EPAPER

JP Nadda: తెలంగాణ బీజేపీ లీడర్లపై జేపీ నడ్డా ఫైర్.. ఎందుకంటే..

JP Nadda: తెలంగాణ బీజేపీ లీడర్లపై జేపీ నడ్డా ఫైర్.. ఎందుకంటే..

తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెంబర్ షిప్ డ్రైవ్ ఒక అడుగు ముందుకి.. నాలుగడుగులు వెనక్కి అన్నట్టు నత్తనడకన సాగుతోంది. దాంతో డిల్లీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్​ట్ర పర్యటన సందర్భంగా టార్గెట్ పూర్తి చేయకపోవడంపై నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారంట. 15 రోజులు డెడ్ లైన్ పెట్టి.. 50 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించాలని ఆదేశించారంట.

అయితే అంత తక్కువ టైంలో అంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడం ఎలా అనే డైలమాలో రాష్ట్ర నాయకత్వం పడింది. టార్గెట్ ను రీచ్ అవ్వడానికి ప్రతి గ్రామం, ప్రతి బస్తీ, ప్రతి ఇల్లు వదలకుండా సభ్యత్వాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకోసం పార్టీలో ఉన్న అన్ని మోర్చాలు సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలని, మెంబర్షిప్ పెంచేందుకు తీవ్రంగా శ్రమించాలని రాష్ట్ర నేతలు పార్టీ శ్రేణులకు చెపుతున్నారంట.


రాష్ట్రంలో బీజేపీ మెంబర్ షిప్ ప్రక్రియ సెప్టెంబర్ 8 నుంచి మొదలైంది. వాస్తవానికి సెప్టెంబర్ 2 నుంచి ఈ ప్రక్రియ మొదలవ్వాల్సి ఉన్నప్పటికి భారీ వర్షాల కారణంగా ఆలస్యమైంది. ఆ తర్వాత గణేశ్ నవరాత్రి ఉత్సవాల వల్ల సైతం మెంబర్ షిప్ డ్రైవ్ కు బ్రేక్ పడింది. దీంతో గత నెల 28న నడ్డా పర్యటన నాటికి దాదాపు 10 లక్షల సభ్యత్వాలను మాత్రమే చేపట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో నేతలు గడువు పొడిగించాలని అదిష్టానాన్ని కోరగా నడ్డా 15 రోజులు పొడిగిస్తూ డెడ్ లైన్ విధించారు. కానీ అంత తక్కువ సమయంలో తెలంగాణకు ఇచ్చిన 50 లక్షల సభ్యత్వాలను పూర్తిచేయడం శ్రేణులకు సవాలే కాదు తలనొప్పిగా మారింది. 50 లక్షల్లో 10 లక్షలు పూర్తవ్వగా మరో 40 లక్షల సభ్యత్వాలు పార్టీ చేపట్టాల్సి ఉంది.

Also Read: ఎవరు అడ్డొచ్చినా ఆగేదిలేదు.. మూసీ బాధితుల‌కు రేవంత్ మ‌రో భ‌రోసా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ బీజేపీ నేతలకు పెట్టిన డెడ్ లైన్ లో ఇప్పటికే వారం రోజులు గడిచిపోయాయి. దీంతో రాష్ట్ర నేతలు టెన్షన్ పడుతున్నారు.. స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి పార్టీ కార్యాక్రమాల్లో బిజీగా ఉంటూ సభ్యత్వనమోదుపై దృష్టి పెట్టడం లేదు. మరోవైపు రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు జరుగుతుండగా సభ్యత్వాలు ఎలా చేపట్టేదంటూ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. 15 రోజులు డెడ్ లైన్ పెట్టిన నడ్డా.. ఈ గడువు అనంతరం మరోసారి రివ్యూ చేస్తానని నేతలకు చెప్పి వెళ్లారు. ఆ సమీక్షలో ఆయనకేం సమాధానం చెప్పాలో తెలియక రాష్ట్ర నాయకత్వం సతమతమవుతోంది. అందుకే రాష్ట్ర నాయకత్వం మరింత గడువు ఇవ్వాలని హైకమాండ్ కు రిక్వెస్ట్ చేసినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా ఈనెల 15వ తేదీ వరకు తెలంగాణలోని అన్ని తండాలు, బస్తీల్లో సభ్యత్వ నమోదు క్యాంపులు ఏర్పాటుచేయాలని నేతలు నిర్ణయించారు. తండాలు, గూడేలు, బస్తీలు, గిరిజన ప్రాంతాల్లో కలిపి తెలంగాణ వ్యాప్తంగా కనీసం 500 మెంబర్ షిప్ డ్రైవ్ క్యాంపులు ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నేతల మద్య ఉన్న పంచాయితీలు కూడా కారణమవుతున్నాయనే చర్చ జరుగుతోంది. నేతల పంచాయితీల వల్ల ఎవరికి వారు అన్నట్లు వ్యవహరిస్తుండటంతో సభ్యత్వ నమోదు వెనబడటానికి కారణమవుతుందనే గుసగుసలు ఆ పార్టీ కార్యలయంలో వినిపిస్తున్నాయి. మరి నడ్డా చెప్పిన టైంలోపు రాష్ట్ర నేతలు ఏ మాత్రం మెంబర్‌షిప్‌లు జాయిన్ చేయిస్తారో చూడాలి.

 

Related News

YSRCP: ఆ నియోజక వర్గంలో వైసీపీ దుకాణం బంద్ ?

History of Naxalism: మావోయిస్టుల అంతం.. ఎందుకీ పరిస్థితి వచ్చింది?

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

Sabarmati and Thames River: సబర్మతి, థేమ్స్ నదులు ఎలా బాగుపడ్డాయి?

Israel-Iran War: ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ వ్యూహం ఇదే!

Osho Rajneesh: కళ్ళకు కట్టినట్టుగా ఓషో రజనీష్ నిజస్వరూపం

×