EPAPER

Operation Congress: టార్గెట్ 14 ఎంపీ సీట్లు.. ఇదే రేవంత్ వ్యూహం..!

Operation Congress: టార్గెట్ 14 ఎంపీ సీట్లు.. ఇదే రేవంత్ వ్యూహం..!
Telangana CM Revanth Ready
Telangana CM Revanth Ready

CM Revanth Plan for Loksabha Elections in Telangana: 14 ఎంపీ సీట్లు.. ఇది తెలంగాణ కాంగ్రెస్‌ టార్గెట్. డబుల్ డిజిట్ టార్గెట్ బాగుంది.. మరి సాధించడం ఎలా? దీనికి కాంగ్రెస్‌ నేతలు అనుసరిస్తున్న వ్యూహమేంటి? సీఎం రేవంత్ నిర్దేశిస్తున్న డైరెక్షన్‌ ఏంటి? రేవంత్ వరుస భేటీలు, నేతలతో సమాలోచనలు దేనికి సంకేతం?


తెలంగాణలో ఉన్న మొత్తం లోక్‌సభ స్థానాల నెంబర్.. 17. ఇందులో 14 ఎంపీ సీట్లను గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది తెలంగాణ కాంగ్రెస్. ప్రభుత్వ పరంగా ఆకట్టుకునే సంక్షేమ పథకాలు, చెప్పినట్టుగానే గ్యారెంటీలను అమలు చేయడంతో పాటు.. పార్టీ బలోపేతం పరంగా జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. ఓటమన్నదే లేదన్నట్టుగా చెలరేగిన కేసీఆర్‌నే గద్దె దించిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్‌ లీడర్లు.. ఇప్పుడు లోక్‌సభలో కూడా తమ టార్గెట్‌ను రీచ్‌ అయ్యి.. ఈ ఎన్నికల యుద్ధాన్ని విజయంతో ముగిద్దామనుకుంటున్నారు.

తెలంగాణ గడ్డపై మరోసారి కాంగ్రెస్‌ జెండా పాతేందుకు వ్యూహాలు రచిస్తోంది అధిష్ఠానం. సీన్‌లోకి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఎంటరయ్యారు. మాములుగానే రేవంత్ ఓ వ్యూహంతో పనిచేస్తారు. ఇప్పుడా వ్యూహాలను పక్కాగా అమలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎక్కడైతే సభను నిర్వహించారో.. ఇప్పుడదే తుక్కుగూడలో జనజాతర సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


Also Read: KCR Visit Karimnagar: చంద్రబాబు దారిలో కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి?

ప్రస్తుతం సీఎం రేవంత్.. ముఖ్య నేతలతో నిత్యం మంతనాలు జరుపుతున్నారు. ఎన్నికలు ఆయ్యే వరకు ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా ఉండాలి. బాధ్యతలను పంచుకోవాల్సిందే.. కార్యకర్తల వెన్నంటి ఉండాల్సిందే. ఇవీ నేతలకు సీఎం రేవంత్ ఇస్తున్న ఆదేశాలు.. అంతేకాదు అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలి. పార్లమెంట్‌, అసెంబ్లీ, బూత్‌.. ఇలా త్రీ లెయర్స్‌లో కమిటీలు ఉండాలి. ఇలా గల్లీ నుంచి మెయిన్ సిటీ వరకు ఎవ్రీథింగ్ అండర్‌ కంట్రోల్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి ఓ చిన్న సమస్య వచ్చి పడింది. ఇతర పార్టీల నుంచి భారీగా నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సో.. ఇప్పుడు గ్రౌండ్ లెవల్‌లో పాతవారు, కొత్తవారు ఎంత మేర కలిసి పనిచేస్తారన్నది ఓ డౌట్. కానీ ఈ విషయంలో కూడా ముందే మేలుకున్నారు సీఎం రేవంత్. మీ ఈగోలను పక్కన పెట్టండి.. పార్టీ గెలుపు కోసం పనిచేయండి. అంటూ నేతలను పిలిచి మరీ చెబుతున్నారు. అంతర్గత కుమ్ములాటలను పక్కన పెట్టాలని సజెస్ట్ చేస్తున్నారు.

నిజానికి ఈ విషయంలో రేవంత్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఆయనకు ఈ విషయంలో చాలా ఎక్స్‌పీరియన్స్ ఉందనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పనైపోయిందనుకునేవారు. పార్టీలో అంతర్గత విబేధాలు, కుమ్ములాటలు ఉన్నాయనే ఆరోపణలు, విమర్శలు ఉండేవి. కానీ అధికారంలో లేనప్పుడే వీటన్నింటిని సెటిల్ చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. అందుకే ఈసారి ముందే మేలుకున్నారు. ఎక్కడైతే ఇతర పార్టీల నుంచి వచ్చి టికెట్ దక్కించుకున్నారో. ఆ నియోజకవర్గాల్లో కీలక నేతలను పిలిపించి నేరుగా మాట్లాడుతున్నారు. కలిసి పనిచేయాలని హితబోధ చేస్తున్నారు.

Also Read: Congress Party: నేడు తుక్కుగూడలో కాంగ్రెస్‌ జనజాతర బహిరంగ సభ..

నిజం చెప్పాలంటే.. లోక్‌సభ ఎన్నికల విషయంలో అన్ని పార్టీల కంటే స్పీడ్‌గా ఉంది కాంగ్రెస్.ఇప్పటికే 14 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేయడంలో కాంగ్రెస్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కూడా కాంగ్రెసే ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఫిబ్రవరి 2 న జరిగిన ఇంద్రవెల్లి బహిరంగ సభలో.. రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని మోగించారు. ఇక ఆ తర్వాత జరిగిన కొస్గి సభలో పాల్గొన్నారు. ఈ సభలోనే కాంగ్రెస్ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారు.

ఇలా ప్రచారం చేస్తూనే మరోవైపు బీఆర్ఎస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు హస్తం నేతలు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అక్రమాలు, కల్వకుంట్ల భూ కబ్జాలు.. ఇలా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎట్‌ ది సేమ్‌ టైమ్.. వంద రోజుల్లో కాంగ్రెస్‌ సర్కార్‌ చేసిన పనులను ప్రజలకు వివరిస్తున్నారు. ఒక్కో గ్యారెంటీ గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నారు.

ప్రజల్లో తమ ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకం వచ్చిందంటున్నారు. మరోవైపు ప్రభుత్వంలో ఏకఛత్రాధిపత్యం కాకుండా.. అన్ని వర్గాల ప్రజలను కలుపుకు పోయారని, అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించారని, గత పాలనకు, ప్రస్తుత పాలనకు మధ్య తేడాలను ప్రజలు గమనిస్తున్నారంటున్నారు. అందుకే ఈసారి ప్రజలు తమకు పట్టం కట్టడం ఖాయమన్న ధీమాలో ఉన్నారు కాంగ్రెస్‌ నేతలు.

Related News

Telangana: విమోచనం.. విలీనం.. విద్రోహం.. ప్రజా పాలనా దినం..! 2014 నుంచి 2024 దాకా..!

Telangana Armed Struggle: జనం నడిపిన విప్లవం.. సాయుధ పోరాటం..!

YS Jagan Mohan Reddy: జగన్ కాదు.. సీతయ్య.. వైసీపీలోనే గుసగుసలు

New Headache To YS Jagan: జగన్‌కు కొత్త తలనొప్పి.. కనక దుర్గ కండిషన్స్

New Election Commissioner: తెలంగాణ కొత్త ఎలక్షన్ కమీషనర్.. ఎవరంటే?

Big Shock to YS Jagan: వైసీపీ అడ్రస్ గల్లంతు.. 45 కార్పోరేటర్లు టీడీపీలోకి?

GHMC Elections: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

Big Stories

×