EPAPER

Palla Rajeshwar Reddy: నెక్స్ట్ టార్గెట్..? బఫర్ జోన్‌లో అనురాగ్ యూనివర్సిటీ!

Palla Rajeshwar Reddy: నెక్స్ట్ టార్గెట్..? బఫర్ జోన్‌లో అనురాగ్ యూనివర్సిటీ!

– బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు
– పోచారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
– హైడ్రా నెక్స్ట్ టార్గెట్ పల్లా కట్టడాలేనా?
– ఇప్పటికే జన్వాడ ఫాంహౌస్‌పై ఫోకస్
– హైడ్రా చర్యలపై సర్వత్రా ఉత్కంఠ


HYDRAA: చెరువుల చుట్టూ కబ్జాలకు గురైన భూములను కాపాడుతోంది హైడ్రా. ఇప్పటిదాకా 160 నిర్మాణాలను కూల్చివేసింది. దీంతో ఆక్రమణకు గురైన 165 ఎకరాల దాకా స్వాధీనం చేసుకున్నట్టయింది. ఇంకా, కొన్ని అక్రమ కట్టడాలపై ఫోకస్ చేసిన హైడ్రా, కూల్చివేతలకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది.

పోచారం పీఎస్‌లో కేసు


మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. చెరువును కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేసినందుకు, ఎఫ్‌టీఎల్‌లో మెడికల్ కాలేజ్ కట్టారని, ఇరిగేషన్ ఏఈ రమేష్ ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు పోలీసులు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

కబ్జా వివాదం ఇదే!

ఘట్‌కేసర్ మండలంలోని వెంకటాపూర్‌లో సర్వే నెంబర్ 813లో నాదెం చెరువు ఉంది. దీని బఫర్ జోన్ పరిధిలో పల్లా రజేశ్వర్ రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ, నీలిమ మెడికల్ కాలేజీ, ఇతర నిర్మాణాలు చేపట్టారని, గణేష్ నాయక్ అనే వ్యక్తి మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్, రెవెన్యూ వాఖ అధికారులకు గతంలో ఫిర్యాదు చేశాడు. అయితే, దీనిపై సరైన స్పందన లేకపోవడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు కదిలారు. పోచారం పీఎస్‌లో కంప్లయింట్ చేశారు.

ఎకరన్నర భూమి ఆక్రమణ

సుమారు 60 ఎకరాల నాదెం చెరువుకు సంబంధించి 14 ఎకరాల బఫర్ జోన్ ఉంది. ఈ బఫర్ జోన్‌లో సుమారు ఎకరన్నర భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్‌స్టిట్యూషన్ అక్రమ నిర్మాణాలు చేపట్టిందనేది ఆరోపణ. ఓవైపు హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, అనురాగ్ యూనివర్సిటీ అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేటీఆర్ ఫాంహౌస్‌గా చెబుతున్న జన్వాడ భవనంపై వివాదం కొనసాగుతోంది. దాన్ని కూడా హైడ్రా కూల్చివేస్తుందని అనుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడంతో చర్చనీయాంశంగా మారింది.

Also Read: N Convention: నాగార్జున వర్సెస్ హైడ్రా.. ఎవరేమంటున్నారు? ఏం జరిగింది?

హైకోర్టులో ఎదురుదెబ్బ

చెరువు భూమి కబ్జాకు సంబంధించి కేసు నమోదు కావడంతో హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు కొనసాగాయి. చెరువు శిఖంలో కాలేజ్ నిర్మించారని పల్లాపై అభియోగాలున్నాయి. వాదనల అనంతరం ఆయనకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనురాగ్ యూనివర్సిటీ నిర్మాణాలు కూల్చివేయకుండా స్టే కోరగా హైకోర్టు, చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించింది. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని హైడ్రాకు స్పష్టం చేసింది. అన్నీ పరిశీలించి ఎఫ్‌టీఎల్‌లో ఉందా లేదా నిర్దారించిన తర్వాతే ముందుకు వెళ్లాలని సూచించింది. నాదెం చెరువు బఫర్ జోన్‌లో తన యూనివర్సిటీ లేదని పల్లా తరఫున న్యాయవాదులు వాదించారు. యూనివర్సిటీ నిర్మించేటప్పుడు అన్ని అనుమతులు తీసుకున్నామని తెలిపారు. వాదనల అనంతరం, నిబంధనలకు అనుగుణంగా వెళ్ళాలని హైకోర్టు తెలిపింది. అధికారులను బెదిరించి నాన్ ఎఫ్‌టీఎల్ సర్టిఫికెట్ తీసుకున్నారని పల్లాపై అభియోగాలు ఉన్నాయి. అగ్రికల్చర్ భూములను నాన్ అగ్రికల్చర్ కమర్షియల్ చేశారని, భవనాలు నిర్మించిన సర్వే నెంబర్లు అన్నీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ భూములని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంకటాపూర్ నాదెం చెరువు మధ్యలో అనురాగ్ యూనివర్సిటీ ఏర్పాటైందని, మట్టి పోయించి కట్టడాలు కట్టారని అంటున్నారు. హెల్త్ యూనివర్సిటీ క్యాంపస్‌ రూములు పెంచుతూ చెరువు శిఖంలోకి అడుగుపెట్టారని, ప్లేగ్రౌండ్ మొత్తం బఫర్ జోన్‌లోనే ఉందని చెబుతున్నారు. వెంకటాపూర్ చెరువును మొత్తం కబ్జా చేద్దాం అనుకుంటే రైతులు తిరగబడ్డారని అంటున్నారు.

Tags

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×