EPAPER

KTR : కోర్టు తీర్పుతో భయం.. కాంగ్రెస్ అంటేనే డ్రామాలమయం

KTR : కోర్టు తీర్పుతో భయం.. కాంగ్రెస్ అంటేనే డ్రామాలమయం
  • గాంధీని హౌజ్ అరెస్ట్ ఎందుకు చేయలేదు
  • అలా చేసి ఉంటే దాడులు జరిగేవా?
  • పోలీసులే దగ్గరుండి అంతా చేయించారు
  • ప్రభుత్వ అసమర్థతకు ఇదే నిదర్శనం
  • పదేళ్లలో ఏనాడైనా ఇలాంటివి చూశామా?
  • ఫ్యాక్షన్ సినిమా రేంజ్‌లో కౌశిక్ ఇంటి మీదకు వచ్చారు
  • గ్యారెంటీలు అమలు చేయమంటే డ్రామాలు చేస్తున్నారు
  • ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కేటీఆర్

అమెరికా టూర్ తర్వాత హైదరాబాద్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. వచ్చీ రాగానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. రెండు రోజుల క్రితం జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధ్వంసమైన ఇంటి అద్దాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.


పోలీసుల డైరెక్షన్‌లోనే!

ఒకనాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి, చావు డప్పులు కొట్టండని రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. తమ పార్టీ వాళ్ళెవరూ ఆయన మాట్లాడినంత అసహ్యంగా మాట్లాడలేదని అన్నారు. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి, పోలీసులే దాడి చేయించారని ఆరోపించారు. తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవనయాత్ర లాగా రేవంత్ ప్రభుత్వం కొనసాగుతోందని, 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, రూ.2 లక్షలు రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు.


హైకోర్టు తీర్పుతో వణుకు

ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మరీ కండువాలు కప్పారని, పది మంది ఎమ్మెల్యేలు పోయారు ఇంకా వస్తారు అని కాంగ్రెస్ మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకు మాట్లాడారని గుర్తు చేశారు కేటీఆర్. హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్‌లో భయం మొదలైందన్నారు. ఫిరాయింపులపై స్పీకర్‌ని కలిసి సుప్రీంకోర్టు తీర్పులను సైతం ఉటంకిస్తూ ఫిర్యాదు చేశామని, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి మీద డిస్ క్వాలిఫై పిటిషన్ వేసిందే కౌశిక్ రెడ్డేనని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున హైకోర్టు జస్టిస్‌కి కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు తీర్పు వచ్చిన రోజు అరెకపూడి గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమిస్తూ ప్రకటన చేశారన్నారు.

Also Read: నోరు మెదపని కేసీఆర్.. బయటపడ్డ అసలు కుట్ర!

పోలీసుల అండతో ఎమ్మెల్యే ఇంటి మీద దాడికి దిగారని, ఈ రకమైన గూండాగిరి పదేళ్లలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు కేటీఆర్. ఫ్యాక్షన్ సినిమాలు తలపించేలా వచ్చారని, చేతగాని ముఖ్యమంత్రి వల్లనే ఇదంతా జరిగిందని విమర్శించారు. రేపు జరగరానిది జరిగితే ఎవరు భాద్యత వహిస్తారని నిలదీశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికైనా తాము ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్యారెంటీలు అమలు చేయాలని అడిగితే హైడ్రామాలు చేస్తున్నారని, పైశాచిక ఆనందం కోసమే రేవంత్ ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. చివరకు ఇవన్నీ ఆయన మెడకే చుట్టుకుంటాయని విమర్శించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న కేటీఆర్, దాడి జరిగినప్పుడు ఇక్కడ విధుల్లో విఫలం అయిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

పదేళ్లలో ఇలాంటివి చూశామా?

తమ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి అర్థరాత్రి వరకు తిప్పితే తెలంగాణ ప్రజలు మొత్తం తమ వెంట నిలిచారని అన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే తెలంగాణ ప్రజలు పౌరుషం చాటారని, తమ నేతలను హౌజ్ అరెస్ట్ చేసి గాంధీకి రక్షణ కల్పించారని మండిపడ్డారు. ఆయన్ను హౌజ్ అరెస్ట్ చేస్తే ఇలాంటివి జరిగేవి కావన్నారు. పదేళ్లలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని, హైదరాబాద్‌లో ఉన్న ప్రజలు అందరూ తమ వాళ్లేనని చెప్పారు. ప్రాంతీయతత్వం మీద దాడులు గతంలో లేవని, ఇప్పుడెందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ ప్రజలు అండగా నిలిచారని, రేవంత్ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఫైరయ్యారు. అరెకపూడి గాంధీ కాంగ్రెస్‌లో ఎందుకు చేరారని, దిక్కుమాలిన పీఏసీ పదవి కోసం పనికిమాలిన మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలని మండిపడ్డారు కేటీఆర్. ఒకసారి నియోజకవర్గ ప్రజలను అడిగితే ఆయన ఏపార్టీలో ఉన్నారో చెబుతారని ఎద్దేవ చేశారు.

Related News

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Jammu Kashmir Elections: కశ్మీర్ ఎన్నికలు.. కమలానికి అగ్నిపరీక్షే..

Why Atishi as Delhi CM: సీఎంగా అతిశీనే ఎందుకు? కేజ్రీవాల్ ప్లాన్ ఏంటి?

Amaravati: అమరావతి సేఫ్.. ఇక దూసుకుపోవడమే

Arvind Kejriwal Resignation: కేజ్రీ కొత్త వ్యూహం ఫలిస్తుందా?

Arvind Kejriwal: అరవింద్ ‘క్రేజీ’వాల్.. బీజేపీకి చుక్కల్!

Big Stories

×