EPAPER

HYDRA: హైడ్రాకు హైపవర్.. రాష్ట్రవ్యాప్తంగా ఫుల్ క్రేజ్

HYDRA: హైడ్రాకు హైపవర్.. రాష్ట్రవ్యాప్తంగా ఫుల్ క్రేజ్

– రాష్ట్రవ్యాప్తంగా హైడ్రాకు ఫుల్ క్రేజ్
– ఇతర నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్లు
– నిజామాబాద్‌కి నిడ్రా కావాలంటున్న స్థానికులు
– హైదరాబాద్‌లో రోజుకు 50 నుంచి 60 ఫిర్యాదులు
– త్వరలోనే హైడ్రా చట్టం తెస్తామంటున్న రంగనాథ్
– వణికిపోతున్న ఆక్రమణదారులు
– మల్లారెడ్డి అల్లుడి కాలేజీలకు నోటీసులు


CM Revanth Reddy: హైడ్రా.. ఎక్కడ చూసినా ఈ పేరు మార్మోగుతోంది. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల రక్షణకు హైడ్రా తీసుకుంటున్న చర్యలు అక్రమార్కులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా బుల్డోజర్లతో దూసుకెళ్తోంది. చెరువుల పక్కనే ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తోంది. వరుస కూల్చివేతలు జరుగుతుండటంతో కబ్జాలకు గురైన చెరువులు, నాలాలు, పార్కులపై రోజూ హైడ్రాకు కనీసం 60 నుంచి 70 వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న హైడ్రా, ఆక్రమణలను బట్టి చర్యలకు సిద్ధమవుతోంది.

త్వరలోనే హైడ్రా చట్టం


అక్రమ కట్టడాలపై వరుస ఫిర్యాదుల నేపథ్యంలో త్వరలోనే హైడ్రా చట్టం తీసుకొస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు నేరుగా అక్కడికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా పోలీస్ స్టేషన్ చర్యలు తీసుకుంటుందని, ఇప్పటివరకు జరిగిన విచారణలో కొంతమంది అవినీతి అధికారులను గుర్తించినట్టు చెప్పారు. వారిపై త్వరలోనే కేసులు నమోదు చేసి విచారణ చేస్తామని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న చెరువులను కాపాడడమే లక్ష్యంగా పెట్టుకుంది హైడ్రా.

స్కూళ్లు, కాలేజీలపై చర్యలకు చర్చలు

చెరువులు, కుంటల వద్ద కూల్చివేతలకు కొన్నిచోట్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం సహకరించినా, పరిస్థితులు అనుకూలించడం లేదు. ఆక్రమణలలో పాఠశాలలు, కళాశాలలు వెలిశాయి. వాటి కూల్చివేతలపై వేచి చూడాలని హైడ్రా భావిస్తోంది. అకడమిక్ ఇయర్ మొదలు కావడం ఇప్పటికే ఆ బిల్డింగుల్లో చదువుతున్న వందల మంది స్టూడెంట్స్‌కి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో నోటీసులు జారీ చేసి కొంత సమయం ఇవ్వాలని చూస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read: Demolitions: ఎవర్నీ వదలొద్దు..: సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి బిగ్ షాక్

మల్లారెడ్డి అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి బిగ్ షాక్‌ తగిలింది. ఆయనకు చెందిన కళాశాలకు మరోసారి నోటీసులు జారీ చేశారు రెవెన్యూ అధికారులు. ఆయనకు చెందిన దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు పంపించారు. చిన్నదామర చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని సర్వే నంబర్ 489లో ఒక ఎకరాలో కళాశాల భవనాలు నిర్మించారు. 485, 488, 484 సర్వేలలో రెండు ఎకరాల్లోని షెడ్ల నిర్మాణాలు చేపట్టారు. 492 ,489 లలో మూడు ఎకరాల్లో పార్కింగ్‌కి స్థలాలు కేటాయించారు. కాలేజీ రోడ్స్‌కి 2.24 ఎకరాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు.

నిజామాబాద్‌లో నిడ్రా డిమాండ్

హైడ్రా మాదిరి నిజామాబాద్‌కి నిడ్రా కావాలని అడుగుతున్నారు అక్కడి స్థానికులు. నగర వ్యాప్తంగా ఈ మాట బలంగా వినిపిస్తోంది. కబ్జా కోరల్లో చిక్కుకున్న రామ్మూర్తి చెరువును సందర్శించిన అర్సపల్లి గ్రామ కమిటీ ప్రతినిధులు, హైడ్రా తరహాలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలంటూ ధర్నా చేశారు. కబ్జాల నుంచి చెరువును కాపాడాలంటూ నినాదాలు చేశారు. రామ్మూర్తి చెరువు విస్తీర్ణం 30 ఎకరాలు. ప్రస్తుతం మిగిలింది 12 ఎకరాలు మాత్రమే. బోధన్ రోడ్డును ఆనుకుని ఉన్న చెరువు కట్ట బఫర్ జోన్ స్థలంలో ఆక్రమణలు వెలిశాయి. దిగువన 7 ఎకరాల్లో ఉన్న గాడి కుంట చెరువు కూడా కబ్జా అయింది. చెరువుల అక్రమణలు తొలగించాలంటూ త్వరలోనే చలో కలెక్టరేట్ చేపడతామని అర్సపల్లి గ్రామ కమిటీ తెలిపింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ కలుస్తామని స్పష్టం చేసింది.

Related News

GHMC Elections: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

KTR : కోర్టు తీర్పుతో భయం.. కాంగ్రెస్ అంటేనే డ్రామాలమయం

Kakani Vs Somireddy: కాకాణి VS సోమిరెడ్డి‌.. రూ.100 కోట్ల లొల్లి

Russia-Ukraine war: మోడీ దెబ్బ.. వెనక్కి తగ్గిన పుతిన్.. యుద్దం ఆగినట్లేనా!

KCR Silent: నోరు మెదపని కేసీఆర్.. బయటపడ్డ అసలు కుట్ర!

 YS Jagan: పెద్దిరెడ్డిని సైడ్ చేసిన జగన్.. పుండు మీద కారం

Hindi: హిందీ హమారా.. హిందుస్థాన్ హమారా

Big Stories

×