EPAPER

Domestic Violence: వీళ్లేం మగాళ్లండి బాబు, భార్యలు అలా చేస్తే కొట్టేస్తారట.. మీరు ఇంతేనా?

Domestic Violence: వీళ్లేం మగాళ్లండి బాబు, భార్యలు అలా చేస్తే కొట్టేస్తారట.. మీరు ఇంతేనా?

ఇరత దేశాలతో పోల్చితే భారత్ లో గృహహింస ఎక్కువగా ఉన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ ఆరోగ్య సర్వేలోనూ ఇవే విషయం వెల్లడైంది. భార్యలను భర్తలు చిన్నచిన్నకారణలతో కొడుతున్నారని తెలిపింది. అంతేకాదు, చాలా మంది భర్తలు తమ భార్యలను కొట్టడాన్ని సమర్థించుకుంటున్నారంటూ సంచలన విషయాలను వెల్లడించింది. గృహహింస చట్టబద్ధంగా నేరం అయినప్పటికీ, పలు కారణాలతో మహిళలు పురుషుల చేతిలో దెబ్బలు తింటున్నారని తెలిపింది.


భార్యలను కొట్టేందుకు భర్తలు చెప్పే కారణాలు

భార్యలను కొట్టేందుకు పలువురు భర్తలు చాలా కారణాలు చెప్పారు. అందులో కొన్ని కీలక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


భర్తతో శృంగారాన్ని నిరాకరిస్తే

అడగ్గానే భార్య శృంగారానికి ఒప్పుకోకపోతే కొట్టడం తప్పుకాదని చాలా మంది భర్తలు చెప్పుకొచ్చారు. పట్టణ ప్రాంతంలో 2,628 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 6,391 మంది పురుషులు భార్య శృంగారానికి ఒప్పుకోకపోతే కొట్టవచ్చి చెప్పారు.

పిల్లలు, ఇంటి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే

55,475 మంది పురుషులలో 11,927 మంది తమ భార్యలను ఇంటిని సరిగా చూసుకోకపోతే, పిల్లలను నిర్లక్ష్యం చేస్తే  కొట్టవచ్చని తెలిపారు. అంతేకాదు, 2019 నుంచి 2021 వరకు ఈ కారణంతో 1,01,806 మంది పురుషులు ఇదే కారణంతో తమ భార్యలను కొట్టినట్లు నివేదిక తెలిపింది.

అత్తమామలను గౌరవించకపోతే

చాలా మంది భర్తలు తమ తల్లిదండ్రులను భార్యలు సరిగా చూసుకోవడం లేదని కొడుతున్నట్లు నివేదికలో వెల్లడించారు. తాజాగా నిర్వహించిన సర్వేలో సుమారు 57, 842 మంది పురుషులు తమ పేరెంట్స్ ను సరిగా చూసుకోవడం లేదని కొట్టినట్లు వెల్లడించింది.

భర్తతో వాదిస్తే  

భార్య తమ మాటకు ఎదురు చెప్తే కొట్టడం కరెక్టే అని చాలా మంది భర్తలు అభిప్రాయపడ్డారు. తాజా నివేదిక ప్రకారం  కనీసం 29,544 మంది పురుషులు తమతో వాదిస్తే భార్యలను కొట్టడం కరెక్టే అన్నారు.

వంట సరిగా చేయపోతే

వంట సరిగా చేయని భార్యలను కొట్టడం తప్పులేని తప్పులేదని చాలా మంది భర్తలు సమర్థించుకున్నారు. దాదాపు 18,908 మంది పురుషులు ఆహారం సరిగ్గా వండకపోతే భార్యలను కొట్టడం సమంజసమని భావిస్తున్నారు.

భార్య తమను అనుమానించడం

భర్తలకు వేరే మహిళలో సంబంధం ఉందని భార్యలు అనుమానించినా కొడుతున్నారని నివేదికలు వెల్లడించాయి.  సుమారు 42,008 మంది పురుషులు అనుమానించే భార్యలను కొట్టడంలో తప్పులేదని సమర్థించారు.

భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడం 

తమకు చెప్పకుండా భార్యలు బయటకు వెళ్లడాన్ని భర్తలు తట్టుకోలరని తాజా నివేదిక వెల్లడించింది. అలా వెళ్లిన వారిని కొట్టే భర్తలు చాలా మంది ఉన్నట్లు తెలిపింది. 68,927 మంది పురుషులు చెప్పకుండా బయటకు వెళ్లిన తమ భార్యలను కొట్టడాన్ని సమర్థించుకున్నట్లు వివరించింది.

ఇన్ని రకాలుగా తమ భర్తలు భార్యలను కొడుతున్నప్పటికీ, వారు బయటకు చెప్పుకోవడం లేదని తాజా నివేదిక తెలిపింది. చిన్న చిన్న విషయాలను బయటకు చెప్పుకుని కుటుంబ పరువు పోగొట్టుకోకూడదని భావిస్తున్నట్లు వెల్లడించింది.

Read Also: కల్తీ ఆహారాన్ని గుర్తించేది ఎలా? తేనె నుంచి మాంసం వరకు.. ఈ సింపుల్ టిప్స్‌తో తెలుసుకోండి

Related News

CM Chandrababu: త్యాగాలు చేసిన వీళ్లకి.. చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారా?

Wild Animals: జనావాసాల్లోకి పులులు, ఏనుగులు.. అడవిని వదిలి నగరాల్లోకి ఎందుకు వస్తున్నాయ్? తప్పు మనదేనా?

YS Jagan Vs YS Sharmila: నీకు చోటు లేదు.. జగన్‌కి షర్మిల ఝలక్

YS Jagan: విజయసాయిరెడ్డికి జగన్ కీలక పదవి.. తట్టుకోలేకపోతున్న ఆ నేత..

Maharashtra Politics: అన్ని రాష్ట్రాలు పాలిటిక్స్ ఒక్కవైపు.. మహారాష్ట్ర పాలిటిక్స్ మరోవైపు!

Israel–Hamas war: ఇజ్రాయెల్ చేతిలో హమాస్ లీడర్లు.. వీళ్లందర్నీ ఎలా హతమార్చింది?

Big Stories

×