EPAPER

KCR – Kavitha: కేసీఆర్, కవిత ఏమయ్యారు? బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం, రీఎంట్రీలు వాయిదా!

KCR – Kavitha: కేసీఆర్, కవిత ఏమయ్యారు? బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం, రీఎంట్రీలు వాయిదా!
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఏమైంది? గులాబీ శ్రేణుల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఆమె జైల్లో ఉన్నపుడు అనారోగ్యం పాలయ్యారని కేటీఆర్ ప్రకటించారు. అయితే కవిత బెయిల్‌పై వచ్చాక ఆమె హెల్త్ గురించి కుటుంబ సభ్యులెవరూ మాట్లాడటం లేదు. అయితే, బతుకమ్మ సంబరాలకు ఒక రోజు ముందు ఆమె హాస్పిటల్‌కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు రెస్టు తీసుకోమన్నారని చెప్పారు.
మరోవైపు తెలంగాణ సెంటిమెంట్‌తో పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ అధికారం కోల్పోయాక ఫాంహౌస్‌కు పరిమితమయ్యారు. ఆయన దసరా నుంచి పొలిటికల్‌గా యాక్టివ్ అవుతారని ప్రచారం జరిగినా చడీచప్పుడు లేదు… ఇక ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ పండుగంటే తెగ హడావుడి చేశేవారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా తెలంగాణలో బతుకమ్మకు ప్రాచుర్యం తెచ్చిన ఆమె పండుగ మొదలై రోజులు గడుస్తున్నా వేడుకల్లో కనిపించడం లేదు. దాంతో కేసీఆర్, కవితల గురించి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.
మాజీ ముఖమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేళ్లు పనిచేశారు. పవర్ పోగానే సైలెంట్ అయిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బాత్‌రూమ్‌లో జారిపడి తుంటి ఎముక విరగడంతో శస్త్రచకిత్స చేయించుకున్న మాజీ ముఖ్యమంత్రి లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని చాలా కష్టపడ్డారు. సారూ.. కారూ.. పదహారూ.. స్లోగన్‌తో వాకింగ్ స్టిక్ చేయూతతో ప్రచారం నిర్వహించారు. ఆయన అంత కష్టపడినా ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా ఆ పార్టీకి దక్కలేదు. పైగా కారు పార్టీకి 8 ఎంపీ స్థానాల్లో డిపాజిట్లు గల్లంతై ఆ పార్టీ భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారిపోయింది.
ఇక అప్పటి నుంచి ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్… బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒక్కరోజు అసెంబ్లీలో కనిపించారు. ఆరునెలలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే ఆయన ఆ ఒక్క రోజు కూడా సభకు వచ్చారన్న ప్రచారం జరిగింది. తర్వాత కొన్ని రోజులకు ఆయన యాగం నిర్వహించడంతో స్థానిక సంస్థల్లో బలనిరూపణకు రెడీ అవుతున్నారన్న ప్రచారం జరిగింది.
దసరా ముహూర్తంగా మాజీ సీఎం మళ్లీ జనంలోకి వచ్చి తన మాటల మంత్రదండం ప్రయోగిస్తారని అందరూ భావించారు. అయితే దసరా బతుకమ్మ పండుగ మొదలై రోజులు గడుస్తున్నా ఆయన ఫాంహౌస్‌ నుంచి బయటి రావడం లేదు. దాంతో ఆయన ఏం చేస్తున్నారన్న దానిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కేసీఆర్‌ షెడ్యూల్‌పై గులాబీ వర్గాలు కొత్త ప్రచారం మొదలుపెట్టాయి. ఇంతకాలం కేసీఆర్ మౌనంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన అలా కనపడకుండా పోవడంపై విమర్శలు సైతం వస్తున్నాయి. ప్రతిపక్ష హోదా వంద శాతం నిర్వహించి ప్రజలు తరపున మాట్లాడతామని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీ చర్చల్లో పాల్గొనలేదు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒకేఒక్కసారి మొక్కుబడిగా అసెంబ్లీకి వచ్చి వెళ్లారు. తర్వాత బయట సైతం ఎక్కడ కనపడడం లేదు. దసరా తరువాత వరంగల్‌లో రైతు దీక్ష పేరుతో నిర్వహిస్తున్న సభలో కేసీఆర్ ప్రత్యక్షం కాబోతున్నారంటున్నారు. ఇంత గ్యాప్ తర్వాత బయటకు వస్తున్న ఆయన ఏం మాట్లాడుతారన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కూడా బతుకమ్మ వేడుకల్లో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ ఏర్పడుతూనే అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ బతుకమ్మను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీ శ్రేణులు బతుకమ్మ ప్రాశస్త్యాన్ని వ్యాపింపజేసేందుకు ప్రయత్నించాయి. కవిత స్వయంగా బతుకమ్మ ఎత్తుకుంటూ వేడుకల్లో పాల్గొనేవారు. దాంతో ఆ సంబురాలకు మరింత ప్రాచుర్యం లభించింది. బీఆర్ఎస్ ఓటమి తర్వాత కవిత ఢిల్లీ మద్యం కేసులో జైలుకెళ్లారు. ఐదు నెలలకు పైగా తీహార్ జైల్లో ఉన్న ఆమె ఇటీవలే బయటకు వచ్చారు.
బెయిల్ రాగానే కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్కు వెళ్లాక ఆమె బయటకు రాలేదు. తండ్రి వద్దే ఉంటూ వస్తున్నారు. తల్లి శోభ పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ కేక్ తినిపిస్తున్న ఫొటోలో కవిత కనిపించారు. అంతే కాని చడీచప్పుడు చేయడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక జరుగుతున్న తొలి బతుకమ్మ ఇది… ఎవరు అవునన్నా, కదన్నా.. తెలంగాణలో బతుకమ్మను ప్రాచుర్యంలోకి తెచ్చింది కవితనే చెప్పాలి.
తెలంగాణ జాగృతి పేరిట ప్రత్యేక సాంస్కృతిక సంస్థను కూడా ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చారు. అలాంటి కవిత ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనక పోవడం గులాబీ శ్రేణుల్లోనే చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా కవిత యాక్టివ్ కాకపోవడంపై నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో కవిత నిజామాబాద్ ఎంపీగా గెలిచి ఆ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. తర్వాత పరాజయం పాలైనప్పటికీ జిల్లా పార్టీలో ఆమె హవానే నడిచింది.
ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రతికూల పరిస్థితి ఎదుర్కుంటుంది. ఆ జిల్లాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బాట పట్టారు. కారు గుర్తుపై గెలిచిన బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్‌కుమార్‌లు కాంగ్రెస్‌లో చేరిపోవడంతో జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు దాదాపు అనథలా మారాయి. అక్కడ గులాబీ కేడరంతా కవిత ఎంట్రీ కోసం ఎదురుచూస్తుందంటున్నారు. ఆమె యాక్టివ్ అయితేనే జిల్లాలో పార్టీకి మనుగడ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి వారి ఆశలు నెరవేరేదెప్పుడో చూడాలి.


Related News

Ratan Tata: తరతరాల నుంచి టాటా అంటే ఇదే…

Roja vs Syamala: రోజా ఏమయ్యారు? మీడియా ముందుకు రాలేక.. రికార్డెడ్ వీడియోలు, ఉనికి కోసం పాట్లు?

Jammu and Kashmir: కాశ్మీర్‌లో ఓటమి.. బీజేపీ ఆ మాట నెలబెట్టుకుంటుందా? కాంగ్రెస్ గెలిచినా.. ఆ నిర్ణయం మోడీదే!

Land Fraud: అక్రమాల పుట్ట ఇంకా అవసరమా? జూబ్లీహిల్స్ సొసైటీలో అక్రమాలెన్నో- ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

Discrimination: జైళ్లను కూడా వదలని కుల వివక్ష

world mental health day: ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలున్నవారిలో.. భారత్‌లోనే అధికమంటా!

Big Stories

×