EPAPER
Kirrak Couples Episode 1

Congress LS Polls Strategy | లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం.. గెలుపే లక్ష్యంగా ప్లానింగ్

Congress LS Polls Strategy | రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమయ్యామని చెప్పేందుకు కాంగ్రెస్ పనుల్ని వేగవంతం చేస్తోంది. ఇండియా కూటమికి సంబంధించి కీలక నిర్ణయాలను ఇప్పటికే ఫైనలైజ్ చేయగా.. అవి ఫలితాలను ఎంత సానుకూలంగా ప్రభావితం చేయగలవో అనే విషయంపై చర్చ కొనసాగుతూనే ఉంది

Congress LS Polls Strategy | లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం.. గెలుపే లక్ష్యంగా ప్లానింగ్

Congress LS Polls Strategy | రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమయ్యామని చెప్పేందుకు కాంగ్రెస్ పనుల్ని వేగవంతం చేస్తోంది. ఇండియా కూటమికి సంబంధించి కీలక నిర్ణయాలను ఇప్పటికే ఫైనలైజ్ చేయగా.. అవి ఫలితాలను ఎంత సానుకూలంగా ప్రభావితం చేయగలవో అనే విషయంపై చర్చ కొనసాగుతూనే ఉంది. అయితే, భారతదేశంలోని మిత్రపక్షాలను కలుపుకుపోతూ తన ఉనికిని స్థిరపరుచకోవడం జాతీయ కాంగ్రెస్ చేసే ప్రయత్నంలో పాజిటీవ్ వైబ్స్ కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకీ, కూటమిలో పోటీ సీట్లు ఖరారైనట్లేనా…? కాంగ్రెస్ గెలుపు టార్గెట్స్ ఏంటీ…? బీజేపీని కట్టడి చేయడానికి ఉన్న అవకాశాలేంటీ..?


2024 లోక్‌సభ ఎన్నికలు మునుపెన్నడూ లేనంత రసవత్తరమైన రాజకీయాల నేపథ్యంలో జరగబోతున్నాయి. కాగా, ఆర్థిక సంవత్సరం ప్రారంభ సమయంలో… అంటే, ఫిబ్రవరి నెలాఖరు, మార్చి ప్రారంభంలో ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. ఈ కీలకమైన రాజకీయ పరిణామాల మధ్య, వచ్చే ఆర్థిక సంవత్సరానికి కంటే ముందే, కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్వల్పకాలిక వ్యయాన్ని కవర్ చేయడానికి ‘ఓట్-ఆన్-అకౌంట్’.. అంటే, ‘మధ్యంతర బడ్జెట్‌’ను తీసుకొస్తుందనే అభిప్రాయాలూ ఉన్నాయి.

ఏది ఏమైనా.. ఇప్పుడు పార్లమెంటరీ వ్యవహారాలను ముగించే సమయం ఆసన్నమైంది. ఎన్నికైన ఎంపీలు తదుపరి యుద్ధానికి సమాయత్తం కావాల్సి ఉంది. ఈ సందర్భంలో, అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి… కొంతమంది నాన్-అలైన్డ్ ప్లేయర్‌లు తమ మార్క్‌ని చూపించడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో జాతీయ కాంగ్రెస్‌ మరింత ఎక్కువ బరువును మోయాల్సి వస్తోందన్నది స్పష్టంగా తెలుస్తోంది. రాజీవ్‌గాంధీ తర్వాత అంత కర్మీషాను సంపాదించుకున్న మోడీ ఇప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు పెద్ద సవాలుగా మారారు. అయితే, దాని కోసం కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఓటర్లు ఎప్పుడూ స్మార్ట్‌గానే ఉంటారు. మార్పు ఎప్పుడు అవసరమనే విషయం వారికి ఎవ్వరూ చెప్పనవసరం లేదు. మీడియా ప్రభావాన్ని దాటి ఆలోచించగల శక్తి వారికి ఉంది. సరిగ్గా ఇదే స్ట్రాటజీని కాంగ్రెస్ అమలుచేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దేశం కోసం త్యాగాలు కొత్తేమీ కాదంటూ ఇండియా కూటమితో కాంప్రమైజ్ అయ్యింది. సీట్లు తగ్గినా గెలుపే ధ్యేయంగా ప్లాన్లు చేస్తోంది.


ఇండియా కూటమిలో భాగంగా, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు 250 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. నిజానికి, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇప్పటివరకు ఇన్ని తక్కువ సీట్లలో ఎప్పుడూ పోటీ చేయలేదనే చెప్పాలి. ప్రస్తుతం భారత్ పార్లమెంట్‌లో 545 లోక్‌సభ సీట్లు ఉంటే అందులో 255 లోక్‌సభ స్థానాలపై “ప్రత్యేకమైన అధిక దృష్టి” పెట్టినట్లు తెలుస్తోంది. ఇది రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ వ్యూహంగా ఉంటుంది. ఇక, బీజేపీ వ్యతిరేక ఇండియా కూటమిలో దేశవ్యాప్తంగా దాదాపు 28 రాజకీయ పార్టీలుండగా.. మొత్తం 545 లోక్‌సభ సీట్లలో సగం వరకు కాంగ్రెస్ పోటీ చేస్తోంది. మిగిలిన సీట్లు కూటమిలోని ఇతర పార్టీలు పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. నిజానికి, ఈ స్ట్రాటజీ కూటమిలో న్యాయమైన పంపిణీని మాత్రమే కాకుండా.. బీజేపీని ఎదుర్కోడానికి గ్రాండ్ ఓల్డ్ పార్టీ తీసుకున్న సరైన నిర్ణయం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తుండటం విశేషం. ఇక, ఈ సగం సీట్లలో కాంగ్రెస్ గెలుచుకోగల స్థానాలపై దృష్టి కేంద్రీకరించడానికి తగినంత అవకాశం కూడా ఇవ్వడం ఆ పార్టీ వ్యూహాన్ని తెలియజేస్తోంది. ఇటీవల, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో రాహుల్ గాంధీ హాజరైన పార్టీ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి రాష్ట్రంలో వార్‌రూమ్‌లను ఏర్పాటు చేయడం, ఇండియా భాగస్వాములతో సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో పాటు తమ అభ్యర్థులను త్వరగా ఖరారు చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న 303 స్థానాలను దాటేసి 400 సీట్లు గెలుచుకోవాలని అధికార బీజేపీ లక్ష్యంగా పెట్టుకోగా, కాంగ్రెస్ పార్టీకి కేవలం 250 స్థానాల్లో పోటీ చేయడం పార్టీ పరంగా కాస్త తలవొంపులైనప్పటికీ.. రాజకీయంగా, ఆ పార్టీ సిద్ధాంతాలను సమర్థిస్తూనే ఉంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 50 ఏళ్ల పాటు దేశాన్ని పాలించింది. అయితే, ప్రస్తుతం కాంగ్రెస్‌ స్థితిని చూసి జాలిపడే పరిస్థితి ఉన్నప్పటికీ.., తప్పు పట్టాల్సిన కండీషన్‌లో లేదన్నది స్పష్టం అయ్యింది. 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2014లో 464 స్థానాల్లో పోటీ చేసి, కేవలం 10 శాతం సీట్లు సాధించి, ప్రతిపక్షంలో స్పష్టమైన స్థానం కూడా దక్కించుకోలేకపోయినంతగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందనే విమర్శలు ఎదుర్కొంది. 2019లో పోటీ చేసిన 423 స్థానాలకు గానూ 52 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. 10 ఏళ్లుగా ఇదే లెక్కల్లో స్తబ్ధుగా ఉంది. అయితే, ఇప్పుడు పరిస్థితి వేరు. 450 సీట్లలో పోటీ చేసి 50 గెలుపొందడం కంటే 250లో పోటీ చేసి కనీసం 100 నుండి 125 సీట్లు గెలుచుకోవడం గ్రాండ్ ఓల్డ్ పార్టీకి మరింత సంతోషాన్ని ఇస్తుంది. అలాగే, కూటమిలో సమన్వయాన్ని కాపాడుకున్నట్లు అవుతుంది. దీనితో, మ్యాజిక్ ఫిగర్ 275కు చేరువగా ఉండే ఛాన్స్ ఉంటుంది.

మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాపులారిటీని, బీజేపీకి ఉన్న సంస్థాగత బలాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. కనీసం హిందీ బెల్ట్‌లోనైనా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు ఉన్న అవకాశాలపై సందేహాలు లేకపోలేదు. అయితే, పరిస్థితిని వాస్తవికంగా బేరీజు వేసుకుని, గత సారి కంటే చాలా తక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించడం ద్వారా, ఓట్ల శాతం పరంగా కాంగ్రెస్ ఓడిపోవచ్చు, కానీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలను పెంచుకుంది. ఇండియా కూటమి.. పెద్ద ప్రయోజనాల కోసం కొన్ని సర్దుబాట్లు, త్యాగాలు చేయవలసి ఉంటుందన్నది మొదటి నుండి అనుకుంటున్న మాటే. కాగా, జూనియర్ భాగస్వాములకు అవకాశం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ఒక ఉదాహరణను సెట్ చేయగలిగితే, అది రాజకీయ పార్టీల మధ్య నమ్మకాన్ని సుస్థిరం చేయడంలో మరో అడుగు ముందుకేసినట్లే. బహుశా, దేశంలో సగం చోట్ల ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కంటే వరుసగా మూడో ఎన్నికల్లో ప్రభావం చూపడంలో విఫలమైతే మరింత మద్దతు కోల్పోతామని కాంగ్రెస్ కూడా గ్రహించి ఉండవచ్చు. అందుకే, కాంగ్రెస్ పెద్ద మనసుతో, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related News

Kutami Strategy: ఎన్నికల ప్రచారంలో పవన్ చేసిన ఛాలెంజ్ నిజమవుతోందా ? సీనియర్లు ఏమంటున్నారు ?

BRS BC Plan: బీసీ మంత్రాన్ని జపిస్తోన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ పోస్ట్ తో కేటీఆర్ కామెంట్స్ వైరల్

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Big Stories

×