EPAPER

India Vs Canada Issue: ట్రూడోకు భారత్‌పై ఎందుకంత పగ.. గెలవడం వెనుక అసలు కథ ఇదే?

India Vs Canada Issue: ట్రూడోకు భారత్‌పై ఎందుకంత పగ.. గెలవడం వెనుక అసలు కథ ఇదే?

India Vs Canada Issue: కెనడా ప్రధాని ఓవరాక్షన్ రాను రానూ మితిమీరుతోంది. భారత్‌తో కయ్యం కోసం కాచుక్కుచ్చున్నట్లు కనిపిస్తుంది. తమ దేశానికి వలసొచ్చిన తీవ్రవాది కోసం దేశ భవిష్యత్తునే పణంగా పెడుతున్నాడు. కెనడాలోని సిక్కుల ఓట్ల కోసం సిగ్గు లేకుండా భారత్‌తో దౌత్య సంబంధాలను దెబ్బతీస్తున్నాడు. తమ దేశంలో జరిగిన ఓ తీవ్రవాది హత్యకు ఇటీవల భారత్‌ను నిందించిన ట్రూడో.. ఇప్పుడు, భారత్‌లో జరిగిన హత్యకు కారణమైన బిష్ణోయ్‌ ముఠాతో కలిసి భారత్ ఏజెంట్లు పనిచేస్తున్నాయని ఆరోపించాడు. ఈ ముఠాతో కెనడాలో హత్యలు చేయిస్తున్నారంటూ నోరు పారేసుకున్నాడు. ఇంతకీ కెనడా ప్రధాని ట్రూడోకు భారత్‌పై ఎందుకంత పగ..? మాటి మాటికీ ఎందుకు భారత్‌ను కెలుకుతున్నాడు..? భారత్‌పై చేస్తున్న ఆరోపణలు ఏంటీ..? దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా..?


భారత ప్రభుత్వంపై కెనడా మరోసారి ఆరోపణలు

ఏ దేశమైనా మరో దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చాలంటే ఒక అంతర్జాతీయ కారణం ఉండాలి. లేదంటే, అది తమ దేశంపై ఏదైనా ప్రభావం చూపుతుండాలి. అదీకాదూ అంటే, మానవహక్కుల ఉల్లంఘన వంటి వ్యవహారాల్లో కలుగుజేసుకోవచ్చు.. ఓ సలహా ఇవ్వొచ్చు, అభిప్రాయం వ్యక్తీకరించొచ్చు. అలాకాదని, కేవలం వారి రాజకీయ లాభాల కోసం మరో దేశంపై బురద చల్లాలనుకోవడం అవివేకమే అవుతుంది. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఇదే చేస్తున్నాడు. అమెరికా, చైనాలు సైతం భారత్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. అలాంటిది కెనడా లాంటి కంట్రీలకు అంత తలపొగరు ఉండటం కాస్త ఆశ్యర్యం కలుగజేస్తుంది. అయినా, కెనడా కయ్యం కావలి అనేటట్లే వ్యవహరిస్తోంది. భారత ప్రభుత్వంపై కెనడా తాజాగా మరోసారి ఆరోపణలు చేసింది. కెనడా గడ్డపై జరుగుతున్న తీవ్రమైన నేరపూరిత చర్యల్లో భారత్‌కు ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపించింది. అయితే, కెనడా అధికారులు, తాము చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలను చూపించలేదు. కెనడాలో ఖలిస్థాన్ అనుకూల అంశాలను లక్ష్యంగా చేసుకోవడానికి, లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో కలిసి భారత్ ఏజెంట్లు పనిచేస్తున్నారని కెనడా ఆరోపించింది.


నిజ్జర్ హత్య అనుమానితుల్లో భారత్ హైకమీషనర్ పేరు

యాదృచ్ఛికంగా.. అక్టోబర్ 12న ముంబైలో జరిగిన ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్ హత్యలో లారెన్స్ బిష్ణోయ్‌కు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్న సమయంలో.. కెనడా వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య గ్యాప్‌ మరింత పెరగడానికి కారణం అయ్యాయి. అక్టోబర్ 14 అర్థరాత్రి ప్రెస్‌‌తో మాట్లాడిన రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ అధికారులు భారత్‌ను నిందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది కెనడాలో హత్యకు గురైన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు సంబంధించిన దర్యాప్తు వివరాలను ఈ ప్రెస్‌మీట్‌లో పంచుకున్నారు. దీనితో, పాటు ఇతర సంబంధిత కేసుల్లోనూ భారత ఏజెంట్లు ప్రమేయం ఉందని వెల్లడించారు. కెనడాలో హత్యలు, హింసాత్మక చర్యలకు భారత ప్రభుత్వం హస్తం ఉందని అన్నారు. నిజ్జర్ హత్యలో అనుమానితుల జాబితాలో కెనడాలోని భారత్ హైకమీషనర్ సంజయ్ వర్మ, ఇతర దౌత్యవేత్తల పేర్లను చేర్చారు. అలాగే, కెనడాతో పాటు విదేశాల్లోని పలు సంస్థలను భారత ప్రభుత్వ ఏజెంట్లు సమాచార సేకరణకు ఉపయోగించుకుంటున్నారని కెనడా ఆరోపించింది. కొందరు వ్యక్తులు, సంస్థలను భారత ప్రభుత్వంతో కలిసి పని చేయమని ఒత్తిడి చేసి, బెదిరిస్తున్నారనీ.. ఇక, సేకరించిన సమాచారం ఆధారంగా కెనడాలోని సౌత్ ఏషియా కమ్యూనిటీ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడానికి భారత ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ప్రకటించింది.

Also Read: కిమ్ మామా మజాకా.. కోపంతో సౌత్ కొరియా రోడ్లు పేల్చివేత!

గ్యాంగ్‌స్టర్ల ప్రమేయంపై కెనడాను హెచ్చరించిన భారత్

2022 జూన్ నెలలో, సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్య తర్వాత పంజాబ్‌లో హింసాత్మక నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌స్టర్ల ప్రమేయంపై కెనడాను భారత హైకమిషన్ అప్రమత్తం చేసింది. మూస్ వాలా హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించగా… ఉత్తర భారతదేశంలో క్రైమ్ చేస్తున్న బిష్ణోయ్ ముఠా, ప్రధానంగా కెనడాలో దాని ఉనికికి సంబంధించి భారత్ కెనడాను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో.. తాజా ప్రెస్‌‌మీట్‌లో దీనిపై ప్రశ్నోత్తరాలు నడిచాయి. సిక్కు సంఘంలోని సభ్యులను భారతీయ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకుంటున్నారా అని కెనడా పోలీస్ అధికారులను జర్నలిస్ట్‌లు అడిగారు. దీనికి, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ అసిస్టెంట్ కమీషనర్ బ్రిగిట్టే గౌవిన్ మాట్లాడుతూ, దక్షిణాసియా సమాజాన్ని ఈ భారత్ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకుంటున్నాయని.. ప్రత్యేకంగా కెనడాలోని ఖలిస్తానీ అనుకూల అంశాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వ్యవస్థీకృత నేరాలు చేస్తున్న బిష్ణోయ్ గ్రూప్‌కు భారత ప్రభుత్వ ఏజెంట్లతో లింక్ ఉందని మేము నమ్ముతున్నామంటూ గౌవిన్ వెల్లడించారు.

వ్యవస్థీకృత నేరాలతో సంబంధాలున్న వ్యక్తులకు కెనడా రక్షణ

అయితే, కెనడాలో అతిపెద్ద తీవ్రవాద దాడికి కారణమైన ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని భారత్ కూడా ఆరోపిస్తోంది. 1985లో ఎయిర్ ఇండియా ఫ్లైట్-182పై బాంబు దాడిలో 329 మంది మరణించారు. అప్పటి నుండీ భారతదేశాన్ని నిందించడానికి, కెనడాలో భారత్ ప్రతిష్టకు భగం కలిగించడానికి ఖలిస్తానీలు పదేపదే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సిక్కు వేర్పాటు వాదులైన ఖలిస్థానీ తీవ్రవాదులు చేసే వ్యవస్థీకృత నేరాలతో సంబంధాలున్న వ్యక్తులకు కెనడా రక్షణ కల్పించడపై భారత్ దశాబ్ధాలుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే, ఈ ఏడాది మేలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. నిజ్జర్ హత్యతో సంబంధం ఉన్న ముగ్గురు భారతీయులను అరెస్టు చేసిన తర్వాత కెనడా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని విమర్శించారు. పంజాబ్ నుండి వ్యవస్థీకృత నేరాలతో లింక్‌లు ఉన్న చాలా మంది ఖలిస్థానీ తీవ్రవాదులను కెనడా స్వాగతిస్తుందనీ ఆరోపించారు. వీళ్లు భారతదేశంలో వాంటెడ్ క్రిమినల్స్ అనీ.. మీరు వారికి వీసాలు ఇచ్చారని కెనడా ప్రభుత్వాన్ని విమర్శించారు. కాగా, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య జరిగిన రెండు రోజులకే బిష్ణోయ్ ముఠా సభ్యులతో భారతీయ ఏజెంట్లు కుమ్మక్కయ్యారని కెనడా ఆరోపించింది.

కెనడా ప్రధాని ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలు

ఇక, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ వ్యాఖ్యల తర్వాత, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కేసుపై భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎన్నిసార్లు అభ్యర్థించినప్పటికీ భారత్ సహకరించట్లేదని పేర్కొన్నారు. అయితే, ఎలాంటి ఆధారాలు చూపకుండా నిరాధార ఆరోపణలు చేసినందుకు భారత ప్రభుత్వం కెనడాపై తీవ్రంగా మండిపడుతోంది. అక్టోబర్ 14న భారత హైకమిషనర్‌పై కెనడా అధికారులు ఆరోపణలు చేసిన తర్వాత, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘాటైన ప్రకటనను విడుదల చేసింది. కెనడా ప్రధాని ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నట్లు పేర్కొంది. దీనికి నిరసనగా, ఆరుగురు కెనడియన్ దౌత్యవేత్తలను బహిష్కరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, కెనడాలోని తమ హైకమిషనర్‌ సంజయ్ వర్మతో పాటు, మరికొందరు దౌత్యవేత్తలను కాల్ బ్యాక్ చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అయితే, భారత్ ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. ఆరుగురు భారత దౌత్యవేత్తలను తామే బహిష్కరించామని ఆయన చెప్పారు. నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం సహకరించకపోవడమే ఇందుకు కారణమని ట్రూడో అన్నారు.

 

Related News

BRS Leaders Serious on KTR: చిన్న దొర ఎందుకిలా..? గులాబీ వర్గాల్లో షాకింగ్ చర్చ

Sajjala Ramakrishna Reddy vs YS Jagan: నాకేం తెలియదు.. జగన్‌ని ఇరికిస్తున్న సజ్జల

Byreddy Siddharth Reddy: పిల్ల ఫ్యాక్షనిస్ట్.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్క‌డ‌?

BRS On Navy Radar station: అప్పుడు అనుమతులు.. ఇప్పుడు అసత్య ప్రచారాలు.. దామగుండం చుట్టూ గులాబీ రాజకీయం

Rapaka Varaprasad: రాపాక దారెటు.. కూటమిలోకి ఎంట్రీ ఇస్తారా ? కలవరమే మిగులుతుందా?

Baba Siddique Murder: బిష్ణోయ్ కులదైవానికి సల్మాన్ బలి..

Big Stories

×