EPAPER

Social Media: రెచ్చగొడితే అరెస్టే..! దిలీప్ అరెస్ట్‌తో రాష్ట్రవ్యాప్తంగా చర్చ

Social Media: రెచ్చగొడితే అరెస్టే..! దిలీప్ అరెస్ట్‌తో రాష్ట్రవ్యాప్తంగా చర్చ

– సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు
– ప్రభుత్వాన్ని బద్నాం చేసే మాటలు
– బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్
– గత ప్రభుత్వంలో కీలక పాత్ర
– అధికారం పోయిన దగ్గర నుంచి ఫ్రస్ట్రేషన్ పెరిగిందా?
– కావాలనే కాంగ్రెస్ సర్కార్‌పై బురద జల్లుతున్నారా?
– దీనికోసం ప్రత్యేక టీముల్ని ఏర్పాటు చేసుకున్నారా?
– నిధుల మూలాలు ఎక్కడి వరకు ఉన్నాయి?


దేవేందర్‌ రెడ్డి చింతకుంట్ల, 9848070809

Dileep Konatham: బీఆర్ఎస్ ఐటీ సెల్ హెడ్ కొణతం దిలీప్‌ అరెస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫాబాద్ గిరిజన మహిళ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, దానిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని వైరల్ చేస్తున్నందున దిలీప్‌పై ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేస్తున్నారని అరెస్ట్ చేశారు.


బీఆర్ఎస్ హయాంలో కీలక పాత్ర

కేసీఆర్ హయాంలో ప్రభుత్వ డిజిటల్ మీడియా తొలి డైరెక్టర్‌గా పనిచేశారు దిలీప్. 2014 నుండి 2023 వరకు ఆ పదవిలో కొనసాగారు. అప్పటి సమాచార సాంకేతిక శాఖ రూపొందించిన పలు కార్యక్రమాలలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఐటీ సెల్ హెడ్‌గా కొనసాగుతున్నారు. ఈయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ముఖ్య అనుచరుడు. బీఆర్ఎస్‌కు అనుకూలంగా, ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా కంటెంట్ క్రియేట్ చేయడంలో దిట్ట.

ప్రభుత్వంపై అదేపనిగా విమర్శలు

పదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది బీఆర్ఎస్. కానీ, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టారు ప్రజలు. బీఆర్ఎస్ నేతల కలలన్నీ పేక మేడల్లా కూలిపోయాయి. అయితే, సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసింది మొదలు, ప్రతీ చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడం, దాని చుట్టూ తప్పుడు ప్రచారం చేయడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని, ఐటీ సెల్ ద్వారా సోషల్ మీడియాలో కావాలనే బద్నాం చేసే కుట్రలు జోరుగా జరుగుతున్నాయనేది కాంగ్రెస్ నేతల వాదన. ఇదే క్రమంలో జైనూర్ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

పార్టీ పరంగానే కాదు.. ఇతర మార్గాల్లోనూ నెగిటివ్ ప్రచారం

బీఆర్ఎస్ అధికారం పోవడానికి సోషల్ మీడియాలో జరిగిన నెగిటివ్ ప్రచారం కారణమని కేటీఆర్ బాగా నమ్మారు. ఈ విషయాన్ని గతంలో మీడియా ముఖంగానే బయటపెట్టారు. మనకి కూడా యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉండాలని బీఆర్ఎస్ నేతలతో మాట్లాడారు. అయితే, అన్ అఫీషియల్‌గా దీన్ని అమలు చేస్తున్నారనేది కాంగ్రెస్ శ్రేణుల వాదన. కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌కు, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా ఇలా పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారని అంటున్నారు. దీన్ని పక్కాగా అమలు చేసే బాధ్యతలు దిలీప్‌కు అప్పగించినట్టు అనుమానాలున్నాయి.

యూట్యూబ్ ఛానల్స్‌కు డబ్బులు

బీఆర్ఎస్‌కు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెగిటివిటీని జనంలోకి చొప్పించేందుకు దాదాపు 30 యూట్యూబ్ ఛానల్స్‌కు ఫండింగ్ జరుగుతోందనే అనుమానాలున్నాయి. ఈరోజుల్లో యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుతున్న వ్యవహారం. అందుకే, వీటిని పక్కాగా అమలు చేసే బాధ్యతలను దిలీప్‌తోపాటు నెల్లూరుకు చెందిన నితిన్ రెడ్డికి కేటీఆర్ అప్పగించినట్టు చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఆయా ఛానల్స్ కోసం డబ్బును ఎవరెవరికి నెలనెలా ఎంత అనేది ఫిక్స్ చేసుకుని మాట్లాడుకున్నారని అంటున్నారు. వీటి పని అదే పనిగా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమేనని మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో దోచేసిన సొమ్మును ఇలా వాడేస్తూ, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.

గతంలోనూ దిలీప్‌పై కేసులు

తెలంగాణ ప్రభుత్వ లోగో మార్పు విషయంలోనూ అవాస్తవ ప్రచారం చేశారని దిలీప్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వం నుంచి అఫీషియల్‌గా ఆర్డర్స్ రాక ముందే నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ట్విట్టర్‌లో సరైన మానిటరింగ్ లేదు కాబట్టి విపరీతంగా రెచ్చిపోతూ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారని, ఇంకా చాలామందిని ఇదేవిధంగా ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ విషయాలన్నింటిపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.

Also Read: Actress Sreeleela: ఎల్లో కలర్‌ డ్రెస్‌లో మెస్మరైజ్‌ చేస్తున్న శ్రీలీల

డీజీపీ వార్నింగ్

అత్యంత సున్నితమైన జైనూరు అంశంపై వివిధ సామాజిక వర్గాలను రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయరాదని డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎవరైనా ప్రేరేపించే, ఉసిగొలిపే ప్రకటనలు చేస్తే, వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ అనధికారిక సమాచారం లేదా ఊహాగానాలు లేదా రెచ్చగొట్టే తప్పుడు వార్తలు వ్యాప్తి చేసినట్టయితే సంబంధిత వ్యక్తులపై, సంస్థలపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

తెలుగు స్క్రైబ్‌పై కేసు

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసిందని, తెలుగు స్క్రైబ్ అనే యూట్యూబ్ ఛానల్‌పై కేసు నమోదు చేశారు సైబర్ పోలీసులు. ఇదే ఇష్యూకి సంబంధించి కొణతం దిలీప్ అరెస్ట్ అయ్యారు.

వెంటనే వదిలేయాలి!: కేటీఆర్ డిమాండ్

దిలీప్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని వెంటనే వదిలేయాలని డిమాండ్ చేశారు. కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించగా, హైకోర్టు చివాట్లు పెట్టినా బుద్ధి రాలేదన్నారు. ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×