EPAPER
Kirrak Couples Episode 1

Gaza: గాజా… కన్నీటి గాథ

Gaza: గాజా… కన్నీటి గాథ

Gaza: యువత అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో గాజా ఒకటి. 2.3 లక్షల మంది జనాభా ఉన్న గాజాలో 60% యువతే. లండన్‌ విస్తీర్ణంతో పోలిస్తే గాజా స్ట్రిప్ ఐదోవంతు ఉంటుంది. జనసాంద్రత అధికం. పాలస్తీనియన్ సెంట్రల్ బ్యూర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల మేరకు ఇక్కడి జనాభాలో మూడొంతుల మంది వయసు 25-64 ఏళ్లలోపే. పేదరికం, నిరుద్యోగం చాలా ఎక్కువ.


80 శాతానికి పైగా జనాభా దారిద్ర్యంలో మగ్గుతున్నారు. ఇక్కడ నిరుద్యోగాన్ని చూస్తే.. ప్రపంచంలోనే అత్యధికం. 2022లో 45 శాతం నిరుద్యోగులుగా ఉన్నారు. ఇక్కడి స్కూళ్లలో ఎక్కువ భాగం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడిచేవే. హమాస్ యుద్ధం కారణంగా అవి ఇప్పుడు శరణార్థి శిబిరాలుగా మారాయి. 278 స్కూళ్లలో 71 శాతం బడులు షిప్టుల పద్ధతిలో పని చేస్తుంటాయి. నిరుడు సగటున ఒక్కో తరగతిలో 41 మంది విద్యార్థులు చదువుకున్నారు.

15-19 ఏళ్ల వయసు వారిలో అక్షరాస్యత ఎక్కువ. 2021లో అక్షరాస్యత రేటు 98%గా ఉంది. ప్రభుత్వ వైద్య సదుపాయాలు దాదాపు మృగ్యమనే చెప్పాలి. విద్యుత్తు కోతలు, మందులు-యంత్ర పరికరాల కొరతతో వైద్య సేవలు అందడమనేది అంతంతమాత్రమే. పలు సర్వీసులు, ప్రత్యేక చికిత్సలనేవి దాదాపు సున్నా. ఆరోగ్య రంగం ఇలా చిక్కి శల్యం కావడానికి కారణం పాలస్తీనియన్ పాలకులు, హమాస్ మిలిటెంట్లే కారణం.


అధునాతన వైద్యసేవలను గాజన్లు పొందాలంటే వెస్ట్‌బ్యాంక్‌, జెరూసలేం ఆస్పత్రులే దిక్కు. ఇందుకు తొలుత పాలస్తీనా అధికారులు, ఆపై ఇజ్రాయెల్ అధికారుల ఆమోదం తప్పనిసరి. 2008-22 మధ్య వైద్యం కోసం దాదాపు 70 వేల మంది చేసుకున్న అభ్యర్థనలు జాప్యం కావడమో లేదంటే తిరస్కరణకు గురికావడమో జరిగింది. నీరు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాల కల్పనలోనూ వెనుకబాటుతనమే. గాజా జనాభాలో 95 శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరే దొరకదు.

రోజువారీ కనీసావసరాలకు ఒక్కొక్కరికి వంద లీటర్లను అందజేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణికంగా నిర్దేశించింది. ఇజ్రాయెల్ తాగునీటి సరఫరాను నిలిపివేసిన తర్వాత కొరత మరింత తీవ్రమైంది. ఇజ్రాయెల్ విద్యుత్తు సరఫరాను నిలిపివేయక ముందు ఇక్కడ కోతలు నిత్యకృత్యం. సగటున రోజుకు 13 గంటలు మాత్రమే కరెంటు ఉండేది. గాజా అవసరాల్లో దాదాపు మూడోవంతును ఇజ్రాయెలే తీరుస్తోంది. ఇజ్రాయెల్ విద్యుత్తు సరఫరాను నిలిపివేయడం, ఇక్కడ ఉన్న ఏకైక గాజా పవర్ ప్లాంట్ మూతపడటం వల్ల ప్రస్తుతం అంధకారమే మిగిలింది.

Related News

Vijayasai Reddy to Join in TDP: టీడీపీలోకి విజయసాయిరెడ్డి? బాంబు పేల్చిన అచ్చెన్న..

Israeli airstrikes on Beirut: లెబనాన్ రాజధాని బీరుట్‌పై బాంబుల వర్షం.. వంతెనల కిందే ఆకలి బతుకులు

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జోలికొచ్చి బుక్కైన నానీలు..

Russia Vs Ukraine War: దూసుకొస్తున్న రష్యా మిస్సైల్? వణికిపోతున్న ఉక్రెయిన్

YS Jagan vs Botsa Satyanarayana: వైసీపీ నేతల పార్టీ మార్పు వెనుక బొత్స వ్యూహం ఉందా?

Irregularities: జూబ్లీహిల్స్‌లో బయటపడ్డ మరో భారీ బాగోతం.. 36 ఏండ్ల నుంచి..

Big Stories

×