EPAPER

BRS Party: తప్పు ఒప్పుకున్న బీఆర్ఎస్.. భయమా? జాగ్రత్తా?

BRS Party: తప్పు ఒప్పుకున్న బీఆర్ఎస్.. భయమా? జాగ్రత్తా?

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆరోపణలపై కమిషన్ విచారణ వేగవంతం చేసింది. కాళేశ్వరంపై విచారణ మొదలుపెట్టి మూడు నెలలు దాటింది. మూడు నెలల కాలంలో కాళేశ్వరం టెక్నికల్ అంశాలపై విచారణ పూర్తి చేసి, రెండో దశ విచారణ మొదలుపెట్టింది. రెండో దశ విచారణలో ఆర్థికంశాలపై దృష్టి పెట్టనుంది. మొదటి దశలో కాళేశ్వరంలో ఆయా డిపార్ట్ మెంట్లలో పని చేసిన అధికారులను విచారణ చేపట్టిన కమిషన్ ఎవిడెన్స్ సేకరణపై ఫోకస్ చేస్తోంది. ఎవిడెన్స్ సేకరణ పూర్తి కాగానే ఫైనల్ రిపోర్ట్ తయారు చేసేందుకు కమిషన్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కాగ్ నివేదిక అందిన నేపథ్యంలో ఎన్డీఎస్సే, విజిలెన్స్ ఫైనల్ రిపోర్ట్ప్ కోసం కమిషన్ ఎదురుచూస్తోంది. ఫైనల్ రిపోర్ట్స్ రాగానే తదుపరి కార్యాచరణకు వెళ్లేందుకు కమిషన్ సిద్దమవుతోంది.

ఈ మూడు నెలల కాలంలో వంద మందికి పైగా అధికారులను విచారించిన కమిషన్ అందులో కీలక అధికారుల నుంచి అఫిడవిట్ల రూపంలో డేటా సేకరించింది. ఇప్పటి వరకు 50 కి పైగ అఫిడవిట్లు కమిషన్ ముందుకు వచ్చాయి. ఈ అఫిడవిట్లను పరిశీలించే పనిలో కమిషన్ బిజీబిజీగా గడుపుతోంది. ఇప్పటికే గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్‌తో పాటు కాళేశ్వరం అంశంలో ఆయా శాఖలో కీలక పాత్ర పోషించిన చీఫ్ సెక్రెటరీలు సోమేష్ కుమార్, ఎస్కే జోషీ, రజత్ కుమార్, స్మితా సభార్వల్‌లతో పాటు మరికొంత మంది అధికారులను విచారించిన కమిషన్ వారి నుంచి అఫిడవిట్లు సమర్పించాలని కోరింది.


గత నెల 20 తేది వరకు అఫిడవిట్లు ఇవ్వాలని కోరినప్పటికి, కొంత మంది కీలక అధికారులు అఫిడవిట్లు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇవ్వని వారిపై కమిషన్ గుర్రుగా వుంది. అఫిడవిట్లు ఇవ్వని అధికారులకు మరోసారి నోటీసులు జారీ చేసేందుకు కమీషన్ సిద్దమవుతోంది. వచ్చిన 50 అఫిడవిట్లను క్షుణ్ణంగా కమిషన్ పరిశీలను చేస్తోంది. అధికారుల నుంచి పెండింగ్‌లో వున్న అఫిడవిట్లన్ని కమిషన్ ముందకు రాగానే వాటిని కూడా పరిశీలను చేసి, అఫిడవిట్లలో డేటా ఆధారంగా మరికొంత మందికి నోటీసులిచ్చి విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది.

అదలా ఉంచితే అఫిడవిట్లు ఇచ్చిన అధికారులందరికి మరోసారి నోటీసులిచ్చి క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు కమిషన్ సిద్దమవుతోంది. అందులో ఓ కీలక మాజీ ఐఎఎస్ అఫిడవిట్లు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారనే తెలుస్తోంది. కమిషన్ ముందు అఫిడవిట్ అందిస్తే అడ్డంగా దొరికిపోతారనే భయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ మాజీ ఐఎఎస్ ఇచ్చే అఫిడవిట్ అదారంగానే కాళేశ్వరం కర్త, కర్మ, క్రియా మేమే అని చెప్పుకుంటున్న గత ప్రభుత్వంలో కొంతమంది పెద్దలకు నోటీసులు వెళ్తాయనే వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఆ అధికారి అఫిడవిట్ అందించడంలేదని ప్రచారం జరుగుతోంది.

గత బీఆర్ఎస్ పాలనలో ప్రతిష్టాత్మకంగా చెప్పట్టి, నిర్మించి, తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చామని గొప్పలు చెప్పుకుంటున్న బిగ్ బాస్ లకు త్వరలోనే కమిషన్ నుంచి నోటీసులు జారీ అవుతున్నాయనే నేపథ్యంలోనే పెద్దసార్లు కమిషన్ ముందుకు ఒక బంటును పంపారనే ప్రచారం సాగుతోంది. నాలుగు నెలల నుంచి గుర్తుకు రాని కమిషన్ ముందుకు కేసీఆర్ అనుంగుడు పిలవకుండానే రావడం ఆ ప్రచారానికి బలం చేకూరుస్తోంది.

Also Read: సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు..ఎవరు పెట్టారో తెలుసా?

సమాచారం లేదు, కమిషన్ ముందుకు ఎందుకొచ్చారో తెలీదు. ఉన్నట్టుండి కమిషన్ ముందు ప్రత్యక్షమయ్యారు. ఆయనే తెలంగాణ జలవనరుల అభివృద్ది సంస్థ మాజీ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్ రావు ఆయన బీఆర్ఎస్ అధికార ప్రతినిదిగా సేవలందించారు. హుటాహుటిన కాళేశ్వరం కమిషన్ ముందుకు పరెగెత్తుకుంటూ వచ్చి.. జష్టిస్ పినాకీ చంద్ర ఘోష్ ముందు వాలిపోయారు. గత మాసంలో విద్యుత్ కమిషన్ విచారణలో కేసీఆర్ కు నోటీసులు జారీ అయిన నేపథ్యంలో.. కాళేశ్వరం కమిషన్ లో సైతం అదే సీన్ రిపీట్ అవుతుందని అనుకున్నారేమో.. కేసీఆర్ కు నోటీసులు జారీ చేసీ, విచారణకు రమ్మంటే పరువు పోతుందనుకున్నారేమో కానీ ప్రకాష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరయ్యారు.

కమిషన్ పిలువకుండానే ఎందుకొచ్చారనేది కాసేపు ఎవరికి అర్థం కాలేదు. కాసేపు అయ్యాక మీడియా ముందుకు వచ్చిన ఆయన తాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదనీ, ఏ పార్టీ నుంచి కమిషన్ ముందుకు రాలేదని, కమిషన్ పిలువకుండానే, తనకు తానే కమిషన్ ముందుకు వచ్చానని చెప్పుకుంటూ మీడియా ముందు మొదలుపెట్టిన ఆయన తన స్పీచ్ అంతా కాళేశ్వరంలో ఎలాంటి తప్పు జరగలేదు, కేసీఆర్ గొప్పోడనీ, ఇదే విషయం కమిషన్ ముందు చెప్పానని చెప్పుకొచ్చారు.

కేసీఆర్ విధేయుడిగా పిలవకుండానే విచారణ కమిషన్ ముందు హాజరైన ప్రకాశరావు.. వెళ్తూ వెళ్తూ.. కేసీఆర్ విధానాలను సమర్ధించుకోవడానికి వైఎస్ కట్టించిన ప్రాణహిత గురించి.. అప్పట్లో చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్ట్‌ను ఎందుకు వ్యతిరేకించారో అన్న అశాంలపై తనదైన వివరణ ఇచ్చి వెళ్లారు. పనిపనిగా మీడియా కూడా సర్టెన్ ఫ్రేమ్‌లో నుంచి బయటకొచ్చి కేసీఆర్ విజన్‌ను అర్థం చేసుకోవాలని సలహాలు కూడా ఇచ్చేశారు.

మొత్తం మీద కాళేశ్వరం అంశంలో తీగ లాగితే డొంక కదిలినట్టు ఏయో అంశాలు బయటకొస్తాయి, ఎవరెవరికి నోటీసులందుతాయి, నోటీసులందుకునే ఆ పెద్దలెవరు అనేది ఉత్కంఠ రేపుతోంది. కాళేశ్వరం విచారణ ప్రస్తుతం రెండో దశ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. మొదటి దశ విచారణలోనే అధికారులకు ముచ్చెమటలు పట్టించిన కమిషన్ రెండోదశలో ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టబోతున్న నేపథ్యంలో ఎంతమందికి ఉచ్చు బిగుసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×