EPAPER

Hemant Soren Money Laundering case | హేమంత్ సోరెన్ భూ కుంభకోణం కేసులో బలమెంత?.. సిట్టింగ్ ముఖ్యమంత్రులను బిజేపీ టార్గెట్ చేస్తోందా?

Hemant Soren Money Laundering case | ఝార్ఖండ్‌ పాలిటిక్స్‌లో జనవరి 31,2023 సాయంత్రం అనూహ్య మార్పులు జరిగాయి. Enforcement Directorate అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ని అరెస్టు చేశారు. అయితే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అవినీతి ఆరోపణల్లో అరెస్టు కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

Hemant Soren Money Laundering case | హేమంత్ సోరెన్ భూ కుంభకోణం కేసులో బలమెంత?.. సిట్టింగ్ ముఖ్యమంత్రులను బిజేపీ టార్గెట్ చేస్తోందా?

Hemant Soren Money Laundering case | ఝార్ఖండ్‌ పాలిటిక్స్‌లో జనవరి 31,2023 సాయంత్రం అనూహ్య మార్పులు జరిగాయి. Enforcement Directorate అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ని అరెస్టు చేశారు. అయితే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అవినీతి ఆరోపణల్లో అరెస్టు కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.


అరెస్టు తరువాత హేమంత్ సొరేన్.. ఝూర్ఖండ్ గవర్నర్‌ను కలిసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత హేమంత్ సొరేన్ మంత్రివర్గంలో ఉన్న Transport Minister చంపయీ సొరెన్‌ నాటకీయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.

అయితే దీనంతటికీ కారణం.. మనీ లాండరింగ్, భూకుంభకోణం కేసులో హేమంత్ సొరేన్‌ని ఆరోపణలు రావడం. ఆ తరువాత ఈడీ ఆయనను అరెస్టు చేయడం. ప్రస్తుతం హేమంత్ సొరేన్‌ ఈడీ కస్టడీలో ఉన్నారు.


మనీ లాండరింగ్, భూకుంభకోణం కేసుల్లో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. అవినీతికి పాల్పడ్డారనేవి తీవ్ర ఆరోపణలు. ఏమిటీ భూకుంభకోణ కేసు.. ఆ వివరాలు మీ కోసం..

Read more: ఫారిన్ వద్దు ఇండియా ముద్దు అంటున్న యువత.. విదేశాలకు ధీటుగా ఎదుగుతున్న భారత్‌!

అవినీతి ఆరోపణల్లో ముఖ్యమైన భూకుంభకోణం కేసు.. 2022కు సంబంధించినది. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని బరియాతు ప్రాంతంలో ఒక మునిసిపల్ tax collection అధికారి అయిన దిలీప్ శర్మ 2022లో పోలీస్ స్టేషన్‌లో ప్రదీప్ బాగ్చీ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. F.I.R ప్రకారం… ప్రదీప్ బాగ్చీ అనే వ్యక్తి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన నాలుగున్నర ఎకరాల భూమిని చట్ట వ్యతిరేకంగా ఆక్రమించుకున్నాడు. ఈ కేసులో కేంద్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ Enforcement Directorate(ED) విచారణ మొదలుపెట్టింది. ప్రాథమిక విచారణలో నాలున్నర ఎకరాలున్న ఈ భూమికి దివంగత బిపి లక్ష్మణ రావు అనే వ్యక్తి యజమాని. కానీ 1947 తరువాత లక్ష్మణ రావు తన భూమిని ఇండియన్ ఆర్మీ పేరున రాసిచ్చారు.

ఈ భూకుంభకోణం కేసులో ఏప్రిల్ 2023న మొదటిసారి ఈడీ action తీసుకుంది. నిందితుడు ప్రదీప్ బాగ్చీ సహా ఏడుగురిని ఈడీ అరెస్టు చేసింది. అరెస్టు అయిన ఏడుగురిలో ఒకరు భాను ప్రతాప్ అనే ప్రభుత్వ అధికారి ఉన్నారు. . ఆయన బడగాయి ప్రాంతంలో రెవెన్యూ సబ్ ఇన్స్‌పెక్టర్. మిగతా వారంతా ల్యాండ్ అమ్మకాలు, కొనుగోలు చేసే బ్రోకర్లు.

ఈ క్రమంలోనే మే 2023లో IAS OFFICER ఛవి రంజన్‌‌ని కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఛవి రంజన్ 2011 బ్యాచ్‌కు సంబంధించిన IAS OFFICER. ఆయన ఈ భూకుంభకోణం జరిగిన సమయంలో రాంచీ జిల్లా కలెక్టర్ పదవిలో ఉన్నారు. ఈ భూకుంభకోణంలో ఆయన కూడా నిందితులకు సహాయం చేశారని ఈడీ అధికారులకు అనుమానం కలిగింది. ఈడీ అధికారుల కథనాల ప్రకారం.. ఈ కేసులో ఉన్నతాధికారులు.. Land Mafiaకు సహాయం చేశారు. నాలుగున్నర ఎకరాల భూమికి సంబంధించి నకిలీ పత్రాలను కూడా సృష్టించారు. ఈ కారణంగానే మే 2023లొ IAS ఛవి రంజన్‌‌ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.

నకిలీ పత్రాలలో ఈ భూమి 1932కు సంబంధించిందని మార్చారు. ఈ భూమికి అసలు యజమాని ప్రదీప్ బాగ్చీ తండ్రి Praful Bagchi అని నకిలీ పత్రాలు సృష్టించారు. ఆ తరువాత వంశ పారంపర్యంగా ఈ భూమి ప్రదీప్ బాగ్చీకి సంక్రమించిందని చూపారు. ఆ తరువాత 2021లో ప్రదీప్ బాగ్చీ ఈ భూమిని కోల్ కతాకు చెందిన Jagat Bandhu Tea Estateకు అమ్మేశారు.

ఇప్పుడు ఈ కంపెనీ Jagat Bandhu Tea Estate Director దిలీప్ ఘోష్ ఈ భూమిని అమిత్ అగ్రవాల్‌కు అమ్మేశారు. నిజానికి ఈ అమిత్ అగ్రవాల్, దిలీప్ ఘోష్ ఇద్దరూ కూడా Jharkhand Chief Minister Hemant Sorenకి బాగా సన్నిహితులని ఈడీ విచారణలో తేలింది. దీంతో 2023 జూన్ నెలలో అమిత్, దిలీప్ ఇద్దరినీ ఈడీ అరెస్టు చేసింది. ఈ భూమి ప్రభుత్వ విలువ 20.75 కోట్ల రూపాయలు. కానీ ఈ భూమిని కేవలం 7 కోట్లకే అమ్మేశారు. అంటే ప్రభుత్వ విలువ కంటే చాలా తక్కువ.

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ 7 కోట్ల రూపాయలలో 25 లక్షలు మాత్రమే ప్రదీప్ బాగ్చీకి ఇచ్చారు. మిగతా పేమెంట్‌లో సగం Jagat Bandhu Tea Estate companyకి.. మిగిలిన భాగం.. ప్రభుత్వ ఆఫీసుల్లో నకిలీ పత్రాలు సృష్టించినందుకు అధికారులకి. So ఇంత రాద్ధాంతం నడిచింది. ఈ భూమిని చట్టాన్ని మోసంచేసి.. అమ్మి సొమ్ము చేసుకోవడానికి.

సరే.. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఎలా ఇరుకున్నారో చూద్దాం.

ఇలాంటి భూకుంభకోణాలు చాలా జరిగాయని Hindustan Times report తెలిపింది. ఆ report ప్రకారం.. Money Laundering చేయడానికే ఈ భూకుంబకోణాలు జరిగాయి. పాత డాకుమెంట్స్‌లో అసలు యజమాని పేర్లను తీసేయడానికి ఒక ప్రత్యేక కెమికల్‌ని ఉపయోగించారు. ప్రభుత్వాధికారులే ఈ అక్రమాలు చేస్తున్నారు. ఈడీ అధికారులు.. నిందితుల వద్ద నుంచి ఆ కెమికల్, నకిలీ పత్రాలు, నకలీ stamp, నకిలీ Land deed స్వాధీనం చేసుకున్నారు.

ఈడీ విచారణలో ప్రభుత్వాధికారి అయిన రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ భాను ప్రతాప్.. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఉన్నారని చెప్పారు. దీంతో ఈడీ అధికారులు.. ముఖ్యమంత్రి వైపు విచారణ మొదలుపెట్టారు. అయితే ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు సంబంధించిన మరో భూమి ఉందని ఈడీ అధికారులకు తెలిసింది. ఎనిమిది న్నర ఎకరాల్లో ఉన్న ఈ భూమి బడగాయి ప్రాంతంలో ఉంది. పైగా ఇది ఆదివాసి రిజర్వడ్ కేటగిరి భూమి. దీనిని ఎవరూ కొనలేరు.. అమ్మలేరు.

ఈ భూమి హేమంత్ సొరేన్‌కే చెందినదని.. బడగాయి రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ మనోజ్ ఝా.. ఈడీ అధికారులకు చెప్పారని సమాచారం. ఒకరోజు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ భూమికి సంబంధించి.. Verification కోసం ఫోన్ వచ్చిందని మనోజ్ తెలిపారు. దీంతోపాటు ఈడీ అధికారులు Prem Prakash అనే వ్యక్తిని కూడా ఈడీ అరెస్టు చేసింది. అతను ముఖ్యమంత్రి బినామీ అని.. Prem Prakash ఎన్నో భూ కుంభకోణాలు చేశాడని పేర్కొంది. ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు దాదాపు 230 కోట్ల రూపాయల విలువగల భూములను ఈ కేసులో attach చేసింది. ఈ భూములన్నీ.. మంచి commercial సెంటర్లలో ఉన్నాయి.

ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ అధికారులు.. విచారణ కోసం మొత్తం 7 సార్లు ముఖ్యమంత్రి సొరేన్‌కు సమన్లు జారీ చేశారు. కానీ ఆయన ఆ సమన్లకు సమాధానం చెప్పకుండా ఏకంగా సుప్రీం కోర్టుకు వెళ్లారు. కానీ సుప్రీం కోర్టు.. ఆయనకు High courtకు వెళ్లాలని సూచించింది. అయితే High courtలో కూడా ఆయనకు చుక్కెదురైంది. ఈడీ విచారణకు హాజరు కావాలని High court చెప్పడంతో జనవరి 20 2024న రాంచీలోని ముఖ్యమంత్రి ఇంట్లో.. ఈడీ అధికారులు ఏడు గంటలపాటు ఆయనను ప్రశ్నించారు.

ఆ తరువాత జనవరి 29 ఈడీ అధికారులు.. ఢిల్లీలోని సొరేన్ ఇంట్లో తనఖీలు చేసి 36 లక్షల నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న రెండు కార్లలో ఒకటి BMW Luxury car ఉంది. తనిఖీలు చేసే సమయంలో సొరేన్ ఆ ఇంట్లో లేరు. ఎవరికీ చెప్పకుండా ఢిల్లీ నుంచి రాంచీకి కారులో రాత్రంతా ప్రయాణించి మరుసటి రోజు చేరుకున్నారు.

తరువాతి రోజు సొరేన్ ఒక వీడియో విడుదల చేశారు. తనను ఈడీ అధికారులు.. రాజకీయ ఉద్దేశంతో టార్గెట్ చేస్తున్నారని.. ఢిల్లీలో దొరికిన ఆ డబ్బులు, కార్లతో తనకు ఏ సంబంధం లేదని.. పైగా ఈ భూకుంభకోణం కేసులో తనకు వ్యతిరేకంగా ఏ ఆధారాలు లేవని చెప్పారు. ఈడీ చెబుతున్న ఎనిమిదిన్నర ఎకరాల భూమి.. ఆదివాసి రిజర్వడ్ భూమి అని.. దానిని ఎవరూ కొనలేరని.. అలాంటి భూమి తనకే విధంగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. 2007 తరువాత నుంచి ఇప్పటివరకు తాను ఎటువంటి ఆస్తిపాస్తులు కొనలేదని తెలిపారు.

ఆ తరువాత ఈడీ అధికారులు జనవరి 31 సాయంత్రం ఆయనను అరెస్టు చేశారు. అరెస్టు అయిన తరువాత ఆయన గవర్నర్‌కు రాజీనామా అందజేశారు. ఈడీ కస్టడీ నుంచి ఆయన ఒకరోజు బెయిల్‌పై విడుదలై బయటికి వచ్చారు. ఆ రోజు ఝార్ఖండ్ అసెంబ్లీలో కొత్త ముఖ్యమంత్రి చంపయి సొరెన్‌ బలపరీక్షలో తన ఓటు వేసి.. ఆయన ప్రసంగం చేశారు. తనకు వ్యతిరేకంగా ఈడీ వద్ద ఆధారాలు లేవని.. ఉంటే చూపెట్టాలని.. అలా చేస్తే.. వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.

ఇదంతా నాణేనికి ఒకవైపు.. నాణేనికి మరోవైపు కూడా చూద్దాం.. కేంద్రంలోని అధికార బిజేపీ.. తనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల నాయకులను, ముఖ్యమంత్రులను వేధిస్తోందని.. అందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సిబిఐ ల దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.

Read more : పేటియం ఉపయోగిస్తున్నారా?.. అకౌంట్ ఉన్నవాళ్లు ఈ జాగ్రత్తలు పాటించండి..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీ అగ్రనాయకుడు ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియాలపై లిక్కర్ స్కాం కేసు నడుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై శారదా చిట్ ఫండ్ స్కాం కేసు నడుస్తోంది.

అలాగే ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి Bhupesh Bhagelపై అన్ లైన్ బెట్టింగ్ స్కాం కేసులో విచారణ సాగుతోంది. బిహార్‌లో ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌లపై రైల్వే ఉద్యోగాలకు బదులు భూమి అవినీతి కేసు ఉంది.

వీరంతా బిజేపీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకించే నాయకులు.. వీళ్లపై కేసులు పెట్టి.. సంవత్సరాల పాటు విచారణ జరుపుతారు. ఈ కేసులు అంత త్వరగా పరిష్కారం కావు. మరోవైపు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆయన అత్యంత అవినీతిపరుడని అమిత్ షా చెప్పారు. కానీ హిమంత బిజేపీలో చేరగానే.. అయనపై ఉన్న అన్నికేసుల విచారణ ఆగిపోయింది.

ఏది ఏమైనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఈడీ అధికారులు అరెస్టు చేయడం ఇదే తొలిసారి.. పైగా ఆయనకు వ్యతిరేకంగా దొరికిన ఆధారాలు పక్కాగా లేవనే చెప్పాలి. రాజకీయ నాయకుల ఇళ్లలో నుంచి వందల, వేల కోట్ల అవినీతి డబ్బు, ఆస్తులు దొరుకుతున్న ఈ రోజుల్లో కేవలం రూ.36 లక్షలు నగదు, 8 ఎకరాల ఆదివాసి భూమి, ఒక కారుని ఆధారంగా చూపి ఈడీ అధికారులు ఈ కేసుని ఎంతవరకు నడపగలరో చూడాలి.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×