EPAPER

KCR : విలీనం లాంఛనమే.. బీజేపీతో బీఆర్ఎస్ లాలూచీ..?

KCR : విలీనం లాంఛనమే.. బీజేపీతో బీఆర్ఎస్ లాలూచీ..?

– బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కుదిరిన డీల్
– దశల వారీగా విలీన ప్రక్రియ
– మొదటగా రాజ్యసభ సభ్యుల జాయినింగ్
– నలుగురు ఎంపీల చేరికకు రంగం సిద్ధం
– ఫలించిన కేటీఆర్, హరీష్ రాయబారం
– త్వరలో భారీ చేరికలుంటాయంటున్న కమలనాథులు
– ఒప్పందం సత్ఫలితం అయిందనే సంకేతాలిస్తున్నారా?
– బీజేపీలో బీఆర్ఎస్ విలీనమైతే కేటీఆర్ పరిస్థితేంటి?


Is BRS Merging With BJP : తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్థకం అయింది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ, గులాబీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను లాగేసుకుంటోంది. ఇంకోవైపు బీజేపీ సైడ్ నుంచి కూడా కేసీఆర్‌పై ఒత్తిడి నెలకొంది. కవిత కోసం కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో జరిపిన మంతనాలు సక్సెస్ అయ్యాయి కానీ, కమలనాథులు పెట్టిన కండిషన్స్‌తో తీవ్ర చర్చల్లో ఉన్నారు కేసీఆర్. అయితే, దశల వారీగా విలీన ప్రక్రియ కొనసాగనున్నట్టు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అదే నిజమైతే, కేటీఆర్ భవిష్యత్తు ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

120 రోజులుగా జైల్లోనే కవిత


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అడ్డంగా దొరికిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత, ప్రస్తుతం తీహార్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. ఆమెను బయటకు తీసుకొస్తామని పార్టీ కార్యకర్తలకు చెప్పిన కేటీఆర్, ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపినట్టుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, కవిత అప్రూవర్ కండిషన్స్‌తో కమలనాథులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విలీన ప్రక్రియ దశలవారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

సామ రామ్మోహన్ సంచలన ట్వీట్

బీజేపీలో బీఆర్ఎస్ విలీన వార్తల నేపథ్యంలో టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ సామ రామ్మోహన్ సంచలన ట్వీట్ చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ విలీనం వాయిదాల పద్దతిలో జరుగుతుందని చెప్పారు. దశల వారీగా విలీనం ఉటుందన్న ఆయన, ముందుగా బీఆర్ఎస్‌కు చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు కమలం గూటికి చేరబోతున్నారని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ టూర్‌లో డీల్ కుదిరిందని, ఢిల్లీ రాయబారంలో కీలక ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యులుగా రామోదర్ రావు, పార్థసారధి రెడ్డి, సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. ఈ మధ్యే కే కేశవరావు కాంగ్రెస్ గూటికి చేరారు.

త్వరలో భారీ చేరికలంటున్న రాష్ట్ర బీజేపీ నేతలు

అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్న బీజేపీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా ఓట్ షేర్‌ను భారీగా పెంచుకుంది. ఇదే అదునుగా నెక్స్ట్ ఎలక్షన్‌లో అధికారం దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. అయితే, రాష్ట్ర బీజేపీ నేతలు త్వరలోనే భారీ చేరికలుంటాయని కొద్ది రోజులుగా చెబుతున్నారు. ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోనే చేరారు. బీఆర్ఎస్‌కు చెందిన ఎంపీల చేరిక ఉంటుందని హైకమాండ్ నుంచి వచ్చిన సంకేతాల నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ నేతలు భారీగా చేరికలుంటాయని అంటున్నట్టుగా రాజకీయ వర్గాల్లో అంచనాలున్నాయి.

కేటీఆర్ ఫ్యూచర్ ఏంటి?

వారం రోజుల్లోనే బీఆర్ఎస్ చేరికల ప్రక్రియ పూర్తవుతుందని ఢిల్లీ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. మరి, కేటీఆర్‌ భవిష్యత్తు ఏంటనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తే, కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనంటున్నారు ఆ పార్టీ నేతలు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇంతకాలం బీఆర్‌ఎస్‌లో తిరుగులేని అధికారం చెలాయించారు ఆయన. తాను ఎంత చెప్తే అంతే అన్నట్టుగా నడిచింది. బీజేపీలో విలీనమై, బీఆర్‌ఎస్ కనుమరుగైతే కేటీఆర్ తెరమరుగవుతారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Related News

Dharmana Prasada Rao: జగన్‌కు బిగ్ షాక్.. ధర్మాన చూపు.. జనసేన వైపు

Puvvada Ajay Kumar: తుమ్మల దెబ్బ.. ఖమ్మం నుండి పువ్వాడ జంప్

Vizag Steel Plant Issue: కూటమి నేతలకు విశాఖ టెన్షన్

Baba Vanga Future Predictions: రెండు నెలల్లో యుగాంతం? ఇవిగో ఆధారాలు..

Sajjala Bhargava Reddy: సజ్జల భార్గవ రెడ్డి ఎక్కడ? అప్పుడు అరాచకం.. ఇప్పుడు అజ్ఞాతం, అవన్నీ బయటపడతాయనేనా?

Bharat Jagruthi: ‘జాగృతి’ జాడేది? ఆ డబ్బులన్నీ ఏమయ్యాయ్?

Vijay Political Party: తమిళ రాజకీయాల్లో రజినీ, కమల్ అలా.. మరి విజయ్? ఆ స్పేస్‌ను TVK భర్తీ చేయగలదా?

×