EPAPER

Amit Shah Fake Video: అమిత్ షా ఫేక్ వీడియో.. అనుకున్నదొకటి.. అయ్యిందొకటి!

Amit Shah Fake Video: అమిత్ షా ఫేక్ వీడియో.. అనుకున్నదొకటి.. అయ్యిందొకటి!
Amit Shah Deep Fake Video Full Story: ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది నేషన్.. కేంద్రహోంమంత్రి అమిత్‌ షా ఎడిటెడ్ వీడియో..రిజర్వేషన్లను రద్దు చేస్తామనేలా ఆయన మాటలను ఎడిట్‌ చేసి వైరల్ చేశారు కొందరు. వారేవరో గుర్తించే పనిలో ఉన్నారు ఢిల్లీ పోలీసులు. అయితే ఇది కాంగ్రెస్‌ నేతల పనే అంటూ ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టడం కొత్త వివాదాన్ని రాజేసింది. ఈ కేసు వెనుక లక్ష్యం.. కాంగ్రెస్‌ను బద్నాం చేయాలనే అన్నది ఆ పార్టీ వాదన. కానీ అది నెరవేరుతుందా? ఆ పరిస్థితి ఉందా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అర్థమయ్యేది ఏంటి? రిజర్వేషన్లు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ టాపిక్‌పైనే పార్టీలు ప్రచారం చేస్తున్నాయి.
విమర్శలు, వాటికి కౌంటర్లు అన్ని ఈ అంశంపైనే.. మోడీ మాట్లాడినా.. రాహుల్ మాట్లాడినా.. సింపుల్‌గా చెప్పాలంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇదే టాపిక్‌పై చర్చ. అలా చర్చిస్తున్న సమయంలోనే బయటికి వచ్చింది అమిత్‌ షా ఎడిటెడ్ వీడియో. దేశవ్యాప్తంగా ఓ సంచలనం సృష్టించింది. నిజం చెప్పాలంటే రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది ఈ వీడియో.. అయితే ఇది ఫేక్ అని తేల్చారు. ఒరిజినల్, ఫేక్ వీడియోలు పక్కపక్కన పెట్టి మరి వైరల్ చేశారు. ఇక్కడ మొదలైంది అసలు రాజకీయం. ఈ వీడియో క్రియేట్ చేసింది కాంగ్రెస్ నేతలే అంటూ దేశవ్యాప్తంగా పలువురిపై కేసులు నమోదయ్యాయి. అందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటికే అరెస్టులు కూడా జరుగుతున్నాయి.

టీపీసీసీ సోషల్ మీడియా వింగ్‌ నేతలకు నోటీసులు జారీ చేశారు.. బాగుంది. బట్ ఇందులో సీఎం రేవంత్‌ రెడ్డిని కూడా చేర్చడం ఎందుకు అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్.. దీని వెనక రాజకీయ కారణాలే ఉన్నాయనే దానిపైనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని. సీఎం రేవంత్ రెడ్డి చేసినంతగా మరేవ్వరూ చేయలేదనే చెప్పాలి. ఆయన ప్రతి సభలో ఇదే అంశంపై మాట్లాడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలోనూ దీనిపై చర్చ మొదలైంది. బీజేపీ పెద్దలు ఇది గమనించే ఈ కేసులో కావాలనే తనను ఇరికించారంటున్నారు రేవంత్ రెడ్డి.


Also Read: బ్రిష్‌భూషణ్‌కు బీజేపీ టికెట్ నిరాకరణ.. బరిలోకి కుమారుడు

నిజానికి రేవంత్ రెడ్డి ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనుకుంది బీజేపీ.. నేషనల్ వైడ్‌గా డిస్కషన్‌కు కారణమైన ఆయనను. ఎన్నికల ముందు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లాలనుకున్నారు. అందుకే FIR నమోదవ్వడమే ఆలస్యం.. 24 గంటలు గడవక ముందే పోలీసులు హస్తిన నుంచి భాగ్యనగరానికి వచ్చేశారు.. నోటీసులు ఇచ్చారు. బట్ సీన్ కాస్త రివర్సైంది. ఎక్కడైతే బద్నాం చేయాలనుకున్నారో.. అక్కడే ఆయన మరింత ఫేమస్ అయ్యారు. ఎవరు ఎడిట్ చేశారో తెలియదు. ఎవరు వైరల్‌ చేశారో గుర్తించలేదు. షేర్‌ చేసిన వారిపై మాత్రం కేసులు పెట్టేసి విచారణ పేరుతో హడావుడి చేయాలనుకున్నారు. కానీ అయ్యేలా కనిపించడం లేదు.


మనం ముందు చెప్పుకున్నాం. వీడియోలు ఫలానా న్యూస్‌ చానల్స్‌ టెలికాస్ట్ చేసిన వీడియోలు లేదంటే వాటి పేరుతో వచ్చిన ఎడిటెట్ వీడియోలు. రేపు విచారణలో కూడా ఇదే విషయాన్ని పోలీసులకు చెబుతారు పార్టీల సోషల్ మీడియా ఇంచార్జ్‌లు.. అప్పుడు వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై విచారణ ప్రారంభమవుతుంది. కానీ ఇదంతా జరిగే లోపు ఎన్నికలు ముగుస్తాయి.కానీ ఆ లోపు మీడియాలో మాత్రం కాంగ్రెస్‌ నేతలు విచారణకు హాజరు. అమిత్‌ షా ఫేక్‌ వీడియోలు వైరల్ చేసిన కాంగ్రెస్ నేతలు.. దానికి బీజేపీ రియాక్షన్స్.. కాంగ్రెస్‌ కౌంటర్స్.. ఇవే తప్ప మరేం కనిపించదు అనుకున్నాం. కానీ ఈ విషయాలు కూడా జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే తెలంగాణ బీజేపీ నేతలు చేసిన పనులు అలా ఉన్నాయి. ఓ రకంగా తెలంగాణ బీజేపీ నేతలు తెలియకుండానే.. ఢిల్లీ పెద్దలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు.

Also Read: ప్రియాంక గాంధీ భావోద్వేగం.. అందుకేనా..?

అలా ఎలా అనే కదా మీ డౌట్? ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాత హడావుడిగా రాష్ట్ర నేతలు కూడా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇక్కడి పోలీసులు కూడా విచారణ షురూ చేశారు. ఎప్పుడైతే ఢిల్లీ నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చారో.. సరిగ్గా అదే సమయానికి వారందరిని అదుపులోకి తీసుకున్నారు సీసీఎస్ పోలీసులు. వారిని విచారిస్తున్నారు.. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులకు ఇప్పుడు నిరాశే ఎదురైంది. హైదరాబాద్‌ నుంచి నిందితులను తరలించారని హెడ్‌ లైన్స్‌ ఎక్స్‌పెక్ట్ చేసిన ఢిల్లీ బీజేపీ పెద్దలకు నిరాశే ఎదురైంది.

కేసు ఎలా నమోదు చేస్తారని ఇటు సీఎం రేవంత్ రెడ్డి వాయించేస్తున్నారు. రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ తీరు ఇది కాదా? అంటూ ఆధారాలతో చూపిస్తున్నారు. అటేమో ఢిల్లీ పోలీసులకు హైదరాబాద్‌ పోలీసులు చెక్‌ పెట్టేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరిగిందే కానీ ఎక్కడా తగ్గలేదు. సో ఈ కేసు బీజేపీకి బూమారాంగ్ అయ్యింది తప్ప.. సాధించింది అయితే ఏం లేదన్న చర్చ జోరుగా సాగుతోంది.

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×