హాట్ టాపిక్ గా బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి
బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు. నాడు కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన ఏలేటి.. ఆ తర్వాత కమలం తీర్ధం పుచ్చుకోవడం.. ఎమ్మెల్యేగా గెలుపొందడం.. ఫ్లోర్ లీడర్ కావడం చకచకా జరిపోయాయి. అయితే కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లడానికి కారకులెవరు..? అయన బీజేపీలో ఎందుకు చేరాల్సి వచ్చింది..? కాంగ్రేస్సే ఏలేటిని వదిలేసుకుందా..? లేక కాంగ్రెస్ తో ప్రయాణం చాలనుకున్నారా అనేది అటుంచుతే.. గత కొన్నాళ్ల నుంచి ఏలేటీ వ్యవహారిస్తున్న తీరు బీజేపీలో చర్చానీయంశంగా మారుతోంది. తరుచూ చిట్ చాట్ల పేరుతో ఆయన చేస్తున్న ఆరోపణలు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తల వంపులు తెస్తోందనే టాక్ ఆ పార్టీలోనే బలంగా వినిపిస్తోంది..
బండి సంజయ్ ను ఓవర్ టెక్ చేయాలనే ఆలోచనలో ఏలేటి
నిత్యం ఏదో రకంగా సంచలన వాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ.. మీడియాను తన వైపునకు తిప్పే ప్రయత్నం చేస్తున్న బండి సంజయ్ ను.. ఓవర్ టెక్ చేయాలనే ఆలోచనలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారా అనే సందేహాలు.. కమలం నేతల్లో వినిపిస్తున్నాయి. పార్టీలో ఇమేజ్ కోసమో ఏమో కానీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధికార పార్టీని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారనే చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది. మరోవైపు ఏలేటి టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఏలేటి వర్గాల్లోనూ, బీజేపీలోనూ, ఇటు కాంగ్రెస్ లోనూ రచ్చ రేపుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారని.. కొత్త ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాబోతున్నారని ఏలేటి వ్యాఖ్యానించడం పట్ల బీజేపీ నేతలే షాక్ అవుతున్నారు.
రేవంత్ కి రాహుల్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్న ఏలేటి
సీఎం రేవంత్ ఏడు సార్లు ఢిల్లీకి వెళ్తే రాహుల్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని.. ప్రియాంక నామినేషన్ కు వెళ్లినా కూడా రాహుల్ దర్శన భాగ్యం దక్కలేదని.. ఏలేటి చేసిన వాఖ్యలు ఇప్పుడు దుమారం లేపడం కాకుండా.. నవ్వుల పాలవుతున్నాయి. నిజానికి అది ఏలేటి మహేశ్వర్ రెడ్డి తప్పు కాదని.. ఆయనకి స్క్రిప్ట్ ఇచ్చిన వారిదని ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారట. ఏది తప్పు ఒప్పు అని తెలిసి ఉంటే ఏలేటి బీజేపీలో ఎందుకుంటారని కౌంటర్లు ఇస్తున్నారట. వయనాడ్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం పాపం ఏలేటికి తెలియకపోయినా.. స్క్రిప్ట్ ఇచ్చిన వారికి అయినా తెలియకపోవడం విడ్డూరంగా ఉందంటూ జోక్స్ వేస్తున్నారట.
Also Read: కాంగ్రెస్‌లో పదవుల కోట్లాట.. రేవంత్ చెక్ పెడతారా?
కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడంలో బీజేపీ కుయుక్తులు
రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కువ కాలం ఉండదని.. ఎన్నికలు ఎప్పుడొచ్చిన బీజేపీ అధికారంలోకి వస్తోందంటూ బీజేపీ చెబుతూ వస్తోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడంలో బీజేపీ కుయుక్తులు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బయటపడ్డాయి. అవే కుయుక్తులు, అవే కుట్రలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు వేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఆ స్కెచ్ లో భాగంగానే ఏలేటి ప్రభుత్వంపై.. ప్రజా పాలనపై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఏలేటికి ఉత్తమ్ కు మధ్య ఏమైనా నడుస్తున్నాయా అనే చర్చ
బీజేపీని లేపేందుకు ఏలేటి చేస్తున్న విశ్వ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది అటుంచుతే.. మరోవైపు పదేపదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని తలుస్తున్న ఏలేటికి ఉత్తమ్ కు మధ్య ఏమైనా నడుస్తున్నాయా.. అనే కూడా పొలిటికల్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఏలేటీతో మాట్లాడించేది ఉత్తమ్ కుమార్ రెడ్డేనా..? అనే అనుమానాలు కూడా పలువురు బయటపెడుతున్నారట. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి మధ్య అవినాభావ సంబంధాలు ఉండేవని.. వారిద్దరూ కలిసి బీజేపీలోకి వెళ్తున్నారనే టాక్ బలంగా వినిపించింది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉండడం.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీ మారడంతో.. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఏమైనా ప్లాన్ చేశారా అని కూడా పొలిటికల్ గా డిస్కషన్ నడుస్తుందట.
సోర్స్ ఇచ్చేంత నెట్ వర్క్ ఏలేటికి ఏఐసీసీ లో ఉందా..?
సీఎంను మారుస్తున్నారనే ప్రచారం చేయించడం వెనక ఎవరున్నారు..? ఏలేటితో స్క్రిప్ట్ చదివించిందేవరు..? కాంగ్రెస్ ను పడగొట్టేందుకు, ప్రజా పాలనను విచ్చిన్నం చేసేందుకు.. బీజేపీ కుట్రలు పన్నుతుందా ? ముల్లును ముల్లుతోనే తీయాలనే నానుడిని పక్కగా ప్లాన్ ప్రకారం ఏలేటితో చేయిస్తున్నారా అనే టాక్ ఇప్పుడు హాట్ హాట్ గా కొనసాగుతోంది. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి లాంటి వారిని కాంగ్రెస్ పార్టీ చాలా మందినే చూసిందని పార్టీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. సోర్స్ ఇచ్చేంత నెట్ వర్క్ ఏలేటికి ఏఐసీసీ లో ఉందా..? సారు పదేపదే అధిష్టానం నుంచే సోర్స్ వస్తోందనే చెప్సడం వెనక డొల్ల తనం స్పష్టంగా కనిపిస్తోందని కుంటార్లు ఇస్తున్నారట. డబ్బు కట్టలతో ఫ్లోర్ లీడర్ పదవిని కొన్న ఏలేటిని.. బీజేపీ సంఘ్ పరివారులు ఎప్పుడు ఒక ఎర గానే చూస్తారని.. ఆ ఎరకు ఏ చేపలు పడవని తెలుసుకునే సమయానికి.. ఏలేటి జీరోగా మిగులుతారనే టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఏలేటి తీరు ఎక్కడి దాకా వెళ్తోందని చర్చ
పార్టీ ఎజెండా పక్కన పడేసీ సొంత ఎజెండాతో వెళ్తున్న.. ఏలేటి తీరు సొంత పార్టీ నేతలే తప్పు బడుతున్న పరిస్థితి ఉందని జోరుగా వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన సొంత ఎజెండాకు పార్టీ ఆఫీసుల్లో స్థానం ఉండదని బీజేపీ రాష్ట్ర నాయకత్వం తేల్చిందని.. అందులో భాగంగానే పార్టీ ఆఫీసులో ఏలేటి మీడియా సమావేశానికి అనుమతి నిరాకరించడంతో.. తన ఇంటినే పార్టీ ఆఫీస్ గా మార్చుకొని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి ఏలేటి వ్యవహారిస్తున్న తీరు ఎక్కడి దాకా వెళ్తోందని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.