EPAPER

BRS Leaders In Congress: కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..?

BRS Leaders In Congress: కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..?

BRS Leaders In Congress: అన్ని నియోజకవర్గాల్లో ఓ లెక్క అక్కడ ఓ లెక్క అన్నట్టు కొనసాగుతుంది అక్కడ పరిస్థితి. ఎక్కడైనా ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసులో కనిపిస్తారు కానీ ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో క్యాంపు ఆఫీసు ఉన్న సంగతే మరిచిపోయినట్లు వ్యవహరిస్తున్నారు. క్యాంపు ఆఫీసులో కార్యకలాపాలు కలిసి రావన్న సెంటిమెంట్‌లో ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను ఏకంగా పాడు పెట్టేస్తున్నారు. దీంతో ఆయన్ని కలవడానికి నియోజకవర్గ ప్రజలు సరిహద్దు దాటి పక్క రాష్ట్రం పోవాల్సి వస్తుందంట. నియోజక వర్గం కంటే నాకు ఇక్కడే కంఫర్ట్ అన్నట్లు వ్యవహరిస్తున్న ఆ గులాబీ పార్టి ఎమ్మెల్యే ఎవరు? క్యాంపు ఆఫీస్ కంటే కర్నూలు బాస్ కంపౌండే శ్రేయస్కరం అంటున్న ఆయన లెక్కలేంటి?


గద్వాల జిల్లాలోని అలంపూర్ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజక వర్గం నుంచి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్ది విజయుడు గెలుపొందారు. అప్పటి వరకు కొనసాగిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను కాదని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సూచించిన వ్యక్తికి గులాబీ బాస్ టికెట్ కేటాయించారు. వెంకట్రామిరెడ్డి అనుచరుడు, ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న విజయుడుకి టికెట్ ఇచ్చారు. వెంకట్రామిరెడ్డి అన్ని తానై వ్యవహరించి విజయుడిని గెలిపించుకున్నారు.

ఇంత వరకు బాగానే ఉంది . గెలిచిన విజయుడు నియోజక వర్గంలోని అలంపూర్ క్యాంప్ ఆఫీస్ వైపు తొంగి కూడా చూడకపోవడంపై నియోజక వర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే నివాసంతో పాటు , ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో గత కేసిఆర్ ప్రభుత్వంలో క్యాంపు ఆఫీస్ ల నిర్మాణం జరిగింది . అయితే క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన గులాబీ పార్టి ఎమ్మెల్యే విజయుడు మాత్రం పక్క రాష్ట్ర మైన , కర్నూలు లోని ఎమ్మెల్సి చల్లా వెంకట్రామిరెడ్డి కాంపౌండ్ నే తన కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.


దాంతో తమ అవసరాల కోసం ఎమ్మెల్యేను కలవాల్సిన వారంతా రాష్ట్ర సరిహద్దు దాటి కర్నూలు పోవాల్సి వస్తుంది. కర్నూలులోని ఎమ్మెల్సి చల్లా వెంకట్రామి రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే విజయుడి కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించడంతో అలంపూర్ నియోజక వర్గం పాలన అంతా ఆ గది కేంద్రంగా కొనసాగుతోంది. ప్రభుత్వ పథకాలు తీసుకోవాలన్నా.., తమ బాధలు చెప్పుకోవాలన్నా, నియోజక వర్గం లోని ఆయా మండలాల నుంచి కర్నూలులోని చల్లా కాంపౌండ్ బాట పట్టాల్సివస్తుందని ప్రజలు వాపోతున్నారు.

Also Read: మరో వివాదంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. ఏకంగా యాదాద్రి ఆలయంలోనే రీల్స్!

కర్నూలు పట్టణం నియోజక వర్గానికి సరిహద్దు ప్రాంతం అయినప్పటికీ వివిధ మండలాల నుంచి కర్నూలు వెళ్లడమనేది వ్యయ ప్రయాసలతో కూడిన అంశమే. నియోజక వర్గంలో క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా పాలన ఉంటే అన్నింటికి సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు. అదలా ఉంటే అలంపూర్ చౌరస్తా లో లక్షల వ్యయంతో నిర్మించిన క్యాంప్ ఆఫీస్ నుంచే మాజీ ఎమ్మెల్యే అబ్రహం కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే వారు . క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా సిబ్బంది నియామకం చేపట్టి , వివిధ మండలాల నుంచే వచ్చే వారి నుంచి వినతులు , దరఖాస్తులు స్వీకరించి అక్కడి నుంచే ప్రభుత్వ పథకాల పంపిణీ చేపట్టే వారు.

అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు టికెట్ దక్కక పోవడంతో చల్లా ఆశీస్సులతో విజయుడు టికెట్ దక్కించుకుని గెలుపొందారు . అబ్రహంకు క్యాంప్ ఆఫీస్ కలిసి రాక పోవడం వల్లనే అలా జరిగిందని , అక్కడి నుంచి ఎమ్మెల్యే పాలన వ్యవహారాలు నడిపిస్తే తనకు కూడా భవిష్యత్ ఉండదనే సెంటిమెంట్‌తో ఎమ్మెల్యే విజయుడు క్యాంప్ ఆఫీస్ వైపు కూడా తొంగి చూడటం లేదని గులాబీ శిబిరం లో చర్చ సాగుతుంది . అదేమి కాదు , అన్నీ తానై వ్యవహరించి టికెట్ ఇప్పించుకోని గెలిపించుకున్న ఎమ్మెల్సి చల్లా.. ఎమ్మెల్యే విజయుడు మరో పవర్ పాయింట్‌లా తయారవుతారనే ముందు జాగ్రత్తతో …తన పర్యవేక్షణ లో కార్యకలాపాలు కొనసాగేలా జాగ్రత్త పడ్డారని మరికొందరు చర్చించుకుంటున్నారు.

ఇక ఇదే సమయంలో నియోజకవర్గం లో పాలన వ్యవహారాల్లో అన్ని కీలక నిర్ణయాలకు సంబంధించి ఎమ్మెల్సీ చల్లా గ్రీన్ సిగ్నల్ తరువాతే ఎమ్మెల్యే విజయుడు ఒకే చెప్తారు. త్వరలో వీరు గులాబీ గూటికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎలాంటి రాజీకీయ అనుభవం లేని విజయుడు.. భవిష్యత్‌పై భరోసా లేకున్నా చల్లా వెంకట్రామిరెడ్డి నిర్ణయాన్ని కాదన లేకపోతున్నారంట.

మొత్తం మీద గత పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో జనాలతో కళకళలాడిన అలంపూర్ క్యాంప్ ఆఫీస్ , ఇప్పుడు ఆఫీసుకు వచ్చే వారు లేక వెలవెలబోతోంది . లక్షల రూపాయల ప్రజా ధనం తో నిర్మించిన ఆ భవనాన్ని వినియోగంలోకి తేవాలని. భవనానికి ఏదైనా వాస్తు దోషం ఉంటే మరమ్మత్తులు చేయించుకుని.. ఎమ్మెల్యే నియోజక వర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని స్థానికులు కోరుతున్నారు. మరి ఎమ్మెల్యే రిమోట్ తన చేతిలో పెట్టుకున్న ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో? చూడాలి.

Related News

TDP Leaders: అనంతపురం టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్.. కారణం ఏం

Niagara Falls of India: చిత్ర కూట్‌లో చూడాల్సిన ప్రదేశాలు.. ఎలా వెళ్లాలో తెలుసా?

Cheetahs – Big Cats: చిరుత లాగే అడవి పిల్లి ప్రమాదకరమా? రెండింటికి తేడా ఏంటి?

Global Water Cycle: ఇండియాకు జలగండం.. భూమి పుట్టుక తర్వాత ఇదే తొలిసారి..

BIG Shock To Mudragada: పాలిటిక్స్‌లో బ్యాడ్ టైం.. ముద్రగడకు బ్యాండ్ బాజానే..

Delhi Air Pollution: చలికాలానికి ముందే గజ గజ వణుకుతున్న ఢిల్లీ.. కారణం ఇదేనా?

Big Stories

×