EPAPER

Maharashtra Politics: అన్ని రాష్ట్రాలు పాలిటిక్స్ ఒక్కవైపు.. మహారాష్ట్ర పాలిటిక్స్ మరోవైపు!

Maharashtra Politics: అన్ని రాష్ట్రాలు పాలిటిక్స్ ఒక్కవైపు.. మహారాష్ట్ర పాలిటిక్స్ మరోవైపు!

Maharashtra Politics: అన్ని రాష్ట్రాల పాలిటిక్స్ వేరు.. మరాఠా రాజకీయం రూటే సపరేటు. అక్కడి ఓటరు నాడిని పట్టుకోవడం తలపండిన పొలిటికల్ పండితులకు కూడా అర్థంకాని విషయం. ఎందుకంటే వేర్వేరు ప్రాంతాలు.. వేర్వేరు సమూహాలు.. ప్రభావం చూపించే ఫ్యాక్టర్స్ ఎన్నో ఉంటాయి. అలాగే రాజకీయ పార్టీలు కూడా ఓవరాల్ స్టేట్ అంతా ఎఫెక్ట్ చూపించే పరిస్థితి ఉండదు. అందుకే అక్కడ ఎప్పుడు చూసినా హంగ్ లాంటి రిజల్టే వస్తుంటుంది. ఇప్పుడు కూడా మరాఠా సామ్రాజ్యం మరో మహా సంగ్రామానికి సిద్ధమైంది. ఇప్పుడే కంటికి కనిపించని శత్రుత్వాలు బయటికొస్తున్నాయి. రాజకీయం అంటే ఇదే అన్నట్లు ఆట నడుస్తోంది.


ఆధిపత్యం కోసం ఆరాటం ఒకరిది.
మనుగడ కోసం పోరాటం ఇంకొకరిది
వారసత్వ గుర్తింపు యుద్ధం మరొకరిది.
మహా సంగ్రామానికి మరాఠా గడ్డ సై
తాడో పేడో తేల్చుకునే టైం వచ్చేసింది.
‘మహా’ పోరాటంలో ఎవరిది పైచేయి?
ఫలితాలను డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి?

ముందు దోస్తీ ఒకలా, ఫలితాల తర్వాత ఇంకోలా


దేశ రాజకీయాలు ఒకలా ఉంటే.. మహారాష్ట్ర పొలిటికల్ ట్రాక్ మరోలా ఉంటుందనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ క్లిప్. 1981లో వచ్చిన ఆకలిరాజ్యం సినిమాలో ఇంటర్వ్యూ సీన్ ఇది. హూ ఈజ్ మహారాష్ట్ర సీఎం అని అడగగానే హీరో చెప్పే జవాబు.. ఇప్పటికీ మహారాష్ట్ర రాజకీయ గందరగోళాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంటుంది. గత 40 ఏళ్ల మహారాష్ట్ర రాజకీయం చెబుతున్నది కూడా ఇదే. ఎప్పుడు ఎవరు సీఎంగా ఉంటారో తెలియదు. ఎన్నికలకు ముందు ఒకలా.. ఎన్నికలు ముగిశాక మరోలా పార్టీల ప్రవర్తన ఉంటుందక్కడ. ముందుగా దోస్తీ ఒకలా.. రిజల్ట్ వచ్చాక మరోలా మారిపోతుంది. అదీ మ్యాటర్.

క్యాస్ట్, క్రాప్, క్యాష్ చుట్టూ మరాఠా రాజకీయాలు

ఎప్పుడూ క్యాస్ట్, క్రాప్, క్యాష్ చుట్టూ మరాఠా రాజకీయాలు తిరుగుతుంటాయి. పార్టీలు కూడా ఇదే నడిపిస్తుంటాయి. కానీ రిజల్ట్ మాత్రం అనుకున్నట్లు ఉండదు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు… గత 40 ఏళ్ల రాజకీయం చూస్తే ఏ ఒక్క పార్టీ కూడా సింగిల్ గా మెజార్టీ మార్క్ దాటలేకపోయింది. అంటే పొలిటికల్ పార్టీలకు అన్ని రీజియన్స్ లో పట్టు లేదు. అందుకే గ్యాప్ కనిపిస్తుంటుంది. మహారాష్ట్రలో మేమే కింగ్ అనుకోవడానికి లేదు. అందరినీ కలిపి జాయింట్ గా డిసైడ్ చేస్తుంటారు జనం. ఎప్పుడూ హంగ్ వంటి పరిస్థితులే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ఎలాగో… మహారాష్ట్రలోనూ విదర్భ, మరఠ్వాడ, వెస్ట్రన్ మహారాష్ట్ర, థానే-కొంకణ్ రీజియన్, ముంబై, నార్త్ మహారాష్ట్ర ఇలా ఆరు ప్రాంతాలుగా ఉంటుంది. ఒక్కో దగ్గర ఒక్కో లెక్క ఉంటుంది. ఒక్కో దగ్గర ఓటరు మైండ్ సెట్ ఒక్కోలా ఉంటుంది. అంతే కాదు ఒక్కో దగ్గర ఒక్కో పార్టీ హవా ఉంటుంది.

LS ఎన్నికల్లో 48 సీట్లలో 17కే పరిమితమైన మహాయుతి

ఐదు నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమి అంటే ఏక్ నాథ్ షిండే, బీజేపీ కూటమి 48 సీట్లకు గానూ కేవలం 17 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే సీన్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందని విపక్షాలు ఆశగా చూస్తున్నాయి. అయితే హరియాణాలో కనిపించిన ఎఫెక్ట్ కూడా వెంటాడుతోంది. అయితే ఆ ప్రభావం మహారాష్ట్రపై ఉండదన్న ధీమాలో మహా వికాస్ అఘాడీ కూటమి ఉంది. నవంబర్ 20న పోలింగ్, 23న ఫలితాలు. సమయం లేదు మిత్రమా.. విజయమో వీర స్వర్గమో అంటున్నాయి పార్టీలు. గత అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికి చాలా మారిపోయింది. శివసేన, ఎన్సీపీలు విడిపోయాయి. ఏవి నిజమైనవో తేల్చేందుకు జనం రెడీ అవుతున్నారు. అటు గత ఎన్నికల్లో నాలుగో స్థానంలో నిలిచిన కాంగ్రెస్.. ఈసారి కథ మార్చాలనుకుంటోంది. లోక్ సభ ఎన్నికల్లో గ్రాఫ్ తగ్గిపోయిన బీజేపీకి గెలుపు కీలకంగా మారింది. సో ఎక్కడి లెక్కలు అక్కడ పక్కాగా ఉన్నాయి.

Also Read:  సద్గురుకి సుప్రీం బిగ్ రిలీఫ్‌, మద్రాసు హైకోర్టులో ఇషా ఫౌండేషన్‌పై కేసు కొట్టివేత

ఓటర్లపై వరాల జల్లు కురిపించేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే అవి ఫలిస్తాయా లేదా అన్నది వేరే సంగతి. ముందు ఫ్రీ ఆఫర్ ఇచ్చెయ్, ఓటు పట్టెయ్ అన్నట్లుగా కథ నడుస్తోందక్కడ. మహారాష్ట్ర ఎదుర్కొంటున్న సమస్యల ముందు ఉచిత హామీలు ఎంత వరకు పని చేస్తాయన్నది పెద్ద ప్రశ్నే. రైతుల కష్టాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, పడిపోయిన సోయాబీన్ రేటు, ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం.. ఇవన్నీ విదర్భ, మరాఠ్వాడా అలాగే నాసిక్‌లలో మహాయుతి కూటమికి లోక్ సభ ఎన్నికల్లో నష్టం చేశాయి. దీంతో ఇప్పుడు కేంద్రం నష్ట నివారణ చర్యలు చేపడుతోంది.

కులాల కోటాలు మార్చడం చుట్టూ మహారాష్ట్ర రాజకీయం

వ్యవసాయంతో పాటే కులాలు, రిజర్వేషన్ లెక్కలు కూడా మహారాష్ట్రలో చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ముట్టుకుంటే మాడిపోయేలా సీన్ ఉంటుంది. ఈ లెక్కలు సరి చేసుకుంటూ సామాజిక సమీకరణాలను పట్టుకోవడం పెద్ద సవాలే. మరాఠా కోటా చుట్టూ అశాంతి ఇంకా రగులుగుతూనే ఉంది. బీజేపీ సంప్రదాయ ఓటరు వర్గం ఓబీసీల ఓట్ షేర్ ఇటీవల తగ్గింది. కులాల కోటాలు మార్చడం చుట్టూ మహారాష్ట్ర రాజకీయం తిరుగుతోంది. ఒక కులాన్ని మరో కోటాలో చేరిస్తే ఆ కోటాలో ఉన్న వారికి కోపం. సో అడకత్తెరలో పోక చెక్కలా సీన్ తయారైంది. లోక్ సభ ఎన్నికల్లో మహాయుతికి వ్యతిరేకంగా మారిన వారిలో ముస్లింలు, దళితులు కూడా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే సీన్ నడుస్తుందా అన్నది చూడాలి.

శివసేన అసలైన వారసత్వం కోసం యుద్ధం

అటు శివసేనలో విబేధాలు, రెండు వర్గాలుగా విడిపోయాక జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికారం నిలబెట్టుకోవడం బీజేపీకి ప్రెస్టిజియస్ గా మారింది. అజిత్ పవార్ ఎన్సీపీతో పొత్తులు ఎలా ఉంటాయోనన్న టెన్షన్ ఉంది. ఒకప్పుడు మహా బీజేపీ కింగ్ గా ఉన్న ఫడ్నవిస్, మళ్లీ పుంజుకోవాలనుకుంటున్నారు. అసలు శివసేన అధినేత ఎవరో నిరూపించుకునేందుకు ఏకనాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే యుద్ధం చేసుకుంటున్నారు. అసలు ఎన్సీపీ ఎవరిదన్న విషయంలో శరద్‌పవార్‌, అజిత్‌ పవార్‌ల మధ్య పోరుకు ఈ ఎన్నికల ఫలితాలు క్లారిటీ ఇవ్వబోతున్నాయి. అంటే ఏ పార్టీ ఎవరిదో తేల్చే ఎన్నిక ఇది. వారసత్వ గుర్తింపు లెక్కలు తేలిపోనున్నాయి. ఇప్పటికైతే తిరుగుబాటు చేసిన వారే పార్టీ పేరు అలాగే సింబల్ ను చేజిక్కించుకున్నారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో మాత్రం జనం అసలైన సింబల్ దక్కని వారినే ఆదరించారు. మరి అసెంబ్లీ ఎన్నికల్లో మూడ్ మారుతోందా? అదే కంటిన్యూ అవుతుందా?? బిగ్ క్వశ్చన్ ఇది.

మహారాష్ట్రలో బాగా పుంజుకున్న కాంగ్రెస్

మహారాష్ట్రలో మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో జాక్ పాట్ కొట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే. గతంలో ఒక్క సీటు నుంచి 13కు బలం పెంచుకుంది. సో పొలిటికల్ గ్రౌండ్ క్లియర్ గా ఉంది. కీలకమైన ఇష్యూస్ ఫలితాలపై ఇంపాక్ట్ చూపబోతున్నాయి. హామీల వరద పారించేందుకు అటు మహాయుతి, ఇటు మహావికాస్ అఘాడీ కూటములు రెడీ అయ్యాయి. ప్రస్తుతం సీట్ల పంపకాలు, లెక్కల్లో బిజీగా ఉన్నాయి. ఎవరు గెలిచినా జీరో అయిన మహారాష్ట్ర ఖజానా నుంచి సవాళ్లు తప్పవు. అప్పు 8 లక్షల కోట్లుగా ఉంది. ఇచ్చే హామీలకు, తీసుకొచ్చే పథకాలకు లెక్కలు సరిచూసుకోవాల్సిన సమయమిదే.

 

Related News

YS Jagan: విజయసాయిరెడ్డికి జగన్ కీలక పదవి.. తట్టుకోలేకపోతున్న ఆ నేత..

Israel–Hamas war: ఇజ్రాయెల్ చేతిలో హమాస్ లీడర్లు.. వీళ్లందర్నీ ఎలా హతమార్చింది?

Train Laws: రైల్లో ముద్దు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇవేం రూల్స్ అండి బాబు.. చంపేస్తారా?

IRCTC New Ticket Rules: రైల్వే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకు ఎందుకు తగ్గించారు? అసలు కారణం ఇదేనా?

YCP – Janasena: లిక్కర్ కలిపిన బంధం.. కలిసిపోయిన జనసేన, వైసీపీ

Dubbaka Politics: దుబ్బాక రాజకీయం.. వణుకుతున్న ఖాకీలు

Big Stories

×