EPAPER
Kirrak Couples Episode 1

Dark Reality Of Whatsapp : వాట్సాప్‌కు ఆదాయం ఎలా వస్తుందంటే.? చీకటి కోణం ఇదే..!

Dark Reality Of Whatsapp : వాట్సాప్‌కు ఆదాయం ఎలా వస్తుందంటే.? చీకటి కోణం ఇదే..!

Dark Reality Of Whatsapp : “నో యాడ్స్..నో గేమ్స్..నో జిమ్మిక్స్..” ఒక చిన్న సూత్రం..ఐమెస్సేజ్, వీచాట్, ఫేస్బుక్ మెసెంజర్, స్నాప్ చాట్, లైన్, కిక్ మెసెంజర్ లాంటి అనేక ప్రపంచ దిగ్గజ మెస్సేజింగ్ అప్లికేషన్లపై గెలవడానికి ఉపయోగపడింది. అది ఏంటని అనుకుంటున్నారా .. మన జీవన విధానంలో భాగమైన వాట్సాప్… ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునేముందు వరకు వాట్సాప్ లేనిదే మనకు పూట గడవదు. అది మెసేజ్ అయినా, ఆడియో కాల్ అయినా, వీడియో కాల్ అయినా…ప్రపంచంలో ఏ మూలాన ఉన్నా సరే, ఇంటర్నెట్ ఉంటే చాలు ఆ వ్యక్తిని మన కళ్ళముందు ఉంచేస్తుంది. అలాంటి వాట్సాప్ గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక్క అణా పైసా కూడా మన దగ్గర నుండి తీస్కోని వాట్సాప్‌కు అసలు ఆదాయం ఎలా వస్తుందనే ప్రశ్న అందరిలో ఆసక్తి రేపుతోంది. అసలు వాట్సాప్ కు డబ్బు ఎలా వస్తుంది, ఎలా సంపాదిస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చీకటి వాస్తవికత గురించి తెలిస్తే శరీరం గగుర్లుపొడుస్తుంది.


బ్రయాన్ ఆక్టన్, జాన్ కౌమ్ అనే ఇద్దరు మిత్రులు యాహు (yahoo)లో జాబ్ వదిలేసి ప్రపంచాన్ని చుట్టేయాలన్న ఆశతో బయలుదేరారు. కాలక్రమేణా వారి సేవింగ్స్ తగ్గిపోతూ వచ్చాయి. మళ్ళీ ఉద్యోగం చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తప్పేది లేక, అప్పటికే ప్రపంచానికి దగ్గరైన ఫేస్బుక్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ వారిని ఫేస్‌బుక్ తిరస్కరించింది.. ఈ వైఫల్యం, వారిని ప్రపంచానికి పరిచయం చేసేలా చేసింది. 2009లో జాన్ కౌమ్, ఒక ఐఫోన్ కొన్నాడు. ఆ ఐఫోన్‌ను వాడుతున్న జాన్ అందులో ఉన్న యాప్‌స్టోర్ సంభావ్యతను అర్ధంచేసుకొని ఎలా అయినా ఒక యాప్‌‌ను డెవలప్ చెయ్యాలని నిర్ణయం తీసుకొన్నాడు. యూజర్ వ్యక్తిగత పేరు పక్కన స్టేటస్ కనిపించేలా యాప్‌‌ను రూపొందించాలని మిత్రుడు బ్రయాన్‌తో ఐడియాని షేర్ చేసాడు. వీరిద్దరూ కలిసి తమ మిత్రుడైన అలెక్స్ ఫిష్‌మాన్‌ని కలిశారు. ఐఓఎస్ డెవలపర్ లేకుండా యాప్‌‌ను డెవలప్ చెయ్యడం కష్టమని తెల్సుకున్న వీరికి అలెక్స్, ఇగోర్ సోలెంనికోవ్ అనే రష్యన్ డెవలపర్‌ని పరిచయం చేసాడు. రెండు నెలల పాటు కృషి చేసి 24th ఫిబ్రవరి, 2009 రోజున WhatsApp.inc అనే అప్లికేషన్‌ని డెవలప్ చేసి ప్రపంచానికి బీటా వెర్షన్‌ను పరిచయం చేసారు. ముందుగా నవంబర్ 2009లో ఐఓఎస్ యాప్‌‌ను డెవలప్ చేసిన వీరు 2010లో ఆండ్రాయిడ్ వెర్షన్‌ను డెవలప్ చేసి ఆండ్రాయిడ్ యూజర్లకు దగ్గరయ్యారు.టెక్స్ట్ మెసేజ్‌కు ఒక రూపాయి చార్జ్ చేసే రోజుల్లో ఉచిత అపరిమిత మెస్సేజింగ్ యాప్‌‌ కనిపించేసరికి యూజర్లు ఆకర్షితులయ్యారు.

ఒక యాప్‌కు ఆదాయం రావాలంటే మొత్తం మూడు మార్గాలున్నాయి.మొదటిది..ప్రకటన(Advertisements), రెండవది.. యాప్ కొనుగోళ్లు, మూడవది.. డేటా అమ్మకం. ఇద్దరు వ్యవస్థాపకులు యాప్‌‌ను డెవలప్ చేసినప్పుడే నో యాడ్ పాలసీని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. నిజానికి మార్కెటింగ్ అనే కాన్సెప్ట్‌ను వాట్సాప్ దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. యాప్ కొనుగోళ్లకి కూడా ఎలాంటి చార్జీలు విధించొద్దని నిర్ణయించుకున్నారు. వాళ్ళ ప్రధాన నినాదం..యూజర్లకు ఒక నమ్మదగినది, ఉపయోగించడానికి సురక్షితమైనది, వాణిజ్యేతర ఉత్పత్తి ఇవ్వడం. ఇక బ్రయాన్ ఆక్టన్, జాన్ కౌమ్ ఇద్దరుగోప్యతా కార్యకర్తలు. వారు డేటా ఉల్లంఘనకు అస్సలు ఇష్టపడలేదు. వీళ్ళకున్న ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయాయి. యాప్ యూజర్ ఫ్రెండ్లీ ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా యాప్ డౌన్‌లోడ్‌లు ఎక్కువ అయ్యాయి. యాప్ అభివృద్ధి కోసం, సీడ్-ఫండింగ్ పద్ధతి ద్వారా డబ్బును సమకూర్చుకున్న వీరు, యాప్ నిర్వహణకు ఇబ్బందుల్లో పడ్డారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అనేక ఇతర ఫీచర్స్ తీసుకురావడం ప్రారంభించారు. కానీ ఆర్ధికంగా వెనకబడుతూ వచ్చారు. బృందాన్ని నియమించుకోవడానికి లేదా సర్వర్‌లలో పెట్టుబడి పెట్టడానికి లేదా సౌకర్యవంతమైన కార్యకలాపాలు చెయ్యాలన్న వీరికి డబ్బు అవసరం పడింది.


అప్పుడే వాట్సాప్ వ్యవస్థాపకులు 1 డాలర్ నామమాత్రపు రుసుమును ప్రవేశపెట్టారు చేసారు. కొన్ని దేశాలలో డౌన్లోడ్ కు ముందు పే చేసేలా మరి కొన్ని దేశాలలో డౌన్లోడ్ తర్వాత పే చేసేలా, మిగతా వాటిల్లో ఆన్యుయల్ ఫీ రెన్యువల్ కాన్సెప్ట్ లాగా తీసుకొచ్చారు. కానీ అది స్వచ్ఛంద రుసుము..ఇది తెలివితక్కువ నిర్ణయం అనిపిస్తుంది కానీ ఉన్నా యూజర్లలో ఒక సానుకూలతను సృష్టించింది. ఇలాంటి సౌలభ్యం కల్పించిన యాప్ కి ఒక డాలర్ తక్కువేనని పే చెయ్యడం ప్రారంభించారు. అలా వచ్చిన డబ్బు ఆపరేషన్ ఖర్చులకు సరిపోతుంది. లాభాల సంగతి పక్కనబెడితే బ్రేక్ ఈవెన్ పాయింట్ ను కూడా అందుకోలేకపోయింది.

టెక్ కంపెనీలకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం యూజర్ డేటా కారణంగా జీరో లాభదాయకతతో కూడా నికర విలువ 1000 కోట్లు చెయ్యొచ్చు. ఇప్పటికే వాట్సాప్‌కు వస్తున్న ఆదరణ చూసి ఇన్వెస్టర్లు, వాట్సాప్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. కానీ స్థాపకులు ఇద్దరిలో ఒకటే భయం, పెట్టుబడిదారులు, మోనటైజేషన్ కోసం ఎక్కడ యాడ్స్ పాలసీ ప్రారంభించమంటారో అని; యాప్ క్వాలిటీ, ఎథిక్స్ లో ఎక్కడ తగ్గాల్సి వస్తుందేమోనని. SEQUOIA CAPITAL లాంటి పెద్ద పెట్టుబడిదారులు, వాట్సాప్ ఎలాంటి నిబంధనలు, షరతులు పెట్టినా అంగీకరించడానికి సిద్ధమని చెప్పారు. ఇలాంటి సమయం లో వాట్సాప్ వ్యవస్థాపకులు ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. పెట్టుబడిదారుల పెట్టుబడి అంగీకరించాలి చెయ్యాలంటే.. వాట్సాప్ పనితీరు వారి జోక్యం ఉండకూడదు . వాట్సాప్ పనితీరులో జోక్యం ఉండకుండా , యాడ్స్ కోసం పుష్ చెయ్యకుండా ఉండే నిబంధనలు మరియు షరతులను అంగీకరించాలని చెప్పారు. వీటిని అంగీకరించిన పెట్టుబడిదారులు , వాట్సాప్ లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. కొద్దీ రోజుల్లోనే అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి వచ్చింది.దీనితో వాట్సాప్ పనితీరు ఇంకా మృదువుగా మారింది ,వినియోగదారు అనుభవం మెరుగుపడింది, యూజర్ బేస్ పెరిగింది. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, యూజర్లు అందరు సంతోషంగా ఉన్నారు. వాట్సాప్ వాస్తవికత ప్రజలను విపరీతంగా ఆకర్షించింది. స్నేహితులు, వారి కుటుంబాలు ఇలా అందరూ తమ సొంత యాప్‌లాగా ప్రమోపెట్టుబడి మార్గం నిలకడగా కనిపించడం లేదు. ఏదో ఒక రోజు పెట్టుబడిదారులు డేటా కోసం ఒత్తిడి చేయవచ్చని వారికి స్పష్టత వచ్చింది

ఇదిలా ఉండగా 2014లో ఫేస్‌బుక్‌ 19 బిలియన్ డాలర్లకు వాట్సాప్ ని కొనుగోలు చేసింది. ఎలాంటి డేటా ఉల్లంఘన జరగదని, మానిటైజేషన్ కోసం ఒత్తిడి ఉండదని ఫేస్‌బుక్‌ హామీ ఇచ్చింది.ప్రపంచం అంత షాక్. వాట్సాప్ కి అంత పెద్ద మొత్తం వెచ్చించడం ఏంటని నివ్వెరపోయారు. ఇదిలా ఉండగా 2016 లో ఫేస్‌బుక్‌ అప్పటివరకు ఉన్న 1 డాలర్ నామమాత్రపు రుసుమును కూడా తీసేసింది. అంతే డౌన్లోడ్లు అంతకంతకు పెరిగిపోయాయి.. ముందుగా అనుకున్నట్టు జుకెర్బెర్గ్ , వాట్సాప్ పనితీరులో జోక్యం అవ్వలేదు కానీ చేసుకోలేదు కానీ మోనేటిజషన్ కోసం ఒత్తిడి చేసాడు. ఇది బ్రెయిన్ అండ్ జాన్ కి నచ్చలేదు. తీవ్ర వాదనల తర్వాత బ్రయాన్ 2017లో ఫేస్‌బుక్‌ను విడిచిపెట్టాడు. తన వాటా గా 850 మిలియన్ డాలర్లు ఫేస్‌బుక్‌ , బ్రయాన్‌కు చెల్లించింది. 2018లో ఫోర్బ్స్ తో జరిగిన ఇంటర్వ్యూలో బ్రయాన్, ప్రపంచం నమ్మలేని నిజాలను బయటకు చెప్పాడు. యూజర్ల డేటా పెద్ద ప్రయోజనం కోసం కోసం ఫేస్‌బుక్‌ కు అమ్మేసినట్లు చెప్పాడు. బ్రయాన్ వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ చేసే డేటా ఉల్లంఘన గురించి తెల్సుకొని , డిలీట్ ఫేస్‌బుక్‌ అనే ట్వీట్ చేసాడు. అప్పట్లో ఈ ట్వీట్ సంచలనం సృష్టించింది. చీకటి వాస్తవికత ఏంటంటే ఫేస్‌బుక్‌ 19 బిలియన్ డాలర్లకు వాట్సాప్ లో ఉన్న యూజర్ల డేటాను కొనుగోలు చేసింది. బ్రయాన్ బయటకు వచ్చిన కొన్ని నెలలకే జాన్ కూడా ఫేస్‌బుక్‌ నుండి బయటకి వచ్చాడు. ఇప్పుడు వాట్సాప్ పూర్తిగా ఫేస్‌బుక్‌ చేతిలోకి వచ్చేసింది.ఇదే అదునుగా, జుకెర్బెర్గ్ తనలో ఉన్న మరో కోణాన్ని బయటకు చూపించాడు. యూజర్ల డేటా వాణిజ్య ప్రయోజనాల కోసం దాన్ని వాడటం ప్రారంభించాడు.

వాట్సాప్ దగ్గర మనకు సంబంధించిన వివరాలు ఏంటో తెల్సుకునే ప్రయత్నం చేద్దాం. పేరు, ప్రొఫైల్ ఫోటో, స్థితి, లాగిన్ కార్యాచరణ, సంప్రదింపు జాబితా, కొనుగోళ్లు, ఆర్థిక సమాచారం, ఐ పి అడ్రస్ , లొకేషన్ , గ్యాలరీ … వీటికి సంబంధించిన వివరాలు అన్నీ వాట్సాప్ దగ్గర ఉన్నాయి. 2021 లో ఆకస్మికంగా, వాట్సాప్ న్యూ పాలసీను కచ్చితంగా అంగీకరించాలి లేదంటే అకౌంట్ ను సస్పెండ్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. వాట్సాప్‌కు అలవాటు పడిన జీవితాలు కదా, ఆ పాలసీ ఏంటి అని ఆలోచించకుండా అంగీకరించారు. ఫలితం మన డేటా మన చేతులతోనే వారికీ ఇవ్వడం. డేటా పారదర్శకతకు సంబంధించి సరైన విధివిధానాలు చూపించనందున యూరోపియన్ యూనియన్ 2021లో వాట్సాప్ కి 225 మిలియన్ యూరోల ఫైన్ విధించింది.

ఇక వాట్సాప్ ఆదాయాన్ని ఎలా సమకూర్చుకుంటుందో తెలుసుకుంటే.. ముందుగా సీడ్ ఫండింగ్ ద్వారా తయారు చేసిన ఈ యాప్‌కు, పెట్టుబడిదారులు ముందుకు రావడం, అలాగే 1 డాలర్ నామమాత్రపు రుసుమును పెట్టడం.., ఇలా వాట్సాప్ తన ఆర్ధిక భారాన్ని నెట్టుకుంటూ వచ్చింది. ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసిన తర్వాత వాట్సాప్ ఆదాయ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. మన డేటా మొత్తం ఫేస్‌బుక్‌ చేతిలోకి వెళ్ళటంతో మన డేటాతో మనల్నే తారుమారు చేయడం ప్రారంభించింది . యూజర్ల డేటాను అమ్మడం ద్వారా ఫేస్‌బుక్‌ డబ్బును అర్జిస్తుంది. వాట్సాప్ పే, వాట్సాప్ బిజినెస్ ద్వారా వాట్సాప్ ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది.వాట్సాప్ తమ ఆదాయాన్ని పెంచడానికి స్టేటస్ సెక్షన్‌లో కొత్తగా యాడ్స్‌ను తీసుకురాబోతుంది. ఒకసారి ఈ యాడ్స్ సిస్టం వస్తే ఆదాయానికి సంబందించి వాట్సాప్ ఎవరు అందుకోలేనంత ఎత్తుకు ఎదుగుతుంది.

.

.

Tags

Related News

మేఘా అవినీతి ముసుగులో అధికారులు..!

TDP MLA Koneti Adimulam Case: నా ఇష్టంతోనే ఆ పని! ఆదిమూలం బాధితురాలు సంచలనం

Mossad Secret Operations : టార్గెట్ చేస్తే శాల్తీ లేవాల్సిందే.. ప్రపంచాన్నిషేక్ చేస్తున్న ఇజ్రాయెల్ మొసాద్

Tirupati Laddu Controversy: 300 ఏళ్ల చరిత్రకి మరకలు పడ్డాయా.. తిరుపతి లడ్డూ గురించి ఎవరికీ తెలియని నిజాలు

Kutami Strategy: ఎన్నికల ప్రచారంలో పవన్ చేసిన ఛాలెంజ్ నిజమవుతోందా ? సీనియర్లు ఏమంటున్నారు ?

BRS BC Plan: బీసీ మంత్రాన్ని జపిస్తోన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ పోస్ట్ తో కేటీఆర్ కామెంట్స్ వైరల్

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Big Stories

×