EPAPER
Kirrak Couples Episode 1

Black Units Into Action: రంగంలోకి బ్లాక్ యూనిట్.. వణికిపోతున్న ఇజ్రాయెల్

Black Units Into Action: రంగంలోకి బ్లాక్ యూనిట్.. వణికిపోతున్న ఇజ్రాయెల్

Black Units Into Action: రంగంలోకి బ్లాక్ యూనిట్.. వణికిపోతున్న ఇజ్రాయెల్యూనిట్ 910 పనులన్నీ హిజ్బుల్లా అధికారిక సైనిక కార్యకలాపాలతో సంబంధం లేకుండా ఉంటాయి. ఇరాన్, హిజ్బుల్లాకు అంతర్జాతీయ వ్యూహాత్మక విభాగంగా ఉన్న యూనిట్ 910 ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దాడులు చేసింది. ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే అమెరికా టార్గెట్‌గా దాడులు ప్రారంభించింది. తర్వాత, ఇజ్రాయెల్‌కు అత్యంత బలమైన రహస్య నిఘా సంస్థ ముసాద్ సభ్యులపైన అటాక్ చేసి చంపేసింది. ఇలాంటి క్రూరమైన యూనిట్‌ను ఇప్పుడు ఇజ్రాయెల్ ఎదుర్కోవాల్సి ఉంది. అయితే, దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఎలాంటి ప్లాన్ చేస్తారన్నది మాత్రం అంతుబట్టడం లేదు.


అర్జెంటీనా మ్యూచువల్ ఇజ్రాయిల్ అసోసియేషన్..

హిజ్బుల్లా ఎక్స్‌ట్రనల్ సెక్యూరిటీ ఆర్గనేజేషన్‌గా ఉన్న యూనిట్ 910కి ఉన్న మరో పేరు ఇస్లామిక్ జిహాద్ ఆర్గనైజేషన్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన సీక్రెట్ సెల్స్‌తో ఇప్పటికే ఎన్నో నేరలకు పాల్పడింది. లెబనాన్ వెలుపల ఉగ్రవాద దాడులను ప్లాన్ చేయడం, సమన్వయం చేయడం, అమలు చేయడంలో ఈ యూనిట్ కీలకంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకూ యూనిట్ 910 చేసిన దాడుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్, యూదు సంస్థలపై చేసిన మూడు ప్రధాన దాడులు చాలా సంచలనం అయ్యాయి. వీటిలో అర్జెంటీనాలోనే రెండు సంఘటనలు ఉన్నాయి. 1992లో అర్జెంటీనాలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై బాంబు దాడి. ఓ ట్రక్కులో మందుగుండు సామాగ్రి నింపి చేసిన ఈ దాడిలో 29 మంది చనిపోగా, 250 మంది గాయపడ్డారు. అలాగే, అర్జెంటీనా మ్యూచువల్ ఇజ్రాయిల్ అసోసియేషన్, జ్యూయిష్ కమ్యూనిటీ సెంటర్ భవనంపై అలాంటి దాడినే చేశారు. ఇక్కడ 95 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది గాయపడ్డారు. హిజ్బుల్లా కమాండర్ అబ్బాస్ ముసావి హత్య తర్వాత ఈ రెండు ప్రతీకార దాడులు జరిగాయి.


2005లో లెబనాన్ ప్రధాన మంత్రిని హత్య

హిజ్బుల్లా మాజీ నాయకుడు ముసావిని ఇజ్రాయెల్ హతమార్చిందనందుకు ప్రతీకారంగా చేసిన ఈ దాడి ముసావి మరణించిన ఒక నెల రోజుల్లోనే జరగడం విశేషం. ఫిబ్రవరి 16, 1992న ముసావి హత్య జరిగితే… అర్జెంటీనాలోని రాయబార కార్యాలయంపై ప్రతీకార దాడి మార్చి 17, 1992న జరిగింది. 1982లో ఏర్పడిన యూనిట్ 910, లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని యూఎస్ ఎంబసీపై 1983లోనే దాడి చేసింది. 78 మంది అమెరికన్లను చంపేసింది. అదే సంవత్సరం, బీరుట్‌లోని అమెరికా మెరైన్ కార్ప్స్ బ్యారక్స్‌పై బాంబు దాడి చేసి 241 మంది అమెరికన్లను చంపింది. 1985లో ఏథెన్స్‌లో ట్రాన్స్ వరల్డ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 847ని హైజాక్ చేసింది. 2005లో లెబనాన్ ప్రధాన మంత్రిని హత్య చేసింది. తర్వాత, 2012లో బల్గేరియాలోని బుర్గాస్‌లో మరో ముఖ్యమైన దాడి చేసింది. ఇజ్రాయెల్ పర్యాటకులను తరలిస్తున్న బస్సుపై యూనిట్ 910 బాంబు దాడి చేసింది. ఈ బస్సులో ఇజ్రాయెల్ ముసాద్‌కు చెందిన ప్రతినిధులు ఉన్నారనే కారణంతో ఈ దాడి జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే, యూనిట్ 910 అకృత్యాలకు అంతే లేదు. అమెరికా నిఘా సంస్థలు ఈ యూనిట్‌ని ‘బ్లాక్ ఆపరేషన్స్’ యూనిట్ అంటారు. మరో కంటికి తెలియకుండా పని కానిచ్చేయడంలో యూనిట్ 910కు పెట్టింది పేరు.

శత్రువులతో పోరాటమే.. మరో మార్గం లేదన్న నెతన్యాహు

ఇలాంటి క్రూరమైన యూనిట్ 910ను ఎదుర్కోడానికి ఇజ్రాయెల్‌తో పాటు పాశ్చాత్య దేశాలు కూడా సిద్ధపడాల్సి ఉంది. అయితే, హమాస్‌పై యుద్ధం ప్రకటించినప్పటి నుండీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ వ్యవహార శైలిలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తూ వచ్చాయి. మొదట అమెరికా అండర్‌లో చేస్తున్న యుద్ధాన్ని పూర్తిగా తన చేతల్లోకి తీసేసుకున్నాడు. ఇటీవల కాలంలో, ఇజ్రాయెల్ ప్రధాన మిత్ర దేశాలైన అమెరికా, ఫ్రాన్స్ సూచించిన 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చించేందుకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సిద్ధపడ్డారని చాలామంది అనుకున్నారు. అయితే, ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనుకునే శత్రువులతో పోరాడటం తప్ప, తమకు మరో మార్గం లేదని తాజాగా, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఐరాస వేదికపై దౌత్యం గురించి కించింతైనా ప్రస్తావించలేదు.

Also Read: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

ఇది తమ సొంత యుద్ధంగానే పరిగణిస్తున్న ఇజ్రాయెల్

ఐరాస వేదికపై నెతన్యాహు ప్రసంగం తర్వాత బీరుట్‌లో చేసిన భారీ దాడితో హిజ్బుల్లా అధినాయకుడు నస్రల్లాను హతమార్చిన తర్వాత.. కాల్పుల విరమణ గురించి ఇజ్రాయెల్ ఆలోచించడం లేదన్న విషయం స్పష్టం అయ్యింది. శత్రువులు ఎక్కడ ఉన్నా ఇజ్రాయెల్ వారిని చంపితీరుతుందని, గతంలో నెతన్యాహు చేసిన హెచ్చరికను నిరూపించడానికే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే, ఈ దాడి గురించి తమకు ముందస్తు సమాచారం కూడా లేదని అమెరికా పెంటగాన్ తెలిపింది. ఆ టైమ్‌లో నెతన్యాహూ అమెరికాలో ఉండి కూడా దాడికి సంబంధించిన క్లూ కూడా ఎవ్వరికీ ఇవ్వలేదు. అంటే, నెతన్యాహూ ఈ యుద్ధాన్ని తమ సొంత యుద్ధంగానే పరిగణించారు. అమెరికా నుండి సైనిక, ఆయుధ సహాయం పొందుతున్నప్పటికీ అమెరికా మాటను కూడా వినట్లేదు.

హమాస్‌, హిజ్బుల్లాపై ఒకేసారి దాడి చేస్తానన్న ఇజ్రాయెల్

నెలల తరబడి అమెరికా చేస్తున్న చర్చల ప్రయత్నాలను మాత్రం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సమర్థించుకుంటున్నారు. ఇప్పటికీ, చర్చలకు ఇంకా అవకాశం ఉందంటున్నారు. అయితే, తాజా పరిస్థితులు చూస్తే అలాంటి అవకాశం ఉన్నట్లు అనిపించట్లేదు. ఈ విషయంలో అమెరికా ముందు ఉన్న ఆప్షన్లు కూడా పరిమితంగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఇప్పటికే అమెరికా… హిజ్బుల్లా, హమాస్‌లను ‘విదేశీ ఉగ్రవాద సంస్థలు’గా గుర్తించింది. కాబట్టి, వారిని ఏరిపారేస్తున్న ఇజ్రాయెల్‌ను చట్టబద్ధంగా ఆపలేని పరిస్థితి. అందులోనూ, త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్‌పై అమెరికా ఒత్తిడి చేసే అవకాశం కూడా తక్కువే. నిజానికి, 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల తర్వాత… హమాస్‌తో పాటు ఒకేసారి లెబనాన్‌లోని హిజ్బుల్లాపై కూడా ఇజ్రాయెల్ దాడి చేయాలని భావించింది. అయితే, అమెరికా దీన్ని వ్యతిరేకించింది. వద్దని ఒప్పించింది. అలా దాడి చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని హెచ్చరించింది. అయితే, ఇప్పుడు మాత్రం నెతన్యాహూని ఆపలేని వాతావరణం నెలకొంది.

ప్రేక్షక పాత్ర పోషిస్తున్న అమెరికా

కొంతకాలంగా ఇజ్రాయెల్ సైనిక చర్యలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడి సూచనలను నెతన్యాహు పట్టించుకోవడం లేదన్నది స్పష్టం అయ్యింది. అమెరికా అందించిన యుద్ధ విమానాలు, బాంబులను బీరుట్‌లో హిజ్బుల్లాపై దాడి చేయడానికి ఇజ్రాయెల్ వాడిన తర్వాత కూడా అమెరికా ప్రేక్షక పాత్ర పోషించింది. యుద్ధంలో ఇజ్రాయెల్ రూటు మార్చి, స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని సృష్టించడానికి అమెరికా వేసిన ప్రణాళికను నెతన్యాహూ ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే, ఇప్పుడు అమెరికా చేతుల్లో ఏమీ లేదు. ఇక, ప్రస్తుతం, ఇజ్రాయెల్ ముందున్న టాస్క్.. హిజ్బుల్లా తీసుకునే ప్రతీకార చర్యలను అడ్డుకోవాలి. అయితే, హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై బలమైన క్షిపణి దాడులు ప్రారంభిస్తుందా లేదా అన్నది ఇంకా తేలలేదు. ఒకవేళ, కేవలం, యూనిట్ 910ను రంగంలోకి దించి… తమ దగ్గర మిగిలి ఉన్న రాకెట్లు, క్షిపణులను ఉపయోగించకపోతే.. తర్వాత అవి ఇజ్రాయెల్ దాడుల్లో కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక, ఇరాన్ సహకారంతో హిజ్బుల్లా, క్షిపణి దాడులతో పాటు యూనిట్ 910 కార్యకలాపాలను కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు, ఇజ్రాయెల్ లెబనాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్ చేయడానికి సిద్ధపడుతుంది. కానీ, యూనిట్ 910ను ఎలా ఎదుర్కుంటుంది..?

Related News

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

YS Jagan: జగన్‌ను లైట్ తీసుకున్న.. కొడాలి నానీ, వంశీ

Israel vs Hezbollah War: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

Kolikapudi Srinivasa Rao: ఇవేం పనులు.. పార్టీ నుండి కొలికపూడి సస్పెండ్..?

Balineni vs YV Subba Reddy: బావ.. నీ బండారం బయట పెడతా.. వైవీకి బాలినేని వార్నింగ్

Big Shock To KCR: కేటీఆర్‌కి మాజీ BRS ఎమ్మెల్యేలు షాక్.. కారణం ఇదేనా?

Big Stories

×