EPAPER

MVV Satyanarayana: అష్టదిగ్బంధంలో ఎంవీవీ చాప్టర్ క్లోజ్?

MVV Satyanarayana: అష్టదిగ్బంధంలో ఎంవీవీ చాప్టర్ క్లోజ్?

విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అష్టదిగ్బంధంలో చిక్కుకుపోతున్నారు. దాదాపుగా 20 ఏళ్లుగా బిల్డర్ గా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, సినీ ప్రొడ్యూసర్‌గా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న సత్యనారాయణ వైజాగ్‌లో బిగ్‌షాట్‌గా చెలామణి అయ్యారు. వైజాగ్ నగరంలో భారీ భవంతులు ఎక్కడ చూసినా ఎంవీవీ పేరు మాత్రమే కనిపిస్తుంది. ఆయన కన్స్‌ట్రక్షన్స్‌లో ఫ్లాట్ కొనాలంటే కోట్లు చెల్లించాల్సిందే.. అంతా బడా వ్యాపారం చేసిన ఎంవీవీ సత్యనారాయణకి 2014 నుండి 2019 మధ్య కాలంలో చుక్కెదురైంది. ఒక వివాదంలో అప్పటి మంత్రి కళా వెంకట్రావుతో ఆయనకు విభేదాలు తలెత్తాయి. అప్పట్లో కళాదే పైచేయి అయింది.

దాంతో ఎంత సొమ్మున్నా అధికారం లేకపోతే ఎవరూ లెక్క చేయరని భావించిన ఎంవీవీ పొలిటికల్ ఎంట్రీకి ఫిక్స్ అయ్యారు. వైసీపీలో జాయిన్ అయి. కొద్ది నెలల్లోనే విశాఖ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. వైసీపీ అధికారంలో ఉండటంతో విశాఖ ఎంపీగా ఎంవీవీ ఏం చేసినా చలామణి అయింది. ఎక్కడ ఖాళీ సైట్లు కనిపించినా వాటి మీద కన్నేయడం, వివాదాలు క్రియేట్ చేసి ఆ స్థలాలను సొంతం చేసుకుని బిల్డింగ్స్ నిర్మించడం అదే పనిగా పెట్టుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఆ క్రమంలో బిల్డర్‌గా విశాఖలో ఎంవీవీ మీద అప్పటి వరకు ఉన్న పాజిటివ్ కాస్తానెగిటివ్ గా మారుతూ వచ్చింది.


ఐదేళ్లు విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ అభివృద్ధి పరంగా ఏం చేయలేదన్న విమర్శలున్నాయి. అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ కేంద్ర నిధులు రూపాయి కూడా తేలేకపోయారు. విశాఖ రైల్వేజోన్‌ను కూడా పట్టించుకలేదు . అందుకే 2024 ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా పోటీ చేస్తే ఓటమి తప్పదనుకున్నారో? ఏమో విశాఖ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగారు. గెలుపు కోసం కోట్లు ఖర్చు చేశారు. ఐదేళ్లు ఎంపీగా ఆయన నిర్వాకాలను చూసిన ప్రజలు ఎమ్మెల్యేగా కూడా గెలిపించలేదు.

ఓటమి చెందిన ఎంవీవీకి కొత్త ప్రభుత్వంలో చిక్కులు మొదలయ్యాయి. ఎంపి గా ఉన్న సమయంలో చేసిన భూకబ్జాలు ఇప్పుడు మెడకు చుట్టుకుంటున్నాయి. సిరిపురం జంక్షన్ లో క్రైస్తవ సంస్థలకు సంబంధించిన సీబీసీఎంసీ భూముల విషయంలో పెద్ద దుమారమే లేచింది. క్రైస్తవ సంస్థకు చెందిన భూములు అక్రమంగా రాయించుకుని నిర్మాణాలు చేపడుతున్నారని ఎంవీవీపై అప్పట్లో కేసులు కూడా వేశారు. బాధితులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కలిసి తమకు న్యాయం చేయాలని కోరడంతో ఆయన సిరిపురం లోని ఆ భూములు పరిశీలించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దానికి తగ్గట్లే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఎంవీవీ సీబీసీఎంసీ భూముల్లో చేపడుతున్న నిర్మాణాలను వెంటనే ఆపాలని విశాఖ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది.

Also Read: మోసం చేస్తారా.. తల్లి, చెల్లిపై కోర్టుకెక్కిన జగన్

అది జరిగి రెండు రోజులు గడవక ముందే ఎండాడలో సీనియర్ సిటిజన్స్ కి ప్రభుత్వం కేటాయించిన హయగ్రీవ భూములపై నకిలీ పత్రాలు సృష్టించి భూములను కాజేశారంటూ చిలుకూరి జగదీష్, అతని భార్య ఆరిలోవ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఎంవీవీ ఎంపీగా ఉన్న సమయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు.. ఇప్పుడు ఫిర్యాదు చేసిన వెంటనే పది సెక్షన్లతో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం గమనార్హం.

ఆ క్రమంలో వైసీపీలో ఉంటే మనుగడ సాధించలేం అనుకుని, తన వ్యాపారాన్ని కూడా నడపలేమనుకున్న ఎంవీవీ బీజేపీలో జాయిన్ అవ్వడానికి ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వానికి కీలకంగా మారిన పవన్ కళ్యాణ్ అంగీకారం లేకుండా బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడంతో ఆయన నిరుత్సాహంగా వెనుదిరిగారంట. ఇప్పుడు పొలిటికల్ స్టేప్ తీసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేకపోవడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో ఉన్నారంట.

ఎంవీవీ ఆ డిప్రెషన్‌లో ఉండగానే హయగ్రీవ భూములకు సంబంధించి ఈడి రంగంలోకి దిగింది. ఎంవీవీ సత్యనారాయణ ఇల్లు, కార్యాలయం, ఎంవీవీ ఆడిటర్ జీవీ, బిజినెస్ పార్ట్‌నర్ గద్దె బ్రహ్మాజీల ఇళ్లల్లో ఏకకాలంలో ఐదు చోట్ల 20 మందితో కూడిన బృందాలు సోదాలు చేశారు.  దాదాపుగా 17 గంటల పాటు సాగిన ఈ సోదాల్లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఇప్పటివరకు ఎంవీవీ సత్యనారాయణని బడా బిల్డర్ గా, సినీ ప్రొడ్యూసర్‌గా, పొలిటీషియన్‌గా చూసిన విశాఖ వాసులకు ఈవీ ఆయనలోని చీకటి కోణాన్ని పరిచయం చేసింది.

ఎంవీవీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా నకిలీ డాక్యుమెంట్లతోనే జరిగిందని, ఆ నకిలీ డాక్యుమెంట్లు ఎంవీవీ తన సామ్రాజ్యంలోనే తయారు చేసేవారని ఈడీ దాడుల్లో బయటపడింది. తనిఖీల్లో ఆయన ఇంట్లో నకిలీ డాక్యుమెంట్ తయారు చేసే మిషన్స్ పట్టుపడినట్లు ఈడీ వెల్లడించింది. నకిలీ స్టాంప్‌పేపర్లు తయారు చేసే డిజిటల్ డివైజ్‌లు , బినామీ పట్టాదారు పాసు పుస్తకాలు, 300పైన సేల్ డీడ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీలో ఈడి అధికారిక ప్రకటన చేశారు. దాంతో ఇంతకాలం ఆయన్ని బిగ్‌షాట్‌గా గౌరవించిన విశాఖ వాసులు నిర్ఘాంతపోతున్నారు.

కోట్లు సంపాదించుకున్న ఎంవీవీ డబ్బుకు వెనకాడకుండా రాజకీయం చేశారు. అయితే ఇప్పుడు ఆయనకు కేసుల ఉచ్చు బిగుసుకుంటుంటే వైసీపీ పెద్దలు అండగా నిలవకపోగా.. ఆయనతో సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. దానికి కారణం క్యాస్ట్ ఈక్వేషన్లే అంటున్నారు . అధికారంలో ఉన్నంతకాలం కనిపించని ఎంవీవీ సత్యనారాయణ కులం జగన్‌కు ఇప్పుడు గుర్తొకొచ్చిందంట. ఎంవీవీ పూర్తి పేరు ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణ చౌదరి.

తాను కమ్మ కులానికి చెందిన వ్యక్తిని కాబట్టే వైసిపి అధిష్టానం పూర్తిగా పట్టించుకోవడం మానేసిందని ఎంవీవీ వాపోతున్నారంట. ఈ కుల సమీకరణలు, జగన్ పట్టింపులు పక్కనపెడితే వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఇప్పటికే రాజకీయంగా భవిష్యత్తు లేకుండా పోయిన ఎంవీవీ.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.

Related News

Kavitha: కవితకు ఏమైంది? సవాలు చేసి సైలెంట్ అయ్యారు ఎందుకు?

Salman Khan: సల్మాన్ నిజంగానే ఆ జింకను కాల్చాడా? ఆ రోజు అతనితో ఉన్న హీరోయిన్స్ ఎవరు? వారికీ ముప్పుందా?

Chandrababu Vision: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ తో ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో తెలుసా? హైదరాబాద్‌కు విశాఖ ప్రత్యామ్నాయం కానుందా?

India China Border Deal: ఆర్ధికంగా నలిగిపోతున్న చైనా.. ఆ ఒప్పందం వెనుక భయంకర నిజాలు

Drone Pilot Training: డ్రోన్ పైలెట్లకు ఈ సర్టిఫికేట్ ఉంటే మస్తు పైసలు..

Peddireddy: ఆగని పెద్దిరెడ్డి దందా? షాక్ లో టీడీపీ

Big Stories

×