EPAPER
Kirrak Couples Episode 1

World War III Fix: ఇజ్రాయెల్-హిజ్బుల్లా వార్.. మూడో ప్రపంచ యుద్ధం ఫిక్స్?

World War III Fix: ఇజ్రాయెల్-హిజ్బుల్లా వార్.. మూడో ప్రపంచ యుద్ధం ఫిక్స్?

Israel-Hezbollah War: మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయా..? పరిస్థితులన్నీ చూస్తుంటే స్పష్టంగా అవుననే అనుకోవాలి. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంతో ఇప్పటికే మిడిల్ ఈస్ట్ రగిలిపోతుంది. ఇరాన్- ఇజ్రాయెల్ చర్యలు ఆజ్యం పోయగా.. ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి అమెరికా అదనపు బలగాలు కూడా దిగుతున్నాయి. ఇది, లెబనాన్ నాశనానికి దారితీస్తుందనే సూచనలు ఉన్నాయి. ఇక, గల్ఫ్ దేశాల ప్రత్యక్ష పాత్ర మాత్రమే తేలాల్సి ఉంది. అది కూడా జరిగితే, ప్రపంచ యుద్ధానికి ఎన్నో రోజులు లేవు..? అటు ఇరాన్, రష్యాలు కాకమీద ఉన్నాయి. ఇటు అమెరికా, యూరప్‌ దేశాలు రెడీ అవుతున్నాయి. ప్రపంచంలో ప్రస్తుతం కనిపిస్తున్నది కొంతే.. నివురుగప్పిన నిప్పులా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివాదాలు విశ్వరూపం దాల్చే సమయం వచ్చినట్లే ఉంది.


మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..? ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు చూస్తే నిజమే అనిపిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో మొదలైన ఈ భయం.. ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్తతలతో పెరిగింది. ఇక, ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి తర్వాత.. ప్రతిదాడి చేయకుండా ఇజ్రాయెల్‌ను అమెరికా ఎందుకు ఆపుతోందనే అనుమానాల మధ్య ఈ భయం కాయమయ్యింది. ప్రస్తుతం ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య నెలకొన్న తీవ్ర యుద్ధంతో భూమి మీద మూడు ప్రత్యక్ష యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామం మూడో ప్రపంచయుద్ధానికి దారితీస్తుందనే సందేహాలు పెరిగాయి. ఇప్పుడు ప్రపంచదేశాలదీ అదే భయం. థార్డ్ వరల్డ్ వార్ ఇప్పుడే వస్తుందేమో అన్నట్లు ప్రధాన దేశాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. అంతర్జాతీయ ఒప్పందాల్లోనూ యుద్ధ సామాగ్రిదే అగ్ర స్థానం.. ఇలాంటి తరుణంలో ఏడాది క్రితమే ఉక్రెయిన్ డిఫెన్స్ కౌన్సిల్ హెడ్, పెద్ద బాంబ్ కూడా పేల్చాడు. 3వ ప్రపంచ యుద్ధం ఆల్రెడీ మొదలయ్యిందని వ్యాఖ్యానించారు. దానికి రుజువులు చెప్పి రెడీగా ఉండండి అంటూ హెచ్చరించాడు. అయితే, ఇవి వట్టి మాటలని కొట్టిపారేయగలమా..? .

రష్యా ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మొదలై రెండేళ్లు దాటుతోంది. ఏడాది క్రితం మొదలైన ఇజ్రాయేల్, హమాస్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు, ఇరాన్, ఇరాక్, సిరియాల్లో బాంబుల మోత బెంబేలెత్తించింది. ఇక, దక్షిణాసియాలో క్షిపణులు ప్రయోగాలే కానీ, దాడులు లేవని అనుకుంటున్న తరుణంలో.. నార్త్ కొరియా-సౌత్ కొరియా బోర్డర్‌లో యుద్ధ సన్నాహం కనిపించింది. ఆమధ్య చైనా అధ్యక్షుడు తైవాన్‌ను ఆక్రమించి తీరుతామని ప్రకటించాడు. మరోవైపు, అమెరికా, యూరప్ దేశాలు దఫాల వారీగా తమ మిత్ర దేశాలకు యుద్ద సామాగ్రిని తరలిస్తూనే ఉన్నారు. అమెరికా దాని మిత్ర దేశాలు కలసి మిడిల్ ఈస్ట్‌లో అక్కడక్కడా మిలటరీ స్థావరాలను మరింత బలోపేతం చేస్తున్నారు.


ఇటీవల హౌతీ రెబల్స్ లక్ష్యంగా అమెరికా యెమెన్‌లో క్షిపణి దాడులు చేసింది. ప్రస్తుతం, ఇజ్రాయెల్‌-లెబనాన్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు అమెరికా అదనపు బలగాలను పంపుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిణామాలు కనిపించడం బహుశా ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో.. ప్రపంచ దేశాల్లో.. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్‌లో.. కనిపిస్తున్న పరిస్థితులన్నీ మూడో ప్రపంచ యుద్ధాన్ని నిజం చేసేలా ఉన్నాయనడంలో సందేహం లేదు. అయితే, తర్వలోనే దీని విశ్వరూపం కనిపించబోతుందా అనే డౌట్‌కు మాత్రమే ఆన్సార్ రావాల్సి ఉంది.

సెప్టెంబర్ 23న, దక్షిణ, తూర్పు లెబనాన్‌తో పాటు రాజధాని బీరుట్‌ను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇందులో, 450 మందికి పైగా మరణించారు, 1500 మంది గాయపడ్డారు. లెబనాన్‌లో ఉన్న పొలిటికల్ గ్రూప్, షియా మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా సభ్యులను చంపడానికి ఇటీవల పేజర్‌లను ఆయుధాలుగా ఉపయోగించిన ఇజ్రాయెల్.. ఆ దాడి తర్వాత చేపట్టిన వైమానిక దాడులు ఇప్పటికే ఉన్న శత్రుత్వాన్ని మరింత తీవ్రంగా మార్చాయి. ఇజ్రాయెల్, హిజ్బుల్లా సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌తో ఉన్న లెబనాన్ దక్షిణ సరిహద్దులో రాకెట్ కాల్పులు గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. అయితే, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో హమాస్ దాడులకు ప్రతీకారంగా, గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించినప్పటి నుండి, హమాస్ మిత్రపక్షమైన హిజ్బుల్లా – రాకెట్ ప్రయోగాలను మరింతగా పెంచింది. దీనితో, ఇజ్రాయెల్ తన దాడులను తీవ్రతరం చేసింది. ఫలితంగా, లక్షకు పైగా లెబనీయన్లు, దాదాపు 60 వేల మంది ఇజ్రాయిలీలు అంతర్గతంగా తమ నివాసాలను వదిలి వెళ్లిపోయారు.

Also Read: రగిలిపోతున్నఇజ్రాయెల్ హిజ్బుల్లా బూడిదే!

గత వారం, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాల్లంట్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్-హమాస్‌‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం “కొత్త దశ”లోకి ప్రవేశిస్తోందని ప్రకటించారు. అలాగే, గాజాలోని జరుగుతున్న యుద్ధం ఇజ్రాయెల్, హిజ్బుల్లా, వారి మిత్రదేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తుందనే ఆందోళనలు దాదాపు సంవత్సరం నుండి కనిపిస్తున్నాయి. అయితే, ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కొంత కాలంగా సాధారణమైన క్షిపణి దాడుల కాస్తా తాజా ఇజ్రాయెలీ దాడులతో ఇరాన్‌తో పాటు ఇస్లామిక్ దేశాలను కూడా ఉడికిస్తున్నాయి. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న పరిస్థితులపై గల్ఫ్ దేశాలు ఇప్పటి వరకూ కాస్త మౌనంగానే ఉన్నాయి. దీనికి భిన్నంగా అవి కూడా రంగంలోకి దిగితే ఆ రచ్చ ప్రపంచవ్యాప్తమవుతుందని అనడంలో సందేహామే లేదు.

అయితే, ఇప్పుడు హిజ్బుల్లా తీసుకునే నిర్ణయంపైనే కొన్ని రోజుల్లో ఏం జరుగుతుందా అనేది ఆధారపడి ఉంది. ఇజ్రాయెల్ దాడిపై హిజ్బుల్లా తీవ్రంగా ప్రతిస్పందించగలదా లేదా అనేది వేచి చూడాలి. ఇంకో వైపు నుండి ఇజ్రాయెల్ లెబనాన్‌పై భూ దండయాత్రను ప్రారంభించడానికి సిద్ధంగా ఉందా అనేది తేలాలి. ఈ రెండిటిలో ఏది జరిగినా అది మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలను మరో స్థాయికి తీసుకెళ్తాయి. ఇది వినాశకరమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇదే జరిగితే, ప్రపంచ పెద్దన్న అమెరికా ఇజ్రాయెల్‌ను కంట్రోల్ చేస్తుందా లేదా అనే దానిపై ప్రపంచ యుద్ధం ఆధారపడి ఉంటుంది.

ఇజ్రాయెల్ ప్రస్తుత చర్యలు చూస్తుంటే, లెబనాన్‌ను నాశనం చేయడానికే సిద్ధపడినట్లు కనిపిస్తుంది. దశాబ్ధాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్, హిజ్బుల్లా సంఘర్షణల మధ్య ఇప్పటికే లెబనాన్‌లో దాదాపు 3 కోట్ల మంది ప్రభావితమయ్యారు. 2000, 2006లో జరిగిన ఘర్షణల వల్ల ఇప్పటికీ లెబనాన్ కోలుకోలేకపోయింది. అక్కడ పార్లమెంట్‌లో హిజ్బుల్లా ప్రాభల్యం పెరగడం, ప్రభుత్వం పడిపోవడం, కోవిడ్-19, 2020లో బీరుట్ పోర్ట్ పేల్చివేత వంటి సంఘటనలు లెబనాన్‌ను మరింత సంక్షోభంలోకి నెట్టి వేశాయి. నిజానికి, ఈ పరిస్థితుల్లో లెబనాన్ యుద్ధాన్ని భరించలేదు. కానీ, ఇరాన్‌తో పాటు ఇతర గల్ప్ కంట్రీలు.. అలాగే, ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న రష్యా వంటి అమెరికా వ్యతిరేక దేశాలు సపోర్ట్ చేస్తే ఈగోల మధ్య యుద్ధం మరింత తీవ్రతరం అవుతుంది. ఇది, ఇజ్రాయెల్‌కు అమెరికా, యూరప్ దేశాల సహకారాన్ని మరింత పెంచేలా చేస్తుంది. ఫలితంగా, లెబనాన్ తుడుచుపెట్టుకు పోతుందనడంలో సందేహం లేదు. ఇదే ఖాయమైతే ప్రపంచ యుద్ధానికి రంగం ఫిక్స్ అయినట్లే భావించాలి.

అందులోనూ, ఆ మధ్య, ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ జ్యోతిష్కుడు, 16వ శతాబ్దానికి చెందిన నోస్ట్రాడమస్ జోస్యం కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. 2024 సంవత్సరంలో నావికా యుద్ధం తప్పదని నోస్ట్రాడమస్ ఊహించాడు. తన పుస్తకం ‘లెస్ ప్రొఫెసీస్’లో, “ఎర్ర విరోధి” ప్రపంచాన్ని భయపెడతాడంటూ తెలిపాడు. అయితే, ఎరుపు తెలుపుల మధ్య నాటికీ, నేటికీ చాలా వ్యాఖ్యానాలు మారుతూ ఉన్నప్పటికీ… నోస్ట్రాడమస్ జోస్యానికి దగ్గరగానే చాలా పరిణామాలు కనిపిస్తున్నాయి. రష్యా ఎలాగూ ప్రపంచ యుద్ధం కొనసాగుతుందని చెప్పగా… మరోవైపు, చైనా, తైవాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతలు ఈ మాటలను నిజం చేసేలా కనిపిస్తున్నాయని కొందరు వాదిస్తున్నారు. అలాగే, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చేష్టలు దక్షిణ కొరియాకు అమెరికా సహకారాన్ని పెంచేలా చేస్తున్నాయి. ఇక, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఎర్ర సముద్రంలో ఓడలపై హౌతీల దాడులు తీవ్రతరం కావడం కూడా ప్రపంచదేశాలపై ప్రభావం చూపించాయి. ఇప్పుడు, ఇలాంటి పరిణామాలన్నీ కలిసి ప్రపంచాన్ని మరో భయంకరమైన విశ్వ సమరానికి రెడీ చేస్తున్నాయా అన్నట్లు ఉంది.

Related News

Chevireddy Bhaskar Reddy: ఏమైనా కానీ నేను ఏం మాట్లాడను.. భయంలో చెవిరెడ్డి

Tourism Corporation: బోయినపల్లి బంధుప్రీతి.. టూరిజం కార్పొరేషన్ అధోగతి..!

YS Jagan: పిన్నెల్లే దిక్కయ్యారా?.. జగన్ వ్యూహమేంటి?

Tirupati Laddu Controversy: ఎంత అపచారం.. తిరుమల కొండపై ఇన్ని పాపాలా? వడ్డికాసులవాడు చక్రవడ్డీతో సహా తిరిగిచ్చేస్తాడా?

Israel-Hezbollah conflict: రగిలిపోతున్నఇజ్రాయెల్ హిజ్బుల్లా బూడిదే!

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. జరగబోయేది ఇదేనా?

Big Stories

×