EPAPER

Jani Master Case : వాష్ రూమ్, డ్రెస్ ఛేంజ్.. జానీ కహానీ

Jani Master Case : వాష్ రూమ్, డ్రెస్ ఛేంజ్.. జానీ కహానీ

సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం, ముఖానికి మేకప్ వేసుకుని వెండితెరపై కనిపించి, అందరినీ అలరించి తమ కల నెరవేర్చుకోవాలనుకునే వారెందరో ఉంటారు. అయితే కెమెరా ముందు నటించడం సులువే అయినా.. ముఖానికి మంచి ముసుగులు తొడుక్కున్న వారిని ఒప్పించి మెప్పించడమే ఇండస్ట్రీలో రోజురోజుకూ కష్టమవుతోంది. సగటు ప్రేక్షకులను అలరించడం సులువే అవుతున్నా.. ఆ కెమెరా ముందుకు రావాలంటేనే రకరకాల పరీక్షలు, అందరినీ సాటిస్ ఫై చేస్తే గానీ రాలేని పరిస్థితులు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లోనూ కనిపిస్తున్నాయి. ఈ అవలక్షణం నుంచి ఇండస్ట్రీలు బయటపడడం లేదు. కేసులు, కంప్లైంట్లు, బాధితులు వెలుగు చూస్తున్నా.. కథ మాత్రం మారడం లేదు.

సినిమాల్లో అవకాశం ఇస్తాం.. మరి మాకేంటి అనే వాళ్లే ఎక్కువన్నది ఇండస్ట్రీపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఇందులో లైంగిక పరమైన ఇష్యూసే ఎక్కువగా ఉంటున్నాయి. డైరెక్ట్ ఫలానా కావాలని ఎవరూ అడగరు. అన్నీ మేనేజర్ల ద్వారా, ఇతర సిబ్బంది ద్వారా సిగ్నల్స్ పంపే వాళ్లే ఎక్కువ. ఎస్ చెప్తే ఒకలా ట్రీట్మెంట్, నో చెప్తే మరోలా ట్రీట్మెంట్ ఉంటుంది. నో చెప్పిన వాళ్ల గురించి ఇండస్ట్రీలో బ్యాడ్ గా ప్రచారాలు చేస్తారన్న టాక్ ఉంది. టైమ్ కు రారు, బద్దకం, పొగరు ఎక్కువ, యాక్టింగ్ స్కిల్స్ లేవు ఇలాంటివి స్ప్రెడ్ చేస్తుంటారు. సో అవకాశాలు ఆటోమేటిక్ గా తగ్గేలా ఒక వ్యవస్థ నడుస్తుంటుందన్నది ప్రధాన ఆరోపణ.


నిజానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటివి కొత్త కాదు. కానీ చాలా మందికి జరిగిన భయంకరమైన అనుభవాలను బయటకు చెప్పేందుకు పెద్దగా ఎవరూ ముందుకు రారు. కెరీర్ నాశనమవుతుందన్నది చాలా మంది భయం. కాస్టింగ్ కౌచ్ పెద్ద సమస్యగా మారిపోయింది. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసినా ఏమున్నది గర్వకారణం.. అన్నిట్లోనూ అదే తంతు అన్న చర్చే నడుస్తోంది. లైంగిక వేధింపులకు సంబంధించి కమిటీలు, ఫిర్యాదులు, దర్యాప్తులు ఇవే జరుగుతున్నాయి. మొన్న మాలీవుడ్, నిన్న శాండిల్ వుడ్, ఇప్పుడు టాలీవుడ్. నిజానికి మిగితా ఇండస్ట్రీల కంటే టాలీవుడ్ లోనే ఎక్కువ లైంగికరపరమైన వేధింపులు ఉన్నాయన్న ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి.

Also Read: మాస్టారు గారి లీలలు.. సపోర్ట్ చేసే వాళ్లు… వ్యతిరేకించే వాళ్ళు వీళ్ళే..

నిజానికి మాలీవుడ్ లో హేమ కమిటీ రిపోర్ట్ తో ఫిలిం ఇండస్ట్రీల్లో అరాచకాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ విషయం అంతటా ప్రకంపనలు సృష్టించింది. చాలా మంది తమ అనుభవాలను బయటకు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, కేసు నమోదవడం మరగింత సంచలనంగా మారింది. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీ మాస్టర్ ను ఆదేశిస్తూ ప్రకటన విడుదల చేసింది. 2017లో కొచ్చిలో మలయాళ నటి కిడ్నాప్ కేసు సంచలనం సృష్టించింది. రౌడీలతో ఆమెపై లైంగిక వేధింపులు జరిపినట్లు నటుడు దిలీప్‌పై ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో అతడు అరెస్టు అయ్యాడు. ఈ నేపథ్యంలో మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై స్టడీ చేసేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేసింది. ఇటీవల ఈ కమిటీ మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల పరిస్థితిపై రిపోర్ట్ ఇచ్చింది.

సినీ పరిశ్రమలో యువతుల సమస్యలు, వర్కింగ్‌ కండీషన్లు, రెమ్యూనరేషన్‌ వంటి వాటిపై స్టడీ చేసింది. సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం 235 పేజీల రిపోర్ట్ ను ఇటీవలే కేరళ ప్రభుత్వానికి సమర్పించింది కూడా. ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న వేధింపులను బయటకు చెప్పుకున్నారు. ఈ ఆరోపణలు కూడా కేరళలో సంచనలం సృష్టించాయి. దాంతో కేరళ చిత్రసీమకు చెందిన అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ కు మోహన్‌లాల్‌ సహా ఇతర సభ్యులు రాజీనామా చేశారు కూడా. నటీమణుల ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో కేరళ సీఎం విజయన్ ఏడుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. ఇంత కథ జరిగిందక్కడ.

టాలీవుడ్ లోనూ ఇలాంటి ఆరోపణలు గతంలోనే చాలా తెరపైకి వచ్చాయి. 2018 ఏప్రిల్ 7న సినీ నటి శ్రీరెడ్డి టాలీవుడ్ లో జరుగుతున్న ఘటనలపై సంచలన ఆరోపణలు చేశారు. కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులకు నిరసనగా ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేయడం అప్పట్లో పెను సంచలనమైంది. శ్రీరెడ్డి ఆరోపణలపై స్పందించాలని మహిళా సంఘాలు, స్వచ్చంద సంస్థలు డిమాండ్ చేశాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ అయితే తెలంగాణ సమాచార ప్రసార శాఖకు నోటీసులు కూడా ఇచ్చింది. ఇదే విషయంపై మహిళా హక్కుల కార్యకర్తలు 2018 సెప్టెంబర్ లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరపిన హైకోర్టు.. సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు పని వేళలు, రెమ్యునరేషన్లు వంటి అంశాలపై ఉన్నతస్థాయి కమిటీని వేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అదే ఏడాది అక్టోబర్ లో ఆదేశించింది.

దీంతో 2019 ఏప్రిల్ లో తెలంగాణ ప్రభుత్వం.. 25 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 12 మంది మహిళా సభ్యులు సబ్ కమిటీగా ఏర్పడి.. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీలో పని చేస్తున్న యువతులు, జూనియర్, సీనియర్ ఆర్టిస్టులు, 24 క్రాఫ్ట్స్ లో పని చేసే యువతులను కలిసి వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకుని రిపోర్ట్ రెడీ చేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో మహిళలకు ఇస్తున్న సొమ్ము, వారిపై వేధింపులు, షూటింగ్ సమయాల్లో భద్రత, టైమింగ్స్ వంటి వాటిపై చాలానే స్టడీ చేశారు. కానీ ఈ రిపోర్ట్ ఇంత వరకు బయటకు రాకపోవడమే చాలా అనుమానాలకు దారి తీసింది. ఇండస్ట్రీలో అవలక్షణాలకు చెక్ పెట్టలేకపోయింది.

Also Read: జానీ మాస్టర్ పై పూనమ్ షాకింగ్ పోస్ట్.. మాస్టర్ కి విలువ ఉందంటూ..?

టాలీవుడ్ కమిటీ రిపోర్ట్ బయటకు రాకపోయినా కొన్ని విషయాలు మాత్రం లీకయ్యాయి. తెలుగు సినీ, టెలివిజన్‌ పరిశ్రమల్లోనూ మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్న విషయం బయటపడింది. అభద్రతాభావం, లింగవివక్ష కనిపిస్తోందని, నటీమణులు, గీత రచయితలు, జూనియర్‌ ఆర్టిస్టులు ఇలా అన్ని స్థాయుల్లోనూ పురుషాధిక్యత కనిపిస్తోందని వెల్లడైంది. రాత్రివేళల్లో ఆలస్యమయ్యేలా పనులు చేయిస్తున్నారని, టైం దాటిపోయినా సేఫ్టీ ట్రాన్స్ పోర్ట్ లేకుండా పని చేయించుకుంటున్న విషయాలు బయటికొచ్చాయి. 2022 జూన్‌ 1న ప్రభుత్వానికి ప్రత్యేక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అయితే అప్పటి నుంచి అది కోల్డ్ స్టోరేజ్ క్ పరిమితమైంది. ఇందులో బయటపడ్డ కొన్ని కీలక విషయాలను చూద్దాం. ఫిల్మ్ సెట్లు, ఆడిషన్ ఛాంబర్లు, రికార్డింగ్ స్టూడియోలల్లో యువతులు తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్నట్లు తేలింది. కోఆర్డినేటర్లు, మధ్యవర్తులపై ఆధారపడిన వారిలోనే ఎక్కువ మంది లైంగిక, శ్రమ దోపిడీకి గురవుతున్నారని గుర్తించారు.

టీవీ ఇండస్ట్రీలో మరీ దారుణంగా పరిస్థితులు ఉన్నట్లు గతంలో కమిటీ దృష్టికి వచ్చింది. ఉదయం 4 నుంచి రాత్రి 8 వరకు పని చేస్తున్నా మహిళలకు సరైన వసతులుండటం లేదని, వాష్‌రూమ్స్, ఆహారం, ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించి మహిళా ఆర్టిస్టులు ఇబ్బంది పడాల్సి వస్తోందన్న విషయం బయటికొచ్చింది. కొన్ని చోట్లైతే మహిళలు తమ దుస్తులు కూడా మార్చుకోవడానికి సౌకర్యాలు ఉండడం లేదని కమిటీ దృష్టికి వచ్చింది. గతంలో టాలీవుడ్ లో ఏర్పాటైన కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. సినీ, టీవీ ఇండస్ట్రీల్లో మహిళలకు భద్రత, రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం, స్త్రీశిశు సంక్షేమం, కార్మిక, పోలీసు శాఖలతో పాటు సినిమాటోగ్రఫీ శాఖలు చొరవతీసుకుని పని చేయాలన్నది. మహిళా ఆర్టిస్టులు ఫిర్యాదు చేసేందుకు, వారి కంప్లైంట్స్ పై స్పందించి పరిష్కరించేందుకు పోలీసుశాఖ షీటీమ్‌ల ఆధ్వర్యంలో ఒక హెల్ప్‌లైన్‌ ఉండాలని సూచించారు. సినీ యూనియన్లలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని, వారి సభ్యత్వాలు పెరగాలని సూచించింది. ఇక కీలకమైంది ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వారికి అందరి సమక్షంలో ఆడిషన్లను నిర్వహించాలని, ఆ ఆడిషన్స్‌ను రికార్డు చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. షూటింగ్ స్పాట్స్‌లో టాయ్‌లెట్లు ఉండాలని, దుస్తులు మార్చుకునేందుకు మహిళలకు ప్రత్యేక గదులు కేటాయించాలన్నది.

తెలంగాణ ప్రభుత్వం కూడా టాలీవుడ్ లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన సబ్ కమిటీ రిపోర్టును విడుదల చేయాలని సినీ నటి సమంత ఇటీవలే విజ్ఞప్తి చేశారు. ఆ రిపోర్టు విడుదలైతేనే తెలుగు సినీ పరిశ్రమలో మహిళలకు భద్రత, పని చేసేచోట సురక్షితమైన వాతావరణం సృష్టించేందుకు తగిన పాలసీలు రూపొందించేందుకు వీలవుతుందన్నారామె. మరి తాజాగా జానీ మాస్టర్ ఎపిసోడ్ తో అయినా ఆ రిపోర్ట్ బయటికొస్తుందా.. ఇండస్ట్రీకి వచ్చే యువతులకు సేఫ్టీ దొరుకుతుందా చూడాలి.

Related News

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Jammu Kashmir Elections: కశ్మీర్ ఎన్నికలు.. కమలానికి అగ్నిపరీక్షే..

Big Stories

×