EPAPER
Kirrak Couples Episode 1

Kimidi Family Cold War: కిమిడి ఫ్యామిలీ వార్.. 40 ఇయర్స్ ఇండస్ట్రీలో కత్తులు దూసుకునే రాజకీయం

Kimidi Family Cold War: కిమిడి ఫ్యామిలీ వార్.. 40 ఇయర్స్ ఇండస్ట్రీలో కత్తులు దూసుకునే రాజకీయం

Kimidi Family Cold War: విజయనగరం జిల్లా చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణని ఓడించిన కిమిడి ఫ్యామిలీలో కోల్డ్ వార్ హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల ముందు వరకు అక్కడ టీడీపీ ఇన్చార్జ్‌గా ఉన్న కిమిడి నాగార్జున వర్సెస్ ఎమ్మెల్యే కిమిడ కళా వెంకట్రావు తనయుడు రామ్‌మల్లిక్‌ల ఆధిపత్యపోరు పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. మాజీ మంత్రి కళా వెంకట్రావు తన కోసం సీటు త్యాగం చేసిన సోదరుడి కొడుకు నాగార్జునను కాదని సొంత వారసుడ్ని ప్రమోట్ చేసుకుంటుడటం వివాదాస్పదంగా తయారైంది.  కిమిడి వారుసులు ఇద్దరూ ఎవరి గేమ్ వారు ఆడుతుండటంతో.. వచ్చే ఎన్నికల నాటి అధిష్టానం ఆశీస్సులు ఎవరికి దక్కుతాయన్న చర్చ జరుగుతోంది.


ఎన్నికల ముందు రసవత్తరంగా మారిన విజయనగరం జిల్లా చీపురుపల్లి పాలిటిక్స్ ఎన్నికల తరువాత కూడా అంతే ఇంట్రస్టింగ్‌గా కొనసాగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అంతకుమించి అన్నట్టు తయారయ్యాయి. అది కూడా ఒకే పార్టీ ఒకే ఫ్యామిలీలో పాలిటిక్స్ కావడం మరింత ఉత్కంఠ రేపుతోంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన మాజీ మంత్రికిమిడి కళా వెంకటరావు అనుభవం సాక్షిగా ఆయన హయాంలో జరుగుతున్న రాజకీయం చీపురుపల్లి ని హాట్ హాట్‌గా మారుస్తున్నాయి. ఎక్కడా ఎలాంటి కత్తులు దూసుకోకపోయినా.. ఎలాంటి విమర్శలు చేసుకోకపోతున్నా.. టైమ్ బాంబ్ పేల్చుకోవడానికి రిమోట్ సెట్ చేసుకున్నారనే గుస గుసలు వినిపిస్తున్నాయి.

కిమిడి కళా వెంకటరావు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్లని వదిలి చీపురుపల్లిలో అడుగు పెట్టిన నాటి నుండి ఈ కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఎన్నికల సమయంలో కళా వెంకటరావుకి చీపురుపల్లి టిక్కెట్ అనౌన్స్ చేయగానే అప్పటి వరకు ఇన్చార్జ్‌గా ఉన్న కిమిడి నాగార్జున తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కారు. అటు అధిస్తానంపై ఇటు కళా వెంకటరావుపై పదునైన విమర్శలు చేశారు. ఇక రాజకీయ సన్యాసం బెటర్ అని నిర్వేదం ప్రకటించారు. యువత రాజకీయాల్లోకి రావద్దు , మోసపోవద్దని హితబోధ కూడా చేశారు. కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి కూడా వెళ్లారు . తరువాత నారా లోకేష్ చొరవతో బయటకి వచ్చి పార్టీ కోసం పని చేశారు. చీపురుపల్లిలో పెదనాన్న కళా వెంకటరావు గెలుపుకోసం కష్టించి పని చేశారు. స్టార్ క్యాంపెనర్ గా శ్రీకాకుళం , ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రచారం నిర్వహించారు.


సీన్ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణను ఓడించి కళా వెంకటరావు జయకేతనం ఎగురవేశారు. కళా గెలిచినా నియోజకవర్గంలో మంచి పట్టున్న నాగార్జున ఆధిపత్యం కొనసాగుతుందని అందరూ భావించారు.  కానీ ఇక్కడే జాగ్రత్త పడ్డారు కళా వెంకటరావు.

అప్పటివరకు రాజకీయాలకు పనికిరాడు అనే ముద్రఉన్న తన తనయుడు కిమిడి రామ్ మల్లిక్ నాయుడును తెరమీదకి తీసుకువచ్చారు.  తాను రాజాంలో ఉంటూ తనయుడుకి నియోజకవర్గాన్ని అప్పగించారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ఎం జరిగినా రామ్ మల్లిక్ నే చూసుకుంటున్నారు. తండ్రి సలహాలు సూచనలతో నాయకులను , కార్యకర్తలను కలుపుకుంటూ రాజకీయ ఓనమాలు దిద్దుతున్నాడు . సుమారు అయిదేళ్ళ నుండి నియోజకవర్గాన్ని నమ్ముకొని ఉన్న నాగార్జునను కళావెంకట్రాకు పూర్తిగా విస్మరిస్తున్నారంట.  ఏనాడూ పిలిచిన పాపాన కూడా పోవడం లేదట.

Also Read: సరిపోయారు ఇద్దరూ.. విశాఖ నుండి ఔట్?

దాంతో నాగార్జున సీన్ రివర్స్ అయింది. 2019 ఎన్నికల్లో అదే చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాగార్జున ఈ పరిస్థితి అసలు ఊహించలేదంట.. పార్టీ అధికారంలోనికి వచ్చాక తనకు అవమానాలు జరుగుతున్నాయని ఫీల్ అవుతున్నారంట. అందుకే ఆయన పెదనాన్న కుటుంబంతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారట.  తనకున్న కేడర్ ను కలుసుకుంటూ వారితోనే చర్చిస్తూ అక్కడికే పరిమితం అవుతున్నారు. అప్పుడపుడూ జిల్లా పార్టీ అధ్యక్షుని హోదాలో విజయనగరంలో ఉన్న అశోక్ బంగ్లా కి వచ్చి కార్యకర్తలకి అందుబాటులో ఉంటున్నారు . కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా ఆయన కనిపించడం లేదు.

విజయనగరంలో సైతం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మంత్రి కొండపల్లి మాత్రమే కనిపిస్తున్నారు . వారు కూడా నాగర్జునకు అంతగా వాల్యూ ఇవ్వడం లేదనే టాక్ నడుస్తోంది. నాగార్జున కూడా గతంలోలా ప్రెస్ మీటలు పెట్టి వైసీపీ పై విమర్శలు చేయడం లేదు.  అయితే నాగార్జునకు మాత్రం పార్టీ అధిష్టానం వద్ద పలుకుబడి బాగానే ఉందంటున్నారు.. పార్టీకి లాయల్టీగా ఉంటారనే పాజిటివ్ ఇంప్రెషన్ ఉందంట. నారా లోకేష్ సపోర్ట్ ఉండడం, గతంలో బొత్సపై చేసిన విమర్శల దాడి కూడా నగార్జునకు కలిసి వచ్చే అవకాశం ఉందట. కాబట్టి సమయం వచ్చినపుడు నగార్జునకు ఖచ్చితంగా పార్టీలో గౌరవం దక్కుతుందనే టాక్ వినిపిస్తుంది.

మరి రానున్న రోజుల్లో నగార్జునకు ఎలాంటి గౌరవం దక్కుతుందో కాని .. కళావెంకటరావు నాగార్జునకు పదవి ఇవ్వనిస్తారా అనే సందేహం కూడా చీపురుపల్లి తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతుంది. మొత్తానికి చీపురుపల్లిలో ఘోర పరాజయం చవి చూసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా దర్జాగా ఉంటే.. గెలిచి అధికారంలో ఉన్న కిమిడి కుటుంబం మాత్రం కలహాలతో కుమ్ములాడు కోవడం మాట్ టాపిక్‌గా మారింది.

Related News

DY CM Pawan Kalyan: పవన్ ప్రాయశ్చిత దీక్షవెనుక ఇంత కథ ఉందా ?

Telangana BJP: అభయ్ ఆగయా.. టీ బీజేపీకి వెన్నులో వణుకు?

KA Paul And JD Lakshmi Narayana: సరిపోయారు ఇద్దరూ.. విశాఖ నుండి ఔట్?

Khajaguda Land Kabja: ఖాజాగూడలో కబ్జా బాగోతం.. రూ.3000 కోట్ల భూమి ఖతం.. ఆ మాజీ మంత్రే సూత్రధారా?

మేఘా అవినీతి ముసుగులో అధికారులు..!

TDP MLA Koneti Adimulam Case: నా ఇష్టంతోనే ఆ పని! ఆదిమూలం బాధితురాలు సంచలనం

Big Stories

×