EPAPER
Kirrak Couples Episode 1

Tourism Corporation: బోయినపల్లి బంధుప్రీతి.. టూరిజం కార్పొరేషన్ అధోగతి..!

Tourism Corporation: బోయినపల్లి బంధుప్రీతి.. టూరిజం కార్పొరేషన్ అధోగతి..!

– టూరిజం పేరుతో బోయినపల్లి మనోహర్ రావు తెరచాటు దందాలు
– పాలిటెక్నిక్ అర్హతతోనే టూరిజం కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు
– అడ్డగోలు వ్యవహారాలతో అడ్డంగా బుక్కైన వైనం
– బావమరిదికి స్వదేశీ దర్శన్ స్కీం పనులు.. అక్రమాలపై కాగ్ అంక్షితలు
– కుమారుడి చేతికి టూరిజం ప్లాజాల సబ్ కాంట్రాక్టులు
– ఎండీగా ఉన్పప్పుడే అర్హత, లైగింక వేధింపుల్లో క్రిమినల్ కేసులు
– దుర్గం చెరువు ఎకో టూరిజం ప్రాజెక్టులో మనోహర్ రావు మాయాజాలం
– టెండర్ లేకుండానే ఏఏ అవొకేషన్స్ సంస్థకు భూ బదిలీ.. కేసు నమోదు
– ఎలక్షన్ కోడ్‌ సమయంలో మంత్రితో తిరుమల యాత్ర.. సస్పెండ్
– అప్పట్లో విజిలెన్స్ కమిషనర్ ఎస్పీ ప్రసాద్ రిపోర్ట్
– మనోహరుడి అక్రమాలతో కుదేలైన టూరిజం శాఖ
– అక్రమాలపై దర్యాప్తు భయంతో ఫారిన్ చెక్కేసే ప్లాన్స్
– టూరిజం శాఖ బోయినపల్లి బాగోతాలపై స్వేచ్ఛ స్పెషల్


దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

Boianapalli Manohar Rao: వడ్డించేవాడు మనోడైతే, ఐఏఏస్, ఐపీఎస్ పోస్టులోనైనా, డిప్లొమా చేసిన వారిని కూర్చోబెట్టొచ్చు. అందినకాడికి దండుకోవచ్చు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐదేళ్లు పనిచేసిన బోయినపల్లి మనోహర్ రావు వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. ఈయన గారి అక్రమాల ధాటికి కుదేలైన టూరిజం శాఖ నేటికీ కోలుకోలేదంటే ఏ స్థాయిలో దందాలు సాగాయో అర్థం చేసుకోండి. టూరిజం శాఖ ఉన్నతాధికారి హోదాలో అక్కడి పనులన్నీ కుటుంబ సభ్యులకే కట్టబెట్టి, వారు రాజమార్గంలో కోట్లు వెనకేసుకునేలా చేసిన మనోహర్ రావు అవినీతి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న విచారణలో మెల్ల మెల్లగా బయటికి వస్తోంది.


మనోహర్ రావు అక్రమాల చిట్టా పెద్దదే!

1. 1989లో పాలిటెక్నిక్ చేసిన మనోహర్ రావు, ఆ డిప్లొమా అర్హతతోనే టూరిజం కార్పొరేషన్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా చేరాడు. కార్పొరేషన్ ఉన్నతాధికారిగా ప్రమోట్ ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతగా ఉండటంతో, ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ అనే ఊరూపేరు లేని సంస్థ నుంచి ఒకే సిట్టింగ్‌లో, ఉద్యోగానికి సెలవు పెట్టకుండానే సర్టిఫికెట్ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ అనే డిగ్రీ సంపాదించి, దాని సాయంతో టూరిజం కార్పొరేషన్‌లో వరుసగా ప్రమోషన్లు కొట్టేశాడు. దీనిపై నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ (ఎఫ్‌ఐఆర్ నెం. 224/2018) నమోదైంది.

2. సొంత సామాజిక వర్గ ప్రభుత్వ పెద్దల అండతో కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎదిగిన మనోహర్ రావు ఆ పదవిలో మార్చి 2018 నుంచి 2023 నవంబర్ 17 వరకు కొనసాగాడు. ఈ కాలంలోనే నాగార్జున సాగర్‌లోని టూరిజం కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేసే ఒక ఎస్టీ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించినందుకు నారాయణగూడ పీఎస్‌లో కేసు (ఎఫ్‌ఐఆర్ నెం. 474/2021) నమోదైంది.

Also Read: Tirupati Laddu Controversy: ఎంత అపచారం.. తిరుమల కొండపై ఇన్ని పాపాలా? వడ్డికాసులవాడు చక్రవడ్డీతో సహా తిరిగిచ్చేస్తాడా?

3. కేంద్రం ప్రతిపాదించిన స్వదేశీ దర్శన్ స్కీంలో భాగంగా తెలంగాణలోని పలు పర్యాటక ప్రాంతాల్లో చేపట్టిన పనుల్లో రూ.30 కోట్లకు పైగా విలువైన పనులను సొంత బావమరిది కంపెనీ అయిన ‘అంబియాన్స్ కన్స్‌స్ట్రక్షన్స్‌’కి అడ్డదారిలో అప్పగించి, ఆ పనులు చేయకుండానే బిల్లులు చెల్లించాడు. దీనిని నాడు కాగ్ నివేదిక తప్పుబట్టగా, నేడు ఆ అక్రమాలపై విజిలెన్స్ శాఖ విచారణ జరుపుతోంది. తన అక్రమాలను ప్రశ్నించకుండా, మనోహర్ రావు, నాటి బీఆర్ఎస్ పెద్దలు, మంత్రులు, నేతల యాత్రల సందర్భంగా టూరిజం కార్పొరేషన్ తరఫున కాంప్లిమెంటరీ హోటల్ రూంలు, భోజనాలు, వాహనాలు సమకూర్చాడని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

4. గత అసెంబ్లీ ఎన్నికల వేళ కోడ్ అమల్లో ఉండగా, నాటి టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి తిరుపతి యాత్రకు వెళ్లినందుకు గానూ, ఎన్నికల సంఘం 17, నవంబర్ 2023న మనోహర్ రావును సస్పెండ్ చేసింది. కాగా, ఆ సస్పెన్షన్‌ తర్వాత ఈయన్ను సంగీత అకాడమీకి డిప్యుటేషన్ మీద సెక్రెటరీగా పంపారు.

5. దుర్గం చెరువు డెక్ ఏరియా లీజ్ ఇవ్వడానికి టూరిజం కార్పొరేషన్ తరఫున 2018, జూన్ 20న టెండర్లు పిలిచారు. అందులో కమల్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒకే సంస్థ అన్ని అర్హతలతో టెండర్ దక్కించుకుంది. ఊహించని రీతిలో 2018, ఫిబ్రవరి 28న ఆ టెండర్‌ దక్కించుకున్న కమల్ హోటల్స్‌కు బదులు, ఎంపీ సంతోష్ రావుకు బినామీగా ఉన్న టానిక్ సంస్థ డైరెక్టర్ అనిత్ రెడ్డికి చెందిన ఏఏ అవోకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో టూరిజం కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవమేంటంటే, టీఎస్‌టీడీసీ టెండర్ ఆహ్వానించిన తర్వాతనే 2018, జూన్ 12న ఏఏ అవొకేషన్స్ సంస్థ రిజిస్టర్ అయింది. ఇందులో అనిత్ రెడ్డి, ఆదిత్య అరిసనపల్లి, జితేందర్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. అన్ని అర్హతలతో టెండర్ దక్కించుకున్న సంస్థకు బదులు టానిక్ యజమానులకు ఈ టెండర్ దక్కటంలో మనోహర్ రావు కీలక పాత్ర పోషించాడు. ఇదంతా రెండవ సారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటై, టూరిజం శాఖకు మంత్రి కూడా లేని రోజుల్లో సాఫీగా సాగిపోయింది. మరోవైపు, నిబంధనల ప్రకారం దుర్గం చెరువు బయో డైవర్సిటీ ఏరియాలోని పర్యావరణానికి, అక్కడి అరుదైన బండరాళ్లకు, సహజ సిద్ధమైన ఆకృతులను దెబ్బతీసేలా ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదని, టెండర్లు ఆహ్వానించినప్పుడు పేర్కొన్నారు. కానీ, బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ అండతో అనిత్ రెడ్డి ఆదేశాల మేరకు జేసీబీలతో అక్కడి గుట్టలను పిండి చేశారు. అంతేకాదు, మనోహర్ రావు మద్దతుతో అనిత్ రెడ్డి మరో ఎకరన్నర ఆక్రమించుకుని మొత్తం 3.7 ఎకరాలను ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. 2019లో టూరిజం శాఖ ఉన్నతాధికారులు ఇదేంటని ప్రశ్నించినా, మనోహర్ రావు జోక్యంతో అదంతా మరుగునపడిపోయింది. అయితే, 2024 జనవరి 18న టూరిజం శాఖ అధికారులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో (ఎఫ్‌ఐఆర్ నెం. 80/2024) దీనిపై ఫిర్యాదు చేశారు. అలాగే, గతంలో దుర్గం చెరువు ప్రాంతంలో షూటింగ్, అక్కడి పార్క్ ఎంట్రీ టికెట్ల అమ్మకం, ఇతరత్రా కార్యకలాపాలతో రోజుకు సగటున రెండు లక్షల ఆదాయం సమకూరేదని, కానీ ఇప్పుడా ఆదాయం అంతా ఏఏ అవోకేషన్స్ పొందుతోంది. దీనికి తోడు ఆ సంస్థకు ఇచ్చిన జీహెచ్ఎంసీ పన్ను మినహాయింపులతో కలిపి ఖజానాకు రూ.5 కోట్ల మేర చిల్లు పడింది.

Also Read: Prakash Raj: పవన్ ను వదలని ప్రకాష్ రాజ్.. అందులో ఆనందం ఏంటో అని మళ్లీ సెటైర్..

6. టూరిజం కార్పొరేషన్ ఆధీనంలోని మెజారిటీ హోటళ్లు, రెస్టారెంట్లను నిబంధనలకు విరుద్ధంగా మనోహర్ రావు బీఆర్ఎస్ నేతల అనుయాయులకు లీజుపై కట్టబెట్టారు. సిద్దిపేట టూరిజం హోటల్‌ను వేరొకరికి లీజుకిచ్చి, దానిని తర్వాత సబ్ లీజ్ పేరుతో కుమారుడికి దక్కేలా చేశారనే ఆరోపణలున్నాయి. అలాగే, బేగంపేట టూరిజం ప్లాజా, వికారాబాద్, సోమశిల, ఈగలపెంటల్లోని హరిత హోటల్స్‌ని అడ్డగోలుగా, కారుచౌకగా కొందరికి లీజుకిచ్చి, కమీషన్లు దండుకున్నారనే మాటా వినిపిస్తోంది. వీలున్న మేరకు టూరిజం కార్పొరేషన్ సివిల్ పనులన్నీ తామే దక్కించుకోవటం, ఎవరైనా బయటి వ్యక్తులు వచ్చి టెండర్లలో పనులు దక్కించుకుంటే, వారిని బెదిరించి తన బినామీలకు, కుమారుడికి లేదా బావమరిదికి కట్టబెట్టారని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు.

7. టూరిజం కార్పొరేషన్‌కు చెందిన మనోహర్ రావు, మరి కొందరు అధికారులు 2023, నవంబరు 17న సింగపూర్‌‌లో పర్యటించారు. దానికి దొంగ బిల్లులు పెట్టి డబ్బులు కొట్టేశారనే అంశంలో నాటి విజిలెన్స్ కమిషనర్ ఉద్యోగం నుంచి మనోహర్ రావు, ప్రసాద్ రెడ్డి, సురేష్ రెడ్డితో పాటు పలువురు టూరిజం కార్పొరేషన్ ఉద్యోగులను సస్పెండ్ చేయాలని సిఫారసు చేయగా, విజిలెన్స్ రిపోర్ట్‌ని తారుమారు చేసి బయటపడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో ప్రసాద్ రెడ్డిపై లోకాయుక్తలో అభియోగాలు నమోదైనా, అతను ఏపీ టూరిజం నుంచి రిజైన్ చేయకుండానే ప్రస్తుతం తెలంగాణ టూరిజం ప్లాజా బేగంపేట్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతనిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా నేటి వరకు ఎలాంటి చర్యలు లేవు.

8. సస్పెండ్ అయిన తర్వాత మనోహార్ రావును తెలంగాణ సంగీత అకాడమీకి సెక్రెటరీగా డిప్యుటేషన్ మీద పంపారు. ప్రస్తుత ప్రభుత్వం తన అక్రమాలను లోతుగా తవ్వి విచారణకు పూనుకుంటుందనే సమాచారంతో మనోహర్ రావు విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. అందుచేత అతని పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని, ఒక ఐపీఎస్ అధికారిచే ఫోరెన్సిక్ అడిట్ చేయించాలని డిమాండ్ పెరుగుతోంది.

Related News

World War III Fix: ఇజ్రాయెల్-హిజ్బుల్లా వార్.. మూడో ప్రపంచ యుద్ధం ఫిక్స్?

Chevireddy Bhaskar Reddy: ఏమైనా కానీ నేను ఏం మాట్లాడను.. భయంలో చెవిరెడ్డి

YS Jagan: పిన్నెల్లే దిక్కయ్యారా?.. జగన్ వ్యూహమేంటి?

Tirupati Laddu Controversy: ఎంత అపచారం.. తిరుమల కొండపై ఇన్ని పాపాలా? వడ్డికాసులవాడు చక్రవడ్డీతో సహా తిరిగిచ్చేస్తాడా?

Israel-Hezbollah conflict: రగిలిపోతున్నఇజ్రాయెల్ హిజ్బుల్లా బూడిదే!

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. జరగబోయేది ఇదేనా?

Big Stories

×