EPAPER

Chandrababu Naidu: చంద్రబాబు సీరియస్.. ఆ మంత్రి పోస్ట్ ఊస్టేనా..?

Chandrababu Naidu: చంద్రబాబు సీరియస్.. ఆ మంత్రి పోస్ట్ ఊస్టేనా..?

చిక్కుల్లో ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

అదృష్టం కలిసి వస్తే ఎవరూ అడ్డుకోలేరనే దానికి.. ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఒక ఉదాహరణ. అమలాపురానికి చెందిన సుభాష్‌.. వైసీపీలో ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న సుభాష్.. నాటి మంత్రి పినిపే విశ్వరూప్‌తో పొసగకపోవడంతో పార్టీకి దూరమయ్యారు. ఎన్నికల ముందే వైసీపీలో నుంచి టీడీపీలోకి మారి.. రామచంద్రపురం స్థానం సీటు పొందారు. నియోజకవర్గం కొత్తదైనా రాజకీయ దిగ్గజాలు ఉన్న నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగి ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యే ఎన్నికైన కొన్నిరోజుల్లోనే చంద్రబాబు మంత్రివర్గంలో కూడా స్థానం పొందారు. చంద్రబాబు మంత్రివర్గంలో కోనసీమ జిల్లా నుంచి స్థానం లభించిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించిన యువనేతకు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుందని జోరుగా చర్చ జరుగుతోంది.


సీనియర్లు ఓర్చుకోలేక దూరం పెడుతున్నారనే చర్చ

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సుభాష్ కు చంద్రబాబు మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు. దీంతో జిల్లాలోని‌ సీనియర్ ఎమ్మెల్యేలు ఓర్చుకోలేక మంత్రి‌ సుభాష్ ను దూరం పెడుతున్నారనే చర్చ నడుస్తోంది. పార్టీకి చెందిన కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించకపోవడం.. ఫెక్సీలలో మంత్రి సుభాష్ ఫోటో ముద్రించకపోవడం లాంటి సంఘటనలు కోనసీమలో అనేకం జరిగాయని అంటున్నారు. దీనిపై మంత్రి సుభాష్ చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తుందట.

అమలాపురంలోని తన సొంత సామాజిక వర్గానికి..

మరోవైపు మంత్రి యువకుడు కావడంతో సీనియర్లకు గౌరవం ఇవ్వట్లేదని మరోవాదన వినిపిస్తుంది. అయితే నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను సుభాష్ దూరంపెట్టి అమలాపురం నుండి వచ్చిన తన సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయట. తనకు ఇచ్చిన శాఖపై పూర్తి అవగాహన లేకపోవడంతో ఆ శాఖ అధికారులు‌ కూడా మంత్రి సుభాష్ ను తప్పుదోవ పట్టిస్తున్నారనే టాక్ నడుస్తుంది.

మంత్రిపై సీరియస్ అయిన సీఎం చంద్రబాబు

ఇక రీసెంట్ గానే టీడీసీ సభ్యత్వాల నమోదులో మంత్రి వెనకబడి ఉండడంతో సీఎం చంద్రబాబు సిరీయస్‌ అయ్యారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన కూడా మంత్రిగా గురుతర బాధ్యతలు అప్పగిస్తే.. ఇంత నెగ్లీజెన్సీగా ఉంటారా అని మండిపడినట్లు తెలుస్తొంది. ఇలా అయితే కుదరదని.. తాము మరో ప్రత్యామ్నాయం చూస్తానని సీఎం చంద్రబాబు హెచ్చరించారట. ఇతర పార్టీ నుంచి వచ్చిన కూడా.. మంత్రి ఇస్తే కనీసం నీకు ఆ పట్టుదల లేకపోతే ఎలా అంటూ ఫైర్ అయ్యారట. అలానే పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి.. తొమ్మిది వేల మంది ఓట్ల నమోదుకు లక్ష్యంగా పెడితే.. కేవలం 2వేల 300 ఓట్లు మాత్రమే చేయడంతో సీఎం చంద్రబాబు నుంచి మంత్రికి చివాట్లు పడ్డట్టు తెలుస్తోంది. మంత్రికి చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read: ఆ జిల్లాపై జగన్ స్పెషల్ ఫోకస్.. వ్యూహం ఫలిస్తుందా..?

ఇంత నెగ్లీజెన్సీగా ఉంటారా అని మండిపడ్డ చంద్రబాబు

చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆడియో వైరల్‌ కావడం వెనక జిల్లాకు చెందిన నాయకుల ప్రమేయం ఉన్నట్లు చర్చ నడుస్తోంది. కొంత కాలంగా అమలాపురంలో మంత్రి జోక్యం ఎక్కువుగా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. అధికారుల నియమాకాల్లో మంత్రి జోక్యం ఎక్కువుగా ఉందనే టాక్ ఎమ్మెల్యేల్లో ఉందట. గత వైసీపీ హయంలో టీడీపీ నేతలను ఇబ్బందులకు గురిచేసిన అధికారులకు కోనసీమ జిల్లాలో పోస్టింగ్‌లు ఇప్పించారని నేతలు చెవులు కోరుక్కుంటున్నారట. దీన్ని మనస్సులో పెట్టుకునే కోనసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేల్లో ఒకరు ఆడియోను బయటకు పంపారనే టాక్ జోరుగా నడుస్తోంది.

వైసీపీ సోషల్ మీడియా చేతిలో ట్రోలింగ్ పాలైన మంత్రి

గతంలో విశ్వరూప్ తనయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా మంత్రి సుభాష్ బాధితులరాలు తన దగ్గరకు వచ్చి సహాయం అడిగితే చేశానని చెప్పడం.. అంతలోనే బాధితురాలు నేను ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్లి సహాయం కోరలేదు అని చెప్పడంతో వైసీపీ సోషల్ మీడియా చేతిలో ట్రోలింగ్ పాలయ్యారు. అంతే కాకుండా రామచంద్రపురం జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పోలిశెట్టి చంద్రశేఖర్ వంటి వారిని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకున్న సుభాష్.. ఇప్పుడు వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా విమర్శలఉ వస్తున్నాయట.

రెడ్డి సుబ్రహ్మణ్యంకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదని టాక్

నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేద్దాం అనుకున్న రెడ్డి సుబ్రహ్మణ్యం.. నియోజవర్గ ఇంచార్జ్ ఎవరూ లేనప్పుడు అన్ని తానే చూసుకున్నారు. ఇప్పుడు ఆయనకు సుభాష్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని రెడ్డి సుబ్రహ్మణ్యం వర్గం సుభాష్ కు దూరంగా ఉన్నారట. అలాగే తోట త్రిమూర్తులకు రైట్ హ్యాండ్ కి వ్యవహరించిన రేవు శీను.. ఎన్నికల ముందు వైసీపీ వదిలి టిడిపిలోకి వచ్చారు. ఎన్నికల ముందు సుభాష్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన నేతల్లో రేవు శీను ఒకరు.. ఇప్పుడు ఆయన టార్గెట్ చేసుకొని సుభాష్ వ్యవహరిస్తున్నారంటూ సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలను దూరం పెట్టడంతో.. తోడుగా ఎవరూ రాకపోవడంతో.. అమలాపురం నుంచి వచ్చిన ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ నే.. కార్యకర్తలుగా తన వెంట వేసుకుని తిరుగుతున్నారనే విమర్శలఉ వస్తున్నాయి.

కూటమి నేతలను ఇబ్బంది పెట్టిన పోలీస్ ఆఫీసర్లను..

మరోవైపు కూటమి నేతలను గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టిన పోలీస్ ఆఫీసర్లను.. తన సొంత నియోజకవర్గంలో అపాయింట్ చేసుకోవడం కూడా పెద్ద వివాదానికి దారి తీస్తుందట. ఈ పంచాయతీ సీఎం చంద్రబాబు వరకు కూడా చేరిందని అనుకుంటున్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అనేక ఇబ్బందులు పెట్టిన పోలీసు ఆఫీసర్ ను.. రామచంద్రపురం ఎస్సైగా కావాలని సుభాష్ తీసుకురావడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. ఈ వ్యవహారాలన్నింటితో.. మంత్రి వాసంశెట్టి సుభాష్ ను సొంత పార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేస్తున్నారట.

చంద్రబాబు వార్నింగ్ తో యువనేత సీరియస్ గా మారనున్నారా ?

లక్కీ ఛాన్స్ కొట్టేసిన యంగ్ మినిస్టర్ విమర్శలు అన్నింటికీ చెక్ పెట్టగలుగుతారా ? కూటమి నేతలను అందరినీ సమన్వయం చేసుకొని.. ప్రాధాన్యత ఇస్తూ.. ముందుకు సాగగలుగుతారా ? చంద్రబాబు వార్నింగ్ తో యువనేత సీరియస్ గా మారనున్నారా ? లేక చివరికి సీఎం యాక్షన్ కి గురవుతారా అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.

Related News

Vemireddy Prabhakar Reddy: నన్నే అవమానిస్తారా.. వేమిరెడ్డి టీటీపీకి హ్యాండ్ ఇస్తాడా..?

Alleti Maheshwar Reddy: సీఎం మార్పు.. ఏలేటి మాటల వెనుక ఆ మంత్రి స్కెచ్?

US Presidential Elections 2024: సర్వేల్లో తేలిందేంటి? గెలుపు ఎవర్ని వరించబోతుంది?

Caste Census: దేశవ్యాప్తంగా ఎంత మంది బీసీలు ఉన్నారు.. లెక్కలు నష్టమా? లాభమా?

YS Jagan: ఆ జిల్లాపై జగన్ స్పెషల్ ఫోకస్.. వ్యూహం ఫలిస్తుందా..?

Rushikonda Palace: జగన్‌కు బిగ్ షాక్.. రుషికొండ ప్యాలెస్ వాళ్లకే?

Big Stories

×