EPAPER

Lawrence Bishnoi: జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ తన గ్యాంగ్‌‌ను ఎలా ఆపరేట్ చేస్తున్నాడు? సినిమా కంటే కిక్ ఎక్కించే స్కెచ్!

Lawrence Bishnoi: జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ తన గ్యాంగ్‌‌ను ఎలా ఆపరేట్ చేస్తున్నాడు? సినిమా కంటే కిక్ ఎక్కించే స్కెచ్!

Gangster Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్.. గత కొద్ది రోజులుగా ఈ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగుతున్నది. కెనడా ప్రధాని వ్యాఖ్యలతో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. వయసు మూడు పదులే అయినా, కొమ్ములు తిరిగిన గ్యాంగ్ స్టర్లకు సైతం వణుకు పుట్టిస్తున్నాడు. ఖలిస్తానీ వేర్పాటు వాది హర్దీప్ సింగ్ నిజ్జర్, ఎన్సీపీ నేత సిద్ధిఖీ, కాంగ్రెస్ నాయకుడు సిద్దు మూసేవాలా.. బిష్ణోయ్ ప్లాన్ చేశాడంటే టార్గెట్ ఫినీస్ కావాల్సిందే! తాము దైవంగా భావించే కృష్ణ జింకలను చంపిన సల్మాన్ కు చావు తప్పదని ఎప్పుడో హెచ్చరించాడు. రీసెంట్ గా ముంబైలోని సల్మాన్ నివాసం కాల్పులు జరిపించి బాలీవుడ్ స్టార్ కు వణుకు పుట్టించాడు. సల్మాన్ హత్య ఏకంగా 60 మంది షూటర్లను బిష్ణోయ్ రంగంలోకి దించాడనే విషయం పోలీసులకు తెలియడంతో అవాక్కయ్యారు. తాజాగా సల్మాన్ కు మరోసారి బెదిరింపులు రావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు


కెనడాలోనూ బిష్ణోయ్ బ్యాచ్ నెట్ వర్క్

రీసెంట్ గా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లారెన్స్ బిష్ణోయ్ పేరును ప్రస్తావించాడు. భారత ఏజెంట్లతో కలిసి తమ దేశంలోని ఖలిస్తానీ వేర్పాటువాదులను చంపేస్తున్నాడని ఆరోపించాడు. తమ దేశంలో ఉగ్రవాదాన్ని భారత్ పెంచి పోషిస్తుందని సంచలన ఆరోపణలు చేశాడు. నిజ్జర్ హత్య కేసు నిందితుల లిస్టులో భారత హైకమిషర్ పేరును చేర్చడంతో పాటు ఆరుగురు భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించడం, ఈ ఆరోపణలను ఖండిస్తూ భారత్, ఢిల్లీలోనే కెనడా దైత్యవేత్తలను దేశ విడిచి వెళ్లిపోవాలని చెప్పడంతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ ఎవరు? అనే చర్చ మొదలయ్యింది.


జైలు నుంచే లారెన్స్ బిష్ణోయ్ ఆపరేషన్స్

గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉన్నా బయట ఉన్నట్లే భావిస్తాడని పోలీసులు అధికారులే చెప్తున్నారు. జైలు అధికారులు ఆయనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందిస్తారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. బిష్ణోయ్ 2015 నుంచి జైలు జీవితాన్ని గడుపుతున్నాడు. ప్రస్తుతం గుజరాత్ లోని జైల్లో  ఉన్నాడు. గత ఏడాది పంజాబ్ జైల్లో ఉన్న సమయంలో లోపలి నుంచే ఓ వార్తా ఛానెల్ కు ఫోన్ ద్వారా రెండు ఇంటర్వ్యూలు ఇవ్వడం సంచలనం కలిగించింది. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పంజాబ్ హైకోర్టు విచారణకు ఆదేశించింది. హై-సెక్యూరిటీ ఖైదీ జైలు నుండి ఫోన్ ఇంటర్వ్యూలను ఎలా ఇచ్చాడనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. బ్యారక్ లోకి అక్రమంగా వచ్చే సెల్ ఫోన్ల ద్వారా లారెన్స్‌ బిష్ణోయ్‌ తన అనుచరులతోని నిత్యం టచ్ లో ఉంటాడు. ఎవరిని హత్య చేయాలనేది ఆయన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీతో పాటు నిజ్జర్ హత్యలకు కూడా ఆయన జైల్లో ఉండే ఫ్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

700 మందితో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లో 700 మందికి పైగా సభ్యులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీతో పాటు కెనడాలోనూ వీరి ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. వారందరినీ లారెన్స్ జైలు నుంచే నియంత్రిస్తున్నారు. లారెన్స్ తమ్ముడు అన్మోల్, ఆయన పార్ట్ నర్ గోల్డీ బ్రార్  కెనడాలో ఉంటూ ఈ గ్యాంగ్ ఫ్లాన్స్ ను ఎగ్జిక్యుట్ చేస్తారు. బిష్ణోయ్‌ మీద 30కి పైగా కేసులు ఉన్నాయి, ప్రస్తుతం 19 కేసులు కోర్టులో విచారణలో ఉన్నాయి. వీటిలో మాదక ద్రవ్యాల రవాణా, ఆయుధాల స్మగ్లింగ్, హత్యలు, దోపిడీ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.  బిష్ణోయ్ ఒక ప్రాంతానికి పరిమితమైన ఇతర గ్యాంగ్‌ స్టర్లలా కాకుండా విస్తృతంగా ఆలోచిస్తాడని పోలీసులు చెప్తున్నారు.

ఎవరీ లారెన్స్ బిష్ణోయ్

లారెన్స్ బిష్ణోయ్ పంజాబ్‌ లోని ఫిరోజ్‌ పూర్‌ జిల్లా ధత్తరన్‌వాలీలో ఫిబ్రవరి 12, 1993లో జన్మించాడు. అసలు పేరు బాల్కరన్ బ్రార్. స్కూల్ డేస్ లో తన పేరు మార్చుకున్నాడు. సంపన్న కుటుంబం. తండ్రి హర్యానా పోలీసు శాఖలో పని చేశారు. వాళ్లకు 100 ఎకరాలకు పైగా భూమి ఉండేది. లారెన్స్ చిన్నప్పటి నుంచి లగ్జరీ జీవితాన్ని గడిపాడు. అతడు కాలేజీ డేస్ లో ఉండగానే విద్యార్థి రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు.

అప్పుడు తన ప్రియురాలిని అపోజిట్ గ్యాంగ్ సజీవ దహనం చేసింది. తన ప్రియురాలిని హత్య చేసేవారిపై ప్రతికారం తీర్చుకునే క్రమంలో నేరాలు మొదలు పెట్టాడు. అప్పుడే గోల్డీ బ్రార్ పరిచయం అయ్యాడు. ఇద్దరు కలిసి గ్యాంగ్ ను మొదలు పెట్టారు. 2018లో సల్మాన్ ఖాన్ హత్యకు ప్లాన్ చేయడంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతున్నది. కోర్టుకు హాజరైన ప్రతిసారి ఆయన స్వాతంత్ర్య పోరాటయోధుడు భగత్ సింగ్ బొమ్మ ఉన్న టీ షర్టులు ధరించడం విశేషం. ప్రస్తుతం ఆయన  జైల్లో ఉన్నా అతడి కోసం కుటుంబ సభ్యులు ఏడాదికి రూ. 40 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు.

Read Also:  క్లెమోర్ మైన్ పేలినా, బుల్లెట్ల వర్షం కురిసినా.. సల్మాన్ లేటెస్ట్ కారు ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిదే!

Related News

Wedding Problems: పెరిగిపోతున్న పెళ్లికాని ప్రసాదులు.. ఆ ‘కండిషన్స్’ అప్లై, అమ్మాయిల డిమాండ్లు ఏంటి సామి ఇలా ఉన్నాయ్?

YS Jagan vs Kottu Satyanarayana: కొట్టు సత్యనారాయణకి.. జగన్ బిగ్ షాక్?

Politics on Musi: మూసీ రాజకీయం.. బీఆర్ఎస్, బీజేపీ ప్లాన్ ఇదేనా?

TDP Leaders: అనంతపురం టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్.. కారణం ఏం

BRS Leaders In Congress: కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..?

Niagara Falls of India: చిత్ర కూట్‌లో చూడాల్సిన ప్రదేశాలు.. ఎలా వెళ్లాలో తెలుసా?

Big Stories

×