EPAPER
Kirrak Couples Episode 1

Janatha Garage Special Story : బడి గోస.. ఇలా అయితే పిల్లలు చదివేదెలా?

Janatha Garage Special Story : బడి గోస.. ఇలా అయితే పిల్లలు చదివేదెలా?
Janatha Garage Special Story

Janatha Garage Special Story : ఈ పిల్లలని చూడండి ..ఇంట్లో ఉన్న యూరియా బస్తాలనే స్కూలు బ్యాగులుగా మార్చి పిల్లలకు నాలుగు అక్షరం ముక్కలు రావాలని బడికి పంపిన అమ్మనాన్నల ఆశలకు వీరు ప్రతిరూపాలు . తాము చదవకున్నా తమ బిడ్డలు చదువుకొని ప్రయోజకులవ్వాలని ప్రైవేటు చదువులు కొనే స్థోమత లేక.. తిండిపెట్టి చదువుచెప్తారనే ఉద్దేశ్యంతో సర్కారు బడిని నమ్మారు .. మరి వారి నమ్మకం ఆ బడులు నిలబెట్టుకుంటున్నాయా.. లేకా నీరుగార్చేస్తున్నాయా తెలుసుకునేప్రయత్నం చేసింది బిగ్ టీవీ..


ఇక్కడ కనిపిస్తున్న పాఠశాల జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలంలో ఉన్న అమ్మాయిల ప్రైమరీ స్కూల్.. ఇక్కడ మొత్తం ఒకటి నుంచి 5 తరగతుల వరకు 120 మంది విద్యార్థులు చదువుతున్నారు.. ఒకటి నుంచి ఐదు తరగతులంటున్నారు ఇక్కడ ఉన్నవి రెండే గదులు కదా అంటే అంతమంది పిల్లలకు ఉన్నది ఇద్దరు టీచర్లు మాత్రమే దీంతో ఒకటి రెండు తరగతులను ఒక గదిలో మూడు నాలుగు ఐదు తరగతులను ఇంకోగదిలో ఉంచి అడ్జెస్ట్ చేసి తరగతులు భోదిస్తున్నారు. పిల్లలందరిని ఒకేచోట కలగా పులగం గా కూర్చోబెట్టి పాఠాలు చెపితే వారిక అర్ధం అవుతుందా అని ఉపాధ్యాయులను ప్రశ్నిస్తే వచ్చే సమాధానం వారి అశక్తత ఒత్తిడిని తెలియచేస్తుంది. నిజమే మరి సౌకర్యాలు కల్పించకుండా చదువు చెప్పండి అంటే వారుమాత్రం ఏం చేయగలరు.

అమ్మాయిల స్కూల్ అయినా ఇక్కడ కనీసం వాష్ రూంలనేవే లేవు. అత్యవసరాలకు పక్కనే ఉన్న గుట్టల్లోకి చెట్లలోకి పరిగెత్తాల్సిన దైన్య పరిస్థితి ఇక్కడి చిన్నారులది. గతంలో మూత్ర విసర్జన కోసం బైటికి వెల్లిన పాపకి పురుగు కరిసి 15 రోజులు బడిమానేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా నేటికి అదే దుస్ధితి.అంతేకాక పాఠశాలకు చుట్టు ప్రహారి గోడ, వంటగది కూడాలేదు .అంతేకాక కొందరు పిల్లలు తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఇంట్లో పసివారిని చూసుకోవడానికి ఎవ్వరులేకపోవడంతో ఇంట్లో ఉన్న తమ చెల్లి తమ్ముళ్లను తమతోపాటు బడులకు వెంటబెట్టుకొని తరగతిగదిలో పక్కన కూర్చొబెట్టుకొని చదువుకోవాల్సిన పరిస్థితి. పసిపిల్లలని తీసుకురాకుండా రావాలనే నియమం పెడితే ఈ పిల్లలు డ్రాఫవుట్ గా మిగిలిపోతారు దాంతో ఏం చేయలేని పరిస్థితి ఉపాధ్యాయులది ఒకపక్క సమస్యలతో బడులతీరు మరో పక్క కుటుంబంలోని ఆర్ధిక పరిస్థితులు వెరసి బడుగుబిడ్డలకు నాణ్యమైన విద్య అందడంలేదు.


ఇది మరో ప్రాథమిక పాఠశాల ఇది పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో నడుస్తున్న ఈ స్కూల్ లో 89 మంది విద్యార్థులు చదువుతున్నారు ఇది ఏ కోపాధ్యాయ పాఠశాల .. ఐదు తరగతులకు కలిసి ఉన్నది ఒకే ఒక గది . దీంతో పిల్లలు వరండాలో కూర్చొని చదువుకోవాల్సిన దుస్ధితి విద్యార్థులది.. ఈ పాఠశాలకు వంటగది,ప్రహారి,బాత్ రూం లాంటి సదుపాయాలేవి లేవు. కనీసం పిల్లలకు మంచినీటి వసతికూడా లేదు. దీంతో ఇంటి నుండి బాటిల్స్ లో నీటిని తెచ్చుకుంటారు విద్యార్థులు వరండా పక్కనే గోడనీడన అంగన్ వాడీ సెంటర్ . ఇలాంటి పరిస్థితులలో పిల్లలకు మెరుగైన విద్య ఎలా అందుతుంది అని ఉపాధ్యాయులను ప్రశ్నిస్తే ఇబ్బందులున్న మాట వాస్తవమేనని కాని తాము ఏం చేయలేని పరిస్థితి అంటున్నారు ఉపాధ్యాయులు.

ఇది మరోగ్రహణం పట్టిన పాఠశాల. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఈ పాఠశాల పూర్తిగా శిథిలావాస్తకు చేరడంలో సమీపంలోని అంగన్ వాడీ కేంద్రంలోరి మార్చారు. అక్కడ ఉన్న ఒకే గదిలో 4,5 తరగతులను నడుపుతున్నారు మిగతా క్లాస్లును సమీపంలోని కమ్యునిటి హాల్ స్కూల్లో నడిపిస్తున్నారు దీంతో ఈ ఏడాది ఒకటి రెండు తరగతులకు కొత్త అడ్మిషన్ లు వచ్చినా కూడా తీసుకోలేని పరిస్థితి.

ప్రాథమిక పాఠశాలల తీరు ఇలా ఉంటే ఉన్నత పాఠశాలల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమి లేదు. అడుగడుగునా సమస్యలతో సావాసం చేస్తూనే విద్యార్థులు చదువుకుంటున్నారు. 250 మంది విద్యార్థులు పైగా చదివే ఈ ఉన్నతపాఠశాలలో ఉన్నది కేవలం నలుగురు ఉపాధ్యాయులే. దీంతో సబ్జెక్టు టీచర్లు లేని కారణంగా అర్ధం అయినా కాకున్నా పిల్లలే చదువుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. మన ఊరు మన బడికింది ఈ పాఠశాల ఎంపిక అయినా పనులు నత్తనడకన సాగుతుండడంతో పిల్లలకు నేలబారు చదువులు తప్పడంలేదు.

ఈ పాఠశాల గద్వాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి విద్యార్థునులు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. ముఖ్యంగా కరోనా తర్వాతి కాలంలో అడ్మిషన్ల సంఖ్య కూడా బాగా పెరిగింది. మెుత్తం 1100 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటారు. కానీ ఈ పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. అంతేకాకుండా పారిశుద్ధ్య సిబ్బంది కూడా లేకపోవడంతో టీచర్లే చందాలు వేసుకొని స్విపర్ ను పెట్టుకోవాల్సిన దుస్థితి ఇక్కడ ఉంది.

రాష్ట్రంలో 45 శాతం పాఠశాలల్లో ఆరేళ్లుగా ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుల పాలనే సాగుతుంది . సీనియర్ స్కూల్ అసిస్టెంట్ లే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారు తమ సబ్జెక్టులను బోదించడంతోపాటు పరిపాలనా వ్యవహారాలన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పాఠాలు చెప్పాలో పాలనా వ్యవహరాలు చూడాలో అర్ధంకాని పరిస్థితిలో చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు. విద్యాభివృద్ది అధికారులని ప్రశ్నిస్తే తాము కూడా తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆరు రకాల అదనపు బాధ్యతలను మోస్తున్నామని వాపోతున్నారు. గ్రౌండ్ లేవల్ ఇబ్బందులు తమ ఉన్నతాదికారుల దృష్టికి పలుసార్లు తీసుకెల్లామని చెప్తున్నారు..

రాష్ట్రవ్యాప్తంగా మెత్తం 32,214 పాఠశాలలుండగా వీటిలో 25,331 ప్రాథమిక పాఠశాలు 6,883 ఉన్నత పాఠశాలలున్నాయి. సుమారు 26 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడులలో చదువుతున్నారు. వీరంతా కూడా రెక్కాడితేకాని డొక్కాడని పేదకుటుంబాలకు చెందిన పిల్లలు . గతంతో పోలిస్తే కరోనా తర్వాతి పరిస్థితులలో తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్ధితుల్లో వచ్చిన మార్పుల కారణంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెరిగింది. విద్యార్దులు చదువు పట్ల ఆసక్తికలిగి ఉన్నా వారికి మాత్రం బడులలో సౌకర్యాల లేమి నిత్యం వారి చదువుకు పరీక్షలు పెడుతూనే ఉన్నాయి .ఒక పక్క మన ఊరు మన బడి కార్యక్రమం కింద విడతలవారీగా అన్ని బడులలో 12 రకాల మౌళిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి పరుస్తాం అని చెప్పిన సర్కారు మెదటి దశలో భాగంగా 9,123 స్కూళ్లను ఎంచుకున్నప్పటికి 15శాతం పనులు కూడా జరగలేదు కేవలం 600 స్కూళ్లలో మాత్రమే పనులు జరిగాయి. భౌతిక సౌకర్యాల కల్పనతోపాటు విద్యానాణ్యత పెరగాలంటే టీచర్లను కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కేటాయించాలంటున్నారు ఉపాధ్యాయ సంఘనాయకులు.

దేశవ్యాప్తంగా విద్యా హక్కుచట్టం వచ్చి 13 ఏళ్లవుతున్నా ఆ చట్టం గురించి పట్టింపు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని అందుకే స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా నాణ్యమైన విద్య అందియడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయంటున్నారు. గత 9 సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం ఆకర్షణీయమైన పథకాలు పెట్టి ఆర్బాటాలు చేయడం మినహా తెలంగాణ కూడా విద్యాభివృద్ధికి చేసిందేమిలేదని దీనికి నిదర్శనమే గత తొమ్మిది సంవత్సరాలకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మూతబడ్డ 1200 పాఠశాలలని , ఉన్నస్కూళ్లనైనా మెరుగు చేసుకుంటున్నారా అంటే అదీలేదు. మెత్తం 7,000 పైచిలుకు హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. 6,392 ప్రైమరీ స్కూల్స్ ఏకోపాధ్యాయ పాఠశాలలుగా నెట్టుకొస్తున్నాయి. 2,000 హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 607 మండలాలకుగాను 17 మంది ఎంఈవోలు ఉన్నారు. 33 జిల్లాలకుగాను 11 మంది డి.ఈవోలే ఉన్నారు. అంతేకాక విద్యాభివృద్ధి అధికారులపాత్ర టప్పా పనికి పరిమితం అయ్యిందని ఇలాంటి పరిస్థితుల నడుమ నాణ్యమైన విద్య ఎలా అందుతుందంటున్నారు. అంతేకాక ప్రస్తుతం టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కలిసి 30వేల దాకా ఖాళీలను భర్తీ చేయాలి. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడం ఆ ప్రభావం స్కూళ్లపై పడుతుందంటున్నారు. గతంలో 12 వేల మంది విద్యా వాలంటీర్లు ఉండి టీచర్ల కొరత ఉన్న చోట సహాయకంగా ఉండేవారు కానీ. 2020-21 విద్యా సంవత్సరం నుండి వారిని కూడా తొలగించి వేసింది ఒక పక్క నోటిఫికేషన్ లు వేయక మరోపక్క సౌకర్యాలు మెరుగుపర్చకుండా విద్య అందించండి అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

సౌకర్యాలేమి ఉన్న పాఠశాలలను గమనిస్తే తీగునీటి సౌకర్యం లేని పాఠశాలలు 6,874 ఉండగా 37 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లేలేవు. 12, 000 స్కూల్స్ లో ప్లేగ్రౌండే లేదు. 53 శాతం బడులలో సరిపడా తరగతి గదులేలేవు. అలా అనేకరకాల అసౌకర్యాలలో కునారిల్లుతున్నాయి సర్కారు బడులు.

మన కన్నా చిన్న రాష్ట్రాలైన ఢిల్లీ ,చత్తీస్ గఢ్ ,హిమాచల్ ప్రదేశ్ లు విద్యకోసం తమ బడ్జెట్ లో పెద్దమెత్తంలో కేటాయింపులు చేస్తుంటే రాష్ట్రం ఏర్పాటు అయినప్పడి నుండి ఈ కేటాయింపుల్లో ఏటికేడాది కోతపడుతూనే ఉంది. 2014-2015 ఏడాదిలో బడ్జెట్ లో 10.89 శాతం నిధులు కేటాయించగా 2022-23 లో 6.24కు పడిపోయింది. ఈ ఏడాది 6.57 శాతం మాత్రమే విద్యకు కేటాయించారు.

ఆ పేదపిల్లల మొహాల్లోకి ఒక్కసారి తొంగిచూస్తే వారి భావి భవితకు ఇటువంటి సమస్యాత్మకమైన పరిస్థితుల్లో ఉన్న విద్య దోహదం చేస్తుందా అనిపిస్తుంది. వారి జీవితానికి పునాదివేసి భవిష్యత్ ను నిర్మించే విద్య ఇది కాదేమో అనిపిస్తుంది. పేదలం కాబట్టి రాజీ పడాలి. బడుగులం కాబట్టి సర్ధుకుపోవాలి. అందిన అరకొర చదవే ప్రసాదం పరమాన్నం అనుకొని సర్కారు బడులకు పంపాలా.. ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నించలేని నిస్సహాయులు కాబట్టి భరించాలా…అలానే కనిపిస్తుంది. చదువుల పరిస్థితి అందుకే సౌకర్యాలుంటే టీచర్లుండరు టీచర్లుంటే వసతులుండవు అలా చీకటికొట్టాల్లాంటి బడుల్లో నేలబారు చదువులే ఇంకాసాగతున్నాయి. తరగతి గది గోడలపై అందంగా కనిపించే అక్షరాలు పిల్లల మెదళ్లలోకి చేరి విజ్ఞానపు వెలుగులుగా విరాజిల్లాలి. కానీ అవి అర్ధంకాని రాతలుగా.. గీతలుగానే ఉన్నాయి. అందుకే పేదపిల్లలింకా నాణ్యమైన విద్యాకు దూరంగానే ఉన్నారు.

.

.

Related News

Vijayasai Reddy to Join in TDP: టీడీపీలోకి విజయసాయిరెడ్డి? బాంబు పేల్చిన అచ్చెన్న..

Israeli airstrikes on Beirut: లెబనాన్ రాజధాని బీరుట్‌పై బాంబుల వర్షం.. వంతెనల కిందే ఆకలి బతుకులు

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జోలికొచ్చి బుక్కైన నానీలు..

Russia Vs Ukraine War: దూసుకొస్తున్న రష్యా మిస్సైల్? వణికిపోతున్న ఉక్రెయిన్

YS Jagan vs Botsa Satyanarayana: వైసీపీ నేతల పార్టీ మార్పు వెనుక బొత్స వ్యూహం ఉందా?

Irregularities: జూబ్లీహిల్స్‌లో బయటపడ్డ మరో భారీ బాగోతం.. 36 ఏండ్ల నుంచి..

Big Stories

×