EPAPER
Kirrak Couples Episode 1

Israeli airstrikes on Beirut: లెబనాన్ రాజధాని బీరుట్‌పై బాంబుల వర్షం.. వంతెనల కిందే ఆకలి బతుకులు

Israeli airstrikes on Beirut: లెబనాన్ రాజధాని బీరుట్‌పై బాంబుల వర్షం.. వంతెనల కిందే ఆకలి బతుకులు

Israel-Hezbollah War Updates : గత దశాబ్ధకాలంగా లెబనాన్ ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు దశాబ్ధాల క్రితం నుండి రాజధాని బీరుట్‌లో బాంబులు మోత మోగుతూనే ఉంది. అయితే సిటీ రూపం ఎంత మారినా యూరప్ లాంటి లైఫ్ స్టైల్‌‌లో మాత్రం మార్పు రాలేదు. సిరియా, హిజ్బుల్లా, ఇరాన్ ప్రభావాలతో ఎంతగా బీటలువారుతున్నా అదే అందంగా భావిస్తోంది బీరుట్ నగరం.


లెబనాన్ ఆర్థికంగా నిలదొక్కకోవడంతో బీరూట్‌‌కు పాత వైభవం వచ్చింది. కొత్త అందాలను పోగేసుకుంది. అయితే, 2011లో మతపరమైన రాజకీయ కలహాల మధ్య లెబనాన్‌కు జీవనాధారంగా ఉన్న విదేశీ ఉద్యోగులు పంపే చెల్లింపులు మందగించాయి. ఇదే సమయంలో, లెబనాన్ ప్రాక్సీ షియా ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్లా ద్వారా ఇరాన్ పుంజుకుంది. ఆ తర్వాత సున్నీ గల్ఫ్ దేశాలు కూడా అక్కడి నుండి ఉపసంహరించుకోవడం ప్రారంభించాయి. ఈ పరిణామంతో 2016 వరకు బ్యాంకులు డాలర్ల కొత్త డిపాజిట్లకు భారీగా వడ్డీ రేట్లు ఇవ్వడం ప్రారంభించాయి. దానితో లెబనాన్‌లో “ఫైనాన్షియల్ ఇంజినీరింగ్” ప్రవేశపెట్టబడింది. ఇందులో భాగంగా, బ్యాంకులకు కొత్త డాలర్ల రూపంలో పెద్ద మొత్తంలో రాబడి వచ్చింది. మెరుగైన డాలర్ ఇన్‌ఫ్లోలు లెబనాన్ విదేశీ నిల్వలు పెరగడానికి దారితీశాయి. దీనితో, బాధ్యతలు కూడా పెరిగాయి. కొన్ని నివేదికలను బట్టి, లెబనాన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులకు మించి అప్పుల కుప్ప పెరిగింది. ఇది, గణనీయమైన నష్టాలకు కారణమయ్యింది. ఇక, లెబనాన్ రుణాన్ని తీర్చుకోడానికి ప్రభుత్వ బడ్జెట్‌లో మూడో వంతు కంటే ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.

అయితే, ఈ ఆర్థిక పతనానికి అనేక కారణాలున్నాయి. ఆ దేశ రాజకీయ నాయకులు 2018 ఎన్నికలకు ముందు ప్రభుత్వ రంగ వేతనాలను పెంచడానికి ఆమోదం తెలిపారు. నిజానికి, లెబనాన్‌లో ఆర్థిక నియంత్రణ అత్యవసరమైనప్పటికీ.. అవసరమైన సంస్కరణలను అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం కారణంగా, విదేశీ దాతలు వాగ్దానం చేసిన సహాయాన్ని నిలిపివేశారు. ఇక, అక్టోబరు 2019లో వాట్సాప్ కాల్‌లపై పన్ను విధించే ప్లాన్ వల్ల యాక్టీవ్‌గా లేని రాజకీయ ప్రముఖులపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితి లెబనాన్‌లో తీవ్రతను పెంచింది. విదేశీ మారకం తగ్గిపోవడంతో, బ్యాంకులు లిక్విడిటీ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఇది బ్యాంకుల మూసివేతకు దారితీసింది. అలాగే, ప్రభుత్వం తన విదేశీ రుణాలపై డిఫాల్ట్ చేసింది. జనవరి 2022 చివరి నాటికి జాతీయ కరెన్సీ, డాలర్‌కు 1500 నుండి దాదాపు 23 వేలకి పడిపోయింది. ఆ నెల ప్రారంభంలో అది 34 వేలకి చేరుకుంది. ఈ సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తూ… ఆగస్ట్ 2020లో బీరుట్ నౌకాశ్రయంలో జరిగిన పేలుడులో 215 మంది మరణించారు. భారీ నష్టాన్ని కలిగించారు. ఇక, 2021 నాటికి, లెబనాన్ ప్రభుత్వ రుణం GDPలో 495%గా అంచనా వేయబడింది. ఈ పరిణామం, గతంలో కొన్ని యూరోపియన్ దేశాలను నిర్వీర్యం చేసిన స్థాయిల కంటే మించిపోయింది.


అప్పటి నుండీ లెబనాన్‌లో రాజకీయ, సామాజిక సంక్షోభాలు ఊపందుకున్నాయి. అంతర్యుద్ధం సమయానికి, 1976లో సిరియన్ దళాలు లెబనాన్‌లోకి ప్రవేశించాయి. అవి, 2005 ఏప్రిల్ వరకు తమ ఆక్రమణను కొనసాగించాయి. ఈ మొత్తం కాలంలో లెబనాన్ ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థ, సమాజంపై సిరియన్ సైనిక, రాజకీయ ప్రభావం విపరీతంగా కనిపించింది. 2005లో లెబనాన్ మాజీ ప్రధాని రఫీక్ అల్-హరిరి హత్య తర్వాత సిరియా బలగాలు లెబనాన్ నుండి వైదొలిగాయి. అల్-హరిరి హత్య లెబనాన్ రాజకీయాల్లో, అక్కడి సమాజంలో సెక్టారియన్ విభజనలను ప్రస్ఫుటంగా తెలియజేసింది. ఆ తర్వాత, సిరియా వైదొలిగినప్పటికీ.. 2006లో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య యుద్ధం జరిగింది. అంతర్యుద్ధం నుండి వచ్చిన విభేదాలు రాజకీయ కలహాలు సృష్టించాయి. ఇది, అధ్యక్ష పదవిపై స్థానిక పార్టీల్లో సమన్వయం లేకపోవడంతో 2014 నుండి 2016 వరకు లెబనాన్‌లో రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేసింది. మిచెల్ ఔన్ అధ్యక్ష పదవిని విడిచిపెట్టిన తర్వాత 2022 నుండి ఆ దేశ అధ్యక్ష పదవి ఇప్పటికీ ఖాళీగా ఉంది.

Also Read: పవన్ కళ్యాణ్ జోలికొచ్చి బుక్కైన నానీలు..

ఇక, 1988లో లెబనీస్ సైన్యానికి కమాండర్‌గా, కొంతకాలం ప్రధానమంత్రిగా పనిచేసిన మిచెల్ ఔన్, 1990లో పదవీచ్యుతుడయ్యాడు. అలాగే, 2005లో సిరియా ఉపసంహరణ తర్వాత మిచెల్ తిరిగి రావడానికి ముందు 15 సంవత్సరాలు ప్రవాసంలో గడిపాడు. 2005 ఎన్నికల తర్వాత ఆధిపత్య క్రైస్తవ పార్టీగా మిచెల్ నడిపిన ఫ్రీడమ్ పేట్రియాటిక్ మూవ్‌మెంట్ పెరగడంతో తిరిగి ఎన్నికయ్యాడు. అయితే, అధికార శూన్యత తర్వాత మిచెల్ అధ్యక్ష పదవిని రఫీక్ హరిరి కుమారుడు, సున్నీ నాయకుడైన సాద్ హరిరి ఆమోదించారు. దీనికి హిజ్బుల్లా మద్దతు కూడా ఉంది. అయితే, లెబనాన్‌ అధ్యక్ష కార్యాలయం ఖాళీగా ఉండటానికి ముఖ్య కారణం, ఇరాన్ హిజ్బుల్లాకు మద్దతు ఇవ్వడం. అలాగే, సాద్ హరిరి, ఇతర సున్నీ రాజకీయ నాయకులకు సౌదీ అరేబియా మద్దతు ఇవ్వడం. దీనితో యుద్ధంలో దెబ్బతిన్న లెబనాన్ ప్రాక్సీ యుద్ధభూమిగా మారిపోయింది. అధ్యక్షుడు లేకుండా, లెబనాన్ వ్యవహారాలు మంత్రి మండలి నిర్వహిస్తూ వచ్చింది.

లెబనాన్ సంక్షోభం సామాజికంగా తీవ్ర ప్రభావాన్ని చూపింది. చాలా మంది లెబనీస్ పౌరులు దేశం విడిచి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. యూరప్ చేరుకోవడానికి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారు. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న నగరాలు ప్రస్తుతం పేదరికంతో అల్లాడుతున్నాయి. చిన్న పిల్లలు వీధుల్లో అడుక్కోవడం కనిపిస్తోంది. ఆహార పంపిణీ, ఆరోగ్య సంరక్షణతో సహా అవసరమైన సేవలు అడుగంటాయి. దీనితో సివిల్ సొసైటీ గ్రూపులు అడుగుపెట్టాయి. అయితే, ఇప్పటికీ, లెబనాన్ రాజధాని బీరుట్‌ నగరంలో నైట్ లైఫ్ వైబ్రెంట్‌గానే ఉంటుంది. ఒక విధంగా బీరూట్ నైట్ లైఫ్, మిడిల్ ఈస్ట్‌‌లో ఇంకెక్కడా కనిపించదు. ఎంత యుద్ధం ఉన్నా.. బీరుట్‌లో బార్‌లు, క్లబ్‌లు సాధారణంగా పనిచేస్తున్నాయి. తెల్లవారుజాము వరకు హౌస్ మ్యూజిక్‌ మోగుతూనే ఉంటుంది. అందుకే, బీరుట్ సిటీ, మిడిల్ ఈస్ట్ పారిస్‌గానే ఉంది. దీనికి లైవ్ ఎగ్జాంపుల్‌గా సెయింట్ జార్జ్ హోటల్ కనిపిస్తుంది. తాజా యుద్ధంలో బీరుట్ హోటల్‌పై బాంబు పేలి, కొంత భాగం కాలిపోయినా.. హోటల్ స్విమ్మింగ్ ఫూల్‌లో ఆడాళ్లు, మగాళ్లూ ఆడుకుంటూనే ఉన్నారు. ఇది బీటలువారిన బీరుట్ నగరం… పరిస్థితులు మారినా పేరు మాత్రం అలాగే ఉంది… పారిస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్.

Related News

Vijayasai Reddy to Join in TDP: టీడీపీలోకి విజయసాయిరెడ్డి? బాంబు పేల్చిన అచ్చెన్న..

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జోలికొచ్చి బుక్కైన నానీలు..

Russia Vs Ukraine War: దూసుకొస్తున్న రష్యా మిస్సైల్? వణికిపోతున్న ఉక్రెయిన్

YS Jagan vs Botsa Satyanarayana: వైసీపీ నేతల పార్టీ మార్పు వెనుక బొత్స వ్యూహం ఉందా?

Irregularities: జూబ్లీహిల్స్‌లో బయటపడ్డ మరో భారీ బాగోతం.. 36 ఏండ్ల నుంచి..

Big Stories

×