EPAPER

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

CM Chandrababu On Rishikonda Building: ఏపీలో ఎన్నికలు పేదోడికి, పెత్తందార్లకు మధ్య యుద్ధమని.. ప్రచారం సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పదేపదే పేర్కొన్నారు. అలాంటాయన తిరిగి అధికారంలోకి వస్తానన్న ధీమాతో విశాఖ రుషికొండపై నివాసానికి నిర్మింపచేసుకున్న ప్యాలెస్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కూటమి ప్రభుత్వానికి ఇప్పుడది వైట్ ఎలిఫెంట్‌లా మారింది. దాని నిర్మాణానికి రుషికొండపై కూలగొట్టిన కాటేజీలు.. అప్పట్లో అసలు ఏం జరిగిందన్న దానిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది. అయితే ఆ ఎంక్వయిరీ టీమ్‌లో ఉన్న అధికారులు ఇంకా వైసీపీ విధేయత ప్రదర్శిస్తుండటంతో.. నిజాలు మరుగున పడిపోతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


విశాఖపట్నంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేసుకోవాలో? ఎలా వినియోగించుకోవాలో? కూటమి సర్కారుకు అంతుపట్టడం లేదు సుమారు 560కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఈ ప్యాలెస్ ఏపీ వాసులనే కాదు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది. వైట్ హౌస్‌ను మరిపించేలా కట్టించిన ఆ ప్యాలెస్ ప్రపంచ సంపన్నులనే ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

రుషికొండ పర్యాటక కేంద్రంగా విశాఖకు తలమానికంగా నిలుస్తుంది. వైసీపీ సర్కారు ఏర్పాడే నాటికే రుషికొండపై పర్యాటకుల సౌకర్యార్ధం పలు కాటేజీలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చాక జగన్ కన్ను రుషికొండపై పడింది. ప్యాలెస్‌లలో ఉండటానికి మాత్రమే ఇష్టపడే మాజీ ముఖ్యమంత్రి తాడేపల్లిలో నివాసానికి కూడా రాజ భవనమే కట్టించుకున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన జగన్.. అక్కడ నుంచి చేసి పాలన సాగించాలని ఫిక్స్ అయ్యారు. మళ్లీ సీఎం అవుతానన్న ధీమాతో రుషికొండపై కాటేజీలను పడగొట్టించి.. సీక్రెట్‌గా ప్యాలెస్ కట్టించేశారు.


ప్రతిపక్షాల్ని, ప్రజల్ని, ఎవ్వరినీ కొండ దరిదాపుల్లోకి కూడా రానీయకుండా.. వైసీపీ నాయకులకే కాంట్రాక్టు ఇచ్చి ఏడు భవన సముదాయాలను పూర్తి చేయించారు. అదేదో నిషేధిత ప్రదేశంలా ఎవ్వరినీ రానియ్యకుండా నిర్మాణాలు చేపట్టారు. పచ్చదనంతో కళకళలాడే రుషికొండను బోడి కొండగా మార్చి విలాసవంతమైన భవనాలు నిర్మించారు. మాయాబజార్‌ సినిమాలోని మయసభను తలపిచేలా పెద్దపెద్ద గదులు, హాల్స్‌, ఫన్నీచర్‌తో నింపేశారు. అనుమతులు లేకపోయినా.. జగన్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. సర్వత్రా విమర్శలు రావడంతో పర్యాటక భవనాలని తొలుత ప్రచారం చేసి తర్వాత పరిపాలన భవనాలని ప్లేట్‌ మార్చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ రాజకోట రహస్యం బయట పడింది.

ఆ మయసభ వైభోగం బయటపడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయారు. అంతటి పాలనా అనుభవం ఉన్న సీబీఎన్నే .. ఆ ప్యాలెస్‌ను ఎలా వినియోగించుకోవాలో అంతుపట్టడం లేదంటున్నారు. దాన్నేం చేయాలో మీరే చెప్పండని ప్రజల్నే కోరుతున్నారు. ఆ క్రమంలో అప్పట్లో కాటేజీల కూల్చివేత, అక్రమ కట్టడాలపై విచారణలకు ఆదేశించారు.

Also Read: వైసీపీకి రాజీనామా.. జనసేనలోకి బాలినేని? ముహూర్తం ఫిక్స్!

గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్ని వ్యవహారాలపై కూటమి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు వాటిపై విచారణలు మొదలయ్యాయి. అయితే పర్యాటకాభివృద్ధి సంస్థలో కొందరు ఉన్నతాధికారులు గత వైసీపీ ప్రభుత్వంపై ఇంకా కృతజ్ఞత చాటుకుంటూనే ఉన్నారంట. అప్పట్లో జరిగిన ఘోర తప్పిదాలు బయటకు రాకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారంటున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన వివిధ అక్రమాలపై అదే ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పని చేసిన అధికారులకే వారు విచారణ బాధ్యత అప్పగించడమే అందుకు నిదర్శనమంటున్నారు.

విశాఖలో పలు పర్యాటక ప్రాజెక్టులను గత ప్రభుత్వం కొందరు ప్రైవేటు వ్యక్తులకు అడ్డగోలుగా కట్టబెట్టిందన్నది ప్రధాన ఆరోపణ.. అంతేకాక రుషికొండపై కాటేజీలు కూల్చేసినపుడు అందులోని రూ.కోట్ల విలువైన మంచాలు, సోఫాలు, ఏసీలు, డైనింగ్‌ టేబుళ్లు వంటివి అప్పటి అధికారులు కొందరు మాయం చేశారన్న ఆరోపణలున్నాయి. వాటిపై స్ట్రిక్ట్ ఆఫీసర్స్‌తో విచారణ చేయించాల్సిన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు ఈ వ్యవహారాలను నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గత ప్రభుత్వంలో పర్యాటకశాఖ మంత్రిగా పనిచేసిన రోజా వద్ద ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీగా పని చేసిన రాజారాం మనోహర్‌కు రుషికొండ కాటేజీల ఫర్నీచర్‌పై విచారణ బాధ్యతలు అప్పగించడం ఆ ఆనుమానాలకు బలం చేకూరుస్తోంది. రాష్ట్ర ఆడిట్‌శాఖలో డిప్యూటీ డైరక్టర్‌గా ఉన్న మనోహర్ఎన్నికలకు ముందువరకూ మంత్రి రోజా వద్ద ఓఎస్‌డీగా విధులు నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు డిప్యుటేషన్‌పై రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు వచ్చారు. అక్కడ కూడా అప్పట్లో కీలకమైన విజిలెన్స్, మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌గా ఆయన్ని నియమించారు.

విశాఖలో ప్రాజెక్టులు, ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించిన పనులకు సంబంధించి మాజీ మంత్రి రోజా దగ్గర ఓఎస్డీగా పనిచేసిన ఆ అధికారితో విచారణ జరిపించాలని ఇటీవల ఉన్నతాధికారులు నిర్ణయించారు.  దాంతో విశాఖలో ఏం జరిగిందన్న వాస్తవాలు వెలుగులోకి తేవాలన్న ఉద్దేశం ఉన్నతాధికారుల్లో ఉన్నట్లు కనిపించడం లేదంటున్నారు. విజిలెన్స్‌ విభాగంలోని మరికొందరు అధికారులు, ఉద్యోగులతో కలిసి ఆ రోజా మాజీ ఓఎస్డీ తాజాగా విశాఖకు వెళ్లి తూతూమంత్రంగా విచారణ జరిపారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రోజా టూరిజం మినిస్టర్‌గా ఉన్నప్పుడే రుషికొండ ప్యాలెస్ నిర్మాణం జరిగింది. మాజీ అయ్యాక రోజాపై కూడా వందల కోట్ల రూపాయల ఆవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఆమెపై కూడా రేపో మాపో విచారణ కమిషన్ వేసే అవకాశముందంటున్నారు. అలాంటి రోజా దగ్గర పనిచేసిన అధికారిని ఇప్పుడు విచారణకు నియమించడంతో హైలెవల్ బ్యూరోక్రాట్లపై లేనిపోని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా విజిలెన్స్, ఈడీ, సీఐడీ వంటి సంస్థలతో విచారణ చేయిస్తే గత ప్రభుత్వంలో జరిగిన బాగోతాలు బయటపడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ప్రభుత్వ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related News

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×