EPAPER

BIG Shock To Amanchi : ఆమంచి రూటెటు?మొదటికే మోసం!

BIG Shock To Amanchi : ఆమంచి రూటెటు?మొదటికే మోసం!
BIG Shock To Amanchi
BIG Shock To Amanchi

BIG Shock To Amanchi (AP political News): వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆ మాజీ ఎమ్మెల్యేకి ఈ సారి టికెట్ దక్కలేదు.. జనసేన నుంచి పోటీ చేయాలని ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. అక్కడ టీడీపీ బీసీలకు టికేట్ కేటాయించింది. దాంతో చివరికి రాజకీయంగా ఆదరించిన కాంగ్రెస్ పార్టీనే దిక్కైంది. ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం రిస్క్ అనుకుని కాంగ్రెస్‌లో జాయిన్ అవ్వడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుననారు. మరి కాంగ్రెస్ టికెట్ అయినా దక్కుతుందోలేదో కాని. సొంత సెగ్మెంట్లో తనని రాజకీయంగా ఇబ్బంది పెట్టిన వారిని తరిమి వేయాలని టార్గెట్ పెట్టుకున్నారు సదరు నేత ఇంతకీ ఎవరా నేత?.. ఆయన ఎవరిపై కక్షగట్టారు?


ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల వేళ బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బయటకొచ్చారు. చీరాల వైసీపీ టిక్కెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమంచి కృష్ణమోహన్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నహాలు చేసుకుంటున్నారంట. ఈ నెల 9న తన భవిష్యత్ ప్రకటిస్తానని ఆమంచి వెల్లడించడం వెనుక ఉద్దేశం అదే అంటున్నారు.

ఆమంచి కృష్ణమోహన్ 2014లో చీరాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తర్వాత టీడీపీలో చేరారు … 2019 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ బాట పట్టారు… ఆ ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్ధి కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కరణం బలరాం వైసీపీలో చేరడంతో.. చీరాలలో కరణం, ఆమంచిల మధ్య ఆధిపత్యపోరు తీవ్ర స్థాయికి చేరింది.


Also Read: సోమిరెడ్డి కాకాణికి కష్టమేనా?

వారి విభేదాలకు చెక్ పెట్టడానికి వైసీపీ అధ్యక్షుడు ఆమంచిని పర్చూరు వైసీపీ ఇన్చార్జిగా పంపారు .. అక్కడ గెలవడం కష్టమన్న భావనతో ఆమంచి తిరిగి చీరాలకు వచ్చి అక్కడ నుంచి పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. చీరాల వైసీపీ టికెట్ తనకే దక్కుతుందని ధీమాతో కనిపించారు. అయితే చీరాల వైసీపీ టికెట్ ఎమ్మెల్యే బలరాం కుమారుడు కరణం వెంకటేష్‌కు ఇచ్చిన వైసీపీ అటు పర్చూరులోనూ యెడం బాలాజీని అభ్యర్ధిగా ప్రకటించింది. దాంతో వైసీపీలో టికెట్ లేకుండా పోయిన ఆమంచి.. జనసేన వైపు చూసినా పవన్‌కళ్యాణ్ ఆయనకు గ్రీన్ సిగ్నెల్ ఇవ్వలేదు.

దాంతో చీరాలలో తన నవోదయ పార్టీ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని.. అనుచరులతో మంతనాలు సాగించారు. 2014లో అలాగే గెలిచిన ఆయనకు ఈ సారి గ్రౌండ్ లెవల్ పరిస్థితులు అనుకూలంగా కనిపించలేదంట.. ఇండిపెండెంట్‌గా బరిలో దిగితే ఎన్నికల ఖర్చు తడిసిపోపెడవ్వడంతో పాటు అనేక సమస్యలు వస్తాయని. రాజకీయ పార్టీ సపర్ట్ ఉంటే ఎన్నికలలో ఎంతావరకైన పోరటం చెయచ్చని ఫిక్స్ అయ్యారంట. ఆ క్రమంలో ఆయనకు కాంగ్రెస్ ఏకైక ప్రత్యామ్నాయంగా మారిందంటున్నారు ..

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో ఈ నెల 9న ఆమంచి కాంగ్రెస్‌లో చేరతారని.. ఆ పార్టీ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది … కాంగ్రెస్ పార్టీ అయితే షర్మిల ఇమేజ్ తనకు చీరాలలో కలిస్తుందని ఆమంచి భావిస్తున్నారంట.. చీరాల ఓటర్లు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను రెండు సార్లు ఆదరించారు.. 2004లో రోశయ్య అక్కడ నుంచి రెండో సారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన రాజకీయ శిష్యుడిగా ఫోకస్ అయిన ఆమంచి మొదటి సారి 2009లో కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు.

2014లో నవోదయం పార్టీ అభ్యర్ధిగా రెండో సారి పోటీ చేసినప్పుడు ఆయనకు రోశయ్య మద్దతివ్వడం కలిసి వచ్చిందంటారు. చీరాలలో కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు గణనీయంగా ఉండటం.  స్థానికంగా తనకు ఉన్న పలుకుబడి, రోశయ్య శిష్యుడిగా వైశ్య సామాజికవర్గంలో ఉన్న గుర్తింపు, షర్మిల ఇమేజ్, హస్తం గుర్తు ఇవన్నీ తనకు కలిసి వస్తాయని ఆమంచి లెక్కలు వేసుకుంటున్నారంట. అదలా ఉంటే వైసీపీ పెద్దలు ఈ సారి అధికారంలోకి రాగానే ఆమంచిని ఎమ్మెల్సీ చేయడంతో పాటు క్యాబినెట్ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చినా ఆయన తిరస్కరించారన్న ప్రచారం జరుగుతోంది.

Also Read: వాళ్ల డీఎన్ఏలో ఉంది.. సీఎం రిజైన్ చేయాల్సిందే?

వైసీపీ ఆఫర్‌కి ఆమంచి నో చెప్పడానికి చీరాల రాజకీయాలతో ఉన్న అనుబంధమే కారణమంటున్నారు. కరణం ఫ్యామిలీ చీరాలలో పాతుకుపోతే తనకు ఫ్యూచర్లో ఇబ్బందవుతుందనే వైసీపీని ఓడించడానికి ఆమంచి సిద్దమయ్యారంట.. ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే వైసీపీకి డ్యామేజ్ తప్పదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకే వైసీపీ పెద్దలు ఆయనకు ఆఫర్లు ఇస్తున్నారంట.

మాజీ ఎమ్మెల్యే ఆమంచి పోటీకి సిద్దమవ్వడంతో..  వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే టీడీపీ అభ్యర్ధిగా ఉన్న కొండయ్య యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. చీరాలలో గణనీయంగా చేనేతలతో పాటు ఇతర వర్గాలకు చెందిన బీసీ ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉన్నారు. అందుకే అక్కడ టీడీపీ బీసీ అభ్యర్ధిని బరిలోకి దింపింది. కొండయ్యయాదవ్ బీసీ కార్డు ఫోకస్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.. అదీకాక గత ఎన్నికల్లో కరణం బలరాం విజయానికి కృషిచేసిన చీరాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బీసీల్లో మంచి పలుకుబడి ఉన్న పాలేటి రామారావు వర్గం ఇప్పుడు కొండయ్యయాదవ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తుంది.

Tags

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×