EPAPER

Janatha Garage Special Story : అయ్యో! వెంకన్న సామి.. మైనింగ్ మాఫియా నిన్నూ వదల్లేదా?

Janatha Garage Special Story : అయ్యో! వెంకన్న సామి.. మైనింగ్ మాఫియా నిన్నూ వదల్లేదా?
Janatha Garage Special Story

Janatha Garage Special Story : మహబూబ్ నగర్ జిల్లాలో ఏడుకొండల నడుమ కొలువైన కురుమూర్తిస్వామి దేవాలయమిది. చిన్న తిరుపతి,పేదల తిరుపతిగా తెలంగాణలో ఉన్న ఈ క్షేత్రానికి వెయ్యిఏళ్లకుపైగా చరిత్ర ఉంది. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ కురుమూర్తి స్వామి వారి దేవాలయానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలతోపాటు అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడ శ్వేతాద్రి, ఏకాద్రి, దుర్గాద్రి, ఘనాధ్రి,భల్లూకాద్రి, పతాకాద్రి, దేవతాద్రి.. ఇలా సప్తగిరులు కొలువైఉన్నాయి. అన్నింటిని కలిసి కురుమూర్తి కొండలు అంటారు . ఈ కొండలన్నీ ఎన్నో రకాల ఔషద మెక్కలకు జీవవైవిద్యానికి నెలవులు.


ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఈ గిరులు జీవనాధార గుట్టలు. గుట్టల సానువుల్లో పశువులను, జీవాలను మేపుకోవడం, ఆ పక్కన ఉన్న తమ పంట పొలాలను సాగుచేసుకుంటూ ఉన్నంతలో సాఫీగా బతికేవారు. అడవి కోళ్లు, దుప్పులు, నెమళ్లు, అడవిపందుల లాంటి రకరకాల పక్షులు జంతువులు ఇక్కడి గుట్టల మధ్య ఉన్న చెలిమెలు ధొనెల్లో నీల్లు తాగుతూ ఈ పరిసరాల్లో తిరుగుతుండేవి. అలాంటి ఈ ప్రాంతానికి ఇప్పుడేమయ్యింది . దేవుని గుట్టల్లో చిచ్చుపెడుతున్న సమస్యలేంది. రైతులను ఆపతికి గురిచేస్తున్న అంశాలేంటి.

కురుమూర్తి స్వామివారి ఆలయం పక్కన గుండెపగిలిన ఈ కొండను చూడండి. ప్రకృతి కన్నీటి చారికగా కనిపిస్తుంది కదా. ఎక్కడో చేపట్టే కాంట్రాక్ట్ పనుల కోసం ఈ కొండను తొలిచి మెరం మట్టిని యథేచ్ఛగా తోలుకు పోతున్నారు. కొందరు కాంట్రాక్టర్లు నిత్యం 30 నుంచి 40 ట్రిప్పుల మట్టిని తీసుకెళ్లి కొండను దాదాపు సగం చేసేశారు. ఆలయం అంటేనే కొండలు గుట్టలు ఆ నడుమ ప్రశాంతమైన వాతావరణం. కానీ అలాంటి పచ్చని ప్రకృతి కొలువైన కొండలను నిలువు దోపిడి చేస్తూ విధ్వంసం చేస్తున్న ఏ అధికారి, ప్రజాప్రతినిది కాని పట్టించుకున్న దాఖలాలేలేవు. స్వలాభం కోసం చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నవారి తీరు మైనాసురలకు అండగా ఉండడంతో గుట్టల గుండెల్లో గునపాలు నిత్యం దిగుతూనే ఉన్నాయి. వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.


ఒక్క మెరమేకాదు గుట్టల అంతర్భాగంలో పెద్దమెత్తంలో ఉన్న రాతినిల్వలపై కూడా మరికొందరి కన్ను పడింది. దీంతో గుట్టల పక్కన ఉన్న రైతుల దగ్గర పొలాలను కొనుగోలు చేసి దీంతో యథేచ్ఛగా మైనింగ్ చేపట్టారు మరికొందరు. కొండరాళ్లను బద్దలు కొట్టేందుకు పెద్ద మెత్తంలో మందుగుండు సామాగ్రిని తెచ్చుకొని 70 ఫీట్ల లోతులో డ్రిల్లింగ్ తో గుంతలు చేసి బ్లాస్టింగ్ లకు పాల్పడుతున్నారు. దీంతో పెద్ద పెద్ద గుట్టలు నిలువునా బద్దలైపోతున్నాయి. గతంలో గుట్టల కిందిభాగంలో ఉన్న చిన్నచిన్న గుండ్లను వడ్డెర సంగాలు కొట్టుకుంటుంటే ఆలయ అధికారులు పోలీసులను పిలిపించి మరీ కేసులు పెట్టెలా చేశారు. కానీ ఇప్పుడు పెద్దపెద్ద గుట్టలు నామరూపాల్లేకుండా కొట్టిపడేస్తుంటే మరి అధికారులు ఏంచేస్తున్నారు మాకో రూల్ బడా బాబులకో రూల్ అని ప్నశ్నిస్తున్నారు వడ్డెర సంఘాలు

దేవుడి సొమ్మంటే ఫలహారంగా భోంచేసినా అడిగేవారుండరన్న ధీమానో మరేమిటో కానీ ఏకంగా దేవుడి ఉనికికే ప్రమాదం వాటిల్లే చర్యలు చేస్తున్నారు కొందరు మైనింగ్ కాంట్రాక్టర్లు. మెత్తం కురుమూర్తి కొండలన్నీ పక్కపక్కనే ఒకదానికోటి ఇంటర్ లింక్ గా ఉంటాయి. దీంతో ఒక కొండ లో బ్లాస్టింగ్ చేస్తే ఆ కొండ పక్కనే ఉన్న మిగతా కొండలపై కూడా బ్లాస్టింగ్ ప్రభావం ఉంటుంది. కురుమూర్తి స్వామి ఆలయం దేవతాద్రిపై ఉండగా దానికి ఆనుకొనే ఈ పెద్ద తిప్ప ఉంది. గతంలో ఈ పెద్ద తిప్ప మీద అనేక నీటి చెలిమెలు ఉండేవి. అనేక వన్యప్రాణులకు సహితం ఇది నెలవు. కానీ ఇక్కడ జరిగే బారీ బ్లాస్టులతో కొండ అదిరి దాని వల్ల దేవతాద్రి కూడా అదురుతుంది. పరిస్థితి ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో ఆలయ ఉనికికే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు దాపురిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. గుట్టలకు గుట్టలు మాయమైపోతున్నా అధికారులు మెద్దునిద్ర నటిస్తూ చోద్యం చూస్తున్నారని దేవుని సొమ్ముని దోచుకుంటూ దేవున్నే లేకుండా చేసే కుట్రలకు పార్టిలకతీతంగా తిప్పికొట్టి అడ్డుకోవాలని కోరుతున్నారు.

కురుమూర్తి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నా దాని నుంచి సాగునీరు ఈ పరిసరాల్లోని కొన్ని గ్రామాలకు అందుబాటులో లేదు. దీంతో వ్యవసాయం దాదాపుగా వర్షాదారితమే. పత్తి , వరి , ఆముదం లాంటి పంటలు పండిస్తుంటారు. బోరు ద్వారా నీటి వసతి ఉంటే యాసంగి పంటలు వేసుకుంటారు . అయితే గత కొంతకాలంగా ఈ ప్రాంతలో మైనింగ్ జరుగుతుండటంతో అది వీరి జీవనాధారాలను గండికొడుతోంది. బ్లాస్టింగ్ వల్ల భూమి పొరల్లో రదలికలు వచ్చి బోర్లు పాడైపోతున్నాయని .. పూడుకుపోతున్నాయని పాడైనప్పుడల్లా పైపులను పీకలేక అవస్థలు పడుతున్నామని ఆర్థికంగా కూడా నష్టపోతున్నామంటున్నారు స్థానిక రైతులు. అంతకాక జీవ జంతువుల దాడి కూడా ఎక్కువైపోయిందని గతంలో గుట్టలలో ఉండే వన్య ప్రాణులు పొలాల మీదికి వచ్చిపడుతున్నాయని వాటి నుంచి పంటను రక్షించుకునేందుకు రేయింబవల్లు పొలాల దగ్గర కాపాలా కాసే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మైనింగ్ అన్నా మూసేయాలని లేదంటే తమ పొలాలన్నా కొనాలని అంటున్నారు. ఈ బాధలు ఏగేకన్నా పొలం వారు కొంటే వేరేచోటుకెల్లి అంతో ఇంతో పొలంకొనుక్కొని బతుకుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కురుమూర్తి కొండల్లో జరిగే ఈ మైనింగ్ బ్లాస్ట్ ల వల్ల చేలు పాడవడం,ఇళ్లు అదరడమేకాక తమ ఉపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. మైనింగ్ గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారిని నయానో భయానో దారికి తెచ్చుకుంటున్నారని కొందరు డబ్బులకు లొంగి వారికి వంత పాడుతున్నారని అందుకే మైనింగ్ కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారని , తమ బతుకులు బాగుపడాలంటే మైనింగ్ జరగకుండా చూడాలంటున్నారు. ఈ గుట్టలు రెవెన్యూ రికార్డుల ప్రకారం అమ్మాపూర్ శివార్లలోని సర్వే నెంబర్ 89లో దాదాపు 150 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. మైనింగ్ డిపార్ట్ మెంట్ నుంచి స్టోన్ క్రషింగ్ కోసం గతంలో కొందరు అనుమతులు పొందారని కొందరు అధికారులు చెప్తుంటే దేవుడి ప్రాపర్టీ అయిన గుట్టలను మైనింగ్ కి ఎలా ఇస్తారని అవన్ని అనుమతులు లేని క్వారీలేనని అంటున్నారు స్థానికులు.

మైనింగ్ కాంట్రాక్టర్ల ఆగడాలు ఎలా ఉన్నాయంటే పొలాల యజమానుల మధ్య గెట్ల 0పంచాయితీలు పెట్టి వారు లబ్ధి పొందుతున్నారు. ఇక్కడ తన పొలం గుండా వేసిన రోడ్డుపై మట్టితో ముల్లకంచెతో రాళ్లతో మైనింగ్ టిప్పర్లు వెళ్లకుండా ఏర్పాట్లు చేసేకుంటున్నారు. జేసీబీతో మైనింగ్ జరిగే పెద్ద తిప్పగుట్టకు రోడ్డు వేశారని కొందరు బాట జాగ వదిలి డబ్బులు తీసుకున్నారని కురుమూర్తి అనే వ్యక్తి తెలిపారు.
తాము బాట జాగ అమ్మము అన్నందుకు తమను మైనింగ్ మాపియా కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తమ పైనే ఎదురు కేసులు పెట్టారని, తాను క్టప్లెంట్ ఇవ్వడానికి వెల్తే ఎవ్వరు తీసుకోలేదన్నారు. దీంతో వామపక్షనాయకుల సహాయంతో తీను కేసు పెట్టానంటున్నారు. ఏటా ఒక కారు పంటతో బతికే బడుగు రైతులమని తమపై ఇదెక్కడి దౌర్జన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనల ప్రకారం ఎక్కడైన క్వారీలకు అనుమతి ఇవ్వాలంటే ఆ ప్రాంతలో మెదట అవగాహన సదస్సులు నిర్వహించాలి. ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి.మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇదేమి లేకుండా అడ్డదిడ్డంగా అధికారులు ప్రజాప్రతినిధుల అండదండలతో ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా చెలరేగిపోతోంది. కొందరి వ్యక్తుల స్వార్ధం కోసం యథేచ్ఛగా ప్రకృతి వనరుల విధ్వంసం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు పర్యావరణ వేత్తలు. అయినా ఆలయం అంటేనే భక్తులు ప్రశాంతత కోసం వెళ్తారు. ఆ ఆలయానికి సమీపంలోనే మైనింగ్ అంతటి ప్రశాంతత ఎలా వస్తుంది అలాంటి వాటికి ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. జీవ వైవిద్యానికి గొడ్డలి పెట్టు లాంటి ఇలాంటి వాటిని అడ్డుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటున్నారు.

కొండలను పిండిచేసే బ్లాస్టింగ్ లు ఆలయ ఉనికికి ప్రమాదం తెస్తుంటే .. జీవనాధారం ప్రమాదంలో పడి రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రశాంతతకు నెలవైన దేవుడి ఆస్తిని ధ్వంసం చేసే హక్కు వారికెక్కడిదని .. వీలైతే ఆలయాన్ని అభివృద్ధి చేయాలి కాలి దేవుడిగుట్టలను మాయం చేసే పని జరుగుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకు చీమకుట్టినట్టయినా లేదు. కళ్లముందు కనిపించే వాస్తవాలు అగుపించడంలేదు.

.

.

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×