EPAPER

Krishna: తరం మారినా తగ్గని ఆదరణ..రెండో ఇన్నింగ్స్ అదుర్స్..

Krishna: తరం మారినా తగ్గని ఆదరణ..రెండో ఇన్నింగ్స్ అదుర్స్..

Krishna: సినీ కెరీర్ లో ఒడుదొడుకులు ఎదురైనా కృష్ణ పట్టుదలతో కృష్ణ ముందుకుసాగారు.1990 నాటికి టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లో లాంటి హీరోల హవా నడుస్తోంది. కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన సూపర్ స్టార్ కృష్ణ. ఆ సమయంలో తన సినీ కెరీర్ ను కొత్త పంథాలోకి తీసుకెళ్లారు. అప్పటి వరకు జేమ్స్ బాండ్, పొలిటికల్ మూవీస్, యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల అలరించిన కృష్ణ 90 దశకంలో రూటు మార్చారు.


రెండో ఇన్నింగ్స్ అదుర్స్

1994లో కృష్ణ కెరీర్ లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన నంబర్ 1 సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తన కెరీర్ లో భిన్నమైన పాత్రలో కృష్ణ ప్రేక్షకులకు విపరీతమైన వినోదాన్ని అందించారు. అదే ఫార్ములాలో 1995 లో వచ్చిన అమ్మదొంగా హిట్ కొట్టింది. 1995 జనవరి 1న కృష్ణ నటించిన 300 వ సినిమా తెలుగువీర లేవరా విడుదలైంది. 1999లో తనయుడు మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజకుమారుడులో కృష్ణ నటించారు. ఆ తర్వాత మహేష్ బాబుతో వంశీలో నటించారు. 2004లో వచ్చిన శాంతి సందేశం చిత్రంలో కృష్ణ జీసస్ క్రీస్తుగా నటించి మెప్పించారు. ఇలా కెరీర్ లో అన్ని రకాల పాత్రల్లో జీవించారు సూపర్ స్టార్ కృష్ణ.


కృష్ణ సినిమాల్లో అనేక రికార్డులు సృష్టించారు.111 మంది డైరెక్టర్లతో సినిమాలు చేశారు. 76 మంది హీరోయిన్లు సూపర్ స్టార్ సరసన నటించారు. 31 సినిమాల్లో అతిథి పాత్ర పోషించారు. 15 సినిమాలకు దర్శకత్వం వహించారు. మల్టీస్టారర్ మూవీస్ ద్వారా నటీనటుల మధ్య ఆరోగ్యకరమైన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. మల్టీస్టారర్ , కౌబోయ్, లవర్ బోయ్ , యాక్షన్ , థ్రిల్లర్, పౌరాణికం, డ్రామా, సాంఘికం, జానపథం ఇలా అన్ని జోనర్ల సినిమాల్లో నటించిన ఒకే ఒక్క హీరో కృష్ణ అనడంలో అతిశయోక్తిలేదు. ఎన్టీఆర్ తో దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు వగలమారి భర్తలు చిత్రాల్లో నటించారు. అక్కినేనితో గురుశిష్యులు, హేమాహేమీలు, శోభన్ బాబుతో గంగ-మంగ, మండేగుండెలు, ఇద్దరు దొంగలు, ముందడుగు సినిమాల్లో నటించారు. కృష్ణంరాజుతో మనుషులు చేసిన దొంగలు, అడవి సింహాలు, విశ్వనాథ నాయకుడులో నటించారు. రజనీకాంత్ తో అన్నదమ్ముల సవాల్, రామ్ రాబర్ట్ రహీమ్, చిరంజీవితో తోడుదొంగలు వంటి మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు.

కృష్ణకు 2500 అభిమాన సంఘాలు ఉండేవి. ఓ సినిమా శతదినోత్సవానికి మద్రాసుకు 30 వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా బస్సుల్లో తరలివచ్చారు. ఆయన అభిమానం అలా ఉండేది. ఎన్నో సినిమాలతో ప్రేక్షుకల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న కృష్ణకు కెరీర్ లో ఒక్కసారి మాత్రమే నంది అవార్డు దక్కింది. 1974లో ఉత్తమ నటుడిగా అల్లూరి సీతారామరాజు సినిమాకు ఈ పురస్కారం వచ్చింది.
1997లో ఫిల్మ్ ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం వరించింది. 2009లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సూపర్ స్టార్ కృష్ణను గౌరవించింది. 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు.

Tags

Related News

Telangana: విమోచనం.. విలీనం.. విద్రోహం.. ప్రజా పాలనా దినం..! 2014 నుంచి 2024 దాకా..!

Telangana Armed Struggle: జనం నడిపిన విప్లవం.. సాయుధ పోరాటం..!

YS Jagan Mohan Reddy: జగన్ కాదు.. సీతయ్య.. వైసీపీలోనే గుసగుసలు

New Headache To YS Jagan: జగన్‌కు కొత్త తలనొప్పి.. కనక దుర్గ కండిషన్స్

New Election Commissioner: తెలంగాణ కొత్త ఎలక్షన్ కమీషనర్.. ఎవరంటే?

Big Shock to YS Jagan: వైసీపీ అడ్రస్ గల్లంతు.. 45 కార్పోరేటర్లు టీడీపీలోకి?

GHMC Elections: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

Big Stories

×