EPAPER

US Presidential Election 2024: కమలా హారిస్ విన్ అవుతుందని.. అలన్ ఎలా చెప్తున్నాడు?

US Presidential Election 2024: కమలా హారిస్ విన్ అవుతుందని.. అలన్ ఎలా చెప్తున్నాడు?

How does Allan Lichtman say that Kamala Harris will win: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపుతున్న అమెరికా ఎన్నికల్లో గెలుపు ఎవరిదనేది ఆల్‌మోస్ట్ ఖాయమైనట్లే కనిపిస్తోంది. డోనాల్డ్ ట్రంప్, కమల హ్యారిస్ మధ్య నెక్ నెక్ ఫైట్ ఉంటుందనుకునే తరుణంలో..  వైట్ హౌస్ తాళాలు కమలా హ్యారిస్‌కే దక్కుతాయంటున్నారు అలన్ లిచ్ట్‌మాన్. ఇంతకీ ఈ కొత్త నోస్ట్రడామస్ ఎవరు..? ఇతడి జోస్యంపై అమెరికాకు ఎందుకింత నమ్మకం..? కమలా హారిస్ విన్ అవుతుందని అలన్ ఎలా చెప్పగలుగుతున్నారు..? గతంలో అలన్ చెప్పిన ప్రిడిక్షన్స్ ఎంతవరకూ నిజమయ్యాయి..? రాబోయే ఎన్నికల్లో ఈ ప్రిడిక్షన్ ప్రభావం ఎంత ఉండనుంది..?


పరిస్థితులన్నీ కమల హ్యారిస్‌కు కలిసొస్తున్నట్లే కనిపిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వయసు రిత్యా ఎదుర్కొన్న విమర్శల నుండి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు, అనుమానాల వరకూ.. ఎటు నుంచి చూసినా అమెరికా వైస్‌ ప్రెసిడెంట్ కమల హ్యారిస్ త్వరలో ప్రెసిడెంట్ పీఠం ఎక్కుతారనే సూచనలే కనిపిస్తున్నాయి. అదృష్టాలు, విధిరాతల సిద్ధాంతాల్లో నిజమెంతో తెలియదు గానీ.. కొన్ని జోస్యాలు నిజాలై తీరుతాయని కొందరు అంటారు. ముఖ్యంగా, మన దగ్గర పోతులూరి వీరభ్రహ్మేంద్ర స్వామి, ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వాంగ ఎలాగో… 15వ శతాబ్ధపు ఫ్రాన్స్ సిద్ధాంతకర్త నోస్ట్రడామస్ చెప్పిన జోస్యాలను ఇప్పటికీ చాలా మంది నమ్ముతారు. అదే నమ్మకం చాలా మంది నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తోంది. అలాంటి వ్యక్తే అలన్ లిచ్ట్‌మాన్. అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్‌గా లిచ్ట్‌మాన్ చాలా పాపులర్. 40 ఏళ్లుగా అమెరికా ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎవరెక్కుతారో.. ఖచ్చితంగా చెప్పే ప్రిడిక్టర్‌ ఈయన. తాజాగా అలన్… రాబోయే అమెరికా ప్రెసిడెంట్ కమల హ్యారిస్ అని చెప్పారు. దీనితో, యూఎస్ వ్యాప్తంగా కమల గెలుపు ఖాయమనే టాక్ పెరిగింది.

డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య సెప్టెంబరు 10న కీలక డిబేట్ షెడ్యుల్ అయిన తరుణంలో లిచ్ట్‌మాన్ జోస్యం చర్చకు దారితీసింది. 2016లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని ఖచ్చితంగా అంచనా వేసిన కొద్దిమందిలో అమెరికన్ యూనివర్సిటీ చరిత్రకారుడు అలన్ లిచ్ట్‌మాన్ ఒకరు. ట్రంప్, ప్రెసిడెంట్ బైడెన్ మధ్య మొదటి 2024 ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగిన వెంటనే, బైడెన్ రేసు నుండి తప్పుకోవడం “డెమోక్రాట్‌ల తప్పుగా” లిచ్ట్‌మాన్ హెచ్చరించారు. అంటే, ఒకవేళ బైడెన్ రేసులో ఉన్నా గెలుపు ఖాయమయ్యేదోమో..? అయితే, ఈ ప్రిడిక్షన్ అప్పట్లో మరో ప్రిడిక్టర్ నేట్ సిల్వర్‌తో ఆన్‌లైన్ యుద్ధానికి దారితీసింది. ఏది ఏమైనప్పటికీ.. లిచ్ట్‌మాన్ మోడల్‌ ఆఫ్ ప్రిడిక్షన్ మాత్రం అమెరికా ప్రజల్లో పాతుకుపోయింది. ఆయన చెప్పే పోల్‌లు సాధారణంగా సక్సెస్ అవుతూనే వచ్చాయి. ఒక విధంగా అలన్ అభిప్రాయాలకు దగ్గరగానే పోల్‌స్టర్‌లు కూడా ట్యూన్ అవుతారనే టాక్ ఉంది. అలన్ అమెరికా ఎన్నికల సిద్థాంతానికి ‘వైట్ హౌస్‌కి కీ’ అనే ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. ట్రూ ఆర్ ఫాల్స్ అనే 13 ప్రశ్నల ఆధారంగా లిచ్‌మాన్ ప్రిడిక్షన్‌ ఆధారపడి ఉంటుంది.


Also Read: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

యుఎస్ ప్రెసిడెంట్ పోల్స్ నోస్ట్రాడమస్ ప్రకారం.. ప్రస్తుత యూఎస్ వైస్ ప్రెసిడెంట్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ వైట్ హౌస్ రేసులో గెలిచి, యుఎస్ అధ్యక్షురాలవుతారని అధికారికంగా అంచనా ఉంది. “యునైటెడ్ స్టేట్స్ తదుపరి అధ్యక్షురాలు కమలా హారిస్” అని లిచ్ట్‌మన్ ఓ అంతర్జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. ఈ తరుణంలో అలన్ లిచ్ట్‌మాన్ “కీస్ టు ది వైట్ హౌస్” మోడల్‌ను ఉపయోగించి కమలా హారిస్‌కు పట్టం కట్టారు. 50 సంవత్సరాల పాటు అమెరికన్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్‌గా, లిచ్ట్‌మన్ ప్రఖ్యాత “13 కీస్ టు ది వైట్ హౌస్” పద్ధతిని అభివృద్ధి చేశారు. ఇది ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనే విషయాన్ని బలంగా అంచనా వేస్తుంది. ఈ పద్ధతిలో 13 ట్రూ ఆర్ ఫాల్స్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఆరు లేదా అంతకంటే ఎక్కువ కీలు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకం అయితే, లిచ్ట్‌మన్ వారి ఓటమిని అంచనా వేస్తారు. ఇక, ఆరు కంటే తక్కువ మంది వ్యతిరేకిస్తే, అధికార పార్టీ మళ్లీ గెలుస్తుందని చెబుతారు. ఇక, ఈ “వైట్ హౌస్‌కి కీ”ల ప్రకారం, కమలా హారిస్‌కు అనుకూలంగా 8 కీలు ఉన్నాయని, అయితే డొనాల్డ్ ట్రంప్‌కు 5 ప్రతికూల కీలు ఉన్నాయని… అంటే ట్రంప్‌కు వైట్‌హౌస్‌ తాళాలు దక్కవని లిచ్ట్‌మాన్ అంచనా వేశారు.

1984 నుండి లిచ్ట్‌మన్, గత పది అధ్యక్ష ఎన్నికల్లో తొమ్మిది మంది గెలుపును విజయవంతంగా అంచనా వేసారు. ఈ అంచనాలన్నీ “కీస్ టు ది వైట్ హౌస్” అని పిలిచే ఈ ప్రత్యేకమైన మోడల్‌ను ఉపయోగించే వచ్చాయి. అమెరికా రాజకీయాల చరిత్ర, అధ్యక్ష ఎన్నికల డైనమిక్స్‌తో సహా అనేక అంశాలపై లిచ్ట్‌మాన్‌కు అపార అనుభవం ఉంది. 1947 మార్చి 18న న్యూయార్క్ సిటీలో జన్మించిన లిచ్ట్‌మన్… హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి హిస్టరీలో పీహెచ్‌డీని పొందారు. తర్వాత, యూఎస్ పొలిటికల్ హిస్టరీలో నైపుణ్యం కలిగిన వాషింగ్టన్, డీసీలోని అమెరికన్ విశ్వవిద్యాలయంలో తన విద్యా వృత్తిలో ఎక్కువ భాగాన్ని గడిపారు. అలన్ విద్యా నేపథ్యం, రాజకీయ చరిత్రపై ఆయనకున్న లోతైన అవగాహన అమెరికా ఎన్నికల పోకడలు, ఫలితాలను సమర్థవంతంగా విశ్లేషించడంలో అలన్‌కు సహాయపడ్డాయి. 1980ల ప్రారంభంలో జియోఫిజిసిస్ట్ వ్లాదిమిర్ కోగన్‌తో కలిసి అలన్ లిచ్ట్‌మాన్ ప్రిడిక్టివ్ మోడల్ “కీస్ టు ది వైట్ హౌస్” అభివృద్ధి చేశారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ పనితీరు. ప్రధాన ఎన్నికల ఛాలెంజర్‌ల ఉనికి.. వారి ఆర్థిక పరిస్థితులు, కుంభకోణాల లేకపోవడం వంటి అంశాలతో సహా రాజకీయ వాతావరణంలోని వివిధ అంశాలను విశ్లేషించి ఈ 13 ‘కీ’లను రూపొందించారు.

ఈ పదమూడు ‘కీ’లు ఏంటో.. ప్రస్తుతం, కమలా హ్యారిస్‌కు ఇందులో ఏం కలిసొస్తున్నాయో చూద్దాం… అందులో, ‘పార్టీ ఆదేశం’ అనే అంశం ప్రముఖంగా నిలుస్తుంది. గత మిడ్‌టర్మ్‌తో పోలిస్తే మధ్యంతర ఎన్నికల తర్వాత అధికార పార్టీకి ప్రతినిధుల సభలో ఎక్కువ సీట్లు ఉండటం ఇక్కడ ప్రభావం చూపించింది. అలాగే, నామినేషన్ పోటీ. అధికారంలో ఉన్న పార్టీ నామినేషన్‌కు చెప్పుకోదగ్గ సవాళ్లు ఏమీ లేకపోవడం కమలకు కలిసొచ్చిన అంశం. ఇక, మూడోది అధికారం. సిట్టింగ్ అధ్యక్షుడు ప్రస్తుత పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తారనే అంశంలో బైడెన్‌కు కూడా ఎన్నికలు సానుకూలంగా ఉన్నాయని లిచ్డ్‌మాన్ చెప్పారు.

Also Read: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

ఇక, ‘థర్డ్-పార్టీ ఫ్యాక్టర్’ను చూస్తే.. చెప్పుకోదగ్గ మూడవ పక్షం లేదు. అలాగే, విదేశీ/సైనిక వైఫల్యాల అంశంలో.. ప్రస్తుత ప్రభుత్వం విదేశీ, సైనిక విషయాల్లో పెద్ద వైఫల్యాలను ఎదుర్కోలేదు. బదులుగా.. విదేశీ/సైనిక విజయాల పరంగా గణనీయమైన విజయాలను సాధించినట్లు మెజారిటీ అమెరికన్లు నమ్ముతున్నారు. ఇక, ఆకర్షణ విషయంలో… అభ్యర్థి చరిష్మా ప్రకారం కమలా హ్యారిస్‌కు ఎలాంటి ఢోకా లేదు. ఛాలెంజర్ అప్పీల్‌ను బట్టి కూడా ట్రంప్‌కు ధీటుగా కమలా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వీటితో పాటు, స్వల్పకాలిక ఆర్థిక స్థిరత్వం, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి, విధాన మార్పులు, సామాజిక స్థిరత్వం, కుంభకోణాలు లేకుండా ఉండటం వంటి అంశాల్లోనూ డెమోక్రటిక్ పార్టీకి మంచి పాయింట్లే వచ్చాయి. కాబట్టి, ఈ 13 అంశాల్లో కమలాకు కలిసొచ్చినమే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

2022 మధ్యంతర ఎన్నికల సమయంలో డెమొక్రాట్‌లు హౌస్‌లో సీట్లు కోల్పోయిన మాట వాస్తవమే అయనప్పటికీ.. థర్డ్-పార్టీ ఛాలెంజర్‌‌లు లేకపోవడం, సానుకూల ఆర్థిక సూచికల వల్ల కమలా హ్యారిస్ లాభపడుతున్నారని.. అది ఆమె అభ్యర్థిత్వానికి అనుకూలంగా ఉందని లిచ్ట్‌మాన్ తన విశ్లేషణలో వెల్లడించారు. నిజానినకి, లిచ్ట్‌మాన్ విధానం సాంప్రదాయ రాజకీయ విశ్లేషణకి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే, లిచ్ట్‌మాన్ ఎక్కువగా పోల్స్, ప్రచార వ్యూహాలకు బదులుగా చారిత్రక నమూనాలు, ఎన్నికల నిర్మాణాత్మక డైనమిక్స్‌పై దృష్టి పెడతారు. 2016లో హిల్లరీ క్లింటన్ గెలుస్తారని అందరూ అనుకుంటున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని అంచనా వేసిన అతికొద్ది మంది విశ్లేషకుల్లో లిచ్ట్‌మాన్ ఒకరు. అలాగే, 2020లో బైడెన్ విజయాన్ని అంచనా వేసిన ఆయన సామర్థ్యం ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఒక నమ్మకమైన ప్రిడిక్టర్‌గా లిచ్ట్‌మాన్ ఖ్యాతిని మరింత పటిష్టం చేసింది. అందుకే, ఇప్పుడు కమలా హ్యారిస్‌ కూడా రాబోయే ఎన్నికల్లో కాబోయే ప్రెసిడెంట్ అనే అంచనాలను కలిగిస్తోంది.

Related News

Telangana: విమోచనం.. విలీనం.. విద్రోహం.. ప్రజా పాలనా దినం..! 2014 నుంచి 2024 దాకా..!

Telangana Armed Struggle: జనం నడిపిన విప్లవం.. సాయుధ పోరాటం..!

YS Jagan Mohan Reddy: జగన్ కాదు.. సీతయ్య.. వైసీపీలోనే గుసగుసలు

New Headache To YS Jagan: జగన్‌కు కొత్త తలనొప్పి.. కనక దుర్గ కండిషన్స్

New Election Commissioner: తెలంగాణ కొత్త ఎలక్షన్ కమీషనర్.. ఎవరంటే?

Big Shock to YS Jagan: వైసీపీ అడ్రస్ గల్లంతు.. 45 కార్పోరేటర్లు టీడీపీలోకి?

GHMC Elections: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

Big Stories

×