EPAPER
Kirrak Couples Episode 1

ISRO: వైఫల్యమే విజయ సోపానం.. శభాష్ ఇస్రో..

ISRO: వైఫల్యమే విజయ సోపానం.. శభాష్ ఇస్రో..

ISRO: ఒకనాటి లక్ష్యం ఉన్నతం.. సాకరం కాని ఫలితం. అయినా భవిష్యత్‌పై తరగని నమ్మకం.. ఈనాటి విజయం. అదే ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-3 సక్సెస్‌. మామూలుగా కాదు.. చంద్రుడి సౌత్ పోల్‌పై జెండా పాతిన తొలి దేశం మనదే. జాబిల్లిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. రేపటి భవితకు ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలకు రెక్కలు తొడిగింది. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరిన్ని అధ్యాయాలకు నాంది పలికింది.


చంద్రుడిపైకి ల్యాండర్‌ను పంపేందుకు 2019లో చంద్రయాన్‌-2 ప్రయోగం జరిగింది. చివరి నిమిషంలో క్రాష్‌ ల్యాండ్‌ కావడంతో ప్రయోగం విఫలమైంది. ఏళ్ల తరబడి శాస్త్రవేత్తల బృందం రాత్రింబవళ్లు కష్టపడి, భవిష్యత్‌ తరాల కోసం కన్న కలలు నిజమైనట్టే అయి.. ఆఖరి నిమిషంలో ఆశలు ఆవిరయ్యాయి. ఆ సమయంలో ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ కన్నీరు పెట్టుకోవడం.. యావత్‌ దేశ ప్రజల్ని ఉద్వేగానికి గురి చేసింది. అయితేనేం.. ఓ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని విజయ సూత్రం తెలుసుకున్న ఇస్రో.. రెండో ప్రయత్నంలో జాబిల్లిపై భారత్‌ జెండా ఎగురవేసింది. చంద్రయాన్ 2 లో జరిగిన తప్పులు, పొరబాట్లను ఫర్‌ఫెక్ట్‌గా ఫిక్స్ చేశారు. ఈసారి చంద్రయాన్ 3తో చరిత్ర సృష్టించారు.

చంద్రయాన్‌-3 విజయం తర్వాత శాస్త్రవేత్తల బృందం ఆనందానికి హద్దులు లేవు. భవిష్యత్‌ భారత్‌ కోసం సైంటిస్టులు చేసిన కృషిని ప్రతీ భారతీయ గుండె చప్పుడు ప్రశంసిస్తోంది. అంతరిక్షంలో అద్భుతాలు సాధించేందుకు శాస్త్రవేత్తలు చేసిన శ్రమను అభినందిస్తోంది. ఈ సమయంలో ఇస్రో మాజీ ఛైర్మన్ శివన్‌ కన్నీరును చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. శివన్‌.. మీ కృషికి నేడు ఫలితం దక్కింది. మీ ప్రయత్నం విఫలమై ఉండొచ్చు కానీ.. ఆ ప్రయత్నం నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. నేడు ప్రపంచం ముందు సగర్వంగా సత్తా చాటింది.


భవిష్యత్‌ తరాల కోసం చేసే కృషి.. ఒక్కోసారి ఫలితం ఇవ్వడానికి సమయం పట్టొచ్చు. కానీ.. నిరంతర శ్రమకు ఫలితం దక్కి తీరుతుంది. ఓటమితో నిరాశ చెందకుండా.. లక్ష్యం దిశగా పయనించాలని.. విజయ తీరాలకు చేరే వరకు విశ్రమించకూడదు అని నిరూపించింది. భళా ఇస్రో.. భావి భారత్‌కు మీరే మార్గదర్శి.

Tags

Related News

Israel vs Hezbollah War: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

Kolikapudi Srinivasa Rao: ఇవేం పనులు.. పార్టీ నుండి కొలికపూడి సస్పెండ్..?

Balineni vs YV Subba Reddy: బావ.. నీ బండారం బయట పెడతా.. వైవీకి బాలినేని వార్నింగ్

Big Shock To KCR: కేటీఆర్‌కి మాజీ BRS ఎమ్మెల్యేలు షాక్.. కారణం ఇదేనా?

Death of Nasralla: 80 టన్నుల బాంబులతో.. నస్రల్లాను ఎలా చంపారంటే..!

Vijayasai Reddy to Join in TDP: టీడీపీలోకి విజయసాయిరెడ్డి? బాంబు పేల్చిన అచ్చెన్న..

Israeli airstrikes on Beirut: లెబనాన్ రాజధాని బీరుట్‌పై బాంబుల వర్షం.. వంతెనల కిందే ఆకలి బతుకులు

Big Stories

×