EPAPER

Manipur Violence: కేంద్ర మధ్యవర్తిత్వం.. మణిపూర్ మంటలు చల్లారేదెప్పుడు?

Manipur Violence: కేంద్ర మధ్యవర్తిత్వం.. మణిపూర్ మంటలు చల్లారేదెప్పుడు?

Manipur MP’s Emotional Letter To Amit Shah: మణిపూర్ మారణహోమాన్ని తగ్గించే మార్గం ఏదీ లేదా? ఇన్నాళ్లు గడిచినా పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులాగే ఎందుకు ఉంది? కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో పరిస్థితి చక్కబడుతుందా? కుకీ, మెయితీ తెగల మధ్య సంధి కుదిర్చే మార్గమేంటి? ఇప్పుడు ఇవే చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పటికే ఘర్షణల్లో వందల మంది చనిపోయారు. వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఇంకా ఈ మారణహోమం కొనసాగాల్సిందేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


గతేడాది మే నుంచి కుకీలకు మెయితీలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. మెయితీలు తమను షెడ్యూల్డ్ ట్రైబ్స్‌గా ప్రభుత్వం గుర్తిస్తూ ఉత్తర్వులివ్వాలని డిమాండ్ చేస్తుండగా.. కుకీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెయితీల దగ్గరే అధికారం మొత్తం ఉందని కుకీల భద్రతకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కుకీ తెగ డిమాండ్ చేస్తోంది. దీంతో గత 16 నెలలుగా మణిపూర్‌లో హింసాత్మక వాతావరణం నెలకొని ఉండగా.. కొద్ది నెలలుగా పరిస్థితి అదుపులో ఉంది. ఐతే ఇటీవలే డ్రోన్ బాంబు ఎటాక్ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఆ దాడికి పాల్పడిన వాళ్లు కుకీలుగా మెయితీలు ఆరోపిస్తున్నారు. తమ పని కాదని కుకీలు అంటున్నారు. అంటే ఈ రెండు తెగల అంతర్యుద్ధాన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ క్యాష్ చేసుకుంటున్నాయా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే రాకెట్ లాంఛర్లను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు అవి ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు ఇచ్చారు.. ఎవరు ప్రయోగించారు వంటి విషయాలపై ఎంక్వైరీ చేస్తున్నారు.

కుకీలు, మెయితీల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటిదాకా 225 మంది మరణించగా.. వందల మంది గాయపడ్డారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. కొండ – మైదాన ప్రాంతాలుగా ప్రజలు అక్కడ విడిపోయారు. ప్రస్తుతం పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు మణిపూర్ సీఎం చాలా రకాల ప్రయత్నాలను ముమ్మరం చేశారు. శాంతిభద్రతలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తగిన అధికారాలివ్వాలని కోరారు. అలాగే కేంద్రం, మణిపూర్‌ ప్రభుత్వంతో మిలిటెంట్ సంస్థల మధ్య జరిగిన సస్పెన్షన్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని సీఎం కోరారంటున్నారు. సస్పెన్షన్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ 25 మిలిటెంట్ గ్రూపులతో 2008లో ఒప్పందం కుదిరింది. ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు మిలిటెన్సీకి అవకాశం ఇవ్వొద్దన్న సూచనలు వస్తున్నాయి. పొరుగున ఉన్న మయన్మార్‌లో ఇదే తరహా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి.


Also Read: డ్రోన్ల ద్వార బాంబులు.. మణిపూర్‌లో దాడులు చేస్తున్న మిలిటెంట్లు ఎవరు?

మణిపూర్​లో మళ్లీ అల్లర్లు చెలరేగడంతో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడుతోంది. ప్రధాని మోడీ ప్రపంచమంతటా పర్యటిస్తున్నారు కానీ ఆయనకు మణిపూర్ ​కు రావడానికి మాత్రం టైమ్ లేదా? అని ప్రశ్నిస్తున్నారు. మణిపూర్​లో అల్లర్లు చెలరేగి ఏడాది దాటిందని, కానీ అక్కడ ఇంకా ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయని, మణిపూర్ మండిపోవాలని ప్రధాని కోరుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఫైర్ అయ్యారు. ఎక్కడో ఉన్న రష్యా – ఉక్రెయిన్ శాంతి ప్రక్రియ కోసం ప్రయత్నాలు చేస్తున్న ప్రధాని.. సొంత దేశంలో ఉన్న మణిపూర్ మంటల్ని ఎందుకు ఆర్పలేకపోతున్నారన్న ప్రశ్నలను సంధిస్తున్నారు.

డ్రోన్ల నుంచి పడ్డ బాంబులు.. మణిపుర్‌ అల్లర్లను మరింత తీవ్రం చేస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా ఇవి మామూలు బాంబులు కాకుండా.. రాకెట్‌ల ద్వారా ప్రయోగించే గ్రెనేడ్లని మణిపుర్‌ పోలీసులు అంటున్నారు. అయితే ఇది ఒక్కరోజులో బయటపడ్డదేమీ కాదు. ఈ డ్రోన్ల దాడుల గురించి కొద్దిరోజులుగా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. గత నవంబర్ లో ఇంఫాల్‌ ఎయిర్ పోర్ట్ వద్ద భారీ డ్రోన్‌ ఒకటి ఎగురుతున్నట్లు గుర్తించారు. దీని కోసం ఏకంగా రాఫెల్‌ ఫైటర్‌జెట్‌నే రంగంలోకి దించారప్పుడు. అటు డ్రోన్ల తయారీకి అవసరమైన పరికరాలతో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని అసోం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. అది జరిగిన కొద్దిరోజులకే హై ఎండ్‌ డ్రోన్‌ బ్యాటరీలతో మణిపుర్‌లో ఎంటర్ అవుతున్న మరో వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.

మణిపుర్‌ పక్కనే ఉండే మయన్మార్‌ లోనూ ఇలాంటి డ్రోన్లే చక్కర్లు కొడుతున్నాయి. అక్కడి సైనిక పాలకులకు వ్యతిరేకంగా చిన్న  రాష్ట్రంలో ఆందోళన కారులు డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు. ఆ చిన్‌ ఆందోళనకారులతో మణిపుర్‌ మిలిటెంట్లకు సన్నిహిత సంబంధాలున్నాయనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఈ అంతర్యుద్ధం మరో లెవెల్ కు వెళ్లకుండా ఆదిలోనే అడ్డుకట్ట వేయడం కీలకంగా మారింది. కేంద్ర ప్రభుత్వానికి తాజాగా మణిపూర్ ఎంపీ లేఖ కూడా రాశారు. తమకు శాంతి వాతావరణం కావాలని, వెంటనే చర్యలు చేపట్టాలంటున్నారు. ఇప్పుడు రంగంలోకి దిగాల్సింది కేంద్రమే. అయితే అది అణచివేతల ద్వారా కాకుండా శాంతియుత చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సి ఉంది.

 

Related News

Arvind Kejriwal Resignation: కేజ్రీ కొత్త వ్యూహం ఫలిస్తుందా?

Arvind Kejriwal: అరవింద్ ‘క్రేజీ’వాల్.. బీజేపీకి చుక్కల్!

Russia vs Ukraine War: మోసపోయి..రష్యా ఆర్మీలో చేరి.. యుద్ధం చేసి తిరిగివచ్చిన భారతీయ యువకుల కథ

Steel Plant Politics: స్టీల్‌ప్లాంట్ పంచాయతీ.. మీ స్టాండ్ ఏంటి?

Donald Trump Shooting: గురి తప్పింది.. టార్గెట్ ట్రంప్.. వెనక ఉన్నది ఎవరు?

Jani Master Case : వాష్ రూమ్, డ్రెస్ ఛేంజ్.. జానీ కహానీ

Kejriwal Resign: కేజ్రీవాల్ క్రేజీ ప్లాన్స్.. రాజీనామా ప్రకటన వెనుక అసలు సంగతి ఇదా ?

Big Stories

×