EPAPER
Kirrak Couples Episode 1

CM Chandrababu Naidu: అటు పాలన.. ఇటు ప్రక్షాళన.. ఏ విషయంలో తగ్గేదేలే

CM Chandrababu Naidu: అటు పాలన.. ఇటు ప్రక్షాళన.. ఏ విషయంలో తగ్గేదేలే

CM Chandrababu Special Focus On AP Development: పాలన మొదలైంది.. ప్రక్షాళన షురూ అయ్యింది. అది కూడా కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధానమైన తిరుమల నుంచి నాలుగోసారి సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకోగానే ఆయన ఆ ఏడుకొండవాడిని దర్శించుకున్నారు. భక్తి భావం అలా ముగియగానే.. ఆయనలోని పాలకుడు నిద్రలేచాడు. ఐదేళ్లలో ఏదీ సరిగా జరగలేదు. అన్నింటిలో అరాచకం.. అవినీతి.. ఏదీ సక్రమంగా లేదు.. పాలకుడు తరహాలో అధికారులు కూడా తయారయ్యారు. ఇక మారాలి.. ప్రక్షాళన జరగాలి. ఇక ముందు కూడా ఇలానే ముందుకు సాగుతుందంటే ఇక నడవదు. ఏపీ నయా సీఎం చంద్రబాబు నాయుడు థాట్స్ ఇలా ఉన్నాయి. అందుకే ఆ తిరుమలేశుడి దర్శనం ముగియగానే ఫస్ట్ ఫోకస్ తిరుమల తిరుపతి దేవస్థానంపైనే పెట్టారు.


నిజానికి వైసీపీ పాలనలో తిరుమల కొండపై అనేక అంశాలు వివాదస్పదమయ్యాయి. అన్యమత ప్రచారం కావొచ్చు.. పాలనాపరమైన నిర్ణయాలు కావొచ్చు. పవిత్రమైన తిరుమల కొండను రాజకీయాలకు కేంద్రంగా మార్చడం ఆఖరికి టీటీడీ చైర్మన్‌ పదవిని ఎవరికి అప్పగించాలన్న విషయాలు కావొచ్చు. ఇలా చాలా అంశాలు వైసీపీ, టీడీపీ నేతల మధ్య డైలాగ్‌ వార్‌ కారణమయ్యాయి. అందుకే తన ప్రక్షాళనను తిరుమల కొండపై నుంచే మొదలు పెడుతానంటున్నారు చంద్రబాబు. సో.. త్వరలోనే టీటీడీలో చాలా మార్పులు జరగబోతున్నాయని తెలుస్తుంది. వైసీపీ హయాంలో పాతుకుపోయిన అధికారులకు స్థానచలనం తప్పదని క్లియర్ కట్‌గా అర్థమవుతోంది. అంతేకాదు ఆ స్థానాల్లో టీడీపీ నేతలు, చంద్రబాబు అనుకూలమైన అధికారులు కొలువు దీరబోతున్నారు.

ఇది తిరుమల అంశం.. ఇక సీఎంగా చార్జ్‌ తీసుకున్న సమయం నుంచి తనలోని రూలర్‌ని నిద్రలేపారు చంద్రబాబు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు ఫైల్స్‌పై సంతకం చేశారు చంద్రబాబు. తొలి సంతకం.. మెగా డీఎస్సీ.. తాను అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్‌ రిలీజ్‌పై తొలి సంతకం చేస్తానన్నారు చంద్రబాబు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన తొలి సంతకం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే డీఎస్సీని ఇచ్చింది. ఇప్పుడు దీనిని సవరించి.. కొత్త ప్రకటన విడుదల చేయనుంది కూటమి ప్రభుత్వం..


రెండో సంతకం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఈ యాక్ట్‌కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో జోరుగా ప్రచారం చేశారు చంద్రబాబు.. వైసీపీ పెద్దలు ఈ యాక్ట్‌ను అడ్డం పెట్టుకొని భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తాన్నారు.. చెప్పినట్టుగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం చేశారు.

మూడో సంతకం.. పెన్షన్‌ 4 వేలకు పెంపు.. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న 3 వేల రూపాయల కంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువగా ఇస్తామని ఎన్నికల వాగ్ధానం చేశారు చంద్రబాబు. అది కూడా ఏప్రిల్ నుంచే అమలు చేస్తామన్నారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఏప్రిల్ నుంచే పెంచిన పెన్షన్‌ డబ్బును పంపిణీ చేయాలని నిర్ణయించారు చంద్రబాబు.. అదే ఫైల్‌పై సంతకం చేశారు.

Also Read: ఏపీలో మారిన పెన్షన్ స్కీం.. “ఎన్టీఆర్ భరోసా” పునరుద్ధరణ.. జులై 1న రూ.7 వేలు

నాలుగో సంతకం.. అన్న క్యాంటీన్లను పునరుద్దరీంచడం. టీడీపీ హయాంలో ఐదు రూపాయలకే భోజనం అందించేలా అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 183 క్యాంటీన్లు నడిచేవి.. కానీ వైసీపీ ప్రభుత్వం వీటిని తొలగించింది. ఇప్పుడు మళ్లీ వీటిని ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకుంటూ ఆ ఫైల్‌పై సంతకం చేశారు చంద్రబాబు.

ఐదో సంతకం.. స్కిల్ సెన్సస్.. నిరుద్యోగం.. ప్రస్తుతం ఏపీలో అత్యంత కీలకమైన సమస్య..అసలు ఎంతమంది ఉన్నత విద్యను అభ్యసించారు. ఎంతమందికి ఉద్యోగాలు లేవు.. ఎవరి నైపుణ్యాలు ఏంటి? ఈ లెక్కలను తేల్చేందుకు స్కిల్ సెన్సస్‌ను చేపట్టనుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఫైల్‌పై ఐదో సంతకం చేయనున్నారు చంద్రబాబు. ఈ సెన్స్‌ ద్వారా వచ్చిన డేటా ఆధారంగా..ఎవరికి ఎలాంటి నైపుణ్యంలో శిక్షణ అవసరమో.. దానిని అందించి నిరుద్యోగాన్ని రూపుమాపాలని అనుకుంటోంది చంద్రబాబు సర్కార్.

ఇవీ పాలన పరమైన నిర్ణయాలు ఇక గత ప్రభుత్వంలోని అవకతవకలను తవ్వి తీయడం కూడా పక్కా అంటున్నారు చంద్రబాబు.. కక్ష సాధింపు చర్యలు ఉండవని చేప్తూనే.. తప్పు చేసిన వారిని మాత్రం వదిలి పెట్టేది లేదని చెబుతున్నారు. అంటే వైసీపీ హయాంలో తప్పులు చేసిన అధికారులు కావొచ్చు.. నేతలు కావొచ్చు. వదిలి పెట్టేది లేదని మాస్‌ వార్నింగ్ ఇస్తున్నారు.

సో.. అటు పాలన.. ఇటు ప్రక్షాళన.. ఏ విషయంలో తగ్గేదేలే అంటున్నారు చంద్రబాబు.. అంటే ముందు ముందు మరిన్నీ బ్రేకింగ్‌ న్యూస్‌లు చూడబోతున్నాం మనం. అది పాలన పరమైన విషయాల్లో కావొచ్చు. కేసుల నమోదు విషయంలో కావొచ్చు.

Tags

Related News

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జోలికొచ్చి బుక్కైన నానీలు..

Russia Vs Ukraine War: దూసుకొస్తున్న రష్యా మిస్సైల్? వణికిపోతున్న ఉక్రెయిన్

YS Jagan vs Botsa Satyanarayana: వైసీపీ నేతల పార్టీ మార్పు వెనుక బొత్స వ్యూహం ఉందా?

Irregularities: జూబ్లీహిల్స్‌లో బయటపడ్డ మరో భారీ బాగోతం.. 36 ఏండ్ల నుంచి..

Alla Nani: వైసీపీ రాజీనామా నేతలకు జనసేన డోర్లు తెరుచుకుంటాయా ? ఆళ్ల నాని పరిస్థితి ఏంటి ?

Hydra Demolitions: కూల్చివేతలపై భిన్న స్వరాలు.. కేసీఆర్ అలా.. కేటీఆర్ ఇలా..

Big Stories

×