EPAPER

Japan Princess Mako | ప్రేమ కోసం రాజసాన్నే వదులుకున్న రాజకుమారి.. సినిమా కథను తలపించే లవ్ స్టోరీ!

Japan Princess Mako | ప్రేమ కోసం రాజసాన్నే వదులుకున్న రాజకుమారి.. సినిమా కథను తలపించే లవ్ స్టోరీ!


Japan Princess Mako | నిజమైన ప్రేమ ముందు ఎంతటి కష్టం, ఎంతటి ధనం, ఎంతటి సుఖమైనా తలవంచాల్సిందే.. అందుకే అన్నారు.. The value of True Love is Divine అని. ప్రేమ కోసం తల్లిదండ్రులని.. కోట్ల ఆస్తిని వదిలేసిన వారి గురించి మనం వింటూ ఉంటాం.

ఇలాంటి ఒక ఉదాహరణ జపాన్ రాజకుమారి మాకో గురించి మీరు కూడా వినే ఉంటారు. జపాన్ రాజకుమారి– Princess మాకో.. ప్రస్తుత చక్రవర్తి నరూహిటో తమ్ముడి కూతరు. రాజకుమారి మాకో ఒక సామాన్యుడిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. అంతేకాదు.. అతడిని పెళ్లి చేసుకునేందుకు ఎన్నో కష్టాలు పడింది. ఎన్నో సంవత్సరాలు ఎదరుచూడాల్సి వచ్చింది. ఇద్దరి మధ్య హోదా, ఆస్తి అంతస్తులు అడ్డు వచ్చినా.. ఆమె తన ప్రేమ కోసం నిలబడింది.


రాజకుమారి మాకో.. జపాన్ యువరాజు ఫుమిహిటో(fumihito) తొలి సంతానం. అక్టోబర్ 1991లో జన్మించిన మాకో.. టోక్యోలోని International Christian University నుంచి 2014లో Arts & Cultural Heritageలో డిగ్రీ చేసింది. మాకో చాలా ప్రతిభావంతురాలు. ఆమెకు 20 సంవత్సరాల వయస్సున్నప్పుడే జపాన్ ప్రతిష్ఠాత్మక బిరుదు ‘Grand condor – Order of the Precious Crown’ లభించింది. జపాన్ చక్రవర్తి అధికార ప్రతినిధిగా ఆమె 2015 నుంచి 2019 మధ్య El Salvador, Honduras, Paraguay, Bhutan, Hungary, Brazil, Peru and Bolivia దేశాలకు వెళ్లింది. అంతే కాదు ఆమె ఒక మానవతామూర్తి.. జపాన్‌లో పలుసార్లు భూకంపాలు వచ్చినప్పుడు, అలాగే 2011 లో Tsunami వచ్చినప్పుడు మాకో తన గుర్తింపుని బయటపెట్టకుండా మాకోషి అనే మారుపేరుతో బాధితులకు సేవలు చేసింది.

యూనివర్సిటీలో చదువుకునే సమయంలో కెయి కుమొరో(Kei Kumoro) అనే యువకుడితో రాజకుమారి మాకోకు పరిచయం ఏర్పడింది. కుమొరో ఒక రోజు రాజకుమారిని తన ప్రేమను తెలియజేశాడు. కానీ కుమొరో ఒక సామాన్య కుటుంబానికి చెందినవాడు. అయినా అతని మంచితనం చూసి రాజకుమారి మాకో అతడిని ప్రేమించింది.

ఆ తరువాత రాజకుమారి లండన్ వెళ్లి మ్యూజియం ఆర్ట్స్ కోర్సులో మాస్టర్స్ చేసింది. మరోవైపు ఆమె ప్రియుడు కుమొరో ఉన్నచదువుల కోసం అమెరికా వెళ్లాడు. కానీ దూరంగా ఉన్నా వారిద్దరి ప్రేమ బంధం మరింత బలపడింది. లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే రాజకుమారి మాకో తన ప్రేమ గురించి తల్లిదండ్రులతో చెప్పింది. అప్పుడు వాళ్లు ముందుగా ఇందుకు అంగీకరించలేదు. ఎందుకంటే జపాన్ రాజ్యంగం ప్రకారం.. రాజకుటుంబంలోని మహిళలు సామాన్యులను పెళ్లి చేసుకుంటే వాళ్లు రాజకుటుంబీకుల హోదా అంటే Japan Imperial family member హోదాను కోల్పోతారు. వారికి ఎటువంటి పదవులు, బిరుదుల ఉండవు.

ఈ విషయం తెలిసి కూడా రాజకుమారి మాకో తను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకుంది. అలా తన పెద్దనాన్న.. చక్రవర్తి నారుహిటో అనుమతితో 2017లో తన ప్రియుడు కుమురోతో ఆమెకు engagement జరిగింది. 2018లో రాజకుమారి వివాహం అని అందరూ అనుకుంటున్న సమయంలో.. ఆమె ప్రియుడు కుమురో తల్లి ఒక fraud అని.. ఆమె చాలామంది వద్ద అప్పులు తీసుకొని తిరిగి చెల్లించలేదని మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో రాజకుమారి పెళ్లి ఆగిపోయింది. కుమురో కుటుంబంలో ఆర్థిక సమస్యలుండడంతో అతను కూడా fraud అని భావించి.. రాజకుమారిని అతడిని కలుసుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. ఈ కారణంగా రాజకుమారి మాకో Depressionలోకి వెళ్లిపోయింది.అదే సమయంలో ఆమెకు మానసిక సమస్యలున్నాయని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.

కానీ కుమురో తన తల్లి తీసుకున్న అప్పు అంతా చెల్లిస్తానని అందరి ముందు మాటిచ్చాడు. ఆ తరువాత 2021లో కుమొరో అమెరికాలో లాయర్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాడు. తన తల్లి చేసిన అప్పుని తీర్చేసి తిరిగి తన ప్రియురాలిని వివాహం చేసుకునేందుకు వెళ్లాడు. కానీ రాజకుమారి కుటుంబం వారిద్దరి వివాహానికి ఒప్పుకోలేదు. అయినా రాజకుమారి మాత్రం కుమురోనే వివాహం చేసుకుంటానని పట్టుబట్టడంతో జపాన్ చక్రవర్తి వారి వివాహానికి ఇష్టం లేకపోయినా అంగీకారం తెలిపాడు. కానీ ఈ పెళ్లి రాజకుటుంబం ఆచారాల ప్రకారం కాకుండా సాదాసీదాగా జరుగుతుందని ఆదేశించాడు

అందుకే 2021 అక్టోబర్‌లో రాజకుమారి మాకో తన ప్రియుడు కెయి కుమురోని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. జపాన్ చట్ట ప్రకారం.. రాజకుటుంబ మహిళలు సామాన్యులను పెళ్లి చేసుకుంటే వారు ఇక రాజ మహల్‌లో కాని.. రాజ కుటుంబీకులతో కాని కలిసి ఉండకూడదు. వారికి ఖజానా నుంచి ఏకమొత్తంలో కొంత ధనం మాత్రం లభిస్తుంది. అలా రాజకుమారి మాకోకు జపాన్ చక్రవర్తి తరపున 1.3 అమెరికన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 11 కోట్ల రూపాయలు కానుక రూపంలో లభించాయి. కానీ ఆ ధనం తీసుకునేందుకు రాజకుమారి మాకో నిరాకరించింది.

ఆ తరువాత ఒక నెలపాటు టోక్యోలో ఒక సామాన్యురాలిగా రాజకుమారి తన భర్తతో జీవించింది. నవంబర్ 2021న ఆమె భర్తతో కలిసి అమెరికా వెళ్లి.. అక్కడే సెటిల్ అయింది. ఇప్పుడు అమెరికాలో రాజకుమారి ఒక మ్యూజియంలో కురేటర్ జాబ్ చేస్తోంది. ఆమె భర్త కుమురో అమెరికాలో ప్రస్తుతం ఒక లాయర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ కలిసి సామాన్య పౌరులుగా సిటీ బస్సులో ప్రయాణం చేయడం.. రోడ్లపై కలిసి తిరగే దృశ్యాలు మీడియా దర్శనమిస్తున్నాయి. మాకో రాజకుమారిగా తన జీవితాన్ని వదిలేసి ప్రేమ కోసం తన భర్తకు తోడుగా నిలిచేందుకు జాబ్ కూడా చేస్తోంది. ఇద్దరు ప్రేమికులు సంతోషంగా జీవితం గడుపుతున్నారు.

ఇలా జపాన్‌లో ఓ రాజకుమారి తన ప్రేమ కోసం తన విలాసవంతమైన జీవితాన్ని వదులుకోవడం ఇదే మొదటిసారి కాదు. అంతకు ముందు రాజకుమారి మాకో cousin sisters అయిన Princess అయాకో, Princess Noriko కూడా సామాన్యులనే వివాహం చేసుకున్నారు.

వీరిద్దరిలో Princess అయాకో తన family friend కెయి మొరియాని పెళ్లిచేసుకుంది. కెయి మొరియాకు ఒక షిప్పింగ్ బిజినెస్ ఉంది. Princess Noriko ఒక మత ప్రచారకుడైన Kunimaro sengeని పెళ్లి చేసుకుంది.

ఇలా మొత్తం ఇప్పటివరకు జపాన్ రాజపుత్రికలు 7 మంది సామాన్యులను పెళ్లిచేసుకున్నారు. వీరిలో అందరి కంటే ముందు ప్రస్తుత చక్రవర్తి చెల్లెలు Princess నోరి సయాకో.. Yoshiki koruda అనే fashion designerని 2004లో పెళ్లి చేసుకుంది.

జపాన్ రాజకుమార్తెలలో అందరికంటే Princess మాకో ప్రేమ కథ బాగా పాపులర్ అయింది. ఎందుకంటే మాకో లవ్ స్టోరీలో ఎన్నో కష్టాలున్నాయి. ఆ కష్టాలను అధిగమించి ప్రేమికులిద్దరూ ఒక్కటయ్యారు. మిగతా రాజపుత్రికలంతా సంపన్న కుటుంబాలలో పెళ్లిచేసుకున్నారు. కానీ రాజకుమారి మాకో మాత్రం ఆమె ప్రియుడు కష్టాలలో ఉన్నా అతడి కోసమే ఎదురు చూసింది. తన కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్లి అతడిని పెళ్లి చేసుకుంది. అలాగే ఆమె భర్త కుమురో కూడా ఎన్నో కష్టాలు పడి తన ప్రియురాలిని భార్యగా పొందాడు. వీరిద్దరి ప్రేమకథ ఒక సినిమా కథకు ఏ మాత్రం తీసిపోదనిపిస్తుంది.

ఇక ఇలాంటి మరో ప్రేమ కథ ఉంది. బ్రిటన్ రాజకుమారుడు Prince Harryది. ప్రస్తుత బ్రిటన్ రాజు కింగ్ Charles రెండో కుమారుడు Prince Harry. రాజవంశం పరంపరగా Prince Harryకి South East England ప్రాంతమైన Sussex వారసత్వంగా లభించింది. అంటే Sussex ప్రాంతానికి Prince Harry జమీందార్ లాంటివాడు. 2016లో Prince Harry Instagram ద్వారా అమెరికన్ film actress Megan Markle కలుసుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ కొన్నాళ్లు dating చేసి.. 2018 మే నెలలో పెళ్లి చేసుకున్నారు. అయితే జనవరి 2020లో Harry, Megan దంపతులు.. రాజకుటుంబంలో తమ పట్ల వివక్ష జరుగుతోందని భావించి రాచరికానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత బ్రిటన్ రాయల్ family membersకు లభించే వార్షిక నిధులను కూడా నిరాకరించారు. మార్చి 31, 2020న బ్రిటన్ రాజకుమారుడు Harry తన తండ్రికి దూరంగా భార్య పిల్లలతో కలిసి permanentగా అమెరికా shift అయిపోయాడు. కానీ ఇటీవల తన తండ్రి బ్రిటన్ రాజు చార్లెస్‌ కు క్యాన్సర్ కారణంగా తీవ్ర అనారోగ్యం బారిన పడడంతో మళ్లీ తిరిగివచ్చాడు. So ఇప్పటికైనా బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ ఒక్కటి కావాలని ఆశిద్దాం.

డబ్బు, పలుకుబడి లాంటివే సర్వస్వం లేకుంటే జీవితాంతం కష్టాలు పడాల్సిందే అనే ఈ రోజుల్లో ప్రేమకు ప్రాధాన్యమిచ్చి ఎన్ని కష్టాలు ఎదురైనా.. డబ్బుని, తన రాజసాన్ని తృణప్రాయంగా భావించిన జపాన్ రాజకుమారి మాకో.. లాంటి వాళ్లు ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమకు ప్రతీకలుగా నిలుస్తున్నారు.

Tags

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×