EPAPER

Ex Minister KTR : కేటీఆర్ కు జ్ఞాపకశక్తి తగ్గిందా ? ఎందుకిలా ట్వీట్లు చేస్తున్నారు ?

Ex Minister KTR : కేటీఆర్ కు జ్ఞాపకశక్తి తగ్గిందా ? ఎందుకిలా ట్వీట్లు చేస్తున్నారు ?

Ex Minister KTR : కేటీఆర్.. బీఆర్ఎస్‌ పార్టీలో కీలక నేత.. మాజీ మంత్రి. పదేళ్ల పాటు ఆయన రాష్ట్రానికి ఆయన సేవలందించారు. అమెరికాలో చదువుకున్నారు.. ఇంగ్లీష్‌ అనర్గళంగా మాట్లాడేస్తారు. ఇన్నీ అర్హతలున్న కేటీఆర్‌కు కాస్త కామన్‌సెన్స్‌తో పాటు.. జ్ఞాపకశక్తి తక్కువనిపిస్తోంది. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు.. చేసే ట్వీట్స్‌ను చూస్తే ఇదే అర్థమవుతోంది. ఇప్పుడీ మాటలు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఆయన రీసెంట్‌గా చేసిన ట్వీట్ అలా ఉంది మరి.


ఫస్ట్ కేటీఆర్ రీసెంట్‌గా చేసిన ఓ ట్వీట్‌ను చూద్దాం. ట్వీట్ సారాంశం ఏంటంటే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాల ప్రభుత్వ భూములను ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెడుతోంది. వీటి విలువ రూ.20 వేల కోట్లు.. వీటిని తనఖా పెట్టి రూ.10 వేల కోట్ల నిధులను సమీకరించనుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్‌ను పెట్టి వారిని 100 కోట్ల కమీషన్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయన్న విషయం నిజం. అలాంటి ప్రాంతంలో 400 ఎకరాలు ప్రైవేట్ సంస్థలకు తాకట్టు పెట్టడమనేది అనాలోచిత చర్య. ఉన్న భూములు తాకట్టు పెడితే కంపెనీలకు ఏమిస్తారు ? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి ? ఇదీ ఆయన ట్వీట్ సారాంశం.

బాగుంది.. విపక్షం అంటే ప్రశ్నించాలి. ప్రజల సంక్షేమం కోసం పోరాడాలి. ప్రస్తుతం బీఆర్ఎస్‌ నేత కేటీఆర్‌ కూడా తాను అదే చేస్తున్నానని అనుకుంటున్నారు. కానీ ఆయన.. వారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో మర్చిపోయినట్టున్నారు. ఒక్కసారి కాస్త పాస్ట్‌లోకి వెళదాం. ఎకరం భూమి వంద కోట్లు పలికింది.. అనే హెడ్‌లైన్స్‌ మీరు వినే ఉంటారు. అప్పట్లో గుర్తుందా? కోకాపేట్‌ ఫేజ్‌ 2 భూములను వేలం వేసింది బీఆర్ఎస్‌ ప్రభుత్వం. for your kind information.. వేలం అనే పదాన్ని గుర్తుంచుకోండి. ఇలా వేలం వేసి రూ.3 వేల కోట్లకు పైగా సమీకరించారు. వేలం అంటే ఈ భూములు ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్మేసినట్టే కదా. మళ్లీ ఆ భూములు తిరిగి రావు.


Also Read : సత్యకుమార్ కామెంట్స్ వెనుక, అడ్డంగా దొరికిన కేటీఆర్

నిజానికి కేటీఆర్ చేస్తున్నవి అలిగేషన్స్ మాత్రమే. దానికి ఓ పేపర్‌లో వచ్చిన వార్తను బేస్‌ చేసుకున్నారు. ఇది నిజమా? కాదా? అన్నది ఇంకా తేలలేదు. ఫర్‌ సపోజ్.. నిజమే అనుకుందాం. నిధుల సమీకరణకు రేవంత్ సర్కార్ భూములను తాకట్టు పెడుతుందనే అనుకుందాం. మరి తాకట్టు బెటరా? వేలం బెటరా? ఇది ప్రజలతో పాటు.. కేటీఆర్‌ గారే ఆలోచించాలి.

కేటీఆర్‌ ఏం చెబుతున్నారంటే.. వేలం మంచిది.. ఎందుకంటే భూములు కంపెనీలకు లేదా రియల్ ఎస్టేట్‌ సంస్థలకు పర్మినెంట్‌గా ఇచ్చేయొచ్చు. అదే తాకట్టు అయితే మళ్లీ ఆ భూములను ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి అది నేరం. వేలం మంచింది.. ఎందుకంటే పర్మినెంట్‌గా అమ్మేసి కేవలం 5 వేల కోట్ల వరకు సమీకరించవచ్చు. అదే తాకట్టు పెట్టి 10 వేల కోట్లు సమీకరించి.. తిరిగి ఇచ్చేసి మళ్లీ భూములను తీసుకోవడం నేరం. వేలం మంచిది.. సొంత లేదా అనుచరవర్గానికి చెందిన వారికి ఖరీదైన భూములను అప్పగించవచ్చు. అదే తాకట్టు పెట్టి ప్రజల సంక్షేమం కోసం నిధులను సమీకరిస్తే నేరం. Wow.. KTR.. Wow.. ఈ లాజిక్‌ దునియాలో ఇంకెవరికీ తట్టదు.. అర్థం కాదు.. ఇది మీకు మాత్రమే చెల్లింది.

Also Read : కేటీఆర్, హరీష్ ఢిల్లీ పర్యటన అందుకేనా?

ఈ రోజు వంద కోట్లు పలికిన భూమి రేపటి రోజు రెండు వందల కోట్లు పలుకుతుంది. ఈరోజు వంద కోట్లకు అమ్ముకోవడం బెటరా? పెరిగిన విలువకు తగ్గట్టుగా తాకట్టు పెట్టి నిధులు సమీకరించుకోవడం బెటరా? ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే.. మీ దగ్గర బంగారం ఉంది.. దానిని అమ్ముకొని డబ్బు తెచ్చుకుంటారా? లేక దానిని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంటారా? ఈ చిన్న విషయం అర్థమైతే.. కేటీఆర్‌ చేసిన ట్వీట్‌లో ఎంత తప్పు ఉందో మీకు అర్థమవుతోంది. గతంలో అంటే సింగరేణి కోల్ మైన్స్ వేలం సమయంలో కూడా మీరు ఇలానే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అసలు బీఆర్ఎస్ హయాంలో కోల్‌ మైన్స్ వేలమే జరగలేదని చెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్‌ హయాంలో మీ అనుచరగణానికి చెందని కంపెనీలకు గనులను అప్పగించేందుకు వేలంలో పాల్గొనకుండా ఉన్నది నిజం కాదా? ఈ విషయాన్ని అప్పుడు దాచి ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఇప్పుడేమో.. ఇలా వేలానికి, తాకట్టుకు తేడా తెలియకుండా మరోసారి ప్రజల్లో లేని ఆలోచనలను పుట్టిస్తున్నారు.

తప్పులను ఎత్తిచూపాలి.. ప్రశ్నించాలి.. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ లేని తప్పును ఎత్తి చూపి.. మీరు తప్పులో కాలేసి.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తా అంటే మాత్రం అస్సలు కుదరదు. ఎందుకంటే ప్రజలంతా తెలివితక్కువ వారు కాదు. ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి కాస్త బాధ్యతతో మెలిగితే ఉన్న పరువు దక్కుతుంది. ఇక మతిమరువు విషయానికి వద్దాం. తాము చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పుఅన్నట్టు ఉంటుంది కేటీఆర్‌గారి వ్యవహారం. తెలంగాణకు కాబోయే సీఎం అనే రేంజ్‌లో ప్రచారం జరిగిన కేటీఆర్ గారి తీరు ఇది. కేటీఆర్ గారు.. వన్ సజేషన్.. ఇప్పటికే ప్రజలు మీ తీరు నచ్చక పక్కన పెట్టేశారు. కానీ మీ తీరు మాత్రం మారడం లేదు. మాటలు తగ్గిపోయి.. ట్వీట్స్ పెరిగిపోయాయి. కనీసం ఆ ట్వీట్స్‌ అయినా.. ముందు వెనుకా కాస్త ఆలోచించి చేయండి.

Tags

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×