EPAPER

IRCTC New Ticket Rules: రైల్వే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకు ఎందుకు తగ్గించారు? అసలు కారణం ఇదేనా?

IRCTC New Ticket Rules: రైల్వే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకు ఎందుకు తగ్గించారు? అసలు కారణం ఇదేనా?

Train Ticket Booking Rules: ప్యాసెంజర్లకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని కలిగించేందుకు భారతీయ రైల్వే సంస్థ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. తాజాగా అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ కు సంబంధించి కీలక మార్పులు చేసింది. గతంలో అడ్వాన్స్ బుకింగ్ కు 120 రోజుల గడువు ఉండగా దాన్ని సగానికి తగ్గించింది. ఇకపై ప్రయాణానికి 60 రోజుల ముందు నుంచే బుకింగ్స్ చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ నిర్ణయం నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు IRCTC నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. అసలు ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తాజాగా రైల్వేబోర్డు వివరించింది. టికెట్ బుకింగ్ సమయానికి, ప్రయాణ సమయానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఉండటంతో ఎక్కువ సంఖ్యలో క్యాన్సిలేషన్స్ జరిగి బెర్తులు వేస్ట్ అవుతున్నాయని తెలిపింది. క్యాన్సిలేషన్స్ తో పాటు బెర్తుల వృథాను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.


టికెట్స్ క్యాన్సిల్, నో జర్సీ

 రైల్వేలో టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ గడువును తగ్గించడం వల్ల అవసరమైన ప్రయాణీకులకు చాలా మేలు కలుగుతుందని రైల్వే బోర్డు తెలిపింది. వాస్తవానికి బుకింగ్ కు జర్నీకి మధ్య ఎక్కువ గ్యాప్ ఉండటంతో చాలా మంది టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు వివరించింది. ఇలా క్యాన్సిల్ అయ్యే టికెట్లలో ఏకంగా 21 శాతం ఉంటున్నట్లు వెల్లడించింది. అంతేకాదు, టికెట్లు బుక్ చేసుకున్న వారిలో 5 శాతం మంది ప్రయాణించడంలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో బెర్తులు ఎక్కువ సంఖ్యలో వృథా అవుతున్నట్లు అధికారులు తెలిపారు. అటు సీట్ల కేటాయింపులో రైల్వే అధికారులు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు వెల్లడించింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో అక్రమాలకు అడ్డుకట్టపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. అవసరమైన ప్రయాణీకులకు మరిన్ని సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.


టికెట్ల బుకింగ్ గడువు విషయంలో కీలక మార్పులు

రైల్వే టికెట్ల బుకింగ్ గడువులో మార్పులు చేయడం ఇదేమీకొత్తకాదు. ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికే పలుమార్లు మార్పులు చేర్పులు చేశారు. గతంలో  60 రోజులు ఉండగా, దాన్ని 120 రోజులకు పెంచారు. ఇప్పుడు మళ్లీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Read Also: కాశ్మీర్‌కు వందేభారత్ స్లీపర్ రైలు సిద్ధం.. ఇప్పుడే ప్లాన్ చేసుకోండి, అబ్బో ఎన్ని ప్రత్యేకతలో చూడండి!

నవంబర్ 1 నుంచి తగ్గింపు గడువు అమలు

రైలు టికెట్ల బుకింగ్ గడువును 60 రోజులకు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్ 31 వరకు పాత పద్దతి అమల్లో ఉంటుంది. ఇప్పటికే 120 రోజుల గడువుతో టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని రైల్వే అధికారులు తెలిపారు. అయితే, ఈ తాజా నిర్ణయం తాజ్ ఎక్స్ ప్రెస్, గతిమాన్ రైళ్లలో అమలు కాదని వెల్లడించారు. ఇప్పటికే ఆ రైళ్లలో టికెట్ల బుకింగ్ గడువు చాలా తక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా తాజా నిర్ణయం నిజమైన ప్రయాణీకులకు చాలా ఉపయోగపడుతుందని తెలిపారు.

Read Also:మీ IRCTC ఐడీతో వేరే వాళ్లకు టికెట్స్ బుక్ చెయ్యొచ్చా? అసలు విషయం చెప్పిన రైల్వేశాఖ

Related News

Train Laws: రైల్లో ముద్దు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇవేం రూల్స్ అండి బాబు.. చంపేస్తారా?

YCP – Janasena: లిక్కర్ కలిపిన బంధం.. కలిసిపోయిన జనసేన, వైసీపీ

Dubbaka Politics: దుబ్బాక రాజకీయం.. వణుకుతున్న ఖాకీలు

India-Canada Crisis: ఆ దేశాల టార్గెట్ భారత్ పతనం.. అదే జరిగితే వరల్డ్ వార్ 3 తప్పదా?

Sajjala VS Vijay Sai Reddy: కేసుల్లో సజ్జల.. సంతోషంలో విజయసాయి రెడ్డి

Aliens: ఏలియన్స్ జాడ దొరికేసింది..! ఇదిగో సాక్ష్యాలు.. సంచలనం రేపుతున్న రిపోర్ట్..

Big Stories

×