EPAPER

Natural Disaster: క్లౌడ్‌ బరస్ట్‌తో ఆకస్మిక వరదలు.. విపత్తులను ఆపే దారేది?

Natural Disaster: క్లౌడ్‌ బరస్ట్‌తో ఆకస్మిక వరదలు.. విపత్తులను ఆపే దారేది?

మన దేశంలో 4 కోట్ల హెక్టార్ల భూమి వరద ముంపును ఎదుర్కొంటోంది. 1953-2010 మధ్య 4.9 హెక్టార్లు వరదల్లో మునిగింది. 2.1 కోట్ల హెక్టార్ల భూమి మాత్రమే సురక్షిత ప్రాంతంలో ఉంది. ఏటా సగటున వరదలతో 2 వేల మంది చనిపోతున్నారు. 6 లక్షల వరకు పశువులు, 12 లక్షల ఇళ్లు ఎఫెక్ట్ అవుతున్నాయి. క్లౌడ్‌ బరస్ట్‌లతో ఏర్పడే ఆకస్మిక వరదలు విపత్తు నిర్వహణ యంత్రాంగానికి సవాల్ విసురుతున్నాయి. IMD, అమెరికా జాతీయ వాతావరణ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా దక్షిణాసియా దేశాల్లో వాతావరణ పరిస్థితుల అంచనాకు 2020లో ఫ్లాష్‌ ఫ్లడ్‌ గైడన్స్‌ సిస్టమ్‌ ను ఏర్పాటు చేసింది. ఆకస్మిక వరదలు, క్లౌడ్‌ బరస్ట్‌లపై 6 నుంచి 24 గంటల ముందు ఇది సమాచారం ఇవ్వాలి. అయితే రియాక్ట్ అయ్యేందుకు తక్కువ టైమే ఉండడం సహాయ చర్యలకు సమస్యగా మారింది. క్లౌడ్‌ బరస్ట్‌లను కనీసం రెండు మూడు రోజుల ముందే గుర్తించగలిగే వ్యవస్థను పటిష్టంగా నిర్మించాల్సిన అవసరం ఉందంటున్నారు. కానీ అది జరగడం లేదు.

సిస్టమాటిక్ అప్రోచ్ ఉంటేనే పర్యావరణం సమతులంగా ఉంటుందన్నది ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం. ఏ సిటీ అయినా పట్టణమైనా, ప్రాంతమైనా, గ్రామమైనా 21 శాతం ఆక్సిజన్ గాలిలో ఉండాలి. ఉదాహరణకు ఒక కోటి మంది జనాభా ఉంటే 50 వేల మొక్కలు ఉండేలా ప్లానింగ్ ఉండాలంటున్నారు. ప్రకృతికి తగినంత ఇన్ పుట్ ఉండాలని, అప్పుడే వీచే గాలి, గాలిలో తేమ శాతం, ఉష్ణోగ్రత సమపాళ్లల్లో ఉండే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. మరో ముఖ్యమైన విషయం గ్రీన్ బెల్ట్ డెవలప్ మెంట్ చేయడం. అప్పుడే పర్యావరణం బాగుంటుందని, ఆక్సిజన్ సమృద్ధిగా ఉండాలంటే ORR, RRR చుట్టూ గ్రీన్ బెల్ట్ చాలా కీలకం అంటున్నారు.


Also Read: భారీ వర్షాలు.. అక్కడ అలా.. ఇక్కడిలా..

ప్రతి నిర్దేశిత భూభాగంలో 33 శాతం గ్రీన్ బాడీ అంటే చెట్లు, మొక్కలు గ్రీన్ కవర్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు. 5-10 పర్సెంట్ నీటి వనరులు ఉండేలా ప్లానింగ్ ఉండాలంటున్నారు. మనదేశంలో గ్రీన్ బెల్ట్ ఉండేందుకు చాలా ప్లేస్ ఉంటుందని, కానీ తగినంత గ్రీన్ బెల్ట్ లేకపోవడం సమస్యలను మున్ముందు మరింత పెంచుతుందని అలర్ట్ చేస్తున్నారు. ట్రాపికల్ టెర్రెయిన్ అంటే భూ ఉపరితల పరిస్థితులు ఎత్తు పల్లాల ప్రకారం ప్రతి చదరపు కిలోమీటర్ ను ఓ గ్రిడ్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు. వర్షం పడ్డప్పుడు ఎక్కడ ఆగుతుంది.. ఏ గ్రిడ్ లో ఆగుతుంది.. చూసుకోవాలని సూచిస్తున్నారు. స్లోప్ ఎటుంటే అటే నీళ్లు వెళ్తాయి. భూఉపరితల స్వభావాన్ని బట్టి వెళ్తుంటాయి. సో టోపోగ్రఫికల్ సెన్సిటివ్ ప్లానింగ్ అన్నది హైదరాబాద్ లాంటి వాటికి చాలా కీలకం అంటున్నారు నిపుణులు.

నిజానికి భారత్‌లో ప్రకృతి వైపరీత్యాలను ముందే తెలుసుకొని అప్రమత్తం కావడానికి తగిన వ్యవస్థ అందుబాటులో ఉంది. పట్టణ నగర ప్రాంతాల్లో పరిస్థితుల్ని భారత వాతావరణ శాఖ, నదులు, రిజర్వాయర్లలో నీటిమట్టం తదితరాలను కేంద్ర జల సంఘం పర్యవేక్షిస్తుంటాయి. దేశవ్యాప్తంగా 20 నదీ తీర ప్రాంతాల్లో దాదాపుగా 1,600 హైడ్రో మెట్రాలాజికల్‌ స్టేషన్లు సీడబ్ల్యూసీ నిర్వహణలో ఉన్నాయి. ఇవన్నీ రిజర్వాయర్లలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలను గుర్తిస్తూ విపత్తు నిర్వహణ సంస్థల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. వరద బీభత్సంతో ముంపు సమస్యలు తలెత్తేలా ఉంటే హెచ్చరించడానికి గూగుల్‌తో సీడబ్ల్యూసీ గతంలోనే ఒప్పందం చేసుకుంది. పట్టణ ప్రాంతాల్లో ఐఎండీ 33 రాడార్‌ నెట్‌వర్క్‌ స్టేషన్లను నిర్వహిస్తూ వాతావరణ సూచనలు చేస్తుంటుంది. ఇదంతా ఒక సిస్టమాటిక్ వ్యవస్థ. మరోవైపు వాతావరణ శాఖ అంచనాలు తప్పుతుండడం కూడా సమస్యలకు కారణమవుతోంది. తుఫాన్లు, క్లౌడ్ బరస్ట్ ను అంచనా వేయడంలో కచ్చితత్వం తప్పడం సమస్యలను పెంచుతోంది. ప్రకృతి వైపరీత్యాలతో సమస్యలు తగ్గాలి, నష్ట తీవ్రత తగ్గాలి అంటే ప్రకృతి అడ్జస్ట్ అయ్యేలా వాతావరణం చుట్టూ ఉండాలి. అదే సమయంలో అంచనాల కచ్చితత్వంపైనా ఫోకస్ పెంచాలి.

Related News

Telangana: విమోచనం.. విలీనం.. విద్రోహం.. ప్రజా పాలనా దినం..! 2014 నుంచి 2024 దాకా..!

Telangana Armed Struggle: జనం నడిపిన విప్లవం.. సాయుధ పోరాటం..!

YS Jagan Mohan Reddy: జగన్ కాదు.. సీతయ్య.. వైసీపీలోనే గుసగుసలు

New Headache To YS Jagan: జగన్‌కు కొత్త తలనొప్పి.. కనక దుర్గ కండిషన్స్

New Election Commissioner: తెలంగాణ కొత్త ఎలక్షన్ కమీషనర్.. ఎవరంటే?

Big Shock to YS Jagan: వైసీపీ అడ్రస్ గల్లంతు.. 45 కార్పోరేటర్లు టీడీపీలోకి?

GHMC Elections: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

Big Stories

×