EPAPER

Kavitha: కవితకు ఏమైంది? సవాలు చేసి సైలెంట్ అయ్యారు ఎందుకు?

Kavitha: కవితకు ఏమైంది? సవాలు చేసి సైలెంట్ అయ్యారు ఎందుకు?

బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఢిల్లి లిక్కర్ కేసులో బెయిల్ విడుదల అయిన తరువాత పార్టీ కార్యక్రమంలో ఎక్కడా కనిపించడం లేదు. ఇటీవల గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో హెల్త్ చెక్ అప్ చేసుకున్న కవిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ఆమె వర్గీయులు అంటున్నారు. మరోవైపు ఆమె దీక్షలో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే అసలు ఆమె ఎందుకు కనిపించడం లేదన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. దాంతో లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న ఆమె కేసు ఇంకా పూర్తికాక పోవడంతో భయపడుతున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పై విడుదల అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. 10 రోజుల విశ్రాంతి తీసుకున్న తర్వాత అందరినీ కలుస్తానని అప్పట్లో ప్రకటించారు. ఆగస్టు చివరి వారంలో ఆమెకు బెయిల్ మంజూరైంది. అయితే ఏమైందో ఏమో గాని ఆమె జైలు నుంచి విడుదలై 2 నెలలు కావస్తున్నా బయటకు మాత్రం రావడం లేదు. ఎవరిని కలవడం లేదు. ఈ మధ్య కాలంలో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో హెల్త్ చెక్ అప్ చేయించుకుంటే ఆమె కవిత గైనిక్ సమస్యలతో భాదపడుతున్నట్లు వెల్లడించారని ఆమె సన్నిహితులు చెప్తున్నారు స్పాట్ తీహార్ జైల్లో ఉన్నప్పుడు ఆమె మానసికంగా దెబ్బ తిన్నారని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆమె వర్గీయులు అంటున్నారు.

జైల్లో ఉన్నప్పుడు రుద్రాక్ష మాల కావాలని కోర్టును రిక్వెస్ట్ చేసిన కవితకు అనుమతి మంజూరైంది. అప్పటి నుంచి ఆమె ఆ రుద్రాక్ష మాల ధరించే ఉన్నారు. ఇటీవల ఏఐజీ ఆసుపత్రిలో హెల్త్ చెక్ అప్ కోసం వచ్చిన రోజు కూడా ఆమె మెడలో రుద్రాక్ష మాల కనిపించింది. దాంతో ఆమె దీక్షలో ఉన్నారని కొందరు చెప్తున్నప్పటికి అది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం తెలియడటం లేదు. ఆమె కాని, ఆమె కుటుంబసభ్యులు కాని వెల్లడించడం లేదు. ప్రస్తుతానికి ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారో ఎవరికి తెలియదు. కేసీఆర్‌తో పాటుగా ఎర్రవల్లి ఫాం హౌస్ లోనే కవిత ఉంటున్నారన్న ప్రచారం మాత్రం జరుగుతుంది.


బతుకమ్మ రోజు కవిత బయటకు వస్తారని అందరూ భావించినప్పటికీ ఆమె మాత్రం పూర్తి స్థాయి విశ్రాంతిలోనే ఉన్నారు. ఎక్కడ కనిపించలేదు. జాగృతి కమిటీలు రద్దు చేసిన కవిత కొత్త కమిటీల పైన దృష్టి పెట్టలేదని తెలుస్తుంది. ఆమె గతంలో ఉన్న మాదిరిగా ప్రభుత్వం పై దూకుడు కొనసాగిస్తారా? లేకపోతే సైలెంట్ అవుతారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది… ప్రస్తుతానికైతే కవిత ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆమెకు ఏమైందో చెపుతారనుకుంటే అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రావడం లేదు. అన్న కేటీఆర్ కూడా దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

Also Read: కేటీఆర్ కొత్త ఫార్ములా.. ‘నోటి’కి బదులు నోటీసులతో జవాబు, ఈ ‘పరువు’ పంచాయతీలు ఎన్నాళ్లో?

ఢిల్లి లిక్కర్ కేసులో బెయిల్ పై మాత్రమే బయట ఉన్న కవిత కేసు పూర్తి కాలేదని భయపడుతున్నారా అని చర్చ జరుగుతుంది. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కవిత తనను జైల్లో పెట్టిన వారిని ఎవరినీ వదలను అని హెచ్చరించారు. తరువాత ఏమైందో ఏమో గాని ఆమె మాత్రం సైలెంట్ అయిపోయారు. అయితే పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆమె నవంబర్, డిసెంబర్ లో కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారంట. వచ్చే ఏడాదిలో ఆమె బయటకు వస్తారని, జాగృతి నూతన కమిటీల ఏర్పాటు చేస్తారని, బీసీ సబ్ ప్లాన్ పై జిల్లాల్లో పర్యటించి వరుస సమీక్షలు నిర్వహిస్తారని.. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యక్రమాలు రూపొందిస్తారని చెప్తున్నారు. మరి ఆమె ఎందుకు సైలెంట్ అయ్యారో అప్పటికైనా తెలుస్తుందో లేదో చూడాలి.

Related News

Salman Khan: సల్మాన్ నిజంగానే ఆ జింకను కాల్చాడా? ఆ రోజు అతనితో ఉన్న హీరోయిన్స్ ఎవరు? వారికీ ముప్పుందా?

Chandrababu Vision: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ తో ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో తెలుసా? హైదరాబాద్‌కు విశాఖ ప్రత్యామ్నాయం కానుందా?

India China Border Deal: ఆర్ధికంగా నలిగిపోతున్న చైనా.. ఆ ఒప్పందం వెనుక భయంకర నిజాలు

Drone Pilot Training: డ్రోన్ పైలెట్లకు ఈ సర్టిఫికేట్ ఉంటే మస్తు పైసలు..

Peddireddy: ఆగని పెద్దిరెడ్డి దందా? షాక్ లో టీడీపీ

MVV Satyanarayana: అష్టదిగ్బంధంలో ఎంవీవీ చాప్టర్ క్లోజ్?

Big Stories

×