EPAPER

IPS officers Transfer in AP: సీబీఎన్ మార్క్ పాలిటిక్స్.. ఏపీలో ఎస్పీల బదిలీలు…!

IPS officers Transfer in AP: సీబీఎన్  మార్క్ పాలిటిక్స్.. ఏపీలో ఎస్పీల బదిలీలు…!

AP Government Transfers IPS Officers in Andhra Pradesh: ఎస్పీ బదిలీలలో చంద్రబాబు తనమార్క్ రాజకీయాన్ని చూపించారు. కులసమీకరణలు పట్టించుకోకుండా తనదైన శైలిలో సమర్థులు అనుకున్న వారికే పట్టం కట్టారు. గత ప్రభుత్వంలో ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయగా చంద్రబాబు మాత్రం అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ సీమలో నిజాయితీ గల అధికారులకు పోస్టింగ్ ఇచ్చారు. గతం ప్రభుత్వంలో సీమలో పనిచేసి రూల్స్ అతిక్రమించకుండా నిబద్ధతతో పనిచేసిన అధికారులకు కీలక పోస్టింగ్స్ ఇచ్చి అందరితో రియల్ ఎడ్మినిస్ట్రేటర్ అనిపించుకుంటున్నారు.


ఎస్‌పీల బదిలీలు ఏకపక్షంగా ఉంటాయన్న వారికి పోస్టింగ్స్‌తో తగిన సమాధానం ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు సమర్థత, నిజాయితీకి పట్టం కట్టారు. అదే సమయంలో గత ఐదు సంవత్సరాలుగా వివక్షకు గురి అయిన వారికి కూడా న్యాయం చేసారు. అంతిమ లక్ష్యం శాంతి భద్రతల పరిరక్షణ అని చెప్పకనే చెప్పారు. గత ఐదు సంవత్సరాలగా టీడీపీ క్యాడర్ అనేక కష్టాలను ఎదుర్కుంది. దాడులతో పాటు రకరకాల కేసులలో ఇరుక్కుని నెలల తరబడి, సంవత్సరాల తరబడి కుటుంబాలకు, స్వగ్రామాలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చిన్న గొడవలు తప్ప పెద్దగా ఎక్కడా గొడవలు జరగలేదు. ప్రతీకార దాడులు సైతం పెద్దగా జరగలేదు. అధికారంలో వస్తున్నామని తెలినప్పుడు చంద్రబాబు తన పార్టీ శ్రేణులను ప్రతిదాడులు చేయవద్దని నచ్చచెప్పడంలో సక్సెస్ అయ్యారు.

ఆ క్రమంలో నెలరోజుల పాటు ఎస్పీల బదిలీలు జరగకపోవడంతో చాలాచోట్ల చంద్రబాబు మారలేదు. పాత చంద్రబాబే అనుకున్నారు. అయితే ఒక్క సారిగా అన్ని జిల్లాల ఎస్పీలను మారుస్తూ అయన తీసుకున్న నిర్ణయంతో అయనలోని అడ్మినిస్ట్రేటర్ మరోసారి ఫోకస్ అయ్యారు. ముఖ్యంగా సీమ జిల్లాలకు సంబంధించి తిరుపతి లాంటి కీలక స్థానంలో తెలంగాణ నుంచి వచ్చిన సుబ్బరాయుడికి అవకాశం కల్పించారు. చంద్రబాబుకు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా సుబ్బరాయుడు 2014నుంచి 19 వరకు పనిచేసారు.


Also Read: First Official Trip of Pawan: పవన్ తొలి అధికారిక పర్యటన, ఈనెల 19న ఢిల్లీకి

తర్వాత సుబ్బరాయుడు తెలంగాణకు వెళ్ళారు. సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన సుబ్బరాయుడుకి సమర్థవంతమైన నిజాయితీ కలిగిన అధికారిగా పేరు ఉంది. దీంతో పాటు ఎప్పుడు వివాదాల జోలికి పోలేదు. నిరంతరం స్వంత గ్రామానికి ఎదో చేయాలనే తపన ఉన్న సుబ్బరాయుడు గతంలో చంద్రబాబు వద్ద పనిచేసినప్పడు తన గ్రామానికి హాంద్రీనీవా నీరు తెచ్చి నీటి సమస్య తీర్చారు. సొంత ఊరిని మర్చిపోని సుబ్బరాయుడిపై చంద్రబాబు విశ్వాసం ఉంచారు. ఆయనకు అదనంగా రెడ్ శ్యాండిల్ టాస్క్‌పోర్స్ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు చిత్తూరు జిల్లా ఎస్పీగా ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన వివిఎన్ మణికంఠచందోలుకు పోస్టింగ్ ఇచ్చారు.

తిరుపతికి ఎన్నికల సమయంలో బదిలీపై వచ్చిన హార్షవర్ధన్ రాజును పక్కన ఉన్న కడప జిల్లాకు బదిలీ చేసారు. అన్నమయ్య జిల్లా మొదటి ఎస్పీగా పనిచేసిన సమయంలో పెద్దిరెడ్డి చెప్పిన మాట వినలేదని అయన్ని బదిలీ చేసారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డికి అనుకూలంగా పనిచేయడం లేదని అయనపై వేటు పడింది. తిరుపతి ఎన్నికలు పూర్తయిన తర్వాత బదీలీపై వచ్చిన అయన నెలరోజుల్లో సమర్థంగా పనిచేశారన్న పేరుంది. కడప జిల్లాలో కూడా ఆయన ఎఫిషియంట్‌గా పనిచేస్తారన్న నమ్మకంతో అయనకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: కేబినెట్ భేటీ, ఆ తర్వాత ఢిల్లీకి చంద్రబాబు.. ఎందుకంటే..

అన్నమయ్య జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడుని నియమించారు. యంగ్ అఫీసర్ కావడంతో పాటు అయన ప్రాంతంలో ఎర్ర చందనం అక్రమ దందా కూడా ఎక్కువుగా ఉంది. అందువల్లనే కీలక పోస్టు అయనకు కేటాయించారు. చంద్రబాబు మీద అంగల్లలో రాల్ల దాడి జరిగిన సమయంలో అక్కడ గంగాధర్ అనే ఎస్పీ ఉన్నారు. అప్పట్లో అయన చంద్రబాబుతో పాటు టిడిపి నాయకులపై కేసులు పెట్టడాన్ని గంగాధర్ వ్యతిరేకించడంతో అయనను వెంటనే బదిలీ చేసారు. గంగాధర్ ‌కు ప్రస్తుతం కృష్ణా ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు.

అనంతపురం జిల్లా ఎస్పీగా మురళీ కృష్ణకు పోస్టింగ్ ఇచ్చారు. గతంలో తిరుమల , తిరుపతిలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉపయోగ పడనుంది. దీంతో పాటు ఎక్కడా వివాదాస్పదంగా వ్యహారించక పోవడం కూడా కలసి వచ్చింది. అనకాపల్లి ఎస్పీగా ఎన్నికల సమయంలో అయన పనితీరు అయనకు కలసి వచ్చింది. అంతకు ముందు అనంతలో పనిచేసిన గౌతమిశాలి ఎన్టీఆర్ జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు.

సత్యసాయి జిల్లా ఎస్పీగా పనిచేసిన మాధవరెడ్డి ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా పనిచేశారన్న పేరుంది. ముఖ్యంగా హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాలలాంటి సమస్యాత్మక ప్రాంతాలలో ఎలాంటి గొడవలు లేకుండా చూశారు. గ్రామాలలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. దాంతో ఆయన్ని నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు కూడా ఆయన్ని ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారుఆయన స్థానంలో సత్యసాయి జిల్లా ఎస్పీగా మహిళా ఐఏఎస్ అధికారి వి.రత్నకు అవకాశం కల్పించారు.

Also Read: కోడికత్తి కేసు.. శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ

సమస్యాత్మక కర్నూలు జిల్లా ఎప్పీగా యువ ఐపిఎస్ అధికారి బిందుమాధవ్ కు అవకాశం కల్పించారు. పల్నాడు ఎస్పీగా ఎన్నికల సమయంలో ఆయనకు కిందిస్థాయి అధికారులు సహకరించక పోవడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. దాంతో అయన మీద ఎన్నికల కమిషన్ వేటు వేసింది. తర్వాత జరిగిన పరిణామాలను విచారించిన ఎన్నికల కమిషన్ రివిజన్ ఇచ్చింది. అప్పటి నుంచి వెయిటింగ్ లో ఉన్న ఆయనకు కర్నూలు ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. గతంలో అక్కడ ఉన్న కృష్ణకాంత్ ను నెల్లూరు కు బదిలీ చేసారు.

మరో వైపు నంద్యాల ఎస్పీ రఘురామిరెడ్డి మొదటి నుంచి వివాదాస్పదంగా వ్యవహరించారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ సమయంలో టీడీపీ శ్రేణులపై దాడి చేయించారన్న విమర్శలున్నాయి. దీంతో పాటు పీఎం మొదటి ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అల్లూ అర్జున్ నంద్యాల పర్యటన సమయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం లాంటి చర్యలతో ఆయనపై విపరీతమైన నెగిటివ్ వచ్చింది. ఆయన్నిప్పుడు డిజిపి వద్ద రిపోర్టు చేయమని అదేశించారు. మరో వైపు నంద్యాలలో అదిరాజాసింగ్ కు అవకాశం కల్పించారు.

మరో వైపు టీటీడీలో సీవీఎస్ఓగా పనిచేసిన నరసింహా కిషోర్‌కు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా నియమించారు. అప్పటి టీటీడీ జేఈఓ దర్మారెడ్డికి నమ్మిన బంటుగా పనిచేసిన నరసింహా కిషోర్‌కు అలాంటి పోస్టింగ్ ఇవ్వడం వెనుక బలమైన కారణం ఉంటుందని అంటున్నారు. అయితే తిరుమలలో నరసింహా వైఖరిని చూసిన వారిలో మాత్రం అది చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద సీమలో ఎస్పీల బదిలీల్లో చంద్రబాబు మార్క్ కనిపించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×