EPAPER

Hydra Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్? ఇక దబిడి దిబిడే..

Hydra Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్? ఇక దబిడి దిబిడే..

అవును హైడ్రాకు హైపవర్స్ రాబోతున్నాయి. పెద్ద లక్ష్యంతో మొదలైన ఈ వ్యవస్థకు ఇప్పుడు బలం విపరీతంగా పెరిగింది. జనం నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. బడాబాబులు షేక్ అయ్యేలా సీన్ మారింది. ఎవరు అడ్డొచ్చినా వినే పరిస్థితిలో హైడ్రా బుల్డోజర్ లేదు. నోటీసులు ఇవ్వడం పాత పద్ధతి, అక్రమమని తేలితే చాలు కూల్చడమే హైడ్రా పని. అవును ఇలాంటి వ్యవస్థ ఇదే తొలిసారి. పార్టీలకు అతీతంగా పవర్ చూపిస్తోంది. సాధారణంగా అధికారంలో ఉన్న వారైతే ఒకలా ట్రీట్ మెంట్, ప్రత్యర్థి పార్టీలైతే మరోలా ట్రీట్ మెంట్ ఉంటుంది. దీంతో ఒకర్ని వదిలేసి ఇంకొకరిపై చర్యలు తీసుకుంటే అసలు లక్ష్యమే నీరుగారిపోతుంది. గతంలో ఇలా పర్యావరణ పరిక్షణ కోసం, జల వనరుల సంరక్షణ కోసం వ్యవస్థలు ఏర్పాటైనా ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. సో ఇప్పుడు కథ మార్చాలని డిసైడ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అన్నిటి మాదిరిగానే హైడ్రాను పెడితే ఎలాంటి ఉపయోగం లేదని ముందుగానే డిసైడ్ అయ్యారు. అందుకే కాస్త కఠినంగా ఉండైనా సరే అనుకున్న లక్ష్యం దిశగా హైడ్రాను నడిపిస్తున్నారు. మిత్రులైనా, ప్రత్యర్థి పార్టీల నేతలైనా ఒకటే ట్రీట్ మెంట్ ఉంటోంది.

కాబట్టి ఇప్పుడు హైడ్రాకు పని చాలా పెరిగింది. మొదట్లో ఒకట్రెండు ఫిర్యాదుల నుంచి ఆ తర్వాత పదుల సంఖ్యలోకి పెరిగాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వందలాది కంప్లైంట్స్ వస్తున్నాయి. వాటిలో ప్రాధాన్యతా క్రమంలో హైడ్రా డీల్ చేస్తోంది. చెరువును చెరపట్టిన వారి భరతం పడుతోంది. హైడ్రా బుల్డోజర్ సిటీలో ఏ మూలకైనా వెళ్లేలా ఈ సంస్థకు ఇకపై సరికొత్త పవర్స్ రాబోతున్నాయి. అనుకుంటే ఏదైనా చేసేలా అధికారాలు రాబోతున్నాయి. ఇప్పటిదాకా FTL పరిధిలోని నిర్మాణాలను కూలుస్తూ ఆక్రమణదారులకు దడ పుట్టిస్తున్న హైడ్రా.. ఇలాంటి వాటికి పర్మిషన్లు ఇచ్చిన అధికారులైనా నజర్ పెట్టింది. అంతర్గతంగా విజిలెన్స్ విచారణ కూడా కొనసాగుతోంది. సో కథ చాలా దూరం వెళ్లేలా కనిపిస్తోంది.


ప్రస్తుతం బుద్దభవన్‌లోని ఆఫీసులో హైడ్రా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. చెరువుల ఆక్రమణలపై పెద్దసంఖ్యలో వస్తున్న ఫిర్యాదులను పరిశీలించేందుకు ఇప్పటికే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన హైడ్రా, ఆ పోలీస్ స్టేషన్‌ను బుద్దభవన్‌లోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే డిప్యుటేషన్‌పై 259 మంది పోలీసు సిబ్బందిని కోరగా, ఆ సంఖ్య మరింతగా పెరుగుతుందంటున్నారు. మరోవైపు ఇప్పటివరకు కూల్చివేతలకు సంబంధించి ఆక్రమణదారులపై ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో హైడ్రా కేసులు నమోదు చేసేందుకు రెడీ అయింది. అలాగే అక్రమ నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇచ్చిన అధికారులపైనా అంతర్గతంగా విజిలెన్స్ విచారణ కొనసాగిస్తోంది. హైడ్రా ఆఫీసుకు అన్ని పార్టీల నుంచి తాకిడి రోజురోజుకు పెరుగుతోంది.

మొదట పదుల సంఖ్యలో వచ్చిన కంప్లైంట్స్ కాస్తా హైడ్రా కఠిన చర్యలతో వందల్లోకి పెరుగుతున్నాయి. వాటన్నింటిని స్వీకరిస్తున్న సిబ్బంది, ఆ వివరాలను నమోదు చేసుకుంటూ కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్తున్నారు. అందులో వేగంగా చర్యలు తీసుకోవాల్సిన వాటిపై రంగనాథ్ ఫోకస్ పెడుతున్నారు. అన్ని కోణాల్లో పరిశీలించాకే రంగంలోకి దిగుతున్నారు. మరోవైపు కంప్లైంట్స్ ఇచ్చే వారి సంఖ్య పెరగడంతో హైడ్రా ఆఫీస్ దగ్గర పోలీసుల బందోబస్తు పెంచారు. సో జనం నుంచి ఊహించనంతగా రెస్పాన్స్ వస్తుండడంతో హైడ్రా బుల్డోజర్ స్పీడ్ పెంచేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే హైడ్రా చట్టం కూడా తెచ్చేలా రెడీ అవుతోంది ప్రభుత్వం. హైడ్రా పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశాక.. ప్రజలు నేరుగా అక్కడికే వెళ్లి అక్రమ నిర్మాణాలపై కంప్లైంట్స్ ఇచ్చేలా ఏర్పాటు చేయబోతున్నారు.

Also Read: హైడ్రాకు హైపవర్.. రాష్ట్రవ్యాప్తంగా ఫుల్ క్రేజ్

నిజానికి చెరువుల FTL పరిధిలో ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు. కానీ జరిగిపోయాయి. ఎందుకంటే అక్రమంగా పర్మిషన్లు ఇవ్వడం, తప్పుడు సర్వే నెంబర్లు చూపి పర్మిషన్ల కోసం అప్లై చేసుకున్న వారి వ్యవహారాలను క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడం ఇవన్నీ జరిగాయి. ఇంకొందరు పైసల కక్కుర్తితో రాజీ పడి పర్మిషన్లు ఇచ్చేశారు. అయితే ఇన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలను బుల్డోజర్ తో నేలమట్టం చేస్తున్న హైడ్రా.. ఇకపై అక్రమ పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లపైనా లెన్స్ పెట్టింది. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా పోలీస్ స్టేషన్ చర్యలు తీసుకుంటుందంటున్నారు రంగనాథ్. ఇప్పటివరకు జరిగిన విచారణలో కొంతమంది అవినీతి అధికారులను హైడ్రా గుర్తించింది కూడా. అవినీతి అధికారులపై త్వరలోనే కేసు నమోదు చేసి విచారణ చేస్తామనీ అంటున్నారు. సో పర్మిషన్లు ఇచ్చేశాం.. మాకేం సంబంధం లేదు అనే వారికి చుక్కలు చూపించబోతున్నారు. చెప్పాలంటే భవిష్యత్ లో ఇలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా శాశ్వత పరిష్కారం చూపబోతున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్లాట్స్ చేసి అమ్మిన వారిపైనా చర్యలకు యాక్షన్ ప్లాన్ రెడీ అవుతోంది.

ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో బయట ఉన్న చెరువులను కాపాడడమే లక్ష్యంగా హైడ్రా స్పీడ్ పెంచుతోంది. ప్రస్తుతం కొందరి విద్యాసంస్థలు చెరువుల FTL, బఫర్ జోన్లలో ఉన్న విషయం హైడ్రా దృష్టికి వచ్చింది. ఒవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన విద్యాసంస్థల వ్యవహారంపై హైడ్రాకు ఇప్పటికే కంప్లైంట్స్ వచ్చాయి. ఇలా చెరువుల పరిధిలో పదుల సంఖ్యలో కాలేజీలు ఉన్నాయి. అయితే ఇక్కడ విద్యాసంస్థ ఎవరిదన్నది కాదు.. విద్యార్థుల భవిష్యత్ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకునేందుకు హైడ్రా నిర్ణయం తీసుకోబోతోంది. FTL పరిధిలోని ఫాతిమా, మల్లారెడ్డి వంటి కాలేజీలకు సమయం ఇస్తామని రంగనాథ్ అంటున్నారు. వచ్చే విద్యాసంవత్సరంలోపు సీన్ మారిపోవాలంటున్నారు. అంతేకాదు పార్టీలకు అతీతంగా తమ చర్యలు ఉంటాయని, ధర్మ సత్రమైనా ఎఫ్‌టీఎల్‌లో ఉంటే కూల్చేస్తామంటున్నారు. హైడ్రా నోటీసులు ఇవ్వదు, కూల్చడమే అన్న పాయింట్ చుట్టూ కథ నడుస్తోంది.

ఇకపై చెరువుల పరిధిలో అక్రమ పర్మిషన్లు ఇవ్వాలన్నా భయపడేలా హైడ్రా చర్యలు ఉండబోతున్నాయి. అలాంటి వాటి జోలికి వెళ్లకుండా చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నారు. అవసరమైతే క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఫోటోలు, వీడియోలు తీశాకే, సర్వే నెంబర్ నిర్ధారించుకున్న తర్వాతే నిర్మాణాలు అనుమతులు ఇచ్చేలా వ్యవస్థ మార్చబోతున్నారు. తప్పుడు సర్వేనెంబర్లు ఇచ్చినా, వాటిని క్రాస్ చెక్ చేసుకోకుండా అనుమతులు ఇచ్చే వారిపైనా ఇకపై కేసులు, కఠిన చర్యలు ఉండబోతున్నాయి. పర్యావరణ హితమే లక్ష్యంగా హైడ్రా యాక్షన్ ప్లాన్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×