Big Stories

Congress Manifesto : కాంగ్రెస్‌ హామీల వ్యయం రూ.62 వేల కోట్లు..? అమలు సాధ్యమేనా..?

- Advertisement -

Congress Manifesto(Karnataka Election News) : కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీని కాంగ్రెస్ చిత్తు చేసింది. కాంగ్రెస్‌ విజయానికి అనేక అంశాలు దోహదం చేశాయి. అందులో ప్రధానమైన అంశం మేనిఫెస్టో. కాంగ్రెస్ ప్రకటించిన 5 ఉచిత పథకాలు ప్రజలను ఆకర్షించాయి. హస్తంగుర్తుపై ఓట్ల వర్షం కురిపించాయి. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఏడాదికి దాదాపు రూ.62 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇది ఆ రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు 20 శాతంతో సమానమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీలు నెరవేరుస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ప్రతి కుటుంబలోని ఓ మహిళకు రూ. 2 వేలు, డిప్లమో చేసిన నిరుద్యోగులకు రూ. 1500, డిగ్రీ చేసిన వారికి రూ. 3 వేలు నెలనెలా ఇస్తామని హామీ ఇచ్చింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం, ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మత్స్యకారులకు ఏడాది 500 లీటర్ల పన్నురహిత డీజీల్‌, వేట విరామ సమయంలో రూ. 6 వేల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇలా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే ప్రభుత్వానికి ఏటా రూ.62 వేల కోట్ల ఖర్చవుతుందని అంచనా .

కర్ణాటకలో రికార్డుస్థాయిలో జీఎస్టీ వసూళ్లు అవుతున్నాయి 2022-23 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వసూళ్ల లక్ష్యం రూ.72 వేల కోట్లుగా పెట్టుకున్నారు. అయితే జనవరి నాటికే మొత్తం రూ.83 వేల కోట్లు వచ్చాయి. బడ్జెట్‌ అంచనాల కంటే 15 శాతం అధికంగా వసూళ్లు రాబట్టింది . 2026-27 నాటికి రెవెన్యూ రాబడులు 30% వృద్ధి చెంది.. రూ.2.9 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని తెలుస్తోంది.

ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాల భర్తీతోపాటు మొత్తంగా పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇది హామీ అమలు చేస్తే మాత్రం రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు హమీలన్నీ అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో బడ్జెట్ పెరుగుతుందని కర్ణాటక ఇన్‌ఛార్జ్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News