EPAPER

Nominated Posts In Telangana: కాంగ్రెస్‌లో పదవుల కోట్లాట.. రేవంత్ చెక్ పెడతారా?

Nominated Posts In Telangana: కాంగ్రెస్‌లో పదవుల కోట్లాట.. రేవంత్ చెక్ పెడతారా?

Nominated Posts In Telangana: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఇప్పుడు పదవుల ఆరాటం కనిపిస్తోందా? జిల్లాలో ప్రోటోకాల్ వివాదానికి నామినేటెడ్ పోస్టులే పరిష్కారంగా నేతలు భావిస్తున్నారా ? ఏఎంసీ చైర్మన్, డైరెక్టర్ల పదవుల భర్తీలో పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారా ? గ్రూపులతో పాటు ఉమ్మడి జిల్లా మంత్రుల్లోనూ సమన్వయం లోపించిందా? అసలు నామినేటెడ్ పోస్టులపై హస్తం పార్టీలో ఏం జరుగుతోందో.. వాచ్ థిస్ స్టోరీ


తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక జరిగిన తొలి, మలి ఎన్నికల్లో.. రెండు పర్యాయాలు అధికారానికి దూరమైంది కాంగ్రెస్. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రజాపాలనే ధ్యేయంగా సాగుతున్న పార్టీలో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడి పని చేసిన నాయకులు నామినేటెడ్ పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచిన తరుణంలో.. నామినేటెడ్ పదవులను ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నిస్తున్నారట.

ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రుల మధ్య సమన్వయ లోపం పార్టీకి ఇబ్బందిగా మారుతుందన్న విమర్శలు క్యాడర్ లో వినిపిస్తున్నాయి. గ్రూప్ లను ఏకం చేసి పదవుల కేటాయింపునకు కలసికట్టుగా పని చేయాల్సిన మంత్రుల మధ్యే సమన్వయం లోపించిందన్న భావన క్యాడర్ లో నెలకొందట. సిద్దిపేట జిల్లా నుంచి పొన్నం ప్రభాకర్, సంగారెడ్డి జిల్లా నుంచి దామోదర రాజనర్సింహ మంత్రులుగా ఉండగా.. ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో పదవులు ఆశిస్తున్న ఆయా గ్రూపుల నేతలు తమకు సాన్నిహిత్యం ఉన్న మంత్రుల వద్దకు వెళ్లి పైరవీలు చేస్తున్నారట. అయితే ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో.. ఉమ్మడి జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫైనల్ లిస్ట్ సిద్ధం కావడం లేదని చర్చ జరుగుతోంది.


జిల్లా ముఖ్యనేతలను నమ్ముకుని పనిచేసిన సీనియర్లు కూడా.. అటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, ఇటు జిల్లా స్థాయి పదవులను ఆశిస్తూ ఎదురు చూస్తున్నారట. అయితే గతంలో జిల్లాలో ఒకటి రెండు చోట్ల మార్కెట్ కమిటీ నియామకాలకు సంబంధించి కొందరి పేర్లు ఖరారు చేసినప్పుడు ఆయా గ్రూపుల మధ్య విభేదాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. దాంతో ఈ పదవుల కేటాయింపు వ్యవహారం హస్తం నేతల్లో చర్చనీయాంశంగా మారిందని పొలిటికల్ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది.

Also Read: ఈ నెల 8న యాదాద్రికి సీఎం రేవంత్…వీటిపై స‌మీక్ష‌!

మరోవైపు ఉమ్మడి జిల్లాలో ప్రోటోకాల్ వివాదాలు నిత్యకృత్యంగా మారాయట. సిద్దిపేట జిల్లాలో విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవడం, అధికారంలోకి కాంగ్రెస్ రావడంతో ఇరు పార్టీల నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం నడుస్తోంది. ఇటీవల దుబ్బాకలో కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, జనగామ నియోజకవర్గానికి సంబంధించి చేర్యాలలో కొమ్మూరి ప్రతాపరెడ్డి స్టేజ్ మీదకు రావడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓపెన్ గానే ప్రశ్నించారు. దీంతో మంత్రి కొండా సురేఖ సమక్షంలోనే ఇరుపార్టీల మధ్య రచ్చ రచ్చ జరిగింది. ఈ క్రమంలోనే జిల్లాలో ప్రోటోకాల్ వివాదానికి నామినేటెడ్ పోస్టులతో చరమగీతం పాడొచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట.

నామినేట్ పోస్టులు ఇస్తే అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని.. విపక్షాలకు ప్రోటోకాల్ పేరిట గొడవ చేసే అవకాశం ఉండదన్న భావన.. ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ లలో వ్యక్తం అవుతుందట. అయితే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వకూడదని సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో వారి ఆశలు ఎంతవరకు నెరవేరుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

కాంగ్రెస్‌లో గ్రూపుల వ్యవహారాన్ని పార్టీ పెద్దలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కార్యకర్తలు వాపోతున్నారట. ఇప్పటికీ కింది స్థాయి కార్యకర్తలు గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్నామని.. ఎటు వెళ్లాలో తేల్చుకొని పరిస్థితుల్లో ఉన్నామని చెబుతున్నారట. అధిష్టానం దృష్టికి వెళ్లినా కూడా వారు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ముగియగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో గ్రూపు రాజకీయాలతో.. తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే పరిస్థితి నెలకొందని కేడర్ లో ఆందోళన వ్యక్తమవుతుందట. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు పార్టీకి నష్టం కాబోతున్నాయా? నామినేటెడ్ పోస్టులతో గ్రూపులకు చెక్ పెట్టవచ్చా? మంత్రుల మధ్య సమన్వయ లోపం క్యాడర్ కు మైనస్ అవుతుందా? వీటికి అధిష్టానం ఎలా చెక్ పెట్టబోతుందని చర్చ జరుగుతోంది.

Related News

US Presidential Elections 2024: సర్వేల్లో తేలిందేంటి? గెలుపు ఎవర్ని వరించబోతుంది?

Caste Census: దేశవ్యాప్తంగా ఎంత మంది బీసీలు ఉన్నారు.. లెక్కలు నష్టమా? లాభమా?

Chandrababu Naidu: చంద్రబాబు సీరియస్.. ఆ మంత్రి పోస్ట్ ఊస్టేనా..?

YS Jagan: ఆ జిల్లాపై జగన్ స్పెషల్ ఫోకస్.. వ్యూహం ఫలిస్తుందా..?

Rushikonda Palace: జగన్‌కు బిగ్ షాక్.. రుషికొండ ప్యాలెస్ వాళ్లకే?

Kotamreddy Sridhar Reddy: వైసీపీ పై కోటంరెడ్డి స్కెచ్.. అనిల్ కుమార్ యాదవ్ తట్టుకోగలడా?

Big Stories

×