EPAPER

Bharat Jodo Nyay Yatra: జనవరి 14 నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్ర.. సంచలనమవుతుందా?

Bharat Jodo Nyay Yatra: జనవరి 14 నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్ర.. సంచలనమవుతుందా?

Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈనెల 14 నుంచి మార్చి 20 వరకు 66 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. ప్రజలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం దగ్గర చేసే థీమ్ తో ఈ యాత్రకు రాహుల్ చేపట్టబోతున్నారు. ఇప్పటికే చేసిన భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వచ్చింది. గతంలో కవర్ కాని ప్రాంతాల మీదుగా కొంత పాదయాత్ర, మరికొన్ని చోట్ల బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. జోడోయాత్ర 2.0 కాంగ్రెస్ లో సరికొత్త జోష్ తెస్తుందా? కాంగ్రెస్ అనుకున్న లక్ష్యాలకు ఎంత చేరువయ్యే అవకాశం ఉంది?


రాహుల్ గాంధీ ఇప్పటికే చేపట్టిన భారత్ జోడో యాత్ర ఫుల్ సక్సెస్ అయింది. దేశంలో ఏ రాజకీయ నాయకులూ చేపట్టని భారీ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇప్పుడు రెండో విడతలో భారత్ జోడో న్యాయ్ యాత్రను చేపట్టబోతున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల్లో ప్రజలకు న్యాయం కావాలి అన్న థీమ్ తో రాహుల్ ఈనెల 14 నుంచి యాత్ర చేపట్టబోతున్నారు. మరోవైపు దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి కూడా మొదలైన పరిస్థితిలో చేపడుతున్న రాహుల్ యాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది.

కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించింది. ఓవైపు రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్రతో పాటే ఎన్నికల మేనిఫెస్టో ప్రిపరేషన్ ను మొదలు పెట్టింది. అలాగే సీట్ల సర్దుబాటు ప్రక్రియనూ ఆరంభించింది. ఎన్నికల వేళ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 14 నుంచి మార్చి 20 వరకు రాహుల్‌గాంధీ చేపట్టబోయే యాత్రకు భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర అని పేరు పెట్టామన్నారు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌. పార్టీ నేతలందరూ ఏకగ్రీవంగా ఈ పేరును నిర్ణయించారన్నారు. మొదట అనుకున్న భారత్‌ న్యాయ్‌ యాత్ర పేరులో జోడో అన్న పదాన్ని చేర్చి మార్పు చేశారు. ఈ యాత్రలో భాగస్వాములు కావాలని ఇండియా కూటమి పార్టీలన్నింటినీ ఆహ్వానించనున్నట్లు జైరాం రమేశ్‌ చెప్పారు.


2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధత, రాహుల్‌గాంధీ మణిపుర్‌ ఇంఫాల్‌ నుంచి ముంబై వరకు చేసే 66 రోజుల యాత్రపై కాంగ్రెస్ కీ మీటింగ్ లో చర్చించారు. డిసెంబర్ 28న పార్టీ సంస్థాగత దినోత్సవం సందర్భంగా లోక్‌సభ ఎన్నికల కోసం నాగ్‌పూర్‌లో సమర శంఖారావం పూరించింది కాంగ్రెస్. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రారంభంతో మరింత స్పీడ్ పెంచబోతున్నారు. 2022 సెప్టెంబరు నుంచి 2023 జనవరి వరకు సాగిన భారత్‌ జోడో యాత్ర సందేశాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లబోతున్నారు. రాజ్యాంగ పీఠికలో చేర్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఏం చేయబోయేదీ రాహుల్‌గాంధీ ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరించబోతున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధత, రాహుల్‌గాంధీ మణిపుర్‌ ఇంఫాల్‌ నుంచి ముంబై వరకు చేసే 66 రోజుల యాత్రపై కాంగ్రెస్ కీ మీటింగ్ లో చర్చించారు. డిసెంబర్ 28న పార్టీ సంస్థాగత దినోత్సవం సందర్భంగా లోక్‌సభ ఎన్నికల కోసం నాగ్‌పూర్‌లో సమర శంఖారావం పూరించింది కాంగ్రెస్. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రారంభంతో మరింత స్పీడ్ పెంచబోతున్నారు. 2022 సెప్టెంబరు నుంచి 2023 జనవరి వరకు సాగిన భారత్‌ జోడో యాత్ర సందేశాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లబోతున్నారు. రాజ్యాంగ పీఠికలో చేర్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఏం చేయబోయేదీ రాహుల్‌గాంధీ ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరించబోతున్నారు.

మొత్తం 110 జిల్లాల్లో 100 లోక్‌సభ, 337 అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేసేలా భారత్ జోడో న్యాయ్ యాత్ర జరగనుంది. త్వరలో యాత్ర లోగో, థీమ్ సాంగ్ రిలీజ్ చేయనుంది కాంగ్రెస్ పార్టీ. జోడో యాత్ర ఎంత ప్రభావం చూపిందో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర కూడా అంతే ప్రభావం చూపుతుందన్న నమ్మకంతో ఉన్నారు. తాజా రూట్ మ్యాప్ ప్రకారం రాహుల్‌ గాంధీ యాత్ర ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 11 రోజుల పాటు కొనసాగనుంది. ఆ రాష్ట్రంలో 1,074 కిలోమీటర్ల దూరం వరకు యాత్ర ఉంటుంది. అమేథీ, రాయ్‌బరేలీ, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌ల మీదుగా వెళ్లనుంది. అసోంలో 8 రోజులు, పశ్చిమబెంగాల్‌-5, బిహార్‌-4, అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయలలో ఒక్కోరోజు పాటు యాత్ర ఉంటుంది.

బీజేపీ ప్రభుత్వం గత పదేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని ఖర్గే ఫైర్ అవుతున్నారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉండి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం కోసం కృషి చేయాలన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్ర చేసిన రాహుల్‌ గాంధీని ప్రశంసించారు. రాహుల్‌ త్వరలో చేపట్టబోయే భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర సామాజిక న్యాయ సమస్యలను వెలుగులోకి తెస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. న్యాయ యాత్రతో పాటే.. సీట్ల సర్దుబాటు కోసం కాంగ్రెస్‌ ఏర్పాటు చేసుకున్న కమిటీ భేటీ అయింది. ఈ మీటింగ్ లో రాహుల్‌ గాంధీ కూడా పాల్గొన్నారు. రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించడం కోసం త్వరలోనే స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కూడా పని మొదలు పెట్టింది.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×