EPAPER
Kirrak Couples Episode 1

Oppenheimer: శృంగారానికి భగవద్గీత శ్లోకం.. ఒపెన్‌హైమర్‌ మూవీపై వివాదం..

Oppenheimer: శృంగారానికి భగవద్గీత శ్లోకం.. ఒపెన్‌హైమర్‌ మూవీపై వివాదం..
Oppenheimer

Oppenheimer: హిందుత్వం అంటే విదేశీ గడ్డపై చులకన భావం కొనసాగుతోంది. ప్రధానంగా విదేశాల్లో మన సంస్కతిని అవమానిస్తున్నారు. హిందూ దేవతలన్నా .. మన కల్చర్‌ అన్నా లెక్కలేని తనం ప్రదర్శిస్తున్నారు. చెప్పులపై హిందూ దేవుళ్లను ముద్రించడం, లోదుస్తులపైనా దేవతల చిత్రాలతో అవమానించడం.. ఏకంగా కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్‌ రక్షణ శాఖ మంత్రి.. మార్లిన్ మన్రోతో పోలుస్తూ ట్వీట్‌ చేయడం తీవ్ర దమారం రేపాయి. వీటిపై మనదేశం తీవ్ర అభ్యంతరం చెబుతున్న సందర్భాల్లో వాటిని తొలగిస్తున్నారు. ఆ తర్వాత కథ మళ్లీ మొదటికి వస్తోంది. తాజాగా హాలీవుడ్‌ మూవీ ఒపెన్‌హైమర్‌ కలకలం రేపుతోంది. అందులో డైరెక్టర్‌ చేసిన దుస్సాహసం అంతా ఇంతా కాదు. హిందువులు పరమ పవిత్రంగా భావించే భగవద్గీతను అవమానించడం తీవ్ర దుమారానికి కారణమవుతోంది.


ఫాదర్‌ ఆఫ్‌ అటామిక్‌ బాంబ్‌గా సుపరిచుతుడైన రాబర్ట్‌ ఒపెన్‌ హైమర్‌ బయోగ్రఫీ ఆధారంగా ఆయన పేరుతో ఓ సినిమా తీశారు. ఇంతవరకు బాగానే ఉంది. అందుకు ఆయన అణు బాంబు రూపొందించేందుకు సినిమాలో కల్పితాలు చూపించుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, డైరెక్టర్‌ ఏమనుకున్నాడో ఏమో.. ఏకంగా హిందూ మతాన్ని కించపరిచేలా సన్నివేశాలు పెట్టి బరితెగించాడు.

సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్ర పోషించిన ఒపెన్‌హైమర్ మూవీలో శృంగారంలో పొల్గొంటున్న సమయంలో పవిత్ర భగవద్గీతలోని శ్లోకాలను పఠిస్తున్నట్లు చూపించడం తీవ్ర కలకలం రేపుతోంది. జీవిత చరిత్ర డ్రామా ఒపెన్‌హైమర్‌లోని ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. క్రిస్టోఫర్ నోలన్ చిత్రం ఒపెన్‌హైమర్‌లో నటుడు సిలియన్ మర్ఫీ పోషించిన టైటిల్ పాత్ర, పవిత్ర హిందూ గ్రంథమైన భగవద్గీతలోని శ్లోకాలను పఠిస్తూ లైంగిక సంపర్కం చేసే సన్నివేశంపై వివాదాలు చుట్టుముట్టాయి.


ఈ దృశ్యంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు నోలన్ కళాత్మకంగా సీన్‌ను ఎంపిక చేసుకున్నారని సమర్ధిస్తున్నారు. దీనిపై #BoycottOppenheimer, #RespectHinduCulture హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

భారత ప్రభుత్వ సమాచార కమిషనర్ ఉదయ్ మహుర్కర్ ఈ సన్నివేశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాన్ని తక్షణం తొలగించాలని పిలుపునిచ్చారు. నోలన్‌కు రాసిన బహిరంగ లేఖలో మహూర్కర్ ఈ సన్నివేశం హిందూ మతంపై కలవరపరిచే దాడి అని నిరసన తెలిపారు. ఒక శాస్త్రవేత్త జీవితంపై ఈ అనవసరమైన సీన్‌ వెనుక ఉన్న ప్రేరణ తనకు అర్థం కాలేదన్నారు. ఈ సీన్‌ 100 కోట్ల మంది సహనశీలురైన హిందువుల మత విశ్వాసాలపై ప్రత్యక్ష దాడి అని స్పష్టం చేశారు. అణు పితామహుడు, అణుబాంబు సృష్టికర్త రాబర్ట్ ఒపెన్‌హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన చిత్రం ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ, ఈ చిత్రంలోని సన్నివేశం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పలువురు మండిపడుతున్నారు. అసలు ఈ సన్నివేశంతో ఉన్న సినిమాను సెన్సార్ బోర్డ్ ఎలా అనుమతించిందని ప్రశ్నిస్తున్నారు. ఈ సీన్‌తో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్-CBFC సినిమాను ఎలా అనుమతించిందనే విషయంపై గందరగోళానికి గురయ్యామంటూ సేవ్ కల్చర్ సేవ్ ఇండియా ఫౌండేషన్ పత్రికా ప్రకటనను ప్రస్తావిస్తూ కేంద్ర సమాచార కమిషనర్ ఉదయ్ మహూర్కర్ మండిపడ్డారు.

ఇది హిందూ సమాజంపై యుద్ధం చేయడంతో సమానం అని.. హిందూ వ్యతిరేక శక్తుల పెద్ద కుట్రలో భాగమైనట్లు కనిపిస్తోందని మహూర్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాలోని దృశ్యాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు. అటువంటి సన్నివేశంతో సినిమాను ఆమోదించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నిర్ణయాన్ని మహూర్కర్ ప్రశ్నించారు.

ట్విట్టర్‌లోనూ ఈ సీన్‌పై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఒపెన్‌హైమర్‌ మూవీని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. హాలీవుడ్, పాశ్చాత్య దేశాలు హిందూ మతాన్ని కించపరిచేలా చూపించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆధ్యాత్మిక గ్రంథాన్ని తగ్గించి చూపించి హిందూ విశ్వాసానికి.. దాని ప్రాముఖ్యతను తక్కువ చేసేలా చూపించడంపై భగ్గుమన్నారు. మరికొందరు ఇది భారత సంస్కృతిపై దాడిగా అభివర్ణించారు.

ఇంత వివాదాస్పదం అవుతున్న ఒపెన్‌హైమర్‌ బయోగ్రఫీ మూవీ రియల్‌ లైఫ్‌లో సైంటిస్ట్‌ రాబర్డ్‌ ఒపెన్‌హైమర్‌కు భగవద్గీతతో అనుబంధం ఉంది. అణుబాంబు పితామహుడిగా పేరొందిన ఒపెన్‌హైమర్ సంస్కృతం నేర్చుకున్నాడు. ఆ గ్రంథాలను చదివి ప్రభావితుడయ్యాడు. అణ్వాయుధం మొదటి విస్ఫోటనాన్ని వివరిస్తూ భగవద్గీత నుంచి ఓ శ్లోకాన్ని ఉదహరించాడు. నేను మృత్యువుగా మారాను, ప్రపంచాలను నాశనం చేసేవాడిని అని అణుబాంబు కనిపెట్టడంపై కామెంట్‌ చేశాడు. అయితే అలాంటి వ్యక్తి బయోగ్రఫీ మూవీలో భగవద్గీతను అవమానిస్తూ పెట్టిన సీన్‌ తీవ్ర దుమారం రేపుతోంది. శృంగారం చేస్తున్న సమయంలో గీతలోని శ్లోకాలను పటించడం కలకలం సృష్టిస్తోంది.

భారత్‌లోనూ ఒపెన్‌హైమర్ మూవీకి కొందరు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. విడుదలైన రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద 30 కోట్లు రాబట్టింది. యూనివర్సల్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్, ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, ఫ్లోరెన్స్ పగ్, కెన్నెత్ బ్రానాగ్, రామి మాలెక్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే సన్నివేశాన్ని సెన్సార్‌ బోర్డు ఎలా అనుమతిచ్చిందనే చర్చ జరుగుతోంది. విదేశాల్లో ఇలాంటి సినిమా రిలీజ్‌ అయిందంటే అక్కడ ఆ తర్వాత అభ్యంతరం చెప్పొచ్చు. కానీ, సినిమా మనదేశంలోనే రిలీజ్‌ అయి హిందువుల మనోభావాలతో చెలగాటం ఆడటం ఏంటని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

రాబర్ట్ ఒపెన్‌హైమర్ పాత్రలో సిలియన్ మర్ఫీ తన ప్రియురాలితో శృంగారం చేస్తున్నప్పుడు భగవద్గీత చదువుతున్న సన్నివేశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సినిమాలోని ఓ సన్నివేశంలో స్త్రీ.. పురుషుడు భగవద్గీతను గట్టిగా చదివేలా చేసి శృంగారంలో పాల్గొన్నట్టు చూపించడం తీవ్ర దుమారం రేపుతోంది. సమాచార మంత్రిత్వ శాఖ తక్షణమే విచారణ జరిపి సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షించాలని సేవ్ కల్చర్ సేవ్ ఇండియా ఫౌండేషన్ డిమాండ్‌ చేసింది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ఓపెన్‌హైమర్ అడల్ట్స్‌ రేటింగ్‌తో రిలీజ్‌ అయింది. అయితే, శృంగార సన్నివేశం నిడివిని తగ్గించడానికి కొన్ని కత్తెర్లు వేసిన తర్వాత భారత్ సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A రేటింగ్ ఇచ్చింది.

Related News

Irregularities: ఆగమవుతున్న తెలంగాణ టూరిజం.. ఇష్టారీతిన దోచేసిన మాజీ ఎండీ

TDP VS BJP: కూటమిలో చిచ్చు పెట్టిన కమిషనర్‌! ఆ అధికారి ఎవరు ?

BRS Leaders: ఏదో చేద్దాం అనుకున్నారు కానీ.! అడ్డంగా బుక్కయ్యారు

Janasena Party: బాలినేని అండతో జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

Sahithi Infrastructure Fraud: ల‌క్ష్మీనారాయణ లీల‌లు.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

Big Stories

×