EPAPER

Microsoft Server Issue: మైక్రోసాఫ్ట్ ను ఆపేసిన బగ్.. ఈ బగ్ కథేంటి?

Microsoft Server Issue: మైక్రోసాఫ్ట్ ను ఆపేసిన బగ్.. ఈ బగ్ కథేంటి?

ఫింగర్ టిప్స్‌తోనే అన్ని పనులను చక్కపెట్టేస్తున్నారు. టెక్నాలజీ అనేది లేకపోతే మనం నథింగ్ అనే సిట్యూవేషన్‌ మనది. ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేస్తోంది మైక్రోసాఫ్ట్‌ టెక్నికల్ ఇష్యూ. మైక్రోసాఫ్ట్‌ ఓఎస్‌లకు సైబర్ సెక్యూరిటీ కల్పించే క్రౌడ్ స్ట్రైక్‌లో ఓ అప్‌డేట్ వచ్చింది. 24*7 ఇంటర్నెట్‌తో లింక్ అయ్యి ఉండే అన్ని సిస్టమ్స్‌ ఆటోమెటిక్‌గా అప్‌డేట్ అయ్యాయి. అంతే .. ఒక్కసారిగా సిస్టమ్ క్రాష్‌ అయ్యింది. మైక్రోసాఫ్ట్‌ ఓఎస్‌ ఉపయోగించే అన్ని సిస్టమ్స్‌లో బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్ ఎర్రర్.. వచ్చేసింది. సింపుల్‌గా చెప్పాలంటే మీ సిస్టమ్‌ ఆటోమెటిక్‌గా ఆగిపోయి.. బ్లూ స్క్రీన్‌పై కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ విషయమేమిటంటే వరల్డ్‌వైడ్‌గా మొత్తం మైక్రోసాఫ్ట్‌పైనే డిపెండ్ అయ్యి ఉంటుంది.
ఇంకేముంది ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆగిపోయింది.

ఇండియా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, యూకేతో పాటు.. అనేక యూరోపియన్ దేశాల్లో ఈ సమస్య మొదలైంది. ఆల్‌ ఆఫ్‌ సడెన్ సిస్టమ్స్‌ రీస్టార్ట్ అవ్వడం స్టార్టయ్యింది. బ్లూ స్క్రీన్ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్ కనిపించింది. మొదట తమకు మాత్రమే ఈ ప్రాబ్లమ్‌ మొదలైందని అనుకున్నారు తర్వాతర్వాత అనేక ప్రాంతాలు.. ఆ తర్వాత దేశాల్లో కూడా ఇదే సమస్యను ఫేస్ చేయడం మొదలైంది. యూకేలో స్కైన్యూస్ సేవలు ఆగిపోయాయి.. ట్రైన్స్‌ సేవలకు కూడా ఇబ్బందులు తప్పలేదు.. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో కూడా సేవలు ఆగిపోయాయి.


ఆస్ట్రేలియాలో వార్తా ప్రసారాలు నిలిచిపోయాయి. ఎయిర్‌పోర్ట్స్‌లో కూడా విమానాలు ఆగిపోయాయి. యూఎస్‌, యూరప్‌లో కూడా అనేక సర్వీసులు నిలిచిపోయాయి. ఎయిర్‌పోర్ట్స్‌, హాస్పిటల్స్, బ్యాంక్స్‌, పోలీస్, ఎమర్జెన్సీ సర్వీసులు.. ఇలా అన్ని సర్వీసులు దెబ్బతిన్నాయి. మన ఇండియాలో కూడా విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. టోటల్‌గా వరల్డ్‌వైడ్‌గా ఎక్కువగా ఎఫెక్ట్‌ అయ్యింది మాత్రం విమానయాన రంగమనే చెప్పాలి. వందలాది ఫ్లైట్స్ క్యాన్సిల్‌ అయ్యాయి.. వేలాది ఫ్లైట్స్‌ రీస్కెడ్యూల్ అయ్యాయి. దీంతో ప్రయాణీకులు ఎయిర్‌పోర్ట్స్‌లో పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా గవర్నమెంట్‌ అయితే ఏకంగా ఎమర్జెన్సీ మీటింగ్‌కు పిలుపునిచ్చింది. ఇదీ, అదీ అని కాదు అన్ని రంగాలపై ఈ ఎఫెక్ట్ క్లియర్‌ కట్‌గా కనిపించింది. ఐటీ ఆఫీసుల్లో కూడా సేవలు నిలిచిపోయాయి.

Also Read: ‘వెబ్ సైట్ క్రాష్, లాగిన్ ప్రాబ్లమ్.. నాలుగు సెంటర్ల ఆపషన్లు’.. మండిపడుతున్న విద్యార్థులు

ప్రపంచం మొత్తం ఇలా కిందా మీదా కావడానికి కారణం క్రౌడ్ స్ట్రైక్.. ఇది అమెరికా బేస్డ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ. అడ్వాన్స్‌డ్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్‌లను అందించే ప్లాట్‌ఫామ్.. ఇది రిస్క్ ఏరియా, ఎండ్ పాయింట్స్, క్రౌడ్‌ వర్క్‌లోడ్, ఐడెంటిటీ, డేటాను సెక్యూర్ చేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే నేక్ట్స్‌ జనరేషన్‌ యాంటీ వైరస్‌లలో టాప్‌ ప్లేస్‌లో ఉంది. పెద్ద పెద్ద కంపెనీల డేటాను సేఫ్‌గార్డ్‌ చేయడం. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అలర్ట్ చేయడం. సైబర్ అటాక్స్‌ను ఆపడం క్రౌడ్ స్ట్రైక్‌ పని.. అందుకే ఈ సాఫ్ట్‌వేర్ క్లైంట్ల లిస్ట్‌లో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్స్, యూనివర్సిటీస్, ఎయిర్‌లైన్స్, టీవీ చానల్స్‌ ఇలా చాలా ఉంటాయి. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ కూడా వీరి లిస్ట్‌లో ఉంది. మైక్రోసాఫ్ట్‌కు విండోస్ పీసీలకు లెటెస్ట్‌ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను కూడా ఇదే కంపెనీ అందిస్తోంది. అదే ఇప్పుడు పెద్ద చిక్కుగా మారింది. రీసెంట్‌గా జరిగిన అప్‌డేట్‌లో ఓ బగ్ ఉంది. అదే ఇప్పుడు కొంపముంచింది.. ప్రపంచం ఆగిపోవడానికి కారణమైంది.

మైక్రోసాఫ్ట్ 360, మైక్రోసాఫ్ట్ విండోస్, మైక్రోసాఫట్ టీమ్స్‌.. అత్యంత ముఖ్యమంగా మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్ బేస్‌డ్ సర్వీసెస్‌.. ఇలా అన్నింటిలో సమస్యలు మొదలయ్యాయి. మొత్తానికి ఈ సమస్యను అటు క్రౌడ్ స్ట్రైక్, మైక్రోసాఫ్ట్‌ సక్సెస్‌ఫుల్‌గా సాల్వ్ అవుతుంది అందులో డౌట్ లేదు. బగ్‌ లేకుండా కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తారు. దీంతో ఇష్యూ సాల్వ్ అవుతుంది. మళ్లీ విమానాలు ఎగురుతాయి.. రైళ్లు పరుగులు పెడతాయి. అంతా నార్మల్‌ సిట్యూవేషన్‌కు వస్తుంది. మళ్లీ ప్రపంచం పరుగులు పెడుతుంది. కానీ ఒక విషయం మాత్రం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనం టెక్నాలజీపై ఎంత ఆధారపడి ఉన్నామో.. కొన్ని గంటలకే పరిస్థితి ఇలా ఉంటే.. ఇదే పరిస్థితి కొన్ని రోజుల పాటు కొనసాగితే.. ఆలోచిస్తేనే కాస్త భయంగా ఉంది కదా.. అలాంటి పరిస్థితి రావొద్దని అనుకుందాం.. మొత్తానికైతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు క్లైమాక్స్‌ సీన్‌ చూసినట్టు ఉంది.

Tags

Related News

Press Freedom: మీడియాతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ..!

Kargil War: కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది?.. 25 ఏళ్ల తర్వాత నిజం ఒప్పుకున్న పాక్

Big Shock to YS Jagan: పూర్తిగా ఖాళీ అవుతున్న వైసీపీ.. వీళ్లంతా జంప్

US Presidential Election 2024: కమలా హారిస్ విన్ అవుతుందని.. అలన్ ఎలా చెప్తున్నాడు?

TDP Office Attack Case: పరారీలో జోగి రమేశ్‌, దేవినేని అవినాశ్‌?

YSRCP VS TDP: వరద పాలిటిక్స్.. బురదలో ప్రజలు.. నేతల గొప్పలు

Natural Disaster: క్లౌడ్‌ బరస్ట్‌తో ఆకస్మిక వరదలు.. విపత్తులను ఆపే దారేది?

Big Stories

×