EPAPER

Encroachments: కబ్జాల్లో ఘనుడు.. ఈ మాజీ ఐపీఎస్..!!

Encroachments: కబ్జాల్లో ఘనుడు.. ఈ మాజీ ఐపీఎస్..!!

– ఆక్రమణదారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్
– కోర్టుల్లో స్టే‌లు ఉన్నా కొట్లాడుతామని స్పష్టం
– సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో తెరపైకి మాజీ ఐపీఎస్ శివానందరెడ్డి కబ్జాలు
– అధికారులను గుప్పిట్లో పెట్టుకుని అందినకాడికి దోచుకున్న వైనం
– చెరువుల హద్దులు మార్చి రియల్ దందా
– వెసెల్లా మెడోస్‌కు అడ్డొచ్చిన ఉన్నతాధికారులకు విల్లాలతో తాయిలాలు
– కొండాపూర్ కుడి కుంటను చెరబట్టడంతో స్మశానం మాయం
– హైకోర్టులో స్టే తెచ్చుకుని పట్టా భూమిగా కలరింగ్
– హైదరాబాద్‌లో దందాలు.. రాయలసీమలో రాజకీయాలు
– మాజీ పోలీస్ అధికారి శివానందరెడ్డి లీలలెన్నో
– సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో భూదందాలపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేటివ్ కథనం


దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

Former IPS Officer: గతంలో ఆయనో ఐపీఎస్ అధికారి. ఎవరైనా తప్పుచేస్తే దండించే హోదాలో ఉన్నాడు. కానీ, ఆయనే తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. లిటిగేషన్‌, ప్రభుత్వ భూములపై వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు, ఎడాపెడా సంపాదించి పెద్ద రాజకీయ నాయకుడు కావాలని తెగ ఉబలాటపడ్డాడు. ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. కానీ, తన బినామీని, ఒకప్పటి డ్రైవర్‌ని ఎమ్మెల్యేగా గెలిపించుకుని అనుకున్నది సాధిస్తున్నాడు. ఆ మాజీ పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదు మాండ్ర శివానందరెడ్డి. లంచాలతో చట్టాన్ని చుట్టంగా చేసుకుని ఈయన సాగించిన లీలలు అన్నీ ఇన్నీ కావు. పోలీస్‌గా ఉంటూనే రియల్ ఎస్టేట్ దందా సాగించిన శివానందరెడ్డి దందాలపై కొత్తగా చర్చ జరుగుతోంది.


కుడి కుంటను దారి మళ్లించి విల్లాల నిర్మాణం

వెసెల్లా మెడోస్ అనే రియల్ సంస్థ శివానందరెడ్డి కనుసన్నల్లోనే పని చేస్తుంది. కొండాపూర్ పరిధిలో ఉన్న కుడి కుంట పక్కనే సైబర్ మెడోస్ పేరుతో ప్రాజెక్ట్ చేసింది. నిజానికి కుడి కుంట విస్తీర్ణం 8 ఎకరాలు. సర్వే నెంబర్ 187, 188, 189లో ఇది ఉంది. అయితే, సర్వే నెంబర్ 188లోని ఎకరం 39 గుంటల భూమిని కబ్జా చేశారని, 2012, 2013లోనే అధికారుల రిపోర్టులు చెబుతున్నాయి. కుంటకు రెండు వైపులా రోడ్డు వేశారు. మత్తడి నుంచి నీళ్లు వెళ్లకుండా అడ్డుకున్నారు. పైపులు వేసి వరదలకు కారణం అయ్యారు. 10 ఫీట్ల బండ్‌ని 40 ఫీట్లుగా మార్చుకుని డ్రైనెజీ పైపులు వేసుకుని రోడ్డుగా వాడుకున్నారు. కుడి కుంటలోకి నీళ్లు రాకుండా, వెళ్లకుండా అన్ని ప్రయత్నాలూ చేశారు. సర్వే నెంబర్ 189లో మరో ఎకరం 33 గుంటల చెరువు భూమి సైబర్ మెడోస్‌లో ఉంది. అలాగే, రోడ్లకు ఇంకో 38 గుంటలు, కుంట, బఫర్ జోన్ కలిపి 5 ఎకరాల వరకు కబ్జా అయినట్టు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఫిర్యాదు చేయగా, అప్పటి జాయింట్ కలెక్టర్ 2013 జనవరి 31న సర్వే రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించారు. చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించుకుని ఇష్టారాజ్యంగా సాగిన ఈ వ్యవహారం అంతా బట్టబయలు అయ్యింది. కాకపోతే, హైకోర్టుకు వెళ్లి పట్టా భూమి అంటూ కూల్చకుండా స్టే తెచ్చుకున్నారు. దీంతోపాటు హెచ్ఎండీఏ లేక్స్‌లో పొందుపర్చారు. 8 ఎకరాల చెరువుగా ఐడీ నెంబర్ 3742గా ఉంచారు. ఓఆర్సీలతో కుంటను లేకుండా చేసే ప్రయత్నం చేసినా, మరోవైపు నీటిని మళ్లించి తమ భూములను, విల్లాలను కాపాడుకున్నారు. కానీ, ఇప్పటికీ వరదలు వస్తే, మత్తడి నుంచి ఫ్రీగా నీళ్లు వెళ్లే పరిస్థితి లేదు. రెండు పైపులు వేసి మళ్లించారు.

రికార్డుల తారుమారులో స్పెషలిస్ట్

ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చేయడంలో శివానందరెడ్డి స్పెషలిస్ట్. పోలీస్ శాఖలో పనిచేసి ఆ శాఖ భూములనే కొట్టేసే ప్రయత్నించిన ఘనుడు. ఏకంగా రూ.10 వేల కోట్ల భూములకు ఎసరు పెట్టాడు. మంచిరేవుల గ్రామంలోని సర్వే నెంబర్ 393 / 1 నుంచి 393 / 20 వరకు 142 ఎకరాల 38 గుంటల భూమిని గ్రేహౌండ్స్ కోసం కేటాయించారు. కానీ, 1961లో ఈ భూములను అసైన్డ్ చేశారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి అసైన్డ్ దారులతో రికార్డులు సృష్టించి వారితో అగ్రిమెంట్స్ చేసుకుని లీగల్‌గా కొట్టేయాలనే ప్రయత్నం చేశాడు. హైకోర్టును తప్పుదారి పట్టించి భూములను కోట్టేయాలని చూశాడు. కానీ, సుప్రీంకోర్టు అది ప్రభుత్వ భూమే అని స్పష్టం చేయడంతో చతికిల పడ్డాడు. శివానందరెడ్డి భార్య ఉమాదేవి యూ అండ్ ఏ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడిందనే ఆరోపణలున్నాయి. టైటిల్ లేకుండానే ప్రీలాంచ్ పేరుతో అమ్మకాలు చేయడంతో, వాళ్ల బంధువే సీసీఎస్‌లో కేసు పెట్టగా, లేని పేపర్స్ సృష్టించి జీపీఏలు చేయించుకున్నారని, 60 మందికి నోటీసులు జారీ చేసి పోలీసులు ఇంకా ఆ కేసులో దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Padi Kaushik Reddy: బ్రేకింగ్ న్యూస్… పాడి కౌశిక్ రెడ్డికి చెప్పు చూపించిన బండ్రు శోభారాణి

బుద్వేల్‌లో 26 ఎకరాల స్కాం

శివానందరెడ్డి అత్యంత విలువైన 26 ఎకరాల బుద్వేల్ అసైన్డ్ భూములను కూడా కొట్టేసే ప్రయత్నం చేశాడు. మొత్తం 281 ఎకరాల ప్రభుత్వ భూమిని 1994లో కొందరికి అసైన్డ్ చేశారు. అనంతరం అమ్ముకోవడంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. హైకోర్టుకు వెళ్లి ఆర్డీవో ఉత్తర్వులను రద్దు చేయించారు. లబ్ధిదారుల నుంచి డెవలప్మెంట్ చేసుకోవాలని ప్రభుత్వానికి వేడుకున్నారు. కానీ, టీజే ప్రకాశ్, కోనేరు గాంధీ, దశరథరామారావుతో పాటు శివానందరెడ్డి కుట్రలు పన్నాడు. పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి 26 ఎకరాలు అగ్రిమెంట్లు చేయించుకున్నాడు. అసైన్డ్ భూమిని పట్టాగా మారుస్తామని చెప్పి మోసాలకు పాల్పడ్డాడు. దీంతో 4 కేసులు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వీవీఐపీలకు తాయిలాలు

అధికారులను మచ్చిక చేసుకునేందుకు తారామతి దగ్గర తక్కువ ధరలకే విల్లాలను ఇచ్చేశాడు. ఈ లిస్టులో మాజీ సీఎస్‌, మాజీ డీజీపీతో పాటు చాలామంది ఐపీఎస్‌లు ఉన్నారు. జీహెచ్ఎంసీలో పనిచేసే ఇంజినీర్లకు సైతం మరో ప్రాంతంలో విల్లాలు ఇప్పించాడు. ఇక్కడ రెండెకరాల దాకా ప్రభుత్వ భూమిని కొట్టేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మాజీ డీజీపీ భార్య ఢిల్లీలో హెల్ప్ చేశారని మరో విల్లా ఇచ్చేశాడు. పోలీసుల దగ్గర ఫైనాన్స్ పేరుతో డబ్బులు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యవహారం సాగించాడు. ఇలా అనేక తాయిలాలతో అన్నింటినీ సెట్ రైట్ చేసుకోవడంలో దిట్టగా మారాడు శివానందరెడ్డి. ఇవే కాకుండా గతంలో నయీంతో సంబంధాలు పెట్టుకుని ఎన్నో దందాలు చేశాడని, కుడి కుంట స్మశానం కూడా కబ్జా చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క కొండాపూర్ కుడి కుంటే కాదు, ఇంకా ఎన్నో దందాలు సాగించాడు.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×